13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

పద్యరచన - 820

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. కౌశిక మహర్షి శాపాన క్రౌంచ పక్షి
    మరణ మొంది శా పమువోవ మనిషి యయ్యె
    పూర్వ మందున జేసిన పుణ్య ఫలము
    ననుభ వింతురు తర్వాత జన్మ లోన

    రిప్లయితొలగించండి
  2. బాణము వేసె నిషాదుడు
    ప్రాణము గోల్పోయె క్రౌంచ ప్రాయము నందున్
    శోణితము గనిన మునియట
    వాణిని శాపముగ విడచె వాల్మీకి యనన్

    రిప్లయితొలగించండి
  3. బోయని బాణము తగిలిన
    హాయని క్రౌంచమ్ము పడెను హావడి తోడన్
    మాయని మచ్చను తుడువగ
    నాయెను వాల్మీకి యతడె నౌరా!జగతిన్

    రిప్లయితొలగించండి
  4. క్రౌంచ పక్షి జంట కామకేళికనుండ
    చంపె బాణ మేసి చంచు డొకడు
    వగచి కోప గించి వాల్మీకి దిగనాడ
    లోక మెరుగు ఆది శ్లోక మయ్యె
    మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
    యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥

    రిప్లయితొలగించండి
  5. క్రౌంచ పక్షి జంట కౌతుకముగలిగి
    కామకేళి యందు కలిసి యుండ
    బోయ డొకడు వేయ భూరి బాణం బును
    పక్షి యొకటి చచ్చి పడెను గ్రింద

    రిప్లయితొలగించండి
  6. అవధాన శిరోమణి మహోపాధ్యాయ శ్రీ కాశీ కృష్ణాచార్యుల వాల్మీకి గ్రంధము లోని వ్యాఖ్యానానికి స్వేచ్చానుసరణ

    కామ మోహితుడౌ దశ కంఠునిలన
    సంహరించిన హే మానిషాద రామ
    సత్ ప్రతిష్ఠను పొందుమా శాశ్వతముగ
    ననుచు వాల్మీకి రామాయణమ్ము పలికె

    రిప్లయితొలగించండి
  7. యతి భంగమనుకుంటే నాలుగో పాదం

    ననుచు వాల్మీకి పలికె రామాయణమ్ము

    రిప్లయితొలగించండి
  8. శబరుడొక్కడు మగపక్షి సంహరించ
    నార్త నాదముఁజేయగ నాడు పక్షి
    పలుక వాల్మీకి నోటిలో పలుకుబోటి
    శాప ఫలమును జెప్పుచు శాపమిచ్చె
    నాపదములెరామకథగ నవతరించె

    రిప్లయితొలగించండి
  9. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపద్యం నాల్గవ పాదంలో యతి తప్పింది.
    ‘ఫలము| ననుభవింతురు రాబోవు జననమందు’ అనండి.
    కౌశికుని శాపగాథ నాకు తెలియనిది.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘క్రౌంచపక్షి పిదప నా| శోణితము...’ అనండి.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కుమార్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కామ మోహిత మైనట్టి క్రౌంచములను
    కరుణ లేకను పడగొట్టి కరకు కోల
    యెంత జేసితివి నిషాద యీవు గూడ
    నట్టి దుస్థితి నొందెద వచిర ముననె.

    రిప్లయితొలగించండి
  11. రూకలకాశయో|తినగరుచ్యమటంచునువేటయందునన్
    మూకగజంటపక్షులను-మోసమునన్నొకదానిజంప|వా
    ల్మీకదిగాంచివేదనగలీలగజెప్పెనునాసుధారగా
    శ్లోకములందుశోకమునులోకులకుంచినచిత్రసీమయే|

    రిప్లయితొలగించండి

  12. పద్యరచన:కామకేళిని యున్నట్టి క్రౌంచ పక్షి
    జాలి లేకను జంపు నిషాదు గాంచి
    శోకమున దిట్ట నది యొక శ్లోక మగుచు
    ఆది కావ్య రచన క౦కురార్పణమ్ము

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్న గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శోకముఁ జూచిన బోయని
    తాకిన రాగమ్ము శ్లోక తంత్రుల మీటన్
    ప్రాకిన'మరా మరామ'లు
    శ్రీకర రామాయణమ్ముఁజిందించె నిలన్!

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి