3, మే 2016, మంగళవారం

పద్యరచన - 1213 (ఉప్పు)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

50 కామెంట్‌లు:

  1. పాక శాల యందు పదిలమై యుండును
    వండు వంటకదియె వన్నెనిచ్చు
    ఉప్పు లేని కూడు చిప్పలెంతున్నను
    ఇచ్చగించ డెవ్వడిదియె నిజము

    కలిమి లేని యిండ్లు కల్పమందున జూడ
    లక్షలుండ వచ్చు లవణ మంటు
    లేని గృహము భువిన లేనిమాటనిజము
    ఛేట తెల్లమిదియె తెలుసు కొనుము

    సంద్రమందు పుట్టె చక్కని రూపుతో
    నుర్వి జేరినట్టి యుప్పు జూడ
    కడలి పుత్రియైన కలికి శ్రి లక్ష్మికి
    సోము విధము దాను సోదరయ్యె

    రిప్లయితొలగించండి
  2. ఉప్పును బోలును సత్యని
    చప్పున బొగడంగ విష్ణు సరస మటంచున్
    నొప్పిని యలిగిన సతిగని
    చెప్పెను రుచులందు సొమ్ము శ్రేష్ట మటంచున్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగున్నది. కాని కొంత గందరగోళంగా అనిపిస్తున్నది.

      తొలగించండి
  3. ఒప్పును రుచి, యది యెటులన?!
    జెప్పెదరుగ, తడబడకను జిహ్వను దాకన్
    యుప్పని, యిది సరిబడగన్
    గొప్పగ బచరించి, వంట గుణమును బెంచున్!

    రిప్లయితొలగించండి
  4. ఒప్పును రుచి, యది యెటులన?!
    జెప్పెదరుగ, తడబడకను జిహ్వను దాకన్
    యుప్పని, యిది సరిబడగన్
    గొప్పగ బచరించి, వంట గుణమును బెంచున్!

    రిప్లయితొలగించండి
  5. ఉప్పన విశ్వాసంబగు
    నుప్పన రుచియగు వినగను యుర్విని, కనగా
    నుప్పన దీపమునార్పుట
    నుప్పందించుట విషయము నొరులకు జెపుటల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘వినగను నుర్విని’ అనండి.

      తొలగించండి
  6. ఉప్పు మించి వాడ నుసురుకు మోసంబు
    తక్కువైన కీడు తగిలి రాదు.
    మధ్యమముగ దినిన మంగళంబిచ్చును
    పథ్యమైన తిండి ఫలముగూర్చు.

    రిప్లయితొలగించండి
  7. ఉప్పు మించి వాడ నుసురుకు మోసంబు
    తక్కువైన కీడు తగిలి రాదు.
    మధ్యమముగ దినిన మంగళంబిచ్చును
    పథ్యమైన తిండి ఫలముగూర్చు.

    రిప్లయితొలగించండి
  8. అవని సకల జన మోదిని
    ప్రవిమల పాకానుకూల భార ధర మిలన్
    ధవళ రుచి వికసిత సురుచి
    లవణ విహీన పరిపాక లలితము గలదే

    రిప్లయితొలగించండి
  9. ఉప్పు లేని కూర చప్పగా నుండును
    భోజ్య వస్తు వులకు ముఖ్య మదియ
    వనధి నీరు మడుల బారించి యెండన
    నెండ జేసి చేతు రిలను నుప్పు

    రిప్లయితొలగించండి
  10. ఆ**
    ఉప్పు నిప్పు గదర ఊపిరి గొనిపోవు,
    నుప్పు లేక తినగ నోప లేము,
    నుప్పు గొప్ప యదియె చెప్పగా తరమౌన,
    సమత పాటి సేయ సకల శుభము !

    రిప్లయితొలగించండి
  11. 1.ఉప్పు లేని కూర యుర్విలో నుండదు
    ఉప్పు యెక్కువైన ముప్పు కలుగు
    ననెడి మాట కాదు యనృతమ వనిలోన
    కొద్దిగాను వాడి కూర దినుడు.

    2.వంట యింటి యందు పక్కాగ నుండును
    నిదియు లేని వంట నెచట లేదు
    పొగడ శక్య మౌన పుడమిలో జనులకు?
    లవణమున్నచోట కవళముండు.

    3.కాసు లెన్ని యున్న కలుపుకు తినలేము
    లక్షరూకలున్న లవణ మన్న
    మె,తిను నుప్పు లేక మెతుకు గొంతుదిగద
    టంచు నరయు డయ్య ననవరతము.

    4.లక్ష్మి తోడ బుట్టె లవణంబు యానాడె
    సంద్రమందు తాను చక్కగాను
    అందరిండ్ల యందు నలరారు చుండును
    యిదియు లేని గృహము యిలను లేదు.

    5.తెల్లరంగుతోడ తేటగా యగుపించు
    కంటి కింపె గాని,వంటి కసలు
    పడదు మితముగాను వాడ హితము కల్గు
    ననెడి మాట నిజము నమ్ముడయ్య/నార్యులార.

    రిప్లయితొలగించండి
  12. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ( డా " మ౦తెన సత్యనారాయణ గారి
    సిధ్ధా౦తము ప్రకారము )

    నరుని శరీర మ౦దున కణమ్ముల పై లవణమ్ము చేరగా --

    పొరలుగ , మ౦చి పోష్య రసమున్ గ్రహియి౦పగ లేడు | కావునన్

    గురియగు పెక్కు నాపదలకున్ దన దేహము |
    " రక్తపోటుచే "


    బరువగు హృత్కవాటములు | వచ్చును
    గు౦డియ పోటు వె౦టనే


    ( పోష్య రసము = ఆహార రసము
    రక్తపోటు = దుష్టసమాసమైనను వాడుక పదము ; హృత్ + కవాటములు = గు౦డె లోని గదులు )

    రిప్లయితొలగించండి
  13. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ( డా " మ౦తెన సత్యనారాయణ గారి
    సిధ్ధా౦తము ప్రకారము )

    నరుని శరీర మ౦దున కణమ్ముల పై లవణమ్ము చేరగా --

    పొరలుగ , మ౦చి పోష్య రసమున్ గ్రహియి౦పగ లేడు | కావునన్

    గురియగు పెక్కు నాపదలకున్ దన దేహము |
    " రక్తపోటుచే "


    బరువగు హృత్కవాటములు | వచ్చును
    గు౦డియ పోటు వె౦టనే


    ( పోష్య రసము = ఆహార రసము
    రక్తపోటు = దుష్టసమాసమైనను వాడుక పదము ; హృత్ + కవాటములు = గు౦డె లోని గదులు )

    రిప్లయితొలగించండి
  14. 4.
    అప్పులు వ్యవహా రమ్మున
    నిప్పుల వలె హద్దుమీర నీయని చోటన్
    ముప్పేమి యుండ దవనిన
    యుప్పుయు వాడవలయు నరుడుర్విన గాదె.

    5.
    ఉప్పు తక్కువైన నుండదు నిలువయే
    యూరగాయ లైన కూరలైన
    అధిక మైన నదియు రుధిర పోటును దెచ్చు
    తెలిసి మసలు వాడె ధీరు డనగ.

    6.
    రుచిని దెచ్చు నుప్పు రోషంబు పెంచును
    పాడు జేయకుండ పదిలపరచు
    మెప్పు పొందు నిదియు ముప్పునే కలిగించు
    హద్దు మీరినంత ఆపదేను

    రిప్లయితొలగించండి
  15. అప్పుల మునిగిన వానిని
    గొప్పలు జెప్పి పని మాను కోతల రాయున్
    కొప్పును వీడిన వనితన్
    నుప్పది సరిపోని వంట నొప్పరు వసుధన్


    రిప్లయితొలగించండి
  16. ఆ**
    ఉప్పు నిప్పు గదర ఊపిరి గొనిపోవు,
    నుప్పు లేక తినగ నోప లేము,
    నుప్పు గొప్ప యదియె చెప్పగా తరమౌన,
    సమత పాటి సేయ సకల శుభము !

    రిప్లయితొలగించండి
  17. ఆ**
    ఉప్పు నిప్పు గదర ఊపిరి గొనిపోవు,
    నుప్పు లేక తినగ నోప లేము,
    నుప్పు గొప్ప యదియె చెప్పగా తరమౌన,
    సమత పాటి సేయ సకల శుభము !

    రిప్లయితొలగించండి
  18. ఉప్పు పప్పున లేక యూహింతుమారుచి
    ----జిహ్వ దాటదుతిండి చేరి తినగ|
    కూరగాయల వంట కుదురునా?బెడురునా?
    -----------ఉప్పందు దరిగిన సప్పబడును
    సాంద్ర మందున నుప్పు సర్వజనుల మెప్పు
    ---------ఇంటికప్పుగ నుండు వంటలందు
    ఉప్పు సత్యాగ్రహ ముధ్యమంబేలేక
    ---------స్వాతంత్ర్య మెట్లబ్బు సర్వులకును?
    ఎక్కు వైనచొ?బీ.పీని టక్కునుంచు
    తక్కువున్నచొ? బలహీన మెక్కువౌను
    ఉప్పుకున్నట్టి శక్తిని గొప్పతనము
    వైద్య లుహకు దట్టిని పదము లివియె|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      చివరి పాదాన్ని సవరించాలి.

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    ఆఱు రుచుల లోన నది యొక్క రుచియయి
    షడ్రుచులను పేర నందగించె!
    నిదియ తక్కువైన నింపొంద దే కూర;
    యెక్కు వైన బీపి యెసఁగు నయ్య!!

    రిప్లయితొలగించండి
  20. ఉప్పు వేయగా కూరకు పప్పుకు రుచి
    చాలినంతగా లవణము చవులు పెంచు
    పత్ని వుప్పు వేయ మరచి వంట చేయ
    చప్పగానుండు నన్నియు చవులు చచ్చి

    రిప్లయితొలగించండి
  21. ఆరుగాలము పనిజేసి యలచినట్టి
    రైతుల కుటుంబముల కుప్పు రక్షజేయు
    పోయినట్టి లవణముల పొసగజేసి
    చెయిదములు లేని వారికి చేయు కీడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘..యలసి’... ‘యలచి’ అయింది టైపాటువల్ల.

      తొలగించండి
  22. మితము లేని ఉప్పు హితము చేయును లేదు
    అధికమైన కొలది అదరుకొట్టు
    అదుపు తప్పునాడు హద్దు మీరగలరు
    తెలిసి మెలిచి బతుకు తెలివిగాను!

    రిప్లయితొలగించండి
  23. మితము లేని ఉప్పు హితము చేయును లేదు
    అధికమైన కొలది అదరుకొట్టు
    అదుపు తప్పునాడు హద్దు మీరగలరు
    తెలిసి మెలిచి బతుకు తెలివిగాను!

    రిప్లయితొలగించండి
  24. సుబ్బారావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘హితము జేయుట కల్ల’ అనండి.

    రిప్లయితొలగించండి
  25. మితము లేని ఉప్పు హితము జేయుట కల్ల
    అధికమైన కొలది అదరుకొట్టు
    అదుపు తప్పు నాడు హద్దు మీర గలరు
    తెలిసి మెలిచి బతుకు తెలివిగాను

    రిప్లయితొలగించండి
  26. మితము లేని ఉప్పు హితము జేయుట కల్ల
    అధికమైన కొలది అదరుకొట్టు
    అదుపు తప్పు నాడు హద్దు మీర గలరు
    తెలిసి మెలిచి బతుకు తెలివిగాను

    రిప్లయితొలగించండి
  27. నందిపాటి సుబ్బారావు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మన బ్లాగులో మరొక ‘సుబ్బారావు’ గారున్నారు. వారు ‘పోచిరాజు సుబ్బారావు’ గారు. మీరిద్దరు ‘Subba Rao' అనే వ్యాఖ్యలు పెడుతున్నారు. మీ యూజర్ నేమ్ ను `N. Subba Rao' లేదా `Nandipati Subba Rao' అని మార్చుకుంటే నాకు ఇబ్బంది ఉండదు.

    రిప్లయితొలగించండి
  28. ఉప్పు పంచదార లొక్క రంగున నుండు
    చూడ చూడ రుచుల జాడ వేరు
    రంగు జూసి మగువ భంగులెన్న గలడె
    విద్య లేని మగడు వింత శిశువు

    రిప్లయితొలగించండి