12, మే 2016, గురువారం

ఖండకావ్యము - 22

శివశివా!
రచన : మిస్సన్న

సీ.         గంగమ్మ తలపైన గంతులేయుచు నుండ
కలత లేదా నీలకంఠ నీకు?
పార్వతి సగమేను పంచుకొన్నను గాని
వెలితి లేదా నీకు విశ్వనాథ?
పాములు మేనిపై ప్రాకుచున్నను నీకు
వెలపరమ్మే లేద వేదవేద్య?
చితిబూది పూసుక చిందు లేసెడి నీకు
చింతలే లేవేమి చిచ్చుకంటి?
తే.గీ.     మంచు కొండ గూడు! మంచినీరు విషమ్ము!
భూత ప్రేత తతులు భూరి జనము!
చేత భిక్ష పాత్ర ! చిరునగ వెట్లౌను
శివము లిచ్చు టెట్లు శివశివయన?

ఆ.వె.     నెత్తిపైన గొప్ప నీటి యూటను బెట్టి
మంచు కొండలందు మసలు చుండి
నీటి ధారలందు నిత్యము నానినన్
జలుబు లేద నీకు చకిత మౌను!

ఆ.వె.     కార్తిక ప్రభాత కాలమందున మాకు
స్నాన మాచరింప జంకు చలికి
మంచు కొండ పైన మసలుదు వీవెట్లు ?
చలిని గెల్చు నట్టి సులువు చెప్పు.

ఆ.వె.     రెండు కనుల మాకు రేయంత కలలౌను
పగటి కలల గల్గు పరవశమ్ము
మూడు కన్నులున్న ముక్కంటివే నీవు!
కలలు రావె చిచ్చుకంటి నీకు?

ఆ.వె.     ఎండ వేడి మాకు, నిచ్చు వేడిని నిప్పు
కోప తాపములను గొప్ప వేడి
చిచ్చుకంటి వీవు చితిభూమి ప్రియమేమి
వేడి లేద నీకు విశ్వమూర్తి!

ఆ.వె.     శివ శివా యనంగ శివముల నిత్తువే
యిట్టి పాటు లేల నిందు ధారి!
శంకరా! యెరుంగ శక్యమే ధాత్రి నీ

తత్త్వ మెవరి కైన తలచు కొలది.

20 కామెంట్‌లు:

  1. అద్భుతమైన శివస్థుతి నందించిన మిస్సన్న కవివర్యులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. చాలా చాలా బాగున్నాయి పద్యాలు.మనసులో భావించి పరమశివుని మాకు దర్శింపజేసారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. శివ శివ శివ శివ యనుచున్
    శివునే బ్రార్ధించు నెడల సేమము ,సిరులన్
    భవుడి చ్చును నో మిస్సన !
    పవలంతయు జేయ పూజ బరిశు ద్ధ ముగన్

    రిప్లయితొలగించండి
  4. తణికెళ్ళ భరణి ధోరణిలో కించిత్ నిందాస్తుతి పూర్వక మీ “శివశివా” అద్భుతము. అన్నా! “ నమశ్శివాయ” అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. .రచయుతరచనాశక్తిని
    ప్రచురించగ ?పరమశివుడు పరవశ మందే
    పచనము వోలెను భక్తిగ
    ఆచలుని కర్పించ గలిగె |యద్బుతశక్తిన్|

    రిప్లయితొలగించండి
  6. శర్మగారి లాగే నాకు కూడా 'నాలోనశివుడు గలడు'రచయిత తనికెళ్ల భరణిగారే గుర్తుకొచ్చారు.మీ పద్యములు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శర్మగారి లాగే నాకు కూడా 'నాలోనశివుడు గలడు'రచయిత తనికెళ్ల భరణిగారే గుర్తుకొచ్చారు.మీ పద్యములు చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. నీరుపంటకాధారము నీరు దేహ
    దాహమును తీర్చి బతికించు ధరణిలోన
    నీరు లేకున్న ఏ ప్రాణి నిలువలేదు
    కాన నీటిని కాపాడ గనుము దీక్ష

    ప్రాణికోటి దాహముదీర్చి పాడిపంట
    వృద్ధి సేయగ పుడమి నీరద్ది తడిపి
    మేలు నొనరించు నదిమాత జాలువారి
    కడలి కలియంగ ఫలమేమి గానరాదె

    మేఘమంబుధి జలములన్ మిగులదాచి
    ప్రాణకోటికి జీవమై వాననిచ్చు
    వాననీటిని భూమాత వాంఛదీర
    గుండెలో దాచి కోరగా కూర్మి నిచ్చు

    వానలు కురియగా వలపులు చిలికించు
    తరువులు భువిలోన పెరుగ వలదె
    వనములు ఖండించి వాసములేర్పర్చ
    ఇంటింటి కొకచెట్టు ఇమడ వలదె
    నిత్యావసరముకై నీడనిచ్చెడి చెట్టు
    మమత వీడుచు కొట్ట మానవలదె
    చెట్ల వైశిష్ట్యము చెవి చెవి నందించ
    అడవులఁగాపాడ నరుగ వలదె

    తరువు గలదేని జనులకు కరువు లేదు
    తరువు నాటక ఏనాడు పరువు రాదు
    తరువు ఫలముల సుమముల సిరులె గాదు
    తరువు నీటికి మూలమౌ తరచి చూడ

    ఒక్క బొట్టైన భూమిలోనొదిగి పోక
    వాన నీరంత కాల్వగా పరుగు దీసి
    ఊరి బయటకు చేరిన కారణమున
    నేడు నగరాలలో నుండె నీటికొరత

    ఇంకుడు గుంతలనింటన్
    ఇంకను మన వీథి లోన ఏర్పడ సేయన్
    శంకర గంగయు భువిలో
    కింకిన భూగర్భ జలము కీడును మాన్పున్

    అమరవాది రాజశేఖర శర్మ

    రిప్లయితొలగించండి
  9. నీరుపంటకాధారము నీరు దేహ
    దాహమును తీర్చి బతికించు ధరణిలోన
    నీరు లేకున్న ఏ ప్రాణి నిలువలేదు
    కాన నీటిని కాపాడ గనుము దీక్ష

    ప్రాణికోటి దాహముదీర్చి పాడిపంట
    వృద్ధి సేయగ పుడమి నీరద్ది తడిపి
    మేలు నొనరించు నదిమాత జాలువారి
    కడలి కలియంగ ఫలమేమి గానరాదె

    మేఘమంబుధి జలములన్ మిగులదాచి
    ప్రాణకోటికి జీవమై వాననిచ్చు
    వాననీటిని భూమాత వాంఛదీర
    గుండెలో దాచి కోరగా కూర్మి నిచ్చు

    వానలు కురియగా వలపులు చిలికించు
    తరువులు భువిలోన పెరుగ వలదె
    వనములు ఖండించి వాసములేర్పర్చ
    ఇంటింటి కొకచెట్టు ఇమడ వలదె
    నిత్యావసరముకై నీడనిచ్చెడి చెట్టు
    మమత వీడుచు కొట్ట మానవలదె
    చెట్ల వైశిష్ట్యము చెవి చెవి నందించ
    అడవులఁగాపాడ నరుగ వలదె

    తరువు గలదేని జనులకు కరువు లేదు
    తరువు నాటక ఏనాడు పరువు రాదు
    తరువు ఫలముల సుమముల సిరులె గాదు
    తరువు నీటికి మూలమౌ తరచి చూడ

    ఒక్క బొట్టైన భూమిలోనొదిగి పోక
    వాన నీరంత కాల్వగా పరుగు దీసి
    ఊరి బయటకు చేరిన కారణమున
    నేడు నగరాలలో నుండె నీటికొరత

    ఇంకుడు గుంతలనింటన్
    ఇంకను మన వీథి లోన ఏర్పడ సేయన్
    శంకర గంగయు భువిలో
    కింకిన భూగర్భ జలము కీడును మాన్పున్

    అమరవాది రాజశేఖర శర్మ

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారికి నమస్సులు... మీ పద్యములు శివభక్తి పరంగా బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారికి నమస్సులు... మీ పద్యములు శివభక్తి పరంగా బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  12. చిన్మయాత్మునిపై మీ పద్యములు చదివి..." తన్మయత్వము తన్మయత్వము తన్మయత్వము నొందితిన్"

    రిప్లయితొలగించండి
  13. శివభక్తి పరమైనపద్యాలు చక్కగా వున్నాయండి మిస్సన్నగారూ.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి,సత్యనారాయణ రెడ్డి గారికి,పెద్దలు హనుమంతరావు గారికి, తమ్ముడు తోపెల్లకు, సుబ్బారావు గారికి, ఈశ్వరప్ప గారికి, సహదేవుడు గారికి, శిష్ట్లా వారికీ, శైలజ గారికి, ఉమాదేవి గారికి, అమరవాది గారికి ధన్యవాద శతములు.

    రిప్లయితొలగించండి
  15. గురువుగారికి,సత్యనారాయణ రెడ్డి గారికి,పెద్దలు హనుమంతరావు గారికి, తమ్ముడు తోపెల్లకు, సుబ్బారావు గారికి, ఈశ్వరప్ప గారికి, సహదేవుడు గారికి, శిష్ట్లా వారికీ, శైలజ గారికి, ఉమాదేవి గారికి, అమరవాది గారికి ధన్యవాద శతములు.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారు మీ కవితాగంగమ్మ "ఆకాశంబుననుండి శంభుని శిరముపైకి " దూకినట్లు దూకుచున్నది.మహదానందాన్ని పంచింది.
    ,,,,,,,,,,

    శివమెత్తి మీరు వ్రాసిన
    శివతత్త్వంబెన్న మాకు చింతలుదీరున్
    భవహరునిలీలలెన్నుచు
    కవితా ఝరిపారె విమలగంగానదియై.

    రిప్లయితొలగించండి
  17. రెండవ పాదంలో సవరణ.....శివతత్త్వంబన్న.

    రిప్లయితొలగించండి
  18. రెండవ పాదంలో సవరణ.....శివతత్త్వంబన్న.

    రిప్లయితొలగించండి