16, మే 2016, సోమవారం

సమస్య - 2035 (భార్యకు మీసముల్ మొలిచె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.

80 కామెంట్‌లు:

  1. సూర్యము యాత్రకున్ దలచి సూనుని తోడను బల్కెని వ్విధిన్
    కార్యము జేయగన్ పిదప గాసిలి చెందక జాగరూ కతన్
    ధైర్యము నుండగా వలయు ధారుణి గారడి మంత్రము గ్ధమౌ
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. కాని సమస్యాపరిష్కారమే అర్థం కాలేదు.

      తొలగించండి
  2. శుభోదయం!

    ఆర్యుడు జేరె నచ్చట సుధా రమణీమణి యా జిలేబినిన్
    కార్యము సృష్టిమూలమని కారణ మయ్యెను తాను, తన్నిడెన్
    భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్
    శౌర్యపు వేళయం దనువు సౌఖ్యము జెందెను బాపడే గనన్ !

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది (అనే అనిపిస్తున్నది). అభినందనలు.

      తొలగించండి

    2. అనే అని పిస్తుంది :)


      నెనర్లు !

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  3. శౌర్యము దోడ నొప్పు నొక జాతి సమంచిత నాటకమ్మునన్
    ధైర్యము దోడ దామగని దాపున పాత్రత నందజేయ నా
    హార్యము దాల్చె నా యిరువు రద్భుత మందెడి దృశ్యమందునన్
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్!

    రిప్లయితొలగించండి
  4. భార్యకు పుత్రసంతతిని బాగుగగోరుచు గొప్ప నౌషధా
    చార్యుని సంప్రదించి నొక చోరుడు మందును దొంగిలించగా
    నార్యుడువైద్యుడాతనికి శాపము నీయగ తారుమా రయెన్
    భార్యకు మీసముల్ మొలిచెబాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘సంప్రదించి యొక...’ అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు.శ్రీ రామా రావు గారి పూరణలో రెండు మూడు పాదములలో యతి సరిచేయాలి.

      తొలగించండి
  5. ఆర్యులు జెప్పగా గలిగె యచ్చెరు వెెంతయొ నంతరంగమున్
    సూర్య సమాన తేజుడగు చూపులు గల్గిన మంత్రగాడిలన్
    కార్యము లెన్నొజేయుచును కష్టము బెట్టగ మానవాళికిన్
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమొచ్చడిన్ౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘...గలిగె నచ్చెరు వెంతయొ నా మనస్సులో’ అనండి. ‘ఎంతయొ+అంతరంగమున్’ అన్నపుడు యడాగమం వస్తుంది. నుగాగమం రాదు. అంతేకాక ‘అంతరంగమందు’ అనే అర్థంలో ‘అంతరంగమున్’ కుదరదు. అందువల్ల నా సవరణ...

      తొలగించండి
  6. ఎన్.వి.ఎన్.చారి 9866610429
    మౌర్యుల కాలమందొకని మాన్య విచిత్ర పటంబు లందునన్
    శౌర్య విరాజితుల్విమల సాెధు మునీశ్వరు లైరి వింతగన్
    చౌర్యము జేయువా రకట చక్కని రాజ కు మారులై రటన్
    ఙార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భ మయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  7. డా.ఎన్ .వి.ఎన్.చారి 9866610429
    భార్యను బంపె భర్త తన బావతొ కాన్పుకు పుట్టినింటికిన్
    ధైర్య విలోలుడై తనకు దక్కు ఫలంబు నూహజేయగా
    వ్నార్యకు వచ్చెస్వప్నమొక టందున గాంచెను వింత వింతగా
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండవ పూరణ బాగున్నది.
      ‘బావతొ’ అని విభక్తి ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. రెండవపాదంలో గణదోషం. ‘ఫలంబును నూహ సేయగా’ అనండి. ‘వ్నార్యకు’... ఇది అర్థం కాలేదు.

      తొలగించండి
  8. వీర్యపు శక్తి తోడ కడు వేదన పొందిన భర్తభక్తితో
    భార్య సమేతమున్ సలిపి బ్రాహ్మణ వైద్యుల పూజలన్, ఘనా
    వర్యుడొసంగ మింగె నొక వైద్యపు మూలిక ప్రేమ తోడ, ఆ
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      ‘సమేతుడై సలిపి’ అంటే బాగుంటుందేమో? ‘ఘనావర్యుడు’... అర్థం కాలేదు.

      తొలగించండి
  9. ఆర్యులు సెప్పి యుంటిరి ట హాహ య నంగను నేమిచిత్ర మహో
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమ య్యె డిన్
    న్నార్యులు దా నెరుంగ వలె భార్యము ఖమ్మున మీసముల్గనన్
    శౌర్యము గాదలంచవలె ,శూరులు వారలు ధాత్రి యందు నన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ - మూడు, నాలుగు పాదములలో యతిని సరిచేయండి.

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      మొదటిపాదం చివర గణదోషం. ‘చిత్రమో’ అంటే సరి. ‘గర్భ మయ్యెడి|న్నార్యులు’ అనండి. అన్నపరెడ్డి వారి చెప్పినట్లు రెండుపాదాల్లో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  10. ధైర్యము మీరసాం బుడును దారిన బోయెడి యాదవుండుయా
    చార్యుల చేరి గర్భమన జాడ్యము వీడగ శాపమిచ్చిరా
    భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్
    శౌర్యున కిప్పుడే గలుగు జాతిని జంపెడి రోకలొక్కటిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధైర్యము మీర సాంబుడును దారిన బోయెడి యాదవుండు యా
      చార్యుల చేరి గర్భమన, జాడ్యము వీడగ శాపమిచ్చిరా
      భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్
      శౌర్యున కిప్పుడే గలుగు జాతిని జంపెడి రోకలొక్కటిన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘యాదవుండు నాచార్యుల’ అనండి. ‘రోకలొక్కటే’ అనండి.

      తొలగించండి
    3. గురువుగారూ, సవరణకి ధన్యవాదములు

      తొలగించండి
  11. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    భార్యకు జన్యు లోపమున పాపము
    మొల్చె మొగాన మీస | మే

    కార్యము జేయకు౦డ , మితి గానక మెక్కుచు
    ను౦టచేత , ని

    ర్వార్యపు గ్రొవ్వు పేరుకొని భర్తకు లావగు
    పొట్ట వచ్చె | నా

    భార్యకు మీసముల్ మొలిచె ! బాపురె
    భర్తకు గర్భ మయ్యెడిన్ !

    { గర్భము = పి౦డము , పొట్ట ;
    గర్భమగు = పి౦డము వచ్చు , పొట్ట పడు }

    రిప్లయితొలగించండి
  12. ఆర్యులపల్కుల న్వినక, హైందవదూషణ సల్పుచున్సదా
    కార్యవిచక్షణాకలిత గౌరవమూర్తుల లెక్కసేయకన్
    భార్యనుగూడ,సంథ్యన ప్రభావముజూపుచు నా క్షణంబులో
    భార్యకు మీసముల్ మొలిచి బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  13. పూర్వ భవార్జితంబయిన పుణ్యమొ పాపమొ జీవి భాగ్యమం
    చార్యులు బల్క రిత్తయయె ; నద్భుత శోధన చేయ విజ్ఞు లే
    కార్యము కాని దంచు భువి కానము , నిక్కము శస్త్ర విద్యచే
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.

    ఇదే భావము గల సమస్య ను ఆకాశవాణి విజయవాడ కేంద్ర
    నిర్వహణ లో తే 23/04/1972 దీన యిచ్చినప్పుడు నేను
    పూరించిన పద్యము :-

    భూమిని పుట్టి మానవుడు భూమిని వీడి ఖగోళ మందు సం
    గ్రామము జేసె, నద్భుతము కాలిడె నేటికి చందమామ పై ;
    క్షామము మాన్పునేమో కద! శస్త్ర చికిత్సను చేసి చూడగా
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ (ప్రస్తుత) పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆకాశవాణి పూరణలో భావం బాగున్నది కాని ప్రాస తప్పింది.

      తొలగించండి
    2. అప్పటి సమస్య ‘భామకు మీసముల్ మొలిచె...’ అని ఉంటుంది. దాని ప్రకారం ప్రాస సరిపోతుంది.

      తొలగించండి
    3. కృష్ణారావుగారూ మొదటిపూరణ మొదటిపాదంలో కూడా ప్రాసను సరిదిద్దాలి.

      తొలగించండి
  14. రిప్లయిలు
    1. ఆర్యులు వార లిద్దరు సదాగమ భాసిత పుణ్య మూర్తులున్
      భార్యయు భర్తయయ్యు నన పత్యులు జేసిన దాన ధర్మ స
      త్కార్యము లన్ని నిండు ఫలితమ్ము లొసంగెను సంతసంబుగన్
      భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్.

      తొలగించండి
    2. ధైర్యము జూపి యిద్ధర సదా చరియించు మనుష్యుడింక నౌ
      దార్యము మిన్ను ముట్టగ నితంబిను లెల్లరు మాననీయులే
      కార్యము కాదు మత్తిలి యకారణ మిట్లు వచింప నేరికిన్
      భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉనాయి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  15. భార్యను జూసి యోటవడు పాత్ర నొకండు ధరించగాను సౌం
    దర్యము, ధైర్యమున్న సహధర్మిణి పాత్ర నొకత్తె వేయ నా
    హార్యము వింతగొల్పు పరిహాసపు పాత్రల హాస్యనాటికన్
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్!

    రిప్లయితొలగించండి
  16. మిత్రులందఱకు నమస్సులు!

    తూర్య నినాదముల్ మొరయ, దువ్వలువల్ ధరియింపఁజేసి, యా
    యార్యకు నంతియే వయసు నర్భకు నిచ్చియుఁ బెండ్లి సేసి, యా
    కార్యముఁ గూడ సేయఁగను, గ్రక్కున వాంతులు కాఁగ నేలకో

    భార్యకు, "మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్
    భార్య క" టంచు వృద్ధు లటఁ బల్కిరి, రక్కెస మేళ మాడుచున్!

    రిప్లయితొలగించండి
  17. శౌర్యము లేని వారు పరుషాధము లంచు నుతించెడింతి యా
    హార్యము గాంచి పల్కె పరిహాసము జేయుచు మందహాసమున్
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్
    సూర్యుడు వెన్నెలన్ గురియు చోద్యము లేదిక యాడవారలే
    ధైర్యము తోడ కాన్పులనెడు తంతును జేసెడు కాలమొచ్చునో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. ‘కాన్పులను తంతును’ అనండి.

      తొలగించండి
  18. ఆర్యుల దూరుచున్ సతము నారడి పెట్టగ ప్రేమజంట దు
    శ్చర్య కతంబునన్ కనలి శాపము నివ్వగ మౌనియొక్కడా
    దుర్యశు లిద్దరున్ గొనిరి దుర్భర మార్పులు దేహమందు, వే
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  19. అయుతకవిసమ్మేళనం ! సందిత ! sk2020కవిత సంఖ్య ! 65 భార్యయుభర్తన్ కలిసి వచ్చిరి రేషనుకార్డుకోసమై కార్యపుటాలయంబునకుకాంచెఁగుమాస్తయ పేర్లు వ్రాయుచున్ భార్యనుభర్తజేసెపొరపాటున యిచ్చిరికార్డునట్టులే! భార్యకుమీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    --
    Sent from Fast notepad

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కెవలం పద్యాన్ని పెట్టండి. ‘అయుత కవిసమ్మేళనం.... సంఖ్య 65' ఇవేవీ అక్కరలేదు.

      తొలగించండి
  20. నా రెండవ పూరణము:
    (కళాపూర్ణోదయ కథానుసారము చేసిన పూరణము)

    [కాళీమాత కరుణచేతను, బ్రహ్మ వాక్పటుత్వము చేతను, సరస్వతీ మాత యిచ్చిన విరుద్ధమైన వరాల బలిమిచేతను...

    దేశ సంచారం చేస్తున్న దంపతులలో... సుముఖాసత్తి మణిస్తంభునిగను, మణిస్తంభుఁడు సుముఖాసత్తిగను మాఱి, సముద్రమును చూచిన యుత్సాహముతోఁ బొంగుచు, నా యిరువురు మన్మథ క్రీడలలో తేలుట నారంభిపఁగ...

    ఆకాశమునుండి వారిరువురను గమనించుచున్న పక్షియుగళము పరస్పరము సంభాషించుకొనుచున్న సందర్భము...]


    ధైర్యము నాకు సన్నగిలెఁ, దత్పురుషుండును మాఱ భార్యగన్;
    భార్యయు మాఱె భర్తగను; నప్పుడు సంద్రముఁ జూచినంత, నా
    శ్చర్యముగాఁగ నిర్వురును జక్కఁగ మన్మథ కేళిఁ దేలఁగన్

    భార్యకు మీసముల్ మొలిచె, బాపురె భర్తకు గర్భమయ్యెడిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అఘటనఘటనాసమర్థులగు మధుసూదనమిత్రునకు అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు మిస్సన్న గారూ! మరి మీరో...మీరును ఘటికులేకదా మిత్రమా! మీ కవిత్వ రచనా సామర్థ్య మసదృశము కదా!

      తొలగించండి
    3. మధుసూదన్ గారూ,
      సుముఖాసత్తి కథ విషయంగా గ్రహించి మీరు చెప్పిన రెండవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  21. ఆధార్ రేషన్ కార్డుల్లో పొరపాట్లు మామూలే కదా! ప్రసూతి సాయం కై ఆ నిరక్షరాస్య జంట దరఖాస్తు పెడితే కార్డుతో రికార్డుతో సరిచూస్తే కనిపించిన తమాషా కథలా లేదూ?

    రిప్లయితొలగించండి
  22. ఆర్య!మహానుభావ!అపురూప గుణాఢ్య!కవీశ్వరా! మహా
    శ్చర్యము పిల్లకాకు లగు ఛాత్రుల గొట్టిరి గుండుదెబ్బ తో
    ధైర్యము జారె పూరణము తట్టక తాపము హెచ్చె సత్యమా!
    భార్యకు మీసముల్ మొలిచె? బాపురె! భర్తకు గర్భ మయ్యెడిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారికి నమస్సులు. ఆర్య లోని "ఆ" కు రూప లోని "రూ" కు యతి సరిపొతుందా. దయతో తెలియజేయప్రార్థన.

      తొలగించండి

    2. మిస్సన్న వారు !

      చాత్రుల గొట్టిరి అంటూ చట్రము బిగించారు ! అదురహో !!

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. మిస్సన్న గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘ఆర్య మహానుభావ సుగుణాకరచిత్త...’ అందామా?

      తొలగించండి
    4. సత్యనారాయణ రెడ్డి గారూ నిజమే. యతిమైత్రి లేదక్కడ. సూచించి నందుకు ధన్యవాదాలు.

      గురువుగారూ సరిదిద్దినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    5. సత్యనారాయణ రెడ్డి గారూ నిజమే. యతిమైత్రి లేదక్కడ. సూచించి నందుకు ధన్యవాదాలు.

      గురువుగారూ సరిదిద్దినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  23. వీర్యము, పుంస్త్వ మిబ్బడిగవృధ్ధిని జేసెడి నౌషధమ్ము తా
    భార్య గ్రహించె పొచ్చెమున భర్తయు గ్రోలెను గర్భ మేర్పడన్
    ధుర్యపు టాసవమ్మునిక దోసము లేర్పడె తత్ప్రభావమున్
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  24. ధైర్యముఁ జూపు పాత్రలకు తానొక తారగఁ బేరుఁ బొందుచున్
    భార్యగ పేరు లేనొక యభాగ్యపు నాయకుఁ బ్రక్కఁ జేయ, నా
    హార్య మొకండు గోడ ప్రతులందున దిద్ద దురాభిమానిచే
    భార్యకు మీసముల్ మొలిచె! బాపురె భర్తకు గర్భమయ్యెడిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘లేని+ఒక’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘దురభిమాని’ని ‘దురాభిమాని’ అన్నారు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన:
      ధైర్యము, జూపు పాత్రలకు తానొక తారగఁ బేరుఁ బొందుచున్
      భార్యగ, వాసికెక్కని యభాగ్యపు నాయకుఁ బ్రక్కఁ జేయ, నా
      హార్య మొకండు గోడ ప్రతులందున దిద్ద మహాభిమానిచే
      భార్యకు మీసముల్ మొలిచె! బాపురె భర్తకు గర్భమయ్యెడున్!

      తొలగించండి
  25. మౌర్యులకాలమందు నొక మాన్యుడు వైద్యుడు జ్ఞానతృష్ణు డౌ
    సూర్యుడు, శాస్త్రవెత్త , పరిశోధన జేసిన తత్ఫలమ్ము దాన్
    పర్యవసానమే గనగ వర్ణన కందని వింతలెన్నియో
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  26. అంజయ్య గౌడ్ గారి పూరణ....

    ఆర్యవిరుద్దమైన దొక యద్భుత యోచన సేసి దంపతుల్
    భార్యను భర్తగాను మరి భర్తను భార్యగ సెక్స్ మార్పిడిన్
    చౌర్యముగా నొనర్చుకొని చక్కగ కాలము గడుపు చుండగా
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యడిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అంజన్న గారూ ... మీ పూరణ బాగున్నది. కాని, మూడవ పాదంలో గణభంగమైనట్టుల అనిపించుచున్నది.

      తొలగించండి
    3. నిజమే మధుసూదన్ గారూ, నేను గమనించలేదు. ధన్యవాదాలు. ‘కాలము వెళ్ళబుచ్చగా’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  27. క్రౌర్యమె కాని మీసములు గాంచక, భార్యకు సంతు లేమిచే
    ధైర్య విహీను డౌచు తగు దారి కనుంగొన చేరె వైద్యుడిన్
    స్థైర్యము చెప్పిమూలికల తాయిత నిచ్చె నదేమి చిత్రమో
    భార్యకు , మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  28. ఆర్యసమాజ మందుమనకందని వింతలుశాస్ర్త వేత్తలే
    కార్య పురోగతందుకొని కాంక్షలుదీర్చగ జాతి మార్పిడిన్
    భార్యకు మీసముల్ మొలచె|బాపురె భర్తకు గర్భ మయ్యెడిన్
    ధైర్యము చేత మార్పులిడ దక్షత గాంచగవింతపంతమే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘పురోగతి+అందుకొని=పురోగతి నందుకొని’ అవుతుంది. అక్కడ ‘కార్యపురోగతిన్ బడసి’ అనండి.

      తొలగించండి
  29. నేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం
    sk 194
    సమస్య : భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకుగర్భమయ్యెడిన్
    నా పూరణ : దైర్యము తోడనా సతులు దైవము తోడుగ అన్నిటా తనే
    కార్యము లెల్లజే సినను కానక భర్తలు హింసపెట్టగా
    ఆర్యుని దుండగం బులను ఆహరి మెచ్చక మార్చెన ట్లునా
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్బమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అన్నిటా’ అన్నదాన్ని ‘అన్నిటన్’ అనండి.

      తొలగించండి
  30. June 2019:

    వీర్యము జూపుచున్ మమత విందిడి మోడిని కౌగిలించెనే...
    ధైర్యముతోడ రాహులుడు తైతకలాడి ప్రధాని యాయెనే...
    సూర్యుడు క్రుంగిపోయెనుగ సూటిగ తూరుపు దిక్కునందునన్
    భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్!

    రిప్లయితొలగించండి