7, మే 2016, శనివారం

సమస్య - 2026 (మతము మారని జనులకు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
మతము మారని జనులకు హితము లేదు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

84 కామెంట్‌లు:

  1. అందరున్ జను మార్గము నరగినపుడు
    మంచిజరుగును మనుజుల కంచితముగ
    చెడ్డదారిన బోవుచు స్వీయపునభి
    మతము మారనివారికి హితములేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వీయాభిమతాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఎడ్డె మనగ మనము తాము తెడ్డెమనుచుఁ
    దెడ్డె మనగ మనము రెచ్చి యెడ్డెమనుచు
    దారి లోనబడక రీతి మీర! రెట్ట
    మతము మారని వారికి హితము లేదు.

    రిప్లయితొలగించండి
  3. ఎన్ని స్తవములు నుడివిన యున్న దొకటె
    విశ్వ మంతయు పాలించు విభుడొ కండె
    మమత నిండిన మనమున సమత లేక
    మతము మారని జనులకు హితము లేదు

    రిప్లయితొలగించండి
  4. అక్కయ్యా,
    సమత లేకుండా మారిన మతం హితం కాదన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. వెతల గుందెడి వారల బ్రతుకులందు
    స్వాంత మందున గొలదిగ స్వార్థము విడి
    యార్తి దొలగను దరినిడి యాదు కొనుట
    మతము,‌ మారని జనులకు హితము లేదు!

    రిప్లయితొలగించండి
  6. సకల శాస్త్రంబులందున సార మెరిగి
    వెలుగు నొందుచు నుండెడి వెజ్జు పలుకు
    ప్రీతితోడవినియుగూడ ప్రేమతోన
    మతము మారని జనులకు హితము లేదు

    ....శ్రీను, దువ్వూరు, కడప జిల్లా

    రిప్లయితొలగించండి
  7. సిరులు వెచ్చించి గెలిచెడు వరుస పెరుగ
    నీతి మృగ్యమయ్యెను రాజనీతి లోన
    ధనము రాజకీయమున ప్రధాన మనెడు
    మతము మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  8. మారవలెను మండూకపు మది తలంపు
    మారు సాంకేతికపు గొప్ప మార్పు గాంచి
    నేటి యాధునికంబున నాటి యహిత
    మతము మారని జనులకు హితము లేదు

    రిప్లయితొలగించండి
  9. మడియు ఆచారమనుచును మసలుచుండు
    మాన్యులెల్లరుయిలలోన మనుషులకును
    దూరమయ్యెడి కాలమ్ము చేరువయ్యె
    మతము మారని జనులకు హితములేదు

    తనదు మతమింక యిలలోన తగినదనుచు
    పలుకుచుందురు మూర్ఖులు ముల్కులట్లు
    అట్టివారల వాదన అనవరతము
    మతము మారని జనులకు హితములేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. సముద్రాల శ్రీనివాసాచార్యులు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘ఎల్లరు+ఇలలోన’ అన్నపుడు యడాగమం రాదు. ‘మాన్యు లెల్లరీ యిలలోన మానవులకు’ అనండి.
      రెండవపూరణ రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. ‘ములుకులట్లు’ అంటే సరి.

      తొలగించండి
  10. తనకు మాలిన పనులలో తలనుదూర్చి
    క్షణము తీరిక లేకుండ గడపుచుండి
    ముఖ్యమైన పనులనవబోకుడు సత
    మతము - మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  11. మతములేవైన జనులకు హితముకొఱకె
    హితవిహీనపు మతమది హేయమగును
    మానవత్త్వము లేనట్టి మరొక దుష్ట
    మతము, మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  12. మతములేవైన జనులకు హితముకొఱకె
    హితవిహీనపు మతమది హేయమగును
    మానవత్త్వము లేనట్టి మరొక దుష్ట
    మతము, మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి

  13. మంచితనము జూప మమత పెరుగు చుండు
    మానవతయు పెరుగు మంచి జరుగు
    తాము నమ్మినదియె ధరఁనిజ యభి
    మతము మారని జనులకు హితము లేదు.

    2.నాదు మతమె గొప్ప నావాదమేసత్య
    మనెడి జనుల మనము యనవరతము
    చింతల మయమగును చెరుపు కలుగ జేయు
    మతము మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో ‘మనము+అనవరతము’ అన్నపుడు యడాగమం రాదు. ‘హృదయ మనవరతము’ అందామా?

      తొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. అన్య మతముల నెల్లసమాదరించు
    భారతమ్మకె కరువయ్యె భాగ్యమిలను
    సొంత యింటిలోన సవతి సంతువోలె
    నెట్టి సాయమ్ము నందని వెట్టి బతుకు
    గడుపుచుండెను నేడహో! గనగ హిందు
    మతము మారని జనులకు హితము లేదు!!!

    రిప్లయితొలగించండి
  16. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.
    తే**
    మూర్ఖ తనమును విడువక మూఢు లయ్యి,
    తప్పు దారులు విడువక ముప్పు నొందె,
    మార్పు గోరక నెప్పుడు మంచి వినని,
    మతము మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  17. మేలు గలుగును నిరతము బాల !వినుము
    మతము మారని జనులకు, హితము లేదు
    మతము మార్పుల మూలాన మతపు విలువ
    తెలియ కుండగ బోవుచు దీటు గాను

    రిప్లయితొలగించండి
  18. ఊషర క్షేత్రమునఁ బంట లుత్కటముగ
    నెట్లు పండింతు రనెడి యన్వీక్ష లేక,
    యందె వ్యవసాయమునుఁ జేతు; రట్టి భూక

    మతము మారని జనులకు, హితము లేదు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భూకమతాన్ని తీసుకొని వైవిధ్యంగా చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  19. ధనము నధికారబలము గల్గిన వటంచు
    వెట్టి చాకిరీచే హింస పెట్టు వెడగు
    మతము - మారని జనులకు హితము లేదు
    ఇహపరమ్ముల శిక్షలు ఇది నిజమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘శిక్షలు+ఇది’ అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు.

      తొలగించండి
  20. కాల ధర్మంబిది జనుల కేల చింత
    రైతునకు నైన క్షేత్రంపు దాత కైన
    చాలు నంచును నిర్దిష్ట కాలమున క
    మతము మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  21. నమస్కారం....
    నాపేరు ముడుంబ ప్రవీణ్ కుమార్
    నేటి సమస్యకు నా పూరణం...తప్పులుంటే సవరించ గలరు....

    రోజు రోజుకు జరిగెడి రొచ్చు లన్ని
    చూసి చూసి విసుగుజెంది చూపు దిప్పి
    మరలి పోయెడి వారల మనమున అభి
    మతము మారని జనులకు హితము లేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముడుంబ ప్రవీణ్ కుమార్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మనమున నభి|మతము...’ అనవచ్చు కదా! సాధారణంగా పద్యాలలో అచ్చులు రాకూడదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు...

      తొలగించండి
  22. 🌺🌻🌺

    తే**

    పెళ్ళి చూపుల యందును ప్రియము బల్కి,
    కట్న కానుక తోడుగ కలిమి గోరి !
    వధువు తలిదండ్రు విసిగించు వరుస "దప్పు
    మతము "మారని జనులకు హితము లేదు. !!


    🌸అంబటి భానుప్రకాశ్.🌸

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగుంది. అభినందనలు.
      ‘తలిదండ్రు’ అని ప్రత్యయం లేకుండా వ్రాశారు. ‘వధువు తండ్రిని విసిగించు..’ అనండి.

      తొలగించండి
  23. కలియుగమ్మున కాంతయు కనకమున్న
    చాలునంచును తలచెడు చపల బుద్ధి
    కలిగినట్టి వారెల్లరికను తమయభి
    మతము మారని జనులకు హితము లేదు

    రిప్లయితొలగించండి
  24. కలవు కుందేటి కెపుడును కాళ్ళుమూడె
    యనుచు బలికెడి మూర్ఖుల నాపగలమె ?
    హేతువాదన కాదన జూతు , రట్టి
    మతము మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. మానవత్వము నిలుపగ మంచి సలుపు
    మతము|”మారనిజనులకు హితములేదు
    చదువు,సంస్కారమేదగ్గ?ముదము కరవే|
    విలువ లంచెడి విద్యయే నిలుపు మతము.

    రిప్లయితొలగించండి
  27. * గు రు మూ ర్తి ఆ చా రి **
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ఏసు మత ప్రచారకు డిట్లు కూసె " మైకు "

    న౦దు :-- నేసు మాత్రమె ప్రభు డ౦దరికిని |
    ి
    ియేసు రక్తమె పాపాల నెల్ల గడుగు |

    యేసు మతములో నే చేరు మి౦క. | మీ కు

    మతము మారని జనులకు హితము లేదు ! !

    రిప్లయితొలగించండి
  28. చేపూరిశ్రీరామారావు గారి పూరణ....

    కష్ట సుఖములు జోడెడ్లుకదులుకలిసి
    ఇష్టపడుతునెసాగించు పయనములను
    మనము సందర్భమునుబట్టి మారుటనభి
    మతము,మారని జనులకు హితములేదు

    రిప్లయితొలగించండి
  29. మాదు మతము గొప్పదనుచు మభ్యపెడుతు
    మతము మారగ పలు బహుమతులనిస్తు
    ముందు మతమును మార్చెడు మూర్ఖపుయభి
    మతము మారని జనులకు హితములేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మభ్యపెట్టి... బహుమతుల నిచ్చి... మూర్ఖపు టభి...’ అనండి.

      తొలగించండి
  30. NVN చారి గారి పూరణము:

    దారి గాచి దోచెడి బోయ దారి మారి
    పుట్టలోనుండి వెల్వడ్డ పుణ్య వ్రతుడు
    వ్రాసె వాల్మీకి తానౌచు రామ చరిత!
    మతము మారని జనులకు హితము లేదు!!

    రిప్లయితొలగించండి
  31. వేద ధర్మాన బుట్టియు, విహిత కర్మ
    ములకు దూరమై, పాపము పుణ్యమనగ
    శ్రద్ధలే కెండమావుల జనెడు, దురభి
    మతము మారని జనులకు హితము లేదు.

    రిప్లయితొలగించండి
  32. Vidhya leni paamara sabha Madhya nilachi
    Pamdituni vole nokkamdu balike nitula
    Matamu maarani janulaku hitamu ledu;
    Gtamu gatamanu variki gatulu levu

    రిప్లయితొలగించండి
  33. తక్కువెక్కువ కులముల తగవు వీడి
    తగ్గు హెచ్చుల యధికారతాత్వ ముడిగి
    లేమి కలుముల తేడాలు లేక సతము
    సర్వ సమభావమున బ్రజల్ చనుట సుఖము
    మతము మారనివారికి హితములేదు

    మతుల భేదముననె మత భేదము గల్గె
    ఎన్ని మతములున్న నీశుడొకడె
    దారులేన్ని యున్న చేరునదొక యూరె
    యీ నిజంబెరుంగ నెసగు సుఖము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వద్దూ(డ్డూ)రి రామకృష్ణ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరయ్య మాష్టారు గార్కి నమస్కారములు శంకరాభరణం బ్లాగు ద్వారా పద్యములు వ్రాసే అవకాశం కలిగినందుకు ఈవేదిక ద్వారా చాలామంది కవి మిత్రులు పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను .ధన్యవాదములు

      తొలగించండి
  34. లలితా ప్రవల్లిక ఘాలి గారి పూరణ....

    ఆత్మ యోగులకుమతము అంటలేదు
    కాల చక్రమున్ మారేటి కాయమునకు
    మతము ఏదని చెప్పును మానవత్వ
    మతముమారని జనులకు హితములేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మతము+అంటలేదు=మత మంటలేదు’ అవుతుంది. మీరు విసంధిగా వ్రాశారు. ‘యోగుల కేమత మంటలేదు’ అనండి. ‘మతము+ఏదని=మత మేదని’ అవుతుంది. అక్కడ ‘మతము లేవని’ అనండి.

      తొలగించండి
  35. ధన్యవాదములు శంకరయ్య మాస్టారు గారు

    రిప్లయితొలగించండి
  36. శంకరాభరణం వారి నేటి సమస్య
    మతము మారని జనులకు హితములేదు
    నా పూరణ :
    s.k: 194
    తే.గీ
    ఆత్మ యోగులకేమతమంటలేదు
    కాలచక్రమున్ మారేటి కాయమునకు
    మతములేవని చెప్పును మానవత్వ
    మతముమారని జనులకు హితములేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మారేటి -> మారెడు, మతము లేవని -> మతము లేదని.... అనండి.

      తొలగించండి
  37. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  40. మతము లెంచియు చూడగా మమత యొకటె
    మనసు యొక్కటె చేర్చును మనిషి నెపుడు
    ఫలము యున్న చోట కలుగు ప్రతి ఫలము
    మతము మారని జనులకు హితము లేదు

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  42. కల్ల బొల్లిమాటలుతోటి కథలు జెప్పి,
    ధర్మ లక్షణదశకము దారితప్ప,
    గద్దె నెక్కిన నేతలు గతము మరచు
    మతము మారని వారికి హితము లేదు.

    రిప్లయితొలగించండి
  43. అచ్చు తప్పున్నదిచటను ముచ్చటైన:
    "మతము మారని జనులకు హితము లేదు"
    "అసలు హైదరబాదు"న సిసలు గాను:👇
    మతము మారిన జనులకు హితము లేదు!

    రిప్లయితొలగించండి