8, మే 2016, ఆదివారం

సమస్య - 2027 (గీతను పఠియించు నరుఁడు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
గీతను పఠియించు నరుఁడు కోతి యగును. 
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

72 కామెంట్‌లు:

  1. నీతిగ బ్రతుకుట కొఱకని
    గీతను పఠియించు నరుఁడు, కోఁతిగ మారున్
    పాతవి చేష్టలు వీడక
    రాతను మార్చెను హరియట లాఘవ మొప్పన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మన్నించండి. యతిదోషంతో సమస్య ఇచ్చాను. మీరు గమనించకుండా పూరణ చెప్పారు. సవరించిన సమస్యతో పూరణ ఇవ్వండి.

      తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు. యతిస్థానమునొకసారి పరిశీలింప మనవి.

    రిప్లయితొలగించండి
  3. రామ చరితము దెల్పును రావణుండు
    మనము ననను నిత్యము మహిమాన్విత శివ
    గీతను పఠియించు నరుఁడు కోతి యగును
    వానికి దహియింపగ లంక ప్రాభవంబు.

    ( పఠియించున్ + అరుఁడు) ( అరుఁడు= శత్రువు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కర్మ చేయుట యొక్కటే కలదు నీకు
      ఫలిత మాసింప రాదని పలికి నట్టి
      గీత మాటలు జదివియు నీతి లేక
      ఫలిత మాసించి వేల్పుకు ప్రణతు లిడెడు
      గీతను పఠియించి నరుడు కోతి యగును
      తప్పులుంటే సవరించిన వాట్సప్ లో పెట్టగలను


      తొలగించండి
    3. ప్రియ మిత్రులు శ్రీ కందుల వర ప్రసాద్ గారూ! బహుకాల దర్శనం. మీరుఇచ్చిన సమస్య పై నాపూరణకు మీ స్పందనకు ధన్యవాదములు.

      తొలగించండి
  4. గీతను పఠియుంచు, నరుడు కోతి యగును
    చిత్తమున భ్రాంతి వీడక జిగిని గనక,
    నెన్ని తీరుల జదివిన నేమి ఫలము
    మనసు మార్చక, మనుగడ మార్గ మందు!

    రిప్లయితొలగించండి
  5. మోక్షమందగ వృద్ధాప్యముననుజూడ
    గీతను పఠియించునరుడు, కోతియగును
    యువక రక్తంబు బారుచు నవతనిండ
    వయసు ధర్మంబు యోచింప వాస్తవంబు.

    రిప్లయితొలగించండి
  6. మోక్షమందగ వృద్ధాప్యముననుజూడ
    గీతను పఠియించునరుడు, కోతియగును
    యువక రక్తంబు బారుచు నవతనిండ
    వయసు ధర్మంబు యోచింప వాస్తవంబు.

    రిప్లయితొలగించండి
  7. మాన ధనముల హరియించు మద్య మెపుడు
    చదువు సంధ్యలున్న ఫలిత మది గన మిల
    సత్వ హారి సురా పాన సంజనితము
    గీతను పఠియించు నరుఁడు కోతి యగును.

    రిప్లయితొలగించండి
  8. డా.ఎన్.వి.ఎన్. చారి 9866610429
    నరుడు నారాయణుడని వానరము జెప్పె
    నట్టి కోతిని కావలె నంచు వేడి
    ననవరతమును హనుమకు హారతిచ్చి
    గీతను పఠియించు నరుడు కోతి యగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హారతి+ఇచ్చి' అన్నప్పుడు యడాగమం వస్తుంది. 'హారతి నిడి' అనండి.

      తొలగించండి
  9. సకల సద్గుణ వారాశి ,శాంతి యుతుడు
    గీతను పఠి యించు నరుడు, కోతి యగును
    దురితములు జేయు మనుజుడు దుష్టు డయ్యు
    వికృత చేష్టల తోడను విర్ర వీగి

    రిప్లయితొలగించండి
  10. తేః మోక్షమొందును కరమగు దీక్షతోడ
    గీతను పఠియించు నరుడు, కోతియగును
    మనపురాణముల తెగడి మనెడు వాడు
    ప్రజల దృష్టిలో సతతము నిజముగాను

    రిప్లయితొలగించండి
  11. ఈతి బాధలు వీడుచు నిత్యు నిగని
    నరుడు నారాయణుని జేర వరము నొంద
    గీతను పఠియించు; నరుఁడు కోతి యగును
    గాదె ! యైహిక ములమున్గ కడవరకును

    రిప్లయితొలగించండి
  12. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    తే**
    సత్య నిత్యము దెలియగ సాగు మెపుడు,
    మంచి మరువక జేయుము మరువ కెపుడు,
    నరుని మూర్ఖత విడిచియు నడువ , కృష్ణ
    గీతను పఠియించు నరుడు కోతి యగును !

    తే**
    తల్లి దండ్రులు జెప్పిన తలపు గొనక,
    చదువు సంధ్యలు మానియు చరిత లేక,
    యూరు దిరిగెడి తనయుడు పొరుగు నున్న
    'గీతను' పఠియించు నరుడు కోతి యగును,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదంలో 'మరువక' శబ్దం పునరుక్తమయింది. 'మంచి పనులను జేయుము మరువ కెపుడు' అనండి.

      తొలగించండి
  13. మానవత్వపు విలువల మర్మమెరగ
    గీతను పఠియించు నరుడు, కోతియగును
    తీరలేనట్టి కోర్కెల కోరు కొనుచు
    అందలాలకై యారాట మొందువాడు.

    రిప్లయితొలగించండి
  14. కర్మ చేయుము ఫలితమ్ము కోర వద్దు
    కర్త వీవను భావమ్ము కల్ల సుమ్ము
    కోతి నిష్కామ కర్మకు గొప్ప గుర్తు
    గీతను పఠియించు నరుడు, కోతియగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సకల శుభదాయిని శ్రీ సుందరాకాండ పారాయణ లో అంతర్లీన పరిశుద్ధ తత్త్వాన్ని గ్రహించి చెప్పిన మీ పూరణ చాల సాధారణముగా కనిపించినా ఎంతో గూఢ భావముతో ఆధ్యాత్మికత చెప్పుచున్నది. అన్నా! అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు తమ్ముడూ. మొదటి పదంలో యతి దోషం ఉంది. సవరించాను.

      తొలగించండి
    4. కర్మ చేయుము ఫలితమన్ కాంక్ష వలదు
      కర్త వీవను భావమ్ము కల్ల సుమ్ము
      కోతి నిష్కామ కర్మకు గొప్ప గుర్తు
      గీతను పఠియించు నరుడు, కోతియగును.

      తొలగించండి
  15. భక్తిభావము పెరుగును పరవశించి
    గీతను పఠియించు నరుడు ;కోతియగును
    పాపపు పనులను చేయుచు పతితు డగుచు
    కోరి నరకము చేరును కుత్సితుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు
      మూడవ పాదంలో గణదోషం. 'పాపపు పనుల జేయుచు' అనండి.

      తొలగించండి
  16. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    తే**
    సత్య నిత్యము దెలియగ సాగు మెపుడు,
    మంచి పనులను జేయుము మరువ కెపుడు,
    నరుని మూర్ఖత విడిచియు నడువ , కృష్ణ
    గీతను పఠియించు నరుడు కోతి యగును !

    ***

    సవరించిన పద్యము ...

    ధన్యవాదాలు సర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్న మిమ్మల్ని, జయన్న గారిని కలవడం, మీ సౌహార్దం ఆనందాన్ని కలిగించాయి. స్వస్తి!

      తొలగించండి
  17. కూతలందున శ్రీరంగ నీతులనుచు!
    దొమ్మర గుడిసెలందున దూరెదరట!
    నాచ రించెడు బుద్ధియు నవని లేక
    గీత పఠియుంచు నరుఁడు కోతి యగును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అట+ఆచరించెడు' అన్నప్పుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
      కూతలందున శ్రీరంగ నీతులనుచు!
      దొమ్మర గుడిసెలందున దూరెదరట!
      యాచ రించెడు బుద్ధియు నవని లేక
      గీత పఠియుంచు నరుఁడు కోతి యగును!

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:
      కూతలందున శ్రీరంగ నీతులనుచు!
      దొమ్మర గుడిసెలందున దూరెదరట!
      యాచ రించెడు బుద్ధియు నవని లేక
      గీత పఠియుంచు నరుఁడు కోతి యగును!

      తొలగించండి
  18. మిత్రులందఱకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

    మాతనుఁ బూజింపక; తాఁ
    బాతకుఁడై; నిలుకడ విడి, పాపాల్ దొలఁగన్

    గీతనుఁ బఠియించు నరుఁడు
    కోతి యగును
    గాదె దూఁకఁ గొమ్మల పైనన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారు "పాపాల్" మాటయెందుకోనచ్చలేదండి. మీకు శబ్దసంపదకు కొదవేమిటి.

      తొలగించండి
    2. మిత్రులు వరప్రసాద్ గారికి నమస్సులు...ధన్యవాదములు

      తొలగించండి
    3. మిత్రులు పోచిరాజు గారికి నమస్సులు...! నాకు అప్పుడు మనస్సున మెదలినదానిని రాశాను. పైగా నెట్ ప్రాబ్లమ్. కరెంట్ ప్రాబ్లమ్...అందుకే అలా...

      తొలగించండి
    4. మధుసూదన్ గారు నమస్కారములు. పరవలేదులెండి. "పాపచ్యుతికిన్" అంటే బాగుంటుందని నా ఉద్దేశ్యము.

      తొలగించండి
    5. మధుసూదన్ గారూ,
      కందంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. కాయ కష్ఠము జేయక కడుపు నిండ
    కూడు నాశించు సోమరి కువలయమున
    నమ్మి ప్రారాబ్ద కర్మము నమ్మి నుదుటి
    గీతను పఠియించు నరుడు కోతి యగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రారబ్ధము' టైపాటు వల్ల ప్రారాబ్ధము.... అయింది.

      తొలగించండి
  20. కాయ కష్ఠము జేయక కడుపు నిండ
    కూడు నాశించు సోమరి కువలయమున
    నమ్మి ప్రారాబ్ద కర్మము నమ్మి నుదుటి
    గీతను పఠియించు నరుడు కోతి యగును

    రిప్లయితొలగించండి
  21. నీతిమాలినగర్వి-దుర్నీతిచేత
    గీతను పఠియించు నరుడు కోతి యగును
    తెలిసి తెలియని మూర్ఖుడై విలువలేక
    కలసి మెలసియు జీవించ?కలతలుంచు.

    రిప్లయితొలగించండి
  22. కర్మ బంధము లేకనే కర్మనెవరు
    చేయుచుందురు నిలలోన జెప్పు కృష్ణ?
    మద్యమును దాగ మనిషి తా మారునెట్లు?
    గీతను పఠీయించు నరుడు, కోతి యగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాంతికృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '... చుందురు+ఇలలోన=... చుందు రిలలోన' అవుతుంది. 'చేయుచుండెద రిలలోన' అనండి.

      తొలగించండి
  23. Gurudevulaku pranaamamulu
    Gita Loni gitalu gani khyati noda
    Gitanu patiyimchu narudu,koti yagunu
    Korikalaku jikkina naadu,kurmi noda
    Vaada vaadala vraalunu pakshi valenu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందుల వర ప్రసాద్ గారి పూరణము:

      గీతలోని గీతలు గాని ఖ్యాతి నొంద
      గీతను పఠియించు నరుడు, కోతి యగును
      కోరికలకు జిక్కిన నాడు, కూర్మి నొంద
      వాడ వాడల వ్రాలును పక్షి వలెను

      తొలగించండి
  24. సక్తి తోడనే గీతను చదువ వలెను
    గీత చదివిన బ్రతుకులో గెలుపు కలుగు
    శాస్త్ర విషయాన సుంతయు శ్రద్ధ లేక
    గీతను పఠియించు నరుడు కోతి యగును

    రిప్లయితొలగించండి
  25. వ్యాధునికి పక్షులను జంపవలదటంచు,
    రక్కసీడుల మూకకు మక్కువలను,
    ధ్వంస మొనరించు వారిని హంసజేయ
    గీతను పఠియించు నరుడు కోతి యగును

    రిప్లయితొలగించండి
  26. తల్లి దండ్రుల యాకటి తీర్చబోడు
    ఆన్నదానము చేయును ఆలయాన
    పేరు కోసమై,పుణ్యంపు ఫలముకొరకు
    గీతనుఁ బఠియించు నరుఁడు కోతి గాదె

    రిప్లయితొలగించండి
  27. అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.

    తే**
    సత్య నిత్యము దెలియగ సాగు మెపుడు,
    మంచి పనులను జేయుము మరువ కెపుడు,
    నరుని మూర్ఖత విడిచియు నడువ , కృష్ణ
    గీతను పఠియించు నరుడు కోతి యగును !

    ***

    సవరించిన పద్యము ...

    ధన్యవాదాలు సర్.

    రిప్లయితొలగించండి
  28. సంస్కృతముకొంత నేర్చిన చాలు ననుచు
    నొంటరి తనము తాళక నొళ్ళు మరచి
    కల్లు త్రాగుచు రాత్రిని కామ సూత్ర
    గీతను పఠియించు నరుఁడు కోతి యగును :)

    రిప్లయితొలగించండి