18, మే 2016, బుధవారం

సమస్య - 2037 (యము నెక్కి లులాయములు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యము నెక్కి లులాయములు విహారము సల్పున్.
APRV ప్రసాద్ గారికి, తాడిగడప శ్యామలరావు గారికి ధన్యవాదాలతో...

66 కామెంట్‌లు:

  1. తమనమ్మె కటిక వానికి
    శ్రమ చేయుటకునివి పనికి రావికయని - పా
    పమది తెలియక 'లారీ'ని ర
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘పా|ప మెఱుగకను ‘లారీ’ని ర...’ అనండి.

      తొలగించండి
  2. అమితో గ్రపు మహిష నికా
    యము భీషణరణము జేసి హతమార్పగ లే
    యమును పడద్రొక్కి మృతకా
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్.

    రిప్లయితొలగించండి
  3. అమితమగు కౄర మహిషుని
    తమకము తోత్రొక్కి చంపె దాక్షాయణి యౌ
    కుమతుడు యసురుని యశ:కా
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్












    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగుంది. మూడవపాదంలో గణదోషం. నా సవరణతో మీ పద్యం....

      అమితక్రూరుడు మహిషుని
      దమకముతో ద్రొక్కి చంపె దాక్షాయణి యా
      కుమతు డసురుని యశఃకా
      యము నెక్కి....

      తొలగించండి

  4. అమరెను కుదురుగ కందము
    సమసెను శంకరు సమస్య సత్యము జూడన్
    అమలిన పద్య జిలేబీ
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. శ్రమజేసి యలసి బోవగ
    క్రమ మందున వాటి కొసగు గడ్డిని దినగం
    దమ దాపున కసవు నికా
    యము నెక్కి లులాయములు విహారము సలుపున్!

    నికాయము=ప్రోగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


    2. గురువు గారూ కొద్దిగా సవరించిన...

      శ్రమజేసి యలసి బోవగ
      క్రమ మందున వాటి కొసగు గ్రాసము దినగం
      దమ దాపున కసవు నికా
      యము నెక్కి లులాయములు విహారము సల్పున్!.

      నికాయము=ప్రోగు

      తొలగించండి
  6. శ్రమపడి రైతులు వ్యవసా
    యము జేయగ వచ్చినట్టి సస్యము నూర్పన్
    ప్రమదముతో నట ఫలసా
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్!

    రిప్లయితొలగించండి
  7. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    యముడను నేనంచు నొకడు
    యమపురి జేరగ యముండు నాగ్రహమొందెన్
    తమనెక్క వచ్చిన మాయా
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవపాదంలో గణదోషం. ‘తమ నెక్క వచ్చు మాయా...’ అనండి.

      తొలగించండి
  8. అకస
    సక2033/15
    సమస్యాపూరణం

    తిమిమన సులనిం డగపా
    పములను జేయుజ నులు యమపురికిం జనగా
    యమరాజు శిక్షలతొకా
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో యతి తప్పింది. ‘..యమపట్టణ మేగన్’ అనండి. ‘శిక్షలతొ’ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. ‘శిక్షలకు...’ అనండి.

      తొలగించండి
  9. యమహా యను వాహనమె
    క్కి మనుమడగు పోతరాజు కీసర కేగన్
    గమనించిన తాత పలికె
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి


  10. విరించి వారు అదురహో !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    తమతమ యిండ్లను వెడలియు
    నమర విహర తల శిలోచ్చ
    యము నెక్కి లులా
    యములు విహారము సల్పున్

    రమణీయమ్మైన ప్రకృతి రంజనమిడఁగన్!

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలో ప్రాస తప్పింది. ‘యమునిస్సాయుతుడు’...? సవరించండి.

      తొలగించండి
  13. కమతము సేయగ మర యం
    త్రములు బిర బిర నవయుగపు రైతును చేరన్!
    తమ పని తప్పెనని యతిశ
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని ‘అతిశయాన్ని ఎక్కడం’...?

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు .
      అతిశయము నెక్కి ' అంటే 'ఎక్కువైన ఆధిక్య భావన కలిగినవై' అనే ఉద్దేశ్యంతో ప్రయోగించాను. (ట్రాక్టర్ల లాంటివి వచ్చాక దున్నడం, కుప్పలు నుర్చడం వంటి పనుల్లో తమకు శ్రమ తగ్గినందన్న సంతోషంతొ గంతులేశాయి అన్న భావనను కల్గించడానికి నేను చేసిన ప్రయత్నమది) సవరణ ఏమైనా కుదిరితే సూచింప గోరుతాను.
      ధన్యవాదములు. శ్రీధర రావు.

      తొలగించండి
  14. సమనీల వర్ణ దృఢ వి
    క్రమ దేహద్యుమ్న ఘోర కర్కశ మృగముల్
    ద్రుమ శాద్వల గోత్ర నికా
    యము నెక్కి లులాయములు విహారము సల్పన్.
    [“సల్పన్” : వచన భేదము తలచి మార్చితిని.]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘సల్పన్’ అసమాపక క్రియ. దీనికి అన్వయం? ‘లులాయములు విహారము సల్పున్’ అనడంలో వచనభేదం ఉన్నట్లు నాకు తోచడం లేదు. ‘గోవులు దుగ్ధము నిచ్చున్, పక్షులు నభమున నెగురున్’ వంటిదే కదా!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వచనభేదము లేకపోతే యిబ్బంది లేదు. అనుమానము వచ్చింది. అంతేనండి. “సల్పున్” పదమునే గ్రహించుచున్నాను. కొండలలో విహారము సలుపుట వలన ధృడములైనవి యని నా భావన. పద్యము యెలా యున్నది తెలుప గోర్తాను.

      తొలగించండి
  15. మా మావయ్యగారు శ్రీ ప్రసాద్ ఆత్రేయ గారి పూరణ:
    క. సమరము లెన్నియొ సల్పియు
    క్రమముగ నొక చక్రవర్తి కట్టెను కోటన్
    సమయము పో నిపుడా కు
    డ్యము నెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలరావు గారూ,
      శ్రీ ప్రసాద్ ఆత్రేయ పూరణ బాగున్నది. వారికి అభినందనలు, మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  16. వరికుప్ప నూర్పిడిలో సంతోషముగా బంతి తిరిగే దున్న పోతులు గుర్తుకొచ్చాయి.
    సమయమున పొలము దున్నుచు
    శ్రమశక్తిని సంతతమ్ము రైతుల కిడుచున్
    కమతములందు వరినికా
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
  17. కమతముల పనులు తీరెను
    సమయంబిది పశువులెల్ల చరియించుటకున్
    అమితపు హృదయానంద మ
    యము నెక్కి లులాయములు విహారము సల్పన్.

    రిప్లయితొలగించండి
  18. యమునా నదితీరములో
    సమరంబేలేనివేళ సఖ్యము గలుగన్
    గమనీయమయిన విమల హ
    యము,నెక్కి లులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం లక్షణంగా ఉంది. కాని సమస్య పరిష్కారం కానట్టుంది. లులాయములు హయము నెక్కిన వన్న అపార్థం వస్తున్నది. ‘కమనీయ సికత సముదా|యము నెక్కి...’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘పాముకు గల గాయము నెక్కి..’ అర్థం కాలేదు. ‘మెచ్చే’ అనడం వ్యావహారికం. ‘మెచ్చన్’ అనవచ్చు.

      తొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. కొమరుదనపు యెనుముల నా
    హిమాలయపు సీమలందు హేలగ జూడన్
    శ్రమమని యె0చక ప్రాలే
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్
    +

    రిప్లయితొలగించండి
  22. అమితానందము తోకు
    డ్యమునెక్కి లులాయములు విహారము సల్పన్
    నిమిషంబాగక రేగుచు
    శ్రమతో కట్టిన మనుజుడు శౌర్యము చూపెన్.

    రిప్లయితొలగించండి

  23. అమలా!వినుమీసంగతి కమతముమూలానవచ్చుకసరునుబరుప న్నమలంబగుగ్రాసపునిచయ యమునెక్కిలులాయములువిహారముసల్పున్

    రిప్లయితొలగించండి
  24. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిచయయము’ అని ఒక య ఎక్కువైనది.

    రిప్లయితొలగించండి
  25. క్రమముగ వార్ధక్యపు కా
    యమున పనిని జేయ లేక వ్యధ జెందంగన్
    యముని దరికి వాహన సా
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్.

    రిప్లయితొలగించండి
  26. నేటి శంకరాభరణం వారి సమస్యాపూరణం -2037
    సమస్య : యమునెక్కిలులాయములు విహారము సల్పున్
    కం . యమహా నెక్కి యువకులుర
    యమునన్ వీధులలొచేరి యువతుల నవమా
    నము చేయ పల్కెజనులున్
    యమునెక్కిలులాయములు విహారము సల్పున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఫూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వీధులలొ’ అని ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘వీధులను’ అంటే సరి!

      తొలగించండి


  27. తమకమున కాపరి కటిక
    కమానుషమ్ముగను యమ్మగ నవి బెదరగన్
    సమీప గిరులన్ జూచి ర
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్

    🙏 చెన్నకేశవ‌, రాయచోటి 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘అమానుషమ్ముగ+అమ్మగ=అమానుషముగ నమ్మగ’ అవుతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు శంకరయ్యగారూ

      తొలగించండి
    3. రెండవపాదాన్ని ‘...కమానుషమ్ముగను నమ్మ నవి బెదరంగన్’ అనండి.

      తొలగించండి
  28. యమునెక్కిరింత సెలవిడి
    యమలోకము వీడి మిత్రులందరు కూడన్,
    ప్రమదమున మేఘసముదా
    యమునెక్కి లులాయములు విహారము సల్పున్


    రిప్లయితొలగించండి
  29. 1.

    యముడెవ్వడు గొనిపోవగ
    యమ పాశమ దేమనంచు నరచెడి వానిన్
    యమభటులీడ్వనతని కా
    యము నెక్కి లులాయములు విహారము సల్పున్
    2.
    సముదాయము నుండి దప్పి
    క్రమమెరుగక దిరుగుచుండి గాసిల; నొకచో
    తమవారల గని యా కు
    డ్యము నెక్కి లులాయములు విహారము సల్పున్
    సమస్యా పూరణం 2

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘సముదాయము దప్పి యను|క్రమ మెరుగక...’ అందామా?

      తొలగించండి
  30. . శ్రమకున్ పంటలు బండగ
    క్రమమున్ తూర్పార పంట కల్లమునందున్
    సమసినగడ్డియె ఫలసా
    యము నెక్కి లులాయములు విహారము సల్పన్|

    రిప్లయితొలగించండి
  31. సమముగ కోతల నారం
    భము నందున వానహెచ్చి వరదలు మెండౌ
    సమయమ్మున మునిగిన స
    స్యము నెక్కి లులాయములు విహారము సల్పున్!

    రిప్లయితొలగించండి