15, మే 2016, ఆదివారం

సమస్య - 2034 (క్రీస్తు పూజనీయుఁడు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు. 

75 కామెంట్‌లు:

  1. క్రీస్తు పూజనీయుఁడు, "గాఁడు" క్రైస్తవులకు
    ఆంగ్ల భాషలో చెప్పితి అతడు, వినుమ !
    ఫేము గల మత మదియేను ప్రేమ మార్గ
    మనుచు భువిలోన పెక్కుగ మన్నె బొందె

    రిప్లయితొలగించండి
  2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇంగ్లీషు గాడు (GOD)లో అరసున్నా ఉండదు. చివర ‘మన్నన గనె’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. వేద మొప్పగ చరియించి విజ్ఞులయిన
    భక్తి మార్గము తరియించు భక్తులకును
    క్రీస్తు పూజనీయుడు గాడు, క్రైస్తవులకు
    క్రీస్తు ఆరాధ్య దైవంబు ప్రీతి మీర

    రిప్లయితొలగించండి
  4. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘క్రీస్తు+ఆరాధ్య=క్రీస్తారాధ్య’ అవుతుంది. అక్కడ విసంధిగా వ్రాయరాదు. ‘క్రీస్తె ఆరాధ్యదైవంబు...’ అనండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేద మొప్పగ చరియించి విజ్ఞులయిన
      భక్తి మార్గము తరియించు భక్తులకును
      క్రీస్తు పూజనీయుడు గాడు, క్రైస్తవులకు
      క్రీస్తె యారాధ్య దైవంబు ప్రీతి మీర

      మీ సవరణకు ధన్యవాదములు

      తొలగించండి
  5. నమ్మి పూజించి నంతనె వమ్ము గాదు
    మతము లనునవి మనుజుల హితము కోరి
    క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్త వులకు
    విశ్వ మంతట నిండిన వేలు పొకడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. కాని సమస్య పరిష్కారం సంతృప్తికరంగా ఉన్నట్టు లేదు.

      తొలగించండి
    2. క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్త వులకు
      మతము లనునవి మనుజుల హితము కోరి
      నమ్మి పూజించి నంతనె వమ్ము కాదు
      విశ్వ మంతట నిండిన వేలు పొకడె

      తొలగించండి
  6. కర్మ సిద్ధాంతమును నమ్ము కర్మఠులకు
    కర్మ నిష్ఠాగరిష్ఠుల కైన నిలను
    క్రీస్తు పూజనీ యుడుగాడు; క్రైస్త వులకు
    దేవు నికుమారు డగుచుండి దివ్యుడయ్యె.

    రిప్లయితొలగించండి
  7. తనను ప్రకటించుకొని రాజు దైవముగను
    దైవదూత యా క్రీస్తు కాదనుచు వేసె
    శిలువ - యట్టి రాజు క్షమియించినను గాని
    క్రీస్తు -పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు
    (అతి కష్టంమద పూరించాను....పాస్మార్కులైనా వేస్తారా మాష్టారూ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      కొద్దిగా అన్వయలోపం. ‘..యట్టి రాజును క్షమించినను గాని క్రీస్తు...’ అనండి.

      తొలగించండి
  8. హైందవ ప్రజలకు, బౌద్ధ మహమ్మదీయ
    మతములను నమ్ము వారికి మహిని యందు
    క్రీస్తు పూజనీయుడు గాడు, క్రైస్తవులకు
    యేసు ప్రభువే కదా పూజ్యు డెల్లవేళ.







    రిప్లయితొలగించండి
  9. తొల్లి రోమురాజుల కెల్ల దుష్టు డతడు
    క్రీస్తు పూజనీయుఁడు గాఁడు, క్రైస్త వులకు
    పుణ్య సుతుడు ముమ్మాటికి పుడమి లోన
    గెలిచె మృత్యువు నాతండు శిలువ వేయ

    రిప్లయితొలగించండి
  10. .డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    ఆంగ్ల శకమున కాధార మాత డెవరు?
    దొంగ స్వామింట మనమేల దూర రాదు ?
    బైబి లెవరికి పూజ్యంబు భారతమున?
    క్రీస్తు, పూజవీయుడు గాడు, క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘స్వామి+ఇంట’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘దొంగ స్వామికి మనమేల లొంగరాదు’ అనండి. బైబిలు ప్రపంచ క్రైస్తవులందరికీ పూజ్యం కదా! మీరు ‘భారతమున’ అన్నారు. అక్కడ ‘బైబి లెవరికి పూజ్యమై వరలుచుండు’ అనండి.

      తొలగించండి
  11. నిన్నటి నా పూరణ...

    నాడు సంతోషమునుజెంది వీడె బాధ
    లన్ని సురలకు ననిదల్చి యమర పతియె
    సమరమందున రావణు జంపగానె
    రామచంద్రుండు, శయనించె రంభ తోడ

    రిప్లయితొలగించండి
  12. కన్నె కడుపున నుదయించి కాంతులీని
    ధరణి శాంతిని కోరిన దైవదూత
    క్రీస్తు పూజనీయుడు, గాడు క్రైస్తవులకు
    మాత్రమే,నెల్ల విశ్వాసములకు గూడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటిపాదంలో యతిదోషం. ‘విశ్వాసపాత్రులకును’ అనండి.

      తొలగించండి
  13. మేరియన్నను 'మదరౌను' సేవజేయు
    వనిత 'సిస్టరు' గానుండు వాస్తవముగ
    చర్చి పూజారి 'ఫాదరు' సరిగ వినుము
    క్రీస్తు పూజనీయుఁడు, 'గాఁడు' క్రైస్త వులకు

    రిప్లయితొలగించండి
  14. మతము సాంఘికాచారంబు మహిని జూడ
    నెవరి మతంబులు వారికి నిడును శాంతి
    చెలగి బ్రార్థింప దేవుని శిలువ; నేల?
    క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు!

    రిప్లయితొలగించండి
  15. కన్నె కడుపున నుదయించి కాంతులీని
    ధరణి శాంతిని కోరిన దైవదూత
    క్రీస్తు పూజనీయుడు, గాడు క్రైస్తవులకు
    మాత్రమేనెల్ల విశ్వాస పాత్రులకును

    రిప్లయితొలగించండి
  16. Drsrinivasachary
    Sk no2036
    కవిత సంఖ్య11
    దైవమెవరయ్య క్రైస్తవ ధర్మ మందు?
    దుర్జనుండెట్టి వాడగు సజ్జనులకు?
    చర్చు కోవెల నెవరికి జగతి యందు?
    క్రీస్తు, పూజనీయుడు,క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘చర్చి యెవరికి కోవెల’ అని మార్చాలనుకున్నాం కదా!

      తొలగించండి
  17. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మతములో జేరిన౦ జాలు మనకు దొరకు

    ప౦చదారయు నూనెయు ప్రాలు మరియు

    నుచిత వైద్యము , విద్య యనుచు దల౦చు

    హి౦దువులు గల రీ దేశ మ౦దు నరయ. |

    క్రీస్తు పూజనీయుడు కాడు క్రైస్తవులకు ,

    కాదు కాదు సుమా , దొ౦గ - క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి
  18. గాడు యన్నదేవుడుయేసు, గాడు యేసు
    క్రీస్తు పూజనీయుడు, గాడు క్రైస్తవులకు
    తాను, గాడుయనిననేమి దైవదూత
    జ్యోతి నవ్యాఖిలా! నీకు జోత కృష్ణ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. కాని ఉత్వసంధులు వేయవలసిన చోటల్లా యడాగమాలు చేశారు. ‘గాడటన్న దేవుడు యేసు... తాను గాడడని యననేమి...’ అనండి.

      తొలగించండి
  19. క్రైస్త వులకెల్ల జగతిని గ్రాంతి నొప్పు
    క్రీస్తు పూజ నీయుడు, గాడు క్రైస్తవులకు
    వంద నీయుడు శ్రీరామ భక్తు డిలను
    మతము బట్టియే దైవము మాన్యు డగును

    రిప్లయితొలగించండి
  20. తే**
    నమ్మి కొలచెడి వారికి బొమ్మ గాదు
    “క్రీస్తు పూజనీయుఁడు ;గాఁడు క్రైస్తవులకు !
    మాత్ర మేనిల,చూడగన్,మహిని దైవ
    దూత యనుచును గొలిచెరు నీతి గలిగి,!!

    అంబటి భానుప్రకాశ్,
    గద్వాల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...గొలుతురు నీతి గలిగి’ అనండి.

      తొలగించండి
  21. మతము హితమునుగోరుచు మహిని వెలయ
    నెవరి సమ్మతమెయ్యదో యెంచుకొనగ
    క్రీస్తు పూజనీయుడు, గాడు క్రైస్తవులకు
    రాముడెప్పుడు దైవంబు రహినిజూడ.

    రిప్లయితొలగించండి
  22. హిందువులకు దేవుడు రామచంద్రుడనగ!
    నాస్థికునికి అల్లా, సాయినాథుల వలె
    క్రీస్తు పూజనీయుడు గాడు! క్రైస్తవులకు
    దారి చూపెడి జీససే దైవమగును!

    రిప్లయితొలగించండి
  23. హిందు,బౌద్ధ,జైన మతస్థు లేరికైన
    క్రీస్తు పూజనీయుడు గాడు; క్రైస్తవులకు
    క్షమయు సహన గుణములు భూషణము లైన
    క్రీస్తు మాత్రమే పూజ్యుడై కీర్తి గాంచె.

    రిప్లయితొలగించండి
  24. ఇతర ఛాందస వాదుల కెప్పుడైన
    క్రీస్తు పూజనీయుడు గాదు, క్రైస్తవులకు
    నతడు దేవుని బిడ్డడే యనవరతము
    ఆర్తులన్ గావ నేతెంచె నవనికతడు

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. నేటి లోకము నాస్తిక వాటి కైన
      నర్చన లిడరు శౌరికి హైందవులును
      దురక లల్లాను గొలువరు ధరణి నింక
      క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వాటి కైన’...?

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “వాటికయైన; వాటికైన” అని నాఉద్దేశ్యము. ఇక్కడ “వాటిక” తత్సమము గాబట్టి యడాగమము తప్పనిసరా ? తెలుప గోర్తాను. అయినచో సవరణ:
      “నేటి లోకము నాస్తిక వాటిక యన”

      తొలగించండి
  26. దేవు డల్లాయని మురిసె భావుకులకు
    బౌద్ధమార్గమున నడుచు బౌద్దులకును
    హైందవమును పాటించెటి హిందువులకు,
    క్రీస్తు పూజనీయుడుగాదు; క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి
  27. క్రైస్తవుల వేలు పెవ్వరు? క్రీస్తు వారి
    కెట్టి వాడగు? నాతడు పొట్టి వాడె?
    క్రీస్తు ప్రభు వెవరికి చెప్పు - శ్రేణి లోన
    క్రీస్తు, పూజనీయుఁడు, గాఁడు, క్రైస్తవులకు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. అందరూ రెండు లేదా మూడు ప్రశ్నలు సృష్టిస్తే మీరు నాలుగు సృష్టించారు.

      తొలగించండి
    3. అన్నా! అద్భుతః. సమస్యను మూడు పదాలుగా విరచి పై 3 పాదాలకు అన్వయం చెప్పవచ్చు. అటువంటిది 4 ముక్కలు చేసి సారాన్ని నాల్గు ముక్కల్లో తేల్చేసారు. వైయ్యాకరుణులకు చిన్నపాటి , (కామా) లేదా అక్షరం తగ్గి సూత్రం వ్రాస్తే కొడుకు పుట్టినంత ఆనంద పడతారని పెద్దలు చెప్పగా విన్నాను. మీరదే పనిచేసారు. మీది “ఆక్రమిత “ క్రమాలంకారం. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదాలు గురువుగారూ. పూరణ మొత్తాన్ని క్రైస్తవంలో యిమిడ్చాను కూడా.

      తొలగించండి
  28. మతము నందున వివిధంపు గతులు గలవు
    క్రీస్తు నమ్మెడు వారల గేలి చేసి
    మాత దైవమ్మనుచు గొల్వ! మరియ కంటెఁ
    గ్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు!

    రిప్లయితొలగించండి
  29. 1.
    సకల మతసారమును జూడ యొకటె యైన
    వివిధ దేవుళ్ళు వెలసిరీ విశ్వమందు
    హైందవ మతమందునగల ఛాందసులకు
    క్రీస్తు పూజనీయుడు గాడు, క్రైస్తవులకు
    పరమ శివుడన్న నుండదు భక్తి నిజము.

    2.
    మతమునకొక దేవుడనుచు మానవులిల
    గొలుచు చుందురుగదా యీ కువలయమున
    హిందువులకు ముస్లిములకు నిందు జూడ
    క్రీస్తు పూజనీయుడు గాడు, క్రైస్త వులక
    తండు మాననీయుడుగదా ధరణి యందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘...జూడ నొకటి’ అనండి.

      తొలగించండి
  30. మహిని జన్మించి మరణించి మరల లేచి
    మానవత్వము చాటిన మాన్యుడైన
    క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు
    కరము నికరము గా గాచు కాపరి కద !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. (15.05.2016)
      శకము లెన్నియో గలవులే ! శంకయేల
      క్రీస్తు శకమన్న మొదలాయె క్రీస్తు నుండి
      శకము పాటించి నంతనే శార్గి యగున?
      క్రీస్తు పూజనీయుడు గాడు . క్రైస్తవులకు

      తొలగించండి
    3. మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  31. పాకశాలలో పుట్టిన బాల యేసు
    క్రీస్తు పూజనీయుడు,గాడు క్రైస్తవులకు
    రాము డారాధ్య దైవంబు రాజ్యమందు
    కులము మతమనక కలియ కలుగు శుభము.

    2.దేవ పుత్రుడై వచ్చిన దేవదూత
    క్రీస్తు పూజనీయుడు,గాడు క్రైస్తవులకు
    మాత్రమే,సర్వజనులకు మాననీయు
    డతడు యెంచి చూడంగ తా నవని యందు.

    రిప్లయితొలగించండి
  32. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మతములో జేరిన౦ జాలు మనకు దొరకు

    ప౦చదారయు నూనెయు ప్రాలు మరియు

    నుచిత వైద్యము , విద్య యనుచు దల౦చు

    హి౦దువులు గల రీ దేశ మ౦దు నరయ. |

    క్రీస్తు పూజనీయుడు కాడు క్రైస్తవులకు ,

    కాదు కాదు సుమా , దొ౦గ - క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి
  33. పరమతస్తుల మనసున తరచు గాను
    క్రీస్తు పూజ నీయుడుగాదు”క్రైస్త వులకు
    నమ్మిగొలువగ దేవుడే|సొమ్ముకొరకు
    నాటకాలను జేయంగ?చేటుగూర్చు.

    రిప్లయితొలగించండి
  34. చస్తు బుద్ధులు తురకలు మస్తు గాను
    కుస్తి పట్టరె పూజకు విస్తు పోయి...
    వాస్తవమ్మిది చైనలో నేస్తులార!
    క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు

    రిప్లయితొలగించండి


  35. క్రీస్తు పూజనీయుఁడు గాఁడు క్రైస్తవులకు
    మాత్రమేను జిలేబి సమాజమునకు
    భువిని నెల్లరకున్ను తా పూజనీయు
    డమ్మ ప్రేమమార్గమున నడచెనతండు

    జిలేబి

    రిప్లయితొలగించండి