19, ఫిబ్రవరి 2015, గురువారం

పద్యరచన - 826

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. వాసుకి త్రాడుగా చిలుక పాలసముద్రము మందరాద్రినే
    జేసిరి మంథదండముగ శ్రీహరి వీపున కూర్మరూపుడై
    మోసెను పర్వతంబును సముద్రమునందున మున్గకుండగా
    తీసిరి పైకియా సుధను దేవతలున్ దితిసూనులొక్కటై

    రిప్లయితొలగించండి
  2. పర్వ తంబది మందర పర్వ తంబు
    వాసు కిని నట ద్రాటిగా నా సురసు రు
    ల మృత ముకొఱ కు సంద్రాన నటు నిటుగను
    జిలుకు చుండగ శ్రీ లక్ష్మి శిఖర మందు
    పుట్టె నద్భుతము గొలుప పుణ్య పురుష !

    రిప్లయితొలగించండి


  3. మందర పర్వతం బునకు నందము గామఱి వాసుకా హినిన్
    చిందులు వేయుచుం డగను, చీరియు బాగుగ గట్టిగా నటన్
    బందము వేసియా సురలు ,పందెము తోడన నాసురా దులున్
    విందుగ లాగగా జనన మొందెను శ్రీలక్ష్మి యద్భుతం బుగన్

    రిప్లయితొలగించండి

  4. ప్రేమ సూత్రమున మధించిన
    హాలాహలం అమృతం ఐరావతం
    లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయ
    అంతా మనవారే మనవారే జిలేబి !!


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. సీ . సాగర మథనము సలుపసురాసురుల్
    కవ్వము మందర గ్రావ మయ్యె
    వాసుకి తాడయ్యె భాగము నాశించి
    హాలా హలము త్రాగె ఆది హరుడు
    కల్ప వృక్షముతోడ కామ ధేనువుకాక
    అప్సరసలుబట్టె అమర ప్రభువు
    శ్రీ మహలక్ష్మిని శ్రీ విష్ణువె వరించె
    మిగిలె యసురులకు మెక్క సురయె

    తే. గీ. వగల మోహిని భాగమ్ము పంచె నపుడు
    అమృత మంతయు కుడువగా అమర శ్రేణి
    కల్లు త్రాగి యసురులకు కైపు మిగలె
    మోస గించిన రాహువు ముక్క లయ్యె

    రిప్లయితొలగించండి
  6. కడలిని సురాసురులు త్రచ్చ కలిగె నపుడు
    కల్ప వృక్షము, సురభియు కమల శశియు
    నమృతమైరావతము పాల యబ్దినుండి
    పద్మనాభుడు చేపట్టె పద్మ కరము

    రిప్లయితొలగించండి
  7. దేవ దానవ భావాల తీరుఁగలిపి
    వజ్రసంకల్పదండంపు వాటమెరిగి
    యప్రమత్తమనెడు త్రాడునల్లి చిలుక
    మొదట విషమైన తదుపరి మెదలు సుధలు!

    రిప్లయితొలగించండి
  8. క్షీరసాగరమును చిలికి సురాసురు
    లందు కొనిన వస్తురాశి గనుడు,
    ఇందుడు, నిందిర, నేన్గు తెల్లనిదియు
    నుచ్చైశ్రవమ్మ ట నుద్భవించె,
    కామధేనువొకటి, కౌస్తుభమ్మొక్కటి,
    కల్పలత యచట కలిగె నంత;
    యమృతమ్మును మరియు యప్సర యనునొక్క
    కులము మరియు హాలహలముఁ బుట్టె,

    మోహనముగ రూపు ముగ్ధులఁ జేయగ
    నసురబుద్ధి కిదియె యంతమనుచు
    సురులకెల్ల పంచె సుధను కృష్ణుఁడపుడు
    శుభము కలుగుననగ సుదతి జనులు.

    రిప్లయితొలగించండి
  9. కరము శ్రేష్ట మంధర గిరి కవ్వముగను జేసియున్
    పరమ వాసుకి నగమునకు పరగ జుట్టి దక్షతన్
    సురల సురులు కలసి త్రచ్చ సుధను బొంద సంధ్రమున్
    అరుదుపడగ బయలు వడెను హాల హలము ,చంద్రుడున్
    సురభి,లక్ష్మి ,కౌస్తుభమ్ము, సుమధురామ్బృతంబెసన్ .

    రిప్లయితొలగించండి
  10. ఐక మత్యమున్న అబ్ధిని మదియింప
    వచ్చుననుచు దెలియ పరచుగాధ
    లక్ష్య సిద్ధి గలుగ లభ్యమౌ సుధయని
    చాటిచెప్పుచుండుమేటిగాధ !!!

    రిప్లయితొలగించండి
  11. సురులునసురులంత-సులబంబుగానట్టి
    మందరగిరిసాంద్రమందునిలిపి
    వాసుకిత్రాడుగా-వాత్చల్యదాడిగా
    చిలుక?సంపదలెల్ల-చేరిరాగ
    లచ్చికల్పనలందులక్ష్యాలవస్తువుల్
    కల్పవృక్షముచేతకల్వమందు
    కామదేనువొకటి-కలువరేడొక్కడు
    వెలికిరాగ?విలువనిలువలున్న?
    చిలికినమృతమ్ము-చిక్కెడిక్రమమున
    కష్టపడిరినాడునిష్టపడుచు
    సాధనానపనులు-సాధ్యమేయనుచున్న
    ఇకమత్యఫలములందుకొనిరి|

    రిప్లయితొలగించండి
  12. మల్లెలవారి పద్యము
    దేవ దానవు ల౦ద౦గ దివ్యసుదను
    మందరమ్మును కవ్వము మలచినారు
    వాసుకిని తాడు గా జేసి వారు మథన
    మిడగ సుధతోడ వస్తులు మేటి పుట్టె

    రిప్లయితొలగించండి
  13. గురువుగారు వ్యక్తిగత పనులవల్ల అందుబాటులో ఉండనని పరస్పర దోషవిశ్లేషన జేసికొనమని తెలియజేశారు.

    రిప్లయితొలగించండి
  14. కె ఎస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
    చేత మనెడి నట్టి క్షీర సాగరమును
    మథియించు చుండును మనుజుడెపుడు
    అగణిత మైనట్టి సుగుణ దుర్గుణములు
    సురలునసురులౌచు వరలుచుంద్రు
    దీక్షయే మందర వృక్ష వంతము గాగ
    వాంఛ యై రూపొంద వాసుకి ఫణి
    విధి యను కూర్మంబు పృథు భారమును మోయ
    మథియించు చుండును మనుజుడెపుడు
    కామధేనువు లక్ష్మియు కల్పవృక్ష
    మనెడు సౌఖ్యమ్ములన్ గొని హాలహలము
    వంటి దుఃఖముల్ ప్రభవింప వడలిపోక
    ధైర్యముగనుండి మోక్షామృతమ్ము గొనుమ







    రిప్లయితొలగించండి
  15. భవ సాగరమును మథియి౦
    పవచ్చు హాలాహలమ్ము పదపడి సుధయున్
    దివిజులవలె మెలగినచో
    అవిరళముగ ముక్తి కాంత యమృతము నొసగున్

    రిప్లయితొలగించండి
  16. పాల సముద్రము దుష్ట సమాసమౌతుందేమో నని కొచం మార్చి వ్రాశాను
    వాసుకి త్రాడుగా కలశ వార్దిని ద్రచ్చగ మందరాద్రి నిన్
    జేసిరి మంథదండముగ శ్రీహరి వీపున కూర్మరూపుడై
    మోసెను పర్వతంబును సముద్రమునందున మున్గకుండగా
    తీసిరి పైకియా సుధను దేవతలున్ దితిసూనులొక్కటై

    రిప్లయితొలగించండి
  17. చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి