16, జులై 2015, గురువారం

సమస్యా పూరణము - 1732 (గుణహీనుం డైనవాఁడె గురు వన నొప్పున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
గుణహీనుం డైనవాఁడె గురు వన నొప్పున్.

28 కామెంట్‌లు:

  1. గణనీయమైన జ్ఞానము
    తొణికిసలాడుచు ముఖమ్ము ద్యోతించగ స
    ద్గుణములనన్నికలిగి దు
    ర్గుణహీనుండైనవాడె గురువననొప్పున్

    రిప్లయితొలగించండి
  2. వినయము విజ్ఞానమ్ములె
    ధనమై వెలుగొందువాడు ధరణిన ఒజ్జై
    ఘనకీర్తిబడయు, ఏవిధి
    గుణహీనుండైనవాడు గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  3. ఋణమే రీతిని తీరదు
    ప్రణుతించగ శిరము వంచి భక్తిని గొలువన్
    పణమడు గనివొజ్జ యనిన దు
    ర్గుణహీనుం డైనవాఁడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధరణిని నొజ్జై’ అనండి.
    ‘న-ణ’ ప్రాస లాక్షణిక సమ్మతమే అయినా సాధ్యమైనంత వరకు ఉపేక్షించడమే మంచిది.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ఒజ్జను వొజ్జ అన్నారు. ఆ పాదానికి నా సవరణ... ‘పణ మడుగనివాడై దు|ర్గుణ...’. (ఒకే వాక్యంలో ఒజ్జ, గురువు పునరుక్తి అవుతున్నది).

    రిప్లయితొలగించండి
  5. గుణవంతుడై న గురువును
    గణముగ పూజింత్రు జనులు గర్వోన్నతితో
    గుణ రహితు గానరు దు
    ర్గుణహీనుండైనవాఁడె గురు వన నొప్పున్.

    రిప్లయితొలగించండి
  6. ధనములకేనిది యైనను
    ధనహీనుండైనవాడు దైవమ్మవగాన్
    గుణములకే పట్టు బడని
    గుణహీనుండైనవాడు గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  7. ప్రణవాది విద్యలొసఁగుచు
    గణితాగుణితాసుకృత్య కార్యంబులలో
    గణనీయుండై భేషజ
    గుణహీనుండైన వాఁడె గురువననొప్పున్.

    రిప్లయితొలగించండి
  8. తన తప్పందురు శిష్యుడు
    గుణహీనుండైన, వాడె గురువన నొప్పున్
    సునిశిత హృదయము, శీలము
    వినయ విధేయతలలవడవిద్యలు నేర్పన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    గణనీయమైన జ్ఞానియు
    తృణమీ యైహికములని పరిపరి బలికి ని
    ర్గుణుని నుతించుచు జను దు
    ర్గుణహీనుండైనవాఁడె గురు వన నొప్పున్.

    రిప్లయితొలగించండి
  10. గుణరహితుడు హరిని ప్రతి
    క్షణమును ధ్యానించువాడు సాత్వికుడును స
    ద్గుణ సంపన్నుడు తమో
    గుణహీనుండైనవాడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  11. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘గుణరహితుని గానరు దు|ర్గుణ...’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    కాని...మొదటిపూరణ మొదటి రెండుపాదాల భావం అర్థం కాలేదు.
    రెండవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘గుణసంపన్నుండు తమో’ అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    గణితాగుణిత... ‘గణితాగణిత’కు టైపాటనుకుంటాను.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ధనమునకు బానిస సుమా
    గుణహీనుండైన వాడు, గురువన నొప్పున్
    తనపెంపు మదిని తల్చక
    ఘనముగ విద్యలను నేర్పు కారణ జన్మున్

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. అణకువ నేర్పించుచు ని
    ర్గుణులకు విజ్ఞానమొసగు గుణవంతుడు స
    ద్గుణుడౌ సర్వరసుడు దు
    ర్గుణ హీనుండైనవాడె గురువన నొప్పున్!!!

    రిప్లయితొలగించండి
  15. క్షణమును నిలుపడు మనసును
    గుణ హీనుం డైన వాడె|”గురువన నొప్పున్
    తృణమగుసంసారంబును
    గుణమున నెగ్గించ గలుగుగుణ వంతుండే|

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులసూచన మేరకుసవరించిన పద్యములు
    ధనలక్ష్మి విడిచి పోయిన
    ధనహీనుండైనవాడు దైవమ్మవగాన్
    గుణములకే పట్టు బడని
    గుణహీనుండైనవాడు గురువన నొప్పున్
    2.గుణరహితుడు హరిని ప్రతి
    క్షణమును ధ్యానించువాడు సాత్వికుడును స
    ద్గుణ సంపన్ను౦డు తమో
    గుణహీనుండైనవాడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సంతోషం!

    రిప్లయితొలగించండి
  18. ఆ.వె:గుణముల బోధన చేయుచు
    ప్రణతుల గైకొని చరించు ప్రాచార్యుండున్
    గణనీయంబగు నీదు
    ర్గుణహీనుండైనవాడె గురువన నొప్పున్.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    ప్రణిధానైశ్వర్యుండున్,
    గణనఁ గనిన బ్రహ్మసూత్ర గరిమాది నిమం
    త్రణ షట్ఛాస్త్రజ్ఞుఁ, డస
    ద్గుణ హీనుం డైనవాఁడె గురు వన నొప్పున్!

    రిప్లయితొలగించండి
  20. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    అద్భుతమైన పూరణ... మీ పూరణలోని ఒక్కొక్కపదాన్ని వ్యాఖ్యానిస్తూ పద్యభావాన్ని వివరించాలంటే పెద్ద వ్యాసమే అవుతుంది. గురుస్వరూపాన్ని కట్టెదుర నిలిపారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. ఇందు నా గొప్పతన మేమియును లేదు! ఇది యంతయునుఁ దమరి యభిమాన విశేషమే శంకరయ్యగారూ! నా పూరణము మీ మెప్పు నందినందుల కెంతయుఁ గృతజ్ఞుఁడను. ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. పణమును గోరును శిష్యుల
    గుణహీనుండైనవాడె,గురువననొప్పున్
    గుణవంతులుగా దిద్దుచు
    మణిదీపములట్లు జేయు మతిమంతుడునే

    క్షణికపు కోరికలందుచు
    గుణములు లౌకికమగునవి గొప్పని తెలిపే
    మణులాదిగ కోరెడు,నవ
    గుణహీనుండైనవాడె గురువననొప్పున్

    చెనటియు నౌచును,శిష్యుల
    ననయము తన సేవలకునె ననువుగ పనుపన్
    వినయము వీడిన,వర దు
    ర్గుణహీనుండైనవాడె గురువన నొప్పున్

    వినయము నేర్పడు నొజ్జయు
    గుణహీనుండైనవాడె- గురువన నొప్పున్
    మనలో వెలిగే యాత్మను
    కనగను జేసెడి నతడును,కనగా జగతిన్

    రిప్లయితొలగించండి
  23. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    ‘తెలిపే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. మిణుగురు వలె ప్రజలందున
    మణులను మెడయందు వేసి మహిమలటంచున్
    క్షనమగు తాంత్రిక విద్యల
    గుణ హీనుండైన వాడె గురువన నొప్పున్|

    రిప్లయితొలగించండి
  26. గణనీయము సాత్త్వికమౌ
    రణమున కావలయును గద రాజస మెపుడున్
    వ్రణమౌ తామసము వదలి
    గుణహీనుం డైనవాఁడె గురు వన నొప్పున్

    రిప్లయితొలగించండి


  27. పణముగు పెట్టును మానము
    గుణహీనుం డైనవాఁడె, గురు వన నొప్పున్
    పణముగ సత్తును బెట్టెడు
    గుణవంతుడు మహిని సుదతి గురుతిది సుమ్మీ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. ప్రణయము నొల్లక భామయె
    పుణుగులు తెమ్మనగ మెండు బూరెల తోడన్
    ప్రణవమ్మును మరువని దు
    ర్గుణహీనుం డైనవాఁడె గురువన నొప్పున్

    రిప్లయితొలగించండి