2, మే 2016, సోమవారం

సమస్య - 2021 (కొయ్యగుఱ్ఱ మెక్కి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె.

89 కామెంట్‌లు:

  1. వింత పనుల జేయు వెర్రి కొరకరాని
    కొయ్య గుర్రమెక్కి కయ్యమాడె
    నతడు మత్తులోన నాలుబిడ్డలతోడ
    గ్రామమందు జనులు కలత పడగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘కొరకరాని కొయ్య’ అనే జాతీయంతో, ‘గుఱ్ఱమెక్కి’కి ఉన్న విశేషార్థంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  2. కీలు మావు లనుచు మేలైన చిత్రాలు
    చిన్న నాట వింటి మిన్న గాను
    వింత లనగ నేడు సొంత వియ్యంకుడు
    కొయ్య గుఱ్ఱ మెక్కి కయ్య మాడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘కీలుగుఱ్ఱం’ సినిమా గురించి తెలుసు. ‘కీలుమావులు’?

      తొలగించండి
    2. మావు = గుఱ్ఱము
      రెండు సార్లు " గుఱ్ఱము " అని వస్తుందని"కీలు గుఱ్ఱానికి బదులుగా " కీలు మావు " అనిరాసాను .అదన్నమట అసల్ సంగతి

      తొలగించండి
  3. మంచి తాయిలాలు , మరకార్లు సయ్యాట
    లాడి మించి పాట పాడు బొమ్మ
    లెన్నొ పాపకిడగ నెగుర దేమని తాను
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
  4. చామర్తి అరుణ గారి (వాట్సప్) సందేశానికి నా పద్యరూపం....

    రాక్షసుం డొకండు రాకుమారి నపహ
    రించఁ గీలుగుఱ్ఱ మెక్కె రాకు
    మారుఁ; డడవిఁ జేరి యా రాక్షసునితోడ
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
  5. శ్రీరాం కవి గారి (వాట్సప్) పూరణ....

    తల్లిమాటవినని తనయుడొకడు తాను
    గుఱ్ఱ మెక్కెదనని గొడవచేయ
    కోరి తల్లి కొయ్యగుఱ్ఱము గొనిపెట్ట
    కొయ్యగుఱ్ఱమెక్కికయ్యమాడె.

    రిప్లయితొలగించండి

  6. కడుపునిండ కూడు కనులనిండ నిదుర
    లేని వాడు గుడ్డ లేని వాడు
    కలిమి పరుని విధము కలలు గనెడివాడ
    కొయ్య గుర్రమెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
  7. అహహ! యిచట గనుమ! యలరుచున్నవి, నాన్న!
    ఆటలాడగ నాకు వీటిగొనుమ
    ననుచు, పాప యొకతె, యచ్చోట నున్న యా
    కొయ్య గుఱ్ఱమెక్కి కయ్య మాడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. ‘ఆటలాడ నాకు వీటిఁ గొనుమ|టంచు పాప...’ అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు..... సవరించిన పద్యం

      అహహ! యిచట గనుమ! యలరుచున్నవి, నాన్న!
      ఆటలాడ నాకు వీటిగొనుమ
      టంచు పాప యొకతె, యచ్చోట నున్న యా
      కొయ్య గుఱ్ఱమెక్కి కయ్య మాడె!

      తొలగించండి
    3. ధన్యవాదములు..... సవరించిన పద్యం

      అహహ! యిచట గనుమ! యలరుచున్నవి, నాన్న!
      ఆటలాడ నాకు వీటిగొనుమ
      టంచు పాప యొకతె, యచ్చోట నున్న యా
      కొయ్య గుఱ్ఱమెక్కి కయ్య మాడె!

      తొలగించండి
  8. పిన్నక నాగేశ్వరరావు గారి (వాట్సప్) పూరణ....

    (1971 లో ఆకాశవాణి వారు ఇదే సమస్యను ఇచ్చినప్పుడు నేను పంపిన పూరణము.)
    కొయ్య గుఱ్ఱమెక్కి కూర్చున్న తమ్ముని
    లాగివైచి కొట్టి లాఘవముగ
    తనను కొట్టినాడు తమ్ముడనుచు అక్క
    కొయ్య గుఱ్ఱమెక్కి కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
  9. తాత, మనవడచట తగవాటలాడుచు
    నుండె నింటిలోన, నెక్కతాత
    చెక్కబల్లమీద చేరియా పిల్లడు
    కొయ్య గుర్రమెక్కి కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మనుమ డచట... నుండి రింటిలోన...’ అనండి.

      తొలగించండి
    2. అవునండీ మాస్టరుగారూ...ధన్యవాదములు.

      తాత, మనవడచట తగవాటలాడుచు
      నుండి రింటిలోన, నెక్కతాత
      చెక్కబల్లమీద, చేరియా పిల్లడు
      కొయ్య గుర్రమెక్కి కయ్యమాడె.

      తొలగించండి
  10. వీర శూర రాకుమారులు రణమున
    అశ్వమెక్కి పోర యలుపు లేక
    పిరికి వాడొకడిని పిలవఁ బోక, గృహంబు
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పోరన్+అలుపు= పోర నలుపు’ అవుతుంది.

      తొలగించండి
  11. బిడ్డలేయు లోపు పేరంటమైపోవు
    తిరిగి రాగలనని తరుణి వెడలె
    మనవడపుడె లేచి మారాము జేయుచున్
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘బిడ్డ లేచులోపు’ అని ఉండాలనుకుంటాను. ‘మనుమ డపుడె’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
      బిడ్డలేచు లోపు పేరంటమైపోవు
      తిరిగి రాగలనని తరుణి వెడలె
      మనుమడపుడె లేచి మారాము జేయుచున్
      కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె!

      తొలగించండి
  12. తెనుఁగులోనఁ గాష్ఠ మనఁగ నర్థం బేమి?
    మనుజవిభుఁడు వనికిఁ జనియె నెట్లు?
    కక్ష బూనియు ప్రతిపక్ష మేమి యొనర్చె?
    కొయ్య; గుఱ్ఱమెక్కి; కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
  13. అంబటి భానుప్రకాశ్ గారి (వాట్సప్) పూరణలు....
    1)
    రాణివాస మందు వనితల గూడియు,
    రణము జేయ లేక రాజొకండు
    చేతగాని తనము చేరగా మనమున,
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె!!
    2)
    చలనచిత్ర మందు చరితను వెలిగెడి,
    నాయకుం డొకండు వేయి జనుల
    పోరు సల్ప నెంచి నేర్పున గూర్చొని,
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె.!!

    రిప్లయితొలగించండి
  14. గుర్ర మెక్కినాను కొంచెమైనను మత్తు
    కలుగ లేద దేమి కారణ౦బొ?
    రమ్ము, విస్కి, బ్రాంది తెమ్ము..యిమ్మటంచు
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె.!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తెమ్ము+ఇమ్ము’ అన్నపుడు యడాగమం రాదు. ‘తెచ్చి యిమ్మటంచు’ అనండి.

      తొలగించండి
  15. జి. మధుసుదన్ రాజు (సందిత) గారి పూరణ....

    రౌడి యొక్క డెక్కె రంగుల రాట్నమున్
    వేగమె తిరుణాల వేడ్కలందు
    తిప్పలేదటంచు చప్పునన్ బలుమార్లు
    కొయ్యగుర్ర మెక్కి కయ్యమాడె!

    రిప్లయితొలగించండి
  16. అమరవాది రాజశేఖర శర్మ గారి పూరణ...

    ఎదగనేల పైరు ఏపుగ నిలపైన
    రాజునేగె నెట్లు రయముగాను
    కౌరవ పతినేది కదనానయొనరించె
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో పూరించడానికి ప్రయత్నించారు. సంతోషం. రెండవ ప్రశ్న తప్ప మిగిలిన ప్రశ్నోత్తరాల అన్వయం కుదరడం లేదు. సవరించండి.

      తొలగించండి
  17. ఆట లాడు వేళ నన్నయ్య తోచెల్లి
    నాది గుఱ్ఱ మనుచు వాదులాడ
    నేను ముందు యాడి నీకిత్తుననచెల్లి
    కొయ్య గుఱ్ఱ మెక్కి కయ్యమాడె!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ముందు+ఆడి’ అన్నపుడు యడాగమం రాదు. ‘నేను ముందె యాడి...’ అనండి.

      తొలగించండి
  18. . * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    పీక వరకు ద్రాగి వీరప్ప యను వాడు

    గొడవ సేయు స౦దు గొ౦దు ల౦దు |

    నయ్యొ యూరి లోన నతడు కొరక రాని

    కొయ్య. | " గర్ర మెక్కి " కయ్యె మాడె

    { గుర్రమెక్కి = వ్య౦గముగ తాగిన వాడు }

    రిప్లయితొలగించండి
  19. నల్లాన్ చక్రవర్తుల వేంకట నారాయణాచార్యులు గారి పూరణ....

    ⁠కుఱ్ఱ నాయకుండు గుఱ్ఱంబు కోరగా
    దర్శకుండు తెలిపె తధ్య మనుచు
    దృశ్య చిత్రణమున తేని కారణమున
    కొయ్య గుఱ్ఱ మెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
  20. అయ్య నుయ్యి గొయ్యి యని నియ్య కొనరయ్య
    యయ్య వారి యింటి దెయ్య మనుచు
    దుయ్య బట్ట బాలు డయ్య సయ్యాటలఁ
    గొయ్య గుఱ్ఱ మెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృత్త్యనుప్రాసతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  21. కోల యనగ నేమి బాలికా దెల్పుమా?
    రాజు వెడలు నెటుల లక్షణముగ?
    కలకు నేమి జేసె గాంధారి తనయుడు?
    కొయ్య, గుఱ్ఱమెక్కి, కయ్య మాడె!!!

    రిప్లయితొలగించండి
  22. అయ్య బంధువులును నాహవ మందుండ
    నాట లేల ననుచు చేటి పలుక
    బాలచంద్రు డేగి పగతుర పీకల
    కొయ్య, గుఱ్ఱ మెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      వైవిధ్యంగా పూరించాలన్న మీ ఆసక్తి ప్రశంశనీయం. కాని ‘కొయ్య(గా)’ వ్యాకరణ సమ్మతం కాదు. ‘కోయ(గా)’ సరైన రూపం.

      తొలగించండి
  23. రాణి రుద్రదేవి రణరంగమందున
    కాళికాంబవోలే కలియదిరిగి
    కత్తిదూసి వైరి కుత్తుకలందెగ
    కొయ్య గుఱ్ఱమెక్కి కయ్యమాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. కాని పూరణలో ‘కొయ్య’ కోయగా అనే అర్థంలో వాడరాదు.

      తొలగించండి
  24. రాణి రుద్రదేవి రణరంగమందున
    కాళికాంబవోలే కలియదిరిగి
    కత్తిదూసి వైరి కుత్తుకలందెగ
    కొయ్య గుఱ్ఱమెక్కి కయ్యమాడె

    రిప్లయితొలగించండి
  25. . పిల్లలిద్దరచట పెనుగు లాడుట జూచి
    తాత విషయమడిగి తగద టంచు
    మాన్పబూన దలచి మనముని దండించ?
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మనుమని’ టైపాటు వల్ల ‘మనముని’ అయింది.

      తొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    అయ్యొ యయ్యొ యనుచు నందఱ నదలించి
    దుయ్యఁబట్టి తాను చయ్యనఁ జని
    గుఱ్ఱ మెక్కలేని గుండత్త ఛాయతోఁ
    గొయ్యగుఱ్ఱ మెక్కి కయ్య మాడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగుందండి! ...నమస్సులు.....సూర్యకాంతం...ఛాయాదేవిల ఫైటా?!

      తొలగించండి
    2. గుండమ్మ కథ చిత్రం నేపథ్యంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారి పూరణములు:

    1.
    రణము జేయ దలచు రాకుమారుని గని
    చిన్నవాడు గనుక గన్నతండ్రి
    చెక్క కత్తి నీయ జేబట్టి బాలుండు
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె!


    2.
    పండ్ల తోట గాయు వనపాలకునకును
    కోర వాని సామి గుర్ర మిచ్చె
    దొంగ యొకడు లోన దూరియు పండ్లను
    గొయ్య, గుఱ్ఱ మెక్కి కయ్యమాడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాంతికృష్ణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణలో ‘కోయ’ను ‘కొయ్య’ అనడం సాధువు కాదని నా అభిప్రాయం.

      తొలగించండి
  28. NVN చారి గారి రెండవ పూరణము:

    బారు లోన దూరి బాగుగ ద్రాగియు
    బిల్లు కట్టు మనిన బెట్టు సేయ;
    తంతుమనగ వారు, చెంతనే యున్నట్టి
    కొయ్య గుఱ్ఱమెక్కి, కయ్య మాడె!

    రిప్లయితొలగించండి
  29. బీటుకూరు శేషుకుమార్ గారి పూరణము:

    మొయ్య లేని బావ మోసెద నేనంచు
    కాగితంపు కత్తి కరమునఁ గొని
    వీరు నట్టు లరచి వీడ్యము నుమ్ముచు
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శేషుకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మోయలేని’ అనండి.

      తొలగించండి
  30. నా రెండవ పూరణము:

    బాలచంద్రుఁ డపుడు పరిపంథి సేనల
    తోడఁ బోరఁ గాను, తూర్ణముగను
    సమర రంగమునకుఁ జని, కుత్తుకలఁ దెగఁ
    గొయ్య, గుఱ్ఱ మెక్కి, కయ్యమాడె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కొయ్యు’ క్రియాపదం విషయంలో నా సందేహం ఇంకా తీరలేదు.

      తొలగించండి
  31. గురువు గారికీ నమస్కారములు

    మా అమ్మాయి పెళ్ళి నిశ్చయమైంది...ఏప్రిల్ 29 రోజు ఎంగేజ్ మెంట్ జరగడం వలన బిజీగా వుండిపోయాను

    ఆటలాడుచుండె యారేళ్ళ పసివాడు
    కొయ్య గుఱ్ఱ మెక్కి, కయ్య మాడె
    వలదనుచును తాత వారింప బోయినన్
    మంకు వదలకుండ మనవ డపుడు.

    చందమామ కథలు చదివెడు బాలుడు
    మోజు తోడ తాను రాజు ననుచు
    కొయ్య గుఱ్ఱ మెక్కి కయ్యమాడెను శత్రు
    పటల ముదును మాడు నటన జేసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శీఘ్రమేవకళ్యాణప్రాప్తిరస్తు

      తొలగించండి
    2. ధన్యవాదాలండి రుబ్బారావు గారు

      తొలగించండి
    3. ఆంజనేయ శర్మ గారూ,
      సంతోషకరమైన విషయాన్ని చెప్పారు. అమ్మాయికి నా శుభాశీస్సులు. (పెళ్ళికి తప్పక పిలవండి!)
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘..చుండె నారేళ్ళ...’ అనండి. ‘మనవడు’ సాధువు కాదు, ‘మనుమడు’ అనండి.

      తొలగించండి


  32. 1.
    రణము జేయ దలచు రాకుమారుని గని
    చిన్నవాడు గనుక గన్నతండ్రి
    చెక్క కత్తి నీయ జేబట్టి బాలుండు
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె!


    2.
    పండ్ల తోట గాయు వనపాలకునకును
    కోర వాని సామి గుర్ర మిచ్చె
    దొంగ యొకడు లోన దూరియు పండ్లను
    గొయ్య ,గుఱ్ఱ మెక్కి కయ్యమాడె!
    3
    అసలు గుర్రమెక్కి యాటలాడగలేక
    దేనినెక్కినూహ దేలినాము
    దాని నెక్క దోటి గూనలేమొనరించె
    గొయ్య, గుఱ్ఱ మెక్కి, కయ్యమాడె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో 'కొయ్యు' క్రియాపదం విషయంలో సందేహం...

      తొలగించండి
  33. రాజ్యమేలె నాడు రంజుగా తన తాత,
    పదను పెట్టె కత్తి కదనమందు!
    భేషజమ్ము నేడు శోష పోవగ తాను
    కొయ్య గుఱ్ఱమెక్కి కయ్య మాడె!

    రిప్లయితొలగించండి
  34. 1.చలన చిత్రమందు చక్కగా యగుపిం చ
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్య మాడి
    విజయలక్ష్మి తోడ వేంచేతు ననుచును
    గొడవ పెట్టట సాగె గొణిగి కొనుచు.

    2.చిన్న బాలుడొకడు చేత కత్తిని బట్టి
    కొయ్యగుఱ్ఱమెక్కి కయ్యయ మాడి
    వత్తు ననుచు పలుక పగలబడుచు నవ్వి
    ముద్దు చేసి రెల్ల మురిసి పోయి.

    3.రాకుమారి జాడ రయముగా నరయుచు
    నపహరించి నట్టి యసుర వరుని
    చంపనెంచి యొకడు సాగె ధైర్యంబుతో
    కొయ్యగుఱ్ఱమెక్కి కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  35. రయ్యి రయ్య నంచు రణరంగమందున
    దూకి శత్రువులను దునుము కోర్కె
    బాలవీరు డపుడు పండ్లు కొరికి
    కొయ్యగుఱ్ఱమెక్కి కయ్యమాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘పండ్లుకొరికి వేగ...’ అనండి.

      తొలగించండి
  36. కల్లలేమి లేని పిల్లవా డాటలో
    కొంత తడవు చెలిమి కూర్మి చేసి
    క్రీడలోన సుంత కినుక నటింపగా
    కొయ్యగుర్ర మెక్కి కయ్యమాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమంత రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  37. బుడతడచటయెంతముద్దుగానుండెనో
    కొయ్యగుర్రమెక్కి.కయ్యమాడె
    నతనిజూచివానియన్నశంకరరావు
    గుర్రముతనదియనిగొడవజేసి

    రిప్లయితొలగించండి
  38. గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ గారి మూఁడవ పూరణము:


    అసలు గుర్ర మెక్కి యాట లాడగ లేక
    దేని నెక్కి యూహ దేలినాము?
    దాని నెక్క దోటి కూన లే మాడిరి?
    కొయ్యగుఱ్ఱ మెక్కి, కయ్యమాడె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాంతికృష్ణ గారూ,
      క్రమాలంకారంలో మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘కూన యే మాడెను’ అనండి. ‘కయ్యమాడె’ ఏకవచనంలో ఉంది కదా!

      తొలగించండి
  39. ఏమి చెప్పనయ్య యేడాది నుండియు
    చిన్న పిల్ల వాని చేష్టల వలె
    తిన వలదన పడని తిండికై మా యయ్య
    కొయ్య గుఱ్ఱ మెక్కి కయ్య మాడె.

    రిప్లయితొలగించండి
  40. వేగంలో "వేగ" లోపించింది.క్షమార్హుడను.

    రిప్లయితొలగించండి
  41. వేగంలో "వేగ" లోపించింది.క్షమార్హుడను.

    రిప్లయితొలగించండి
  42. క్రికెటు జూలు రాలి కిక్కులన్ గోరుచు
    ట్రిక్కు జేసి కుక్క ఠీవి జూపి
    సీటు క్రింద నక్కు సింహమున్ గానక
    కొయ్యగుఱ్ఱ మెక్కి కయ్యమాడె!

    రిప్లయితొలగించండి