10, మే 2016, మంగళవారం

సమస్య - 2029 (మాట నిలుకడ లేకున్న...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
మాట నిలుకడ లేకున్న మాన్యుఁ డగును. 

97 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నేటి రాజకీయంబున నీతి మాలి
      పూటపూటకోమాటను మాట లాడు
      వారె పెద్దలగుచునుండ వాదమేల?
      మాట నిలుకడ లేకున్న మాన్యుఁ డగును.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అన్నారు. 'పూటపూటకున్ మాటల మార్చునట్టి | వారె.. .' అనండి.

      తొలగించండి
  2. తనరు భావము నెలవున దానెఱింగి
    మనసు నందున స్వార్థము మట్టు బెట్టి
    చెలగు జీవన పథముల జెల్లు వాని
    మాట నిలుకడ లేకున్న మాన్యు డగును!

    నిలుకడ=విరామము

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. కొలువు లేక లోకమ్మున విలువ లేదు
    పంపు పట్నమునకు బిడ్డ పెంపునొంద
    వివరముగఁ జెప్పుచుంటిని, వినుము నాదు
    మాటనిలు కడ లేకున్న మాన్యుఁ డగును!!


    నాదు మాటన్ + ఇలు + కడ = నాదు మాటనిలు కడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని... ఇలు కడను ఇంటికడ అనాలి కదా...

      తొలగించండి
  5. గురువు గార్కి నమస్సులు !
    నమ్మ కమ్మెల్ల నతనిపై వమ్ము కాదె?
    మాట నిలుకడ లేకున్న, మాన్యుఁ డగును.
    నేత నిలకడ యుంచుచు నిజము తోడ
    చెప్పి నటులనే పనులను చేసి చూప !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం. .. అమెరికాలో ఉన్నన్ని రోజులు బ్లాగుకు దూరమయ్యారు. మీ పునరాగమనం సంతోషదాయకం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిలుకడ నుంచుచు'అనండి.

      తొలగించండి
  6. అమ్మ ప్రేమను మరచిన వార లున్న
    కల్తి యుగమందు జగతియె వెల్తి బడగ
    నేను నాదను భావన నీడ లందు
    మాట నిలుకడ లేకున్న మాన్యుఁ డగును

    రిప్లయితొలగించండి
  7. మనిషి విలువను బట్టియె మాటయుండు
    మనసు విలువను బట్టియె మనిషియుండు
    విలువ తెలిసిన వాడియె నిలువ గలడు
    మాట నిలుకడ లేకున్నా మన్యుఁ డగును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాడియె'....? 'వా డిల నిలువగలడు' అందామా?

      తొలగించండి
  8. _/|\_

    మాట దప్పిన వాడెట్లు మనుజుడగును ??
    నిలువ జాలడెచట ! సుంత విలువ లేదు
    మాట నిలకడ లేకున్న -మాన్యుడగును
    స్వార్థ చింతన విడనాడి బ్రతుకుచున్న !

    రిప్లయితొలగించండి

  9. ఎవ్వరామాట చెప్పింది నెప్పుడంటి?
    ననుచు తప్పించు కోకున్న నవని మీద
    ఎన్నికలలోన నిలబడ నెవడి తరము?
    మాట నిలకడ లేకున్న మాన్యు డగును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెప్పింది, కోకున్న' అని వ్యావహారికం ప్రయోగించారు. 'చెప్పిన దెప్పుడంటి... తప్పించుకొనకున్న' అనండి.

      తొలగించండి
  10. 🔴🔴

    మాట మాటంటు నిలబడి మంచి జేయ
    ఒక్కరును వెంట నిలబడ రూరుకొమ్ము
    లోక రీతిని తెలియని లోహి తాస్య
    మాట నిలకడ లేకున్న మాన్యు డగును

    🔴
    Veera

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అంటు'అనడం గ్రామ్యం. 'మాట మాటకు నిలబడి' అనండి.

      తొలగించండి
  11. .డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    ప్రజలు నమ్మరు మెచ్చరు వ్రభుత నెపుడు
    మాట నిలకడ లేకున్న;మాన్యు డగును
    మాటయును మంచి మార్గంబు మార్చనట్టి
    నాయకుండు,కైమోడ్పుల నందు కొనును

    రిప్లయితొలగించండి
  12. 2) లోకు వగుట తప్పదు సుమ ! లోక మందు
    మాట నిలకడ లేకున్న , మాన్యు డగును
    మనుజు డేకాల మందైన మహిమ గాంచి
    నిలుపు కొన్న తన పలుకు నిగ్గు తోడ

    రిప్లయితొలగించండి
  13. నమస్తే అన్నయ్యగారూ.ఈ పద్యమొకపరి చూడండి.
    వానకాలమందు బాలబాలికలెల్ల
    కాగితంపు పడవ కత్తిపడవ
    రామణీయకముగ రకరకముల చేసి
    మురిసి పోవు చుంద్రు మోజు తోడ.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      నిన్న ప్రయాణంలో ఉండి మీ పద్యాన్ని సమీక్షించలేదు. మన్నించండి.

      తొలగించండి
  14. కొలువు గొప్సదైన విలువఁ కోలుపోవు
    మాటనిలుకడలేకున్న :మాన్యుడగును
    మానవతను పూని మంచి పనులను జేయంగ
    ననుచు తెలియుమయ్య కుమార యనవ రతము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘మానవతను బూనియు జేయ మంచిపనుల’ అనండి.

      తొలగించండి
  15. సవరణ చేసిన పద్యం

    మనిషి విలువను బట్టయె మాటయుండు
    మనసు విలువను బట్టయె మనిషియుండు
    విలువ తెలిసిన వాడిల నిలువ గలడు
    మాట నిలుకడ లేకున్నా మన్యుఁ డగును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైప్ దోషాలున్నవి. బట్టియె - బట్టయె; లేకున్న - లేకున్నా...

      తొలగించండి
  16. నమ్మకమ్మును గోల్పోవు నరుడు ధరను
    మాట నిలుకడ లేకున్న, మాన్యుడగును
    ఇచ్చు మాటను మరువక ఖచ్చితముగ
    ఆచరించుచు జూపిన యశము దక్కు !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అగును+ఇచ్చు’ అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాశారు. ‘మాట నిచ్చి కచ్చితముగ మరువకుండ’ అందామా?

      తొలగించండి
  17. నమస్తే అన్నయ్యగారూ.నిన్నటి పద్యమొకపరి చూడండి.
    అవని యందు చూడ అన్నదమ్ముల మధ్య
    నీరు జల్లినంత నిప్పు రగిలె
    ననుచు పల్కు జనుల నాపలేక
    మౌనమాశ్రయించె మనుజ జాతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ బాగుంది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘...ననుచు పల్కు జనుల నాపంగలేకను’ అందామా?

      తొలగించండి
  18. పదవులందున సాగుచు ముదమునంద
    ఎన్ని పార్టీలు మారెనో యెంచ దరమె
    స్వార్థ పూరిత బుద్ధితోఁ బరగ,లేదు
    మాట నిలుకడ! లేకున్న మాన్యుడగును!

    రిప్లయితొలగించండి

  19. నా రెండవ పూరణము

    తప్పు మాటలు జెప్పుచు దప్పు కొనగ
    నెవరు గానరు దరిజేర నీయరు గద
    మాట నిలుకడ లేకున్న; మాన్యు డగును
    వాడెవడు మాట పటిమను పాడి యవగ
    వాడి, దానిని చేతల బడసి జనునొ!

    రిప్లయితొలగించండి
  20. స్వార్థచింతనమ్ముగలిగి సాయమందు
    వాదన పఠిమతోడన వాదమాడి
    నేడిల జయము జేగూర్చె న్యాయ వాది
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పటిమ’ను ‘పఠిమ’ అన్నారు.

      తొలగించండి
    2. అంతేకాదు, సమాసంలో ‘వాదనాపటిమ’ అవుతుంది.

      తొలగించండి
  21. మనుజు డెవరైన దన తోడి మనుజు తోడ
    బగను బెంచుక నొకనాడు బలిమి గలిగి
    "నెంత కాలమ్ము నైన నిన్నేసెద న'ను
    మాట నిలుకడ లేకున్న మాన్యుడగును!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపుతానన్న మాటమీద నిలుకడ లేకపోవడం మంచిదే. మంచి పూరణ. అభినందనలు.

      తొలగించండి
  22. మాటపై నిలబడుటయే మతమునాడు
    పిదపకాలము వచ్చెను పిదపబుద్ధి
    ఆడినవి వీడి నేత లారాధ్యులైరి
    మాటనిలకడలేకున్న మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  23. పరపతిని గోలుపోవును పదుగురెదుట
    మాట నిలకడ లేకున్న, మాన్యుడగును
    సతము మాటపై నిలబడు సజ్జ నుండు
    అతనిపేరునిల్చు జగతి ననవరతము

    రిప్లయితొలగించండి
  24. పరువుమర్యాదలనిలుపుపథము మాట
    సిరులుసంపదలనిడెడిశక్తి మాట
    మనుజులసుఖశాంతుల బాటమాట నేల
    మాటనిలకడలేకున్నమాన్యుడగును?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపు చేసే సమయంలో పద్యాల మధ్య వ్యవధానం ఉంచండి. మీ పద్యాన్నే చూడండి....

      పరువు మర్యాదల నిలుపు పథము మాట
      సిరులు సంపదల నిడెడి శక్తి మాట
      మనుజుల సుఖశాంతుల బాటమాట నేల
      మాట నిలకడ లేకున్నమాన్యు డగును?

      తొలగించండి
  25. ముఖ్య ముగనిల గారవ ముండ దా ర్య !
    మాట నిలుకడ లేకున్న, మాన్యు డగును
    మాన వత్వము తోడన మదిని దలచి
    సాటి వారల కెప్పుడు సాయ బడిన

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. కాపురుషుల సాంగత్యము పాప మొసగు
      చెఱచు సద్గుణముల నెల్ల పఱచు సుఖము
      వారి విడిచి వర్తిలి ముదమార జూప
      మాట నిలు కడ లేకున్న మాన్యుఁ డగును.
      [మాట నిలుకు+ అడ = మాటనిలుకడ; నిలుకు = నెమ్మదితనము; అడ = ముద్ద]

      తొలగించండి
    2. విలక్షణమైన విఱుపుతో విశేషార్థాన్ని సాధించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  27. గురుదేవులకు ప్రణామములు..ధన్యవాదములు
    రాజకీయ నేతల పై..
    ==============*================
    నేత యగును మాట నిలుకడ లేకున్న,
    మాన్యు డగును వాడు మాన హీను
    డయిన,ఖలులకు ఖలు డైన జాలును నేడు
    అన్నయందురు గద యార్తులెల్ల !

    రిప్లయితొలగించండి
  28. నమస్కారం సర్, ,,


    అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.


    తే**
    అవని యందున జనులతో యనవ రతము,
    మాట నిలుకడ లేకున్న మాన్యు డగును ,!
    యెట్లు,మాటలు దప్పక, తిట్లు బడక,
    చరిత గొనుటయె గొప్పది తరచి జూడ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జనులతో ననవరతము’ అనండి. అక్కడ యడాగమం రాదు. అలాగే ‘అగును+ఎట్లు’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు.

      తొలగించండి


  29. నీతియు నిజాయితీలకు నీళ్ళ నొదలి
    కల్ల బొల్లి బలుకులతో కథను మార్చి
    న్యాయ వాదులంతట జేయు నయము గాను
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును

    రిప్లయితొలగించండి
  30. పూజ్యులు శంకరయ్యగారికి వందనములు. నిన్నటి నా పద్యము పై సుమలత గారి సందేహమునకు నా వివరణ యిచ్చట కూడ పొందు పరచు చున్నాను. పరిశీలించ గోర్తాను.

    సుమలతగారు నమస్కారములు. మంచి ప్రశ్న వేశారు. పర్వము అంటే ఇక్కడ సమూహము అని అర్థము. ఇది తత్సమము. “నౌపర్వము” సమాసమే సాధువు.
    “ నావః పర్వము” సరిగాదనుకుంటాను. ఎందుకంటే సమాసము చేయునపుడు పదమూల రూపమునే తీసుకుంటాము. విగ్రహ వాక్యములో విభక్తిని గ్రహిస్తాము. ఉదాహరణకు “కుసుమావళి” పువ్వుల సమూహము. ఇక్కడ “అ” కారంత కుసుమ పదమునే తీసుకున్నాము. “కుసుమాని” బహువచనము తీసుకోలేదు. అట్లే “నౌ” ఔకారాంత పదమునే తీసుకొని సమాసము చేయవలసి యుంటుంది. “నావః” బహువచన పదము రాదు సమాసము లో.
    అందుకే నా సవరణ నుపహరించుకొని మొదటి పద్యమునే గ్రహించ గోర్తాను. ఇది నాకు తెలిసిన విషయము. మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      నమస్కారం.
      నేను ముందే చెప్పాను. నాకు సంస్కృత భాషా పరిజ్ఞానం శూన్యమని. మొదటి పద్యంలోని ప్రయోగమే సాధువుగా తోస్తున్నదని నిన్ననే చెప్పాను కదా! స్వస్తి!

      తొలగించండి
  31. మాట ముఖ్యము లోకాన మానవతకు
    మాట తప్పుట తుల్యంబు మరణమునకు
    మాట నిలకడ చేతనే మాన్యుఁడగును
    మాట నిలుకడ లేకున్నమాన్యుఁ డగును

    లేకున్న ఈ + అమాన్యుడగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ‘ఈ+మాన్యుఁడు’... అర్థం కాలేదు.

      తొలగించండి
    2. లేకున్న + అమాన్యుడగును. ఈ పొరపాటున వచ్చింది. మన్నించగలరు.

      తొలగించండి
  32. ఆ యయాతిని రాముడే నంతరించు
    ననగ హనుమాను రక్షించ మనుగ డైన
    మాటనిలకడ లేకున్న మాన్యు డగును
    రామ చంద్రు డే నిలలోన క్షేమకరుడు| {యయాతినిచంపెద నని ప్రతినమానిభక్తుని రక్షించిన?మాటనిలకడ?}
    2.మాట మూటలు బంచుచు మలచు చున్న
    ఎన్ని కైనట్టి తంత్రంబు పన్నుగడయె
    మాటనిలకడ లేకున్న మాన్యు డగును|
    రాజకీయాన నేత విరాగి గాక|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘రాముడే యంతరించు, చంద్రుడే యిలలోన’ అనండి.

      తొలగించండి
  33. 1.
    కోట్లు ఖర్చుచేసి జనుల యోట్ల బొంద
    కల్ల లాడుచు తానెన్నికలను గెలిచి
    పదవి బొంది మాట మరచు ప్రభువు జూడ
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును

    2.
    వ్యర్థు డనుచును దూరరే వసుధయందు
    మాట నిలకడ లేకున్న, మాన్యుడగును
    ఖచ్చితత్వము కలిగియున్ కల్ల లెరుగ
    నట్టి జనులీ సమాజము నందు సుమ్ము

    రిప్లయితొలగించండి
  34. నేను కనబడు తదుపరి నిముసమందు
    అప్పులోడికి పట్టింతుననుచు నాడు
    మాటనిచ్చె స్నేహితుడు నా మంచి కోరి
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును
    అరాశ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అప్పులోడు’ వ్యావహారికం.

      తొలగించండి
  35. బడుగు వర్గపు ప్రగతికై పాటు పడక,
    నాయకునిగాగ నిలువ ననర్హుడగును
    మాట నిలుకడ లేకున్న ; మాన్యుఁ డగును
    సత్య వాక్పరి పాలన జరుపునాడు

    రిప్లయితొలగించండి
  36. మిత్రులందఱకు నమస్సులు!

    [నాయకు లనగానే మన మదిలో మెదిలే యాలోచన యిది]

    ’సకల సౌఖ్యమ్ము లిత్తును; సకల జనుల
    బాధ లన్నియుఁ దీర్చెదఁ బఱఁగ మీ’క
    టంచుఁ బనిఁ గొని, నాయకుఁ డటె చనఁ; దన

    మాట నిలుకడ లేకున్న, మాన్యుఁ డగును!

    రిప్లయితొలగించండి
  37. స్వార్థ తత్వమె లాభాలుసాకుచుండ
    కోట్లు గడియించ నెంచిన కోర్కె లందు
    తప్పదనివార్య మన్నట్లు తిప్పలందు
    మాటనిలకడ లేకున్న?మాన్యు డగును|

    రిప్లయితొలగించండి
  38. మాట కెన్నియో వ్యాఖ్యలు మహిని గలుగ
    మాట కెన్నడు నిలుకడ మాను లేదు
    గాని స్థిరమైన నడవడీ గలుగు మనిషి
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘నిలుకడ మానులేదు’... అర్థం కాలేదు. ‘నడవడిన్’... ‘నడవడీ’ అయింది.

      తొలగించండి
  39. . ఆ యయాతిని రాముడే యంతరించు
    ననగ హనుమాను రక్షించ మనుగ డైన
    మాటనిలకడ లేకున్న మాన్యు డగును
    రామ చంద్రు డే యిలలోన క్షేమకరుడు| {యయాతినిచంపెద నని ప్రతినమానిభక్తుని రక్షించిన?మాటనిలకడ?}
    2.మాట మూటలు బంచుచు మలచు చున్న
    ఎన్ని కైనట్టి తంత్రంబు పన్నుగడయె
    మాటనిలకడ లేకున్న మాన్యు డగును|
    రాజకీయాన నేత విరాగి గాక|

    రిప్లయితొలగించండి
  40. ప్రాణ,మాన,విత్తముల కపాయమైన
    బొంకవచ్చునని దెలిసి శంక వీడి
    యట్టి స్థితిలోన బొంకిన నప్పు డతని
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును!

    రిప్లయితొలగించండి
  41. ఎప్పటికి నేది యుచితమో యప్పుడటుల
    మనసు రంజింప జేసెడు మాట లాడు
    వాడు కల్లలాడ వలసి వచ్చు నపుడు
    మాట నిలకడ లేకున్న మాన్యుడగును!

    రిప్లయితొలగించండి
  42. యెన్నికల వేళ పలికెనుయేలికన్న
    తీయని పలుకుల్ వసుధలో తెలివి తోడ
    పనియవగానె తా బాట మార్చు
    మాట నిలకడ లేకున్న మాన్యు డగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      యడాగమంతో పద్యం ప్రారంభించరాదు కదా! ‘ఎన్నికల వేళ’ అనండి.
      మూడవపాదంలో గణదోషం. ‘పనియు పూర్తి కాగానె తా బాట...’ అనండి.

      తొలగించండి
  43. నిందలెల్లను బడుచును నింద్యుడగును
    మాటనిలకడ లేకున్న, మాన్యుడగును
    రాముపగిదిని రాజ్యంబు రహినివీడ
    దుష్టశక్తుల దొలగించు ధుర్యుడగుట.

    రిప్లయితొలగించండి
  44. మాట తీరును బట్టి యే మానవుని కి
    విలువ గలదు మహినిమరి విజ్ఞత కలి
    గినడచుట వలన కలదు గాదె మమత
    మాట నిలుకడ లేకున్న మాన్యు డగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో యతి తప్పింది. ‘విజ్ఞత కలు|గ నడచుట...’ అనండి.

      తొలగించండి
  45. నేత లాడు మాట లిలను నీటి బుడగ
    లనుచు తెలిసియు గెలిపించ లక్షణముగ
    నందల మ్మెక్కి యతడాడినట్టి నాటి
    మాట నిలకడ లేకున్న మాన్యు డగును.

    రిప్లయితొలగించండి
  46. గౌరవము లేదు చూడరే కౌరవులకు
    మాట నిలుకడ లేకున్న, మాన్యు డగును
    పాండవాగ్రజు డీనేల, పలుకు తీరు
    వలన నిలచెగా వంద్యుడై ప్రజల లోన

    రిప్లయితొలగించండి
  47. వక్ర శుక్రనీతి (భాగ్యనగర పోతన): 👇

    పెళ్ళి చూపులందును నాడ పిల్ల లందు
    ప్రాణ విత్త మానములకు భంగ మందు
    బాప లావులు భయపడి పారు నపుడు
    మాట నిలుకడ లేకున్న మాన్యుఁ డగును :)

    రిప్లయితొలగించండి