చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ చాల పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుకవి మిత్రులు డా. విష్ణునందన్ గారికి ధన్యవాదములు!
నేను ముందు "లచ్చి"యనియే ముందు టైపుచేసితిని. కాని, యొక చిన్న సవరణ మవసరపడి, దానిని తొలఁగించితిని. రెండవసారి టైపుచేయునపుడు "లచ్చి"కి బదులు, "లక్ష్మి"యని టైపాటు దొరలినది. మూఁడవసారి, విరామ చిహ్నముల నుంచునపుడు దానిని గమనింపకయే ప్రకటించితిని. క్షంతవ్యుఁడను. దోషమునుం దెలిపినందులకు ధన్యవాదములు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. బహుశా టైపాటు కావచ్చు. ‘శ్రాద్ధ మెవడు పెట్టు శ్రద్ధగా పితరుల’ రెండవపూరణలో ‘మాంస వంటకాల’ అనడం దుష్ట సమాసం. ‘మాంసభోజనంపు మహితరుచికి’ అందామా?
పనికిమాలినట్టి పట్టింపులవియేల
రిప్లయితొలగించండిపట్టువిడుపులేక బ్రతుకలేవు
తిండియు దొరకని ప్రదేశమ్ములో చిక్క
బ్రాహ్మణుండు కాకి పలలముదిను
కత్తి పట్టు రాజు, కలము పట్టును కవి,
రిప్లయితొలగించండిమగని తలచు మగువ, మండు పొయ్యి,
జడలుఁ దాల్చు మునులు,శాస్త్రముఁ జెప్పును
బ్రాహ్మణుండు, కాకి పలలముఁ దిను!!
అక్షరంబు రాని యజ్ఞాని యైనను
రిప్లయితొలగించండిబ్రాహ్మణుండు, కాకిపలలము దిను
మనిన తినడిది నిజమాకటం బడినను
పులులు గడ్డిదినునె? పుడమి యందు.
ఆవు పాలనిచ్చు- అమ్మపంచును ప్రేమ
రిప్లయితొలగించండిసిగ్గులొలుకు కలికి -చిలుక పలుకు
సార మత్తునిచ్చు- శాస్త్రాలు బొధించు
బ్రాహ్మణుండు,- కాకి పలలము దిను
కూడు గుడ్డలందు కులమడ్డు రాదయా!
రిప్లయితొలగించండిగుణమె నిర్ణ యించు తినెడు తిండి
కాపు వాడు మెచ్చి కటిక శాకముఁ దిను!
బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!
(కాకి =నల్లవన్నెగల కోడిపుంజు)
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ చాల పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొండ నుండు కోతి మండుచుండునెపుడు
రిప్లయితొలగించండిచాయమగడు కొంగ జపము జేయు
చాఱమీనుకొరకు శాస్త్రము జెప్పును
బ్రాహ్మణుండు కాకి పలలము దిను!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరామచిహ్నాలు పెట్టకపోవడంవల్ల అపార్థాలకు అవకాశమున్నది. ఈ సమస్యకు మూలమైన ప్రహేళికాపద్యంలో ఇలాగే ఉంటుంది. విరామచిహ్నాలు పెడితేనే అర్థవంతమౌతుంది. విరామచిహ్నాలతో మీ పద్యం...
కొండ నుండు కోతి; మండుచుండునెపుడు
చాయమగడు; కొంగ జపము జేయు
చాఱమీనుకొరకు; శాస్త్రము జెప్పును
బ్రాహ్మణుండు; కాకి పలలము దిను!!!
ఈ నాటి సమస్యకు మూలమైన ప్రహేళికాపద్యం ఇది....
రిప్లయితొలగించండికొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించుచుండును
బ్రాహ్మణుండు కాకి పలలము దిను!
పై పద్యంలో ఏపాదాని కాపాదం చదివితే అపార్థాలకు అవకాశం ఉంది. విరామచిహ్నాలు పెట్టి తదనుగుణంగా చదివితే అపార్థాలు తొలగిపోతాయి...
కొండ నుండు నెమలి; కోరిన పాలిచ్చు
పశువు; శిశువు తోడ పలుక నేర్చు
వనిత; వేదములను వల్లించుచుండును
బ్రాహ్మణుండు; కాకి పలలము దిను!
పాలకుర్తి రామమూర్తి గారి పూరణ.....
రిప్లయితొలగించండిప్రగతి సుగతి జూపు పరతత్త్వ మెవ్వాడు
సాధనమ్ము జేసి బోధ జేయు?
"కా"యను చరుచెద్ది? కాకేమి దిను? నోలిఁ
బ్రాహ్మణుండు, కాకి, పలలము దిను!
పాలకుర్తి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గోవు మెచ్చి తినును కోమలమౌ గడ్డి
రిప్లయితొలగించండిచేరి దుంపలతిను చెవుల పిల్లి
పప్పు ధప్పళమ్ము బహుపసందుగ తిను
బ్రాహ్మణుండు, కాకి పలలముదిను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేదవిద్యలెల్ల విస్తారమొనరించు
రిప్లయితొలగించండిబంధు జనుల రాక పరిగణించు
కౄర మృగములెల్ల కోరియిష్టముతోడ
బ్రాహ్మణుండు, కాకి, పలలముదిను.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
కాకి మాంస మనిన కడజాతి వానికి
రిప్లయితొలగించండిమక్కు వెక్కు వుండి మఱచి పోడు
జ్ణాన హీను డెపుడు జాత్యల్పు డగునులే
బ్రాహ్మణుండు కాకి పలలముదిను
కవిశ్రీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పప్పు,నెయ్యి,కూర,భక్షించు నన్నంబు
రిప్లయితొలగించండిపరమ ప్రీతి తోడ *బ్రాహ్మణుండు.
కాకి పలలముఁదిను* కరణిని తినువారు
కలరు వారి నిపుడు తలఁచ నేల?
పప్పు,నెయ్యి,కూర,భక్షించు నన్నంబు
రిప్లయితొలగించండిపరమ ప్రీతి తోడ *బ్రాహ్మణుండు.
కాకి పలలముఁదిను* కరణిని తినువారు
కలరు వారి నిపుడు తలఁచ నేల?
బ్రాహ్మణుండు కాకి పలలము దినునట
రిప్లయితొలగించండిచూచితీవ ? రమణ ! చోద్యమ యది
కాల మహిమ ,యిదియ ,కనగనిం కనునేమి
యుండు దైవ మ !నతు లొనర జేతు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండికొమ్మనుండుఁ గ్రోఁతి కోరిన సిరులిచ్చు
లక్ష్మి యేడ్చు శిశువు మెచ్చు మధువు
తేఁటి మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!
నా పూరణమందు విరామ చిహ్నములనుం బాటించినచో నిట్లుండును:
రిప్లయితొలగించండికొమ్మనుండుఁ గ్రోఁతి; కోరిన సిరులిచ్చు
లక్ష్మి; యేడ్చు శిశువు; మెచ్చు మధువు
తేఁటి; మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు; కాకి పలలముఁ దిను!
దువ్వూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీరు పూరణగా ప్రహేళికనే నిచ్చారు. చాల బాగుంది. అభినందనలు. విరామచిహ్నాలతో ప్రహేళికా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీరు కూడా గుండు వారి వలె పూరణగా ప్రహేళికనే ఇచ్చారు. నేను ఆ చమత్కారాన్ని గమనించలేదు. మన్నించండి. మీ ప్రహేళికా పూరణ బాగున్నది. అభినందనలు.
పంచ భక్ష్యము లుంచిన పళ్ళెమందు
రిప్లయితొలగించండిపప్పుప్రీతితో గుడుచును బ్రాహ్మణుండు
కాకి పలలముఁ దిను కడు కాంక్షతోడ
చెట్టుకొమ్మపై కాళ్ళతో పట్టి యుంచి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుక్కుటామిషమ్ము కోరి భుజి౦చు న
రిప్లయితొలగించండిబ్రాహ్మణుండు. కాకిపలలము దిను
ట.కొర కియ్య కొనదు డాకిని యైనను
వేయి రుచులు కల్గు వేపుడిడిన
శైలజ గారి ఆటవెలది హాయిగా నడిచింది.
రిప్లయితొలగించండిశ్రీ గుండు మధుసూదన్ గారి పద్యం మేలైనది . మంచి ప్రణాళిక ! రెండవ పాదంలో ' లచ్చికి 'మారుగా లక్ష్మిని ప్రతిక్షేపించడం ' ప్రమాదో ధీమతామపి ' కావచ్చును .
ఆవు,పచ్చిగడ్డిహరిణకంతినుచుండు|
రిప్లయితొలగించండిత్రాగు పాలుపిల్లి,త్రాచులాగ|
పంచ్యభక్ష్యములనువదలక దినగల్గు
బ్రాహ్మణుండు|కాకిపలలముదిను
శ్రీ భాగావతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిశాకములను తినును శాస్త్రజ్ఞుడైనట్టి
బ్రాహ్మణుండు; కాకి పలలముఁ దిను.
తృణము తినెడి గోవు తినబోదు నంజుడు
యెగిరి వాయసమ్ము యెఱచి తినును
సుకవి మిత్రులు డా. విష్ణునందన్ గారికి ధన్యవాదములు!
రిప్లయితొలగించండినేను ముందు "లచ్చి"యనియే ముందు టైపుచేసితిని. కాని, యొక చిన్న సవరణ మవసరపడి, దానిని తొలఁగించితిని. రెండవసారి టైపుచేయునపుడు "లచ్చి"కి బదులు, "లక్ష్మి"యని టైపాటు దొరలినది. మూఁడవసారి, విరామ చిహ్నముల నుంచునపుడు దానిని గమనింపకయే ప్రకటించితిని. క్షంతవ్యుఁడను. దోషమునుం దెలిపినందులకు ధన్యవాదములు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండితేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘హరిణకం’...?
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నంజుడు+ఎగిరి వాయసమ్ము+ఎఱచి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నంజుడు| నెగిరి వాయసమ్మె యెఱచి...’ అనండి.
క్రమాలంకారము
రిప్లయితొలగించండిశ్రాద్ధ మెవడు శ్రద్ధగా పితరుల?
పిండమేది ముట్టు పిదపనచట?
శూద్రుడేమి తినును సొగసైనదంచును?
బ్రాహ్మణుండు-కాకి-పలలముదిను
పప్పు నెయ్యి కలిపి పర్వమంచు దినును
బ్రాహ్మణుండు;కాకి,పలలముదిను
శూద్రుడెంతగానొ సుఖము చెందును గదా!
మాంస వంటకాల మహిత రుచికి
శాకపాకములను సరిగాను తినుగదా
బ్రాహ్మణుండు-కాకిపలలముదిను
నీచమైనదైన నింపుగా పిండంబు
ముట్టినంత కాకి ముక్తి యనరె
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. బహుశా టైపాటు కావచ్చు. ‘శ్రాద్ధ మెవడు పెట్టు శ్రద్ధగా పితరుల’
రెండవపూరణలో ‘మాంస వంటకాల’ అనడం దుష్ట సమాసం. ‘మాంసభోజనంపు మహితరుచికి’ అందామా?