6, మే 2016, శుక్రవారం

సమస్య - 2025 (బెండు మునుఁగు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
బెండు మునుఁగు నినుపగుండు దేలు.

89 కామెంట్‌లు:

  1. గారడీలు మరియు కనికట్టు జేయుచు
    తాను బ్రతుకుచుండు దారి ప్రక్క
    యతని చేయి తగిలినంతనే నీటిలో
    బెండు మునుఁగు నినుపగుండు దేలు.

    రిప్లయితొలగించండి
  2. మంత్ర తంత్ర మనుచు మాయల పకీరు
    చిలక ప్రాణ ముంచు చెట్టు లోన
    రాకు మారి దెచ్చి రాయిగా మార్చిన
    బెండు మునుఁగు నినుప గుండు దేలు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు
      మొదటి పాదంలో గణదోషం. 'మాయలాడు పకీరు' అనండి.

      తొలగించండి
  3. దొరవి కాలుజార శిరమున గల గడ్డి
    బెండు మునుగు , నినుపగుండు దేలు
    నదిక శక్తి నిడు నయస్కాం తమున్న ప్ర
    యోగ శాల లోన బాగుగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగున్నది. కాని ‘దొరవి కాలుజార శిరమున గల గడ్డి బెండు మునుగు..’ అనడం అర్థం కాలేదు.

      తొలగించండి
    2. మా ఊరిలో మెట్టపొలం కు ఊరికి మధ్య ఒక చెరువున్నది. ఆడవాళ్ళు పొలంలో గడ్డి కోసుకొని చెరువులోనుంచి నడచిరావాలి. కొన్నిచోట్ల జారుడుగాఉండి వాళ్ళు జారి పడినప్పుడు, నెత్తిమీదున్న గడ్డి మోపు నీళ్ళలో మునిగిపోయేది. ఆవిషయాన్ని ప్రతిబింబించాలని ప్రయత్నించాను.
      గడ్డి బెండుః గడ్డి మోపు

      తొలగించండి
  4. పడిన కష్టములకు ఫలితమ్ము దక్కక
    నలయు వాని బ్రతుకు గలయ జూడ
    కలసిరాని కాల మిల నిట్టులనిపించు
    బెండు మునుగు నినుప గుండు దేలు!

    రిప్లయితొలగించండి
  5. 🌺ఆటవెలది 🌺

    సమస్య :-బెండు మునుగు నినుప గుండు దేలు

    కలియుగమున కరువు గాఢంగ రాసాగె

    భుక్తి లేక నరులు భువిని యందు

    ఆకు వలెను రాలె అంచున సిరిలేక

    బెండు మునుగు నినుప గుండు దేలు

    .........
    శ్రీను, దువ్వూరు, కడప జిల్లా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దువ్వూరు శ్రీను గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగుంది. కాని కొన్ని లోపాలు... ‘గాఢంగ’ అనడం వ్యావహారికం. మీ పద్యానికి నా సవరణ....

      కలియుగమున కరువు గాఢమై రాసాగె
      భుక్తి లేక నరులు పుడమియందు
      రాలి రాకులవలె బ్రతుకగ సిరి లేక
      బెండు మునుగు నినుపగుండు దేలు.

      తొలగించండి
  6. ఆస్తి కరిగి పోయొ నప్పులెయగుపించె
    బిడ్డ కయ్యె ఖర్చు వేలలోన
    పసిడి నమ్మి తేను పైసలివి మిగిలె
    బెండు మునిగి నినుప గుండు తేలె.

    రిప్లయితొలగించండి
  7. సమస్య
    బెండు మునుగు నినుప గుండు దేలు

    వానకాలమందు వాగులు వంకలు
    పారు నట్టి దినము పత్త లేక
    కుంట లెండి నావి కురియక వానలు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    బండకాడి అంజయ్య గౌడ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బండికాడి అంజయ్య గౌడ్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘పత్త’ అని అన్యదేశ్య్తాన్ని ప్రయోగించారు. ‘ఎండినావి’ అనడం గ్రామ్యం. ‘సాగునట్టి దినము జాడ లేక| కుంట లెండెనయ్యొ...’ అనండి.

      తొలగించండి
  8. N. విజయ ప్రసాద్ గారి పూరణ.....

    అవని యందు చూడ అల్పుడపుడును
    వాగి వాగి డాబు పలుకు
    సజ్జనుండు చాల నెమ్మది చూడగా
    బెండు మునుఁగు నినుపగుండు దేలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని లోపాలు. మొదటి రెండు పాదాలలో గణదోషం. మూడవపాదంలో యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ....
      అవనియందు జూడ నల్పు డపుడపుడు
      వాగుచుండు డాబు పలుకులెన్నొ
      సజ్జనుండు మిగుల సౌమ్యుడై యుండును
      బెండు మునుగు నినుపగుండు దేలు.

      తొలగించండి

  9. Dr.Nvn Chary గారి పూరణ....

    బెండు మునుంగు నినుప గుండు దేలు
    నాదు చెఱువు లందు నమ్ము డనుచు
    సృష్టికి ప్రతి సృష్టి చేయగా నెంచిన
    ప్రకృతి సిద్ధ మగునె ప్రాఙులార!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మొదటిపాదంలో గణదోషం. ‘గుండు దేలు ననుచు’ అనండి. ‘ప్రాజ్ఞులార’లో జ్ఞ టైప్ చేయలేకపోయారు.

      తొలగించండి
  10. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల చక్రమటుల
    పేదరికముతోడ వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దులు.

    రిప్లయితొలగించండి
  11. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల చక్రమటుల
    పేదరికముతోడ వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దులు.

    రిప్లయితొలగించండి
  12. Sk 2031
    Dr.Nvn chary
    బెండు మునుగు నినుప గుండు దేలు నిటుల
    నాదు చెఱువు లందు నమ్ము డనుచు
    సృష్టికి ప్రతి సృష్టి చేయగా నెంచిన
    ప్రకృతి సిద్ధ మగునె ప్రాఙ్ఞులార!

    రిప్లయితొలగించండి
  13. 🌺🌻🌺


    అంబటి భానుప్రసాద్ గారి పూరణ....

    రాజ కీయ మందు రంగులు మార్చియు,
    చేయు చుందు రెన్నొ చిత్ర ములను,!
    వారి చేత బడిన వస్తువు మాయగ,
    బెండు మునుగు నినుప గుండు దేలు !!

    రిప్లయితొలగించండి
  14. దేశపతి గారి పూరణ....

    వదరుబోతుపలుకువంకరకూతలు
    నమ్మ రాదు మనము నవ్వులాట
    మాటపెంచువిలువ, మరువకు, జరుగునా?
    బెండు మునుగు నినుప గుండు దేలు.

    రిప్లయితొలగించండి
  15. 2011/15
    మజ్జారి చెన్నకేశవులు గారి పూరణ.....

    రాజ్యమందు నేలె యవినీతరాచకం
    దొంగతనము దారి దోపిడీలు
    దండవాది దీర్పు ధనిక పేదలరీతి
    బెండు మునుఁగు నినుప గుండు దేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో యతి తప్పింది. ‘రాజ్యమందు గల దరాజకత్వము మెండు’ అనండి. ‘దండవాది దీర్పు’ అర్థం కాలేదు.

      తొలగించండి
  16. [8:54AM, 5/6/2016] అంబటిభానుప్రకాశ్.: 🌺🌻🌺


    అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    ఆ**
    రాజ కీయ మందు రంగులు మార్చియు,
    చేయు చుందు రెన్నొ చిత్ర ములను,!
    వారి చేత బడిన వస్తువు మాయగ,
    బెండు మునుగు నినుప గుండు దేలు !!


    🌺🌲🌺
    [9:26AM, 5/6/2016] అంబటిభానుప్రకాశ్.: 🌲🌻🌲

    అంబటి భానుప్రకాశ్.


    ఆ** ఆడ వారి నోట నాడేటి మాటలు,
    మరల మరల నెపుడు,మారు చుండు,!
    బెండు మునుగు నినుప గుండు దేలు,
    నట్లు చూప గలరు నవని యందు! !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణలో ‘ఆడేటి’ అనడం గ్రామ్యం. ‘ఆడెడు’ అనండి. మూడవపాదంలో గణదోషం. ‘గుండు దేలు ననుచు’ అనండి. ‘...గలరు+అవని=గల రవని’ అవుతుంది. ‘చూపువార లవనియందు’ అనండి.

      తొలగించండి
  17. అ. రా. శ. గారి పూరణ...

    త్రాగుబోతు వాని వాగుడు కదుపేది
    తలయు తోక లేని పలుకు లిడును
    వాని మాటలందు వాస్తవ ముండునా
    బెండు మునుఁగు నినుపగుండు దేలు.

    రిప్లయితొలగించండి
  18. వలపు లోన బడిన వల్లింతు రేమేమొ
    ఒక్క టన్న నిజమ దుండబోదు
    కోతలెన్ని యైన కొత్త కొత్తగనుండు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అది+ఉండబోదు’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘ఒక్కటన్న సత్య ముండబోదు’ అనండి.

      తొలగించండి
  19. కలియుగంపు మాయ కనులకు కట్టగా*
    విశ్వమంత యొక్క విపణి కాగ*
    సాధ్యపడనివెన్నొ సాధించి చూపగా*
    బెండు మునుగు ఇనప గుండు తేలు*

    *** నాగమంజరి గుమ్మా ***

    రిప్లయితొలగించండి
  20. [5/6, 9:42 AM] కృష్ణ మోహన్ గోగులపాటి: బండపగల గొడుతు బోరు బావులువేస్తె
    బెండు మునుఁగు నినుపగుండు దేలు
    నీటి చుక్క రాక నీరసించెనుజనులు
    జ్యోతినవ్య కృష్ణ జూడుఁ మఖిల
    [5/6, 9:50 AM] కృష్ణ మోహన్ గోగులపాటి: చిన్న సవరణతో....

    బండపగల గొడుతు బావులెన్నోత్రవ్వ
    బెండు మునుఁగు నినుపగుండు దేలు
    నీటి చుక్క రాక నీరసించెనుజనులు
    జ్యోతినవ్య కృష్ణ జూడుఁ మఖిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోగులపాటి కృష్ణమోహన్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది.
      ‘బండ పగులగొట్టి... నీరసించిరి జనుల్’ అనండి.

      తొలగించండి
  21. జివివి ప్రసాద్ గారి పూరణ...

    చేప ఎరను తినగ చెరువులో గాలపు
    బెండు మునుగు,నినుపగుండు దేలు
    వెదకులాడ వేస్తె సూదంటురాయి
    నాణెములకు బదలు నదయెనంటె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జివివి ప్రసాద్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని కొన్ని లోపాలున్నవి. మూడవపాదంలో గణ యతి దోషాలు. ‘చూడ బోద మనిన సూదంటు రాయికి| నినుప గుండు తాకి యిటుల దేలె’ అనండి.

      తొలగించండి

  22. ఇంద్రజాలికుండు నింద్రజాలముజేయ
    నగ్గిలేక మంటలావరించు
    నతని కరము బుట్టునందంపు బక్షులు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    రిప్లయితొలగించండి
  23. మండు టెండ లందు నుండిన నిజ శిరం
    బెండు, మునుఁగు నినుపగుండు, దేలు
    కుట్టు, గాలి వీచు దట్టమై విన్పట్టె
    నిట్లు వేరు వేర నిండ్ల వింత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మండు టెండలోన మాడిన నా తల
      చల్లనైన నీడ నుల్లసిల్లఁ
      గలిగె, పోచిరాజు కామేశ్వరా నీదు
      పూరణమ్ముఁ జదువ ముదము గలిగె.
      (ఔత్సాహిక కవుల పూరణలను చదువుతూ, వారికి సవరణలను సూచిస్తూ, మాటిమాటికి డిస్కనెక్ట్ అవుతూ మిక్కిలి తక్కువ స్పీడ్ ఉన్న ఇంటర్‍నెట్‍తో ఒక్కొక్క వ్యాఖ్యకు ఐదేసి నిముషాలు తీసుకుంటూ పద్యాల ఎడారిలో తల వేడెక్కిన నన్ను ఒయాసిస్సులా మీ పద్యం సేదదీర్చింది. ధన్యవాదాలు)
      వైవిధ్యమైన విరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వ్యాఖ్య చూసిన తర్వాత కోటి రూపాయల బహుమతి దొరికినంత సంతోషము కల్గినది. సేద దీర్చిమనస్సున కాహ్లాదముకలిగించ గల్గితే కవనానినికి సార్థకత జేకూరినట్లే గదా. ధన్యున్ని. మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  24. గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    నీరు ప్రమిదలలో ని౦పి , య౦టి౦చగ
    . . వర్తులు నీటుగా ప్రజ్వలి౦చె ! !


    గాలిలోన విసరగన్ బూల , మాలిక
    . . గా మారి పడె వాని గళము న౦దు ! !

    గుడ్డు పయిన చేతి గుడ్డను వేసి , యా
    . . పిదప తీయగ - కోడి పిల్ల వచ్చె ! !


    గుడ్డపీలిక. వ్రేలికొసలతో లాగగా
    . . " ద్రౌపది చీర య౦త పొడ వయ్యె " ! !
    ...………………………….....

    బె౦డు మునుగు నినుప గు౦డు దేలును నీట

    ననుచు చూపె నెల్ల రక్కజ పడ. |

    ఊరివార లెల్ల గారడి వానికి

    ధనము ధాన్య మిడిరి తనివి దీర

    { వర్తి = వత్తి }

    రిప్లయితొలగించండి
  25. రామభక్తి మధురరసమును బీల్చుచు
    బెండు మునుగు.నినుపగుండు దేలు
    కామ క్రోధ లోభ గర్వ భారము తొలగ
    ప్రవాహణమ్ము వోలె భవజలధిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ప్రవహణమ్ము’ టైపాటు వల్ల ‘ప్రవాహణమ్ము’ అయింది.

      తొలగించండి
  26. బండ కట్టి నీట బడవేయ ,వెంటనే
    బెండు మునుగు, నినుప గుండు తేలు
    ననుట నిజము కాదు మునుగును జలమున
    నిజము పలికి తిపుడు నీవు నమ్ము

    రిప్లయితొలగించండి
  27. నీటి నంటి కూడ నిలకడగ మనును
    బెండు! మునుగు నినుప గుండు! దేలు
    చుంద్రు విజ్ఞులు బాహ్య సుఖముల నంటక !
    మునిగి పోదురిలను మూఢ మతులు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘...చుంద్రు బాహ్యసుఖము సోకక విజ్ఞులు’ అందామా?

      తొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో గణదోషం. ‘విన్నవించెను నాడు’ అనండి.

      తొలగించండి
  29. నీ టి నంటి కూడ నిలకడగ మనును
    బెండు! మునుగు నినుప గుండు! దేలు
    చుంద్రు విజ్ఞులు ఇహ సుఖముల నంటక !
    మునిగి పోదురిలను మూఢ మతులు!

    రిప్లయితొలగించండి
  30. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల మహిమ చేత
    పేదరికము చేత వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    రిప్లయితొలగించండి
  31. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల మహిమ చేత
    పేదరికము చేత వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    రిప్లయితొలగించండి
  32. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల మహిమ చేత
    పేదరికము గని వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    గన

    రిప్లయితొలగించండి
  33. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల మహిమ చేత
    పేదరికము గని వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    గన

    రిప్లయితొలగించండి
  34. కలిమి లేములెపుడు కలకాలముండవు
    మారుచుండు కాల మహిమ చేత
    పేదరికము గని వేదన పడబోకు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    గన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘పేదరికము జూచి’ అనండి.

      తొలగించండి
  35. నేటి శంకరాభరణం సమస్యాపూరణం
    sk :194
    సమస్య : బెండు మునుగు నినుప గుండు దేలు
    ఆ.వె
    నీతి నియమములను నీట ముంచియు నేడు
    విత్తు కిచ్చెనకట ! విలువ మెండు
    నల్లకోటు బాబు నాలుక నాడించ
    బెండు మునుగు నినుప గుండు దేలు
    2
    తెలుగు బెండు జేసి తెగవాగు కొందరు
    బరువు పెంచిరాంగ్ల భాష కిపుడు
    తెలుగు తీపి ముందు తేలిపోదాభాష
    బెండు మునుగు నినుప గుండు ముందు
    3
    కలిమి తోటి చెలిమి కలుగును ఇక్కట్లు
    నీతి నొదిలితేను నీడ కరువు
    తెలుగు బెండు జేసి తెగమెచ్చినాంగ్లము
    బెండు మునుగు నినుప గుండు దేలు
    ఘాలి లలిత ప్రవల్లిక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలితా ప్రవల్లిక గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘కలుగును ఇక్కట్లు’ అని విసంధిగా వ్రాయరాదు. ‘కలుగులే యిక్కట్లు’ అనండి.

      తొలగించండి
  36. నిండు జలనిధినిడ నినుముతో జతగూర్చ
    బెండు, మునుఁగు నినుపగుండు ; దేలు
    జలము నందు కలప, సహజగుణములివి
    శంక లెందు కిందు శంకరార్య !

    రిప్లయితొలగించండి
  37. కలియుగంబులోన కాదేది చిత్రంబు
    కల్ల నిక్కమగును నిజము కల్ల
    శాస్త్ర శోధనాన సలిపెడి సాధనన్
    బెండు మునుగు నినుపగుండుదేలు.

    రిప్లయితొలగించండి
  38. కలియుగంబులోన కాదేది చిత్రంబు
    కల్ల నిక్కమగును నిజము కల్ల
    శాస్త్ర శోధనాన సలిపెడి సాధనన్
    బెండు మునుగు నినుపగుండుదేలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదంలో యతి తప్పింది.

      తొలగించండి
  39. మిత్రులందఱకు నమస్సులు!

    నింగిఁ ౙుక్క మెఱయు; నీటఁ దేలును ౙొప్ప
    బెండు; మునుఁగు నినుప గుండు; దేలుఁ
    బరవశమునఁ బ్రియుఁడు పఱఁగఁ బ్రేయసిఁ గని;
    కాల్చు నెండ: ౘలియుఁ గంపన మిడు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  40. కవిమిత్రులకు నమస్కృతులు.
    రెండు మూడు రోజులుగా నా ఇంటర్ నెట్ వేగం మరీ తక్కువగా వస్తున్నది. మిత్రుల పూరణలపై ఒక్కొక్క వ్యాఖ్యను పెట్టడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతున్నది. అందులోనూ నెట్ మాటిమాటికి డిస్కనెక్ట్ అవుతున్నది. ఎల్లుండి నుండి స్పీడ్ పెరుగుతుందన్నారు.
    మీ పూరణలపై వెంటవెంటనే స్పందించలేకపోతున్నందుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  41. . వీర-బ్రహ్మ గురువు విన్నవించె నునాడు
    బెండుమునుగు నినుపగుండు దేలు
    ముందుకాలమందు మూర్ఖులు బెరుగగ?
    కలియుగాన జరుగు|విలువదరుగ|

    రిప్లయితొలగించండి
  42. నాటి దర్శకుడయిన విఠలా చార్యుని
    చిత్రములను గాంచ చిత్రమదియె
    మాయలెన్నొ యుండు మంత్రగాళ్ళుండేరు
    బెండు మునుగు నినుప గుండు దేలు

    సత్యవాక్కులివియె సలిల మందున దేలు
    బెండు, మునుగు నినుపగుండు, దేలు
    కుట్టు, యంచ నడక కులుకులీనుచునుండు
    విశ్వసత్యమిదియె విమలులార

    నిన్నటి సమస్యకు నా పూరణలు

    1.
    ప్రక్కనె గల నగరమ్మున
    చక్కని దైన పడతి వరుసకుమరదలె యా
    రుక్కమ్మను కాదని తన
    యక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్

    2.
    చుక్కలలో చంద్రునివలె
    మిక్కుటముగ పొగడబడెడు మేనత్తకు వా
    డొక్కడె పుత్రుడతడు మా
    యక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్

    రిప్లయితొలగించండి
  43. రక్తి పెరుగ పద్య రచనకు, నేడిట్టి
    ప్రశ్న కష్టమాయె, భారమైన
    భావ మెగిరిపోయె, పరువు నేలకు జారె
    బెండు మునుఁగు నినుప గుండుఁ దేలు

    రిప్లయితొలగించండి
  44. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఆంజనేయ శర్మ గారూ,
    మీ నేటి పూరణ, నిన్నటి పూరణలు అన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    హనుమంత రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  45. గురువు గారికి నమస్కారములు . మీరు సూచించిన విధంగా సవరించిన పూరణాన్ని ఇక్కడ వుంచాను.
    ధన్యవాదములు. శ్రీధర రావు.

    నీటి నంటి కూడ నిలకడగ మనును
    బెండు! మునుగు నినుప గుండు! దేలు
    చుంద్రు బాహ్య సుఖము సోకక విజ్ఞులు !
    మునిగి పోదురిలను మూఢ మతులు!

    రిప్లయితొలగించండి
  46. అక్కట నొకటే కన్నని
    మిక్కిలి బాధను బడు నొక మీనాక్షిని తా
    మక్కువమీరగ నొక్కడు
    న "క్కను" బ్రేమి౦చి పె౦డ్లి యాడె ముదమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘అక్కను ప్రేమించి...’ అన్న సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అక్కట’ అన్నది కళ. కనుక ‘అక్కట యొకటే’ అనండి.

      తొలగించండి
  47. బావమరిది కొడుకు బహు గడసరి వాడు
    బెండు మునుగు నినుప గుండు దేలు
    ననుచు జూపె!పట్టి యరచేత మోయగన్
    బెండు గుండదేను! గుండు బెండు!

    రిప్లయితొలగించండి
  48. శంకరయ్య గారికి నమస్సులు.వేగంలో జరిగిన పొరబాటు.
    సవరణ పద్యం.
    ,,,,,

    కలియుగంబులోన కాదేది చిత్రంబు
    కల్ల నిక్కమగుచు కన్నుచెదరు
    శాస్త్రసాధనాన సలిపడి శోధనన్
    బెండుమునుగు నినుపగుండు దేలు.

    రిప్లయితొలగించండి
  49. శంకరయ్య గారికి నమస్సులు.వేగంలో జరిగిన పొరబాటు.
    సవరణ పద్యం.
    ,,,,,

    కలియుగంబులోన కాదేది చిత్రంబు
    కల్ల నిక్కమగుచు కన్నుచెదరు
    శాస్త్రసాధనాన సలిపడి శోధనన్
    బెండుమునుగు నినుపగుండు దేలు.

    రిప్లయితొలగించండి
  50. గురువు కరుణ కలుగ క్రూరత్వము లుడిగి
    సాత్వికమ్ము హెచ్చు సరసముంగ...
    శంకరయ్యగారి సవరణమ్ముల తోడ
    బెండు మునుఁగు నినుపగుండు దేలు
    🙏

    రిప్లయితొలగించండి