25, ఫిబ్రవరి 2015, బుధవారం

పద్యరచన - 831 (ఆధ్యాత్మిక ప్రవచనములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఆధ్యాత్మిక ప్రవచనములు”

13 కామెంట్‌లు:

  1. భక్తి మార్గము ప్రజలకు పడయు కొఱకు
    ప్రవచ నములు గా వింతురు పండితులట
    యవియ యుండును నా ధ్యా త్మిక పర ముగను
    వారు గామన చాగంటి ప్రముఖులు మఱి

    రిప్లయితొలగించండి

  2. పరమ గురువులాధ్యాత్మ ప్రవచనములిడి
    మంచిమార్గము నందున కొంచమైన
    జనులు నడచునట్లుగ జేయ సంఘమందు
    నీతి నియమములింకను నిలచియుండె

    రిప్లయితొలగించండి
  3. ప్రవచన ములువిని నంతనె
    భవబంధ ములన్ని మరచి భగవం తునిపై
    సవరణ జేయుచు బ్రతుకును
    వివరించును మనసు నిండ వేయి విధమ్ముల్

    రిప్లయితొలగించండి
  4. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది. ‘యవియ యుండును నాధ్యాత్మికవిషయములు’ అనండి
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భగవంతునిపై’ అన్నదానికి అన్వయం లేదు. ‘భగవంతునకై’ అంటే సరిపోతున్నది.

    రిప్లయితొలగించండి
  5. పరమ పుణ్య మాధ్యాత్మిక ప్రవచనమ్ము
    విశ్వ కల్యాణ సిద్ధికి వేదవాక్కు
    సర్వ జనుల కిదియె మోక్ష సాధకమ్ము
    పామర మదికి పాండిత్య పాయసమ్ము

    సూక్తి వాక్కులు జెవులను సోకనిచ్చి
    భక్తి శ్రద్ధతో గ్రాంధిక భావ మెరిగి
    నైతి కమ్ముగ సంఘపు ఖ్యాతి పెంచ
    ప్రేమ ప్రవచనమ్ము వినుము ప్రీతి తోడ

    రిప్లయితొలగించండి
  6. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. భక్తిన్ మానవులంతరంగముల సంభావ్యమ్ముఁ జేయంగ, నా
    సక్తిన్ పెంచుచు ధర్మమార్గమును సంస్థాపించు కార్యమ్ములో,
    ముక్తిన్ లక్ష్యముగాగ జేసికొనుచున్ ముమ్మూర్తులా బ్రహ్మలై,
    వక్తల్ జేయుచునుందురెల్లెడనిటుల్ వైవిధ్యమౌ బోధలన్.

    రిప్లయితొలగించండి
  8. అమృత వాక్కుల గైసేసి యద్బుతముగ
    ప్రవచనమ్ములు భోధించు పండితాళి
    భక్తి భావమ్ము నెలకొల్పి ముక్తి నిడెడు
    మంచి మాటలు వినవలె మనుజులంత !!!

    రిప్లయితొలగించండి
  9. మనపురాణ గాధలఁజెప్పి ఘనముగాను
    ధర్మమార్గము పయనించు మర్మములను
    విన్నవించి జనులకు విపులముగను
    పావనచరితతో వారు వరలు చుండ్రు

    రిప్లయితొలగించండి
  10. దినచర్యలలో నెదురగు
    ఘనతర సందియ నివృత్తి జ్ఞానముఁ బెంచన్
    వినదగు నాధ్యాత్మిక ప్రవ
    చనముల గురువులు వచింప సచ్ఛీలతతోన్!

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘విన్నవించియు/ విన్నవించుచు’ అంటే సరి!
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్య గురుదేవులకు నమస్సులు.మనుజులకు అనిమనసులో అనుకుని టైపు జనులకు అని చేశాను. తమరి సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి