కవిమిత్రులకు నమస్కృతులు. ఇంకా జ్వరం తగ్గలేదు. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా పరిచయమైన మిత్రులు రామమోహన్ గారు నన్ను అపోలో హాస్పిటల్‍కు తీసుకువెళ్ళారు. డాక్టర్ మూడురోజులకు మందులిచ్చి అప్పటికి తగ్గకుంటే కొన్ని పరీక్షలు చేయాలన్నారు. అన్నపరెడ్డి వారికీ, రామమోహన్ గారికి ధన్యవాదాలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, ‘శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్ట’దన్న మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘అతిశయ మేలనొ శివు డను...’ అనండి. సృష్టిస్థితిలయకారకుల గురించిన మీ రెండవపూరణ కూడా బాగుంది. అభినందనలు. ***** జిగురు సత్యనారాయణ గారూ, సృష్టిస్థితిలయకారకుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ భావం అవగాహన కాలేదు. వివరిస్తారా? పద్యంవరకు సలక్షణంగా చక్కగా ఉంది. ఆ విషయంలో అభినందనలు. ***** మాజేటి సుమలత గారూ, కలాంకు శ్రద్ధాంజలి ఘటించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘కలం’ అనడం వ్యావహారికం. ‘కలము బట్టి’ అనండి. ‘హృది పుటల’నడం దుష్టసమాసం. ‘ఎద పుటలపై’ అనండి. ***** నాగరాజు రవీందర్ గారూ, త్రిపుర సంహార ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, ధన్యవాదాలు. ఈరోజే ‘అపోలో’లో జనరల్ ఫిజీషియన్‍కు చూపించుకున్నాను. రతీదేవి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి వాక్యంలో సతి పునరుక్తి అయింది. ‘పతియే దైవ మ్మెట్లగు| సతి చావుకు కారకుండు...’ అనండి. ***** దువ్వూరి రామమూర్తి గారూ, కట్నంకోసం పీడించిన శంకరయ్యను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, వైవిద్యమైన విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, దక్షదజ్ఞ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘పిత యింట, పితృ నింట’ ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘గైకొనియె కద...’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, దక్షయజ్ఞధ్వంస ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆదరంబున గుర్తించి యడిగినంత పులకరించితి చల్లని పలుకు వినుచు పద్య రచనను ప్రోత్సాహపరచు నట్టి కంది శంకర గురువర్య వందనములు
గురువుగారు మీరు జ్వరముతో ఉన్నారని తెలిసినది. మీరు త్వరగా కోలుకోవాలని పరమేశ్వరుని ప్రార్థించుచున్నాను.
కొన్ని కారణాల వలన ఇటీవల బ్లాగును వీక్షింపలేకున్నాను. పద్యరచన కూడా చేయలేకపోతున్నాను. ఐననూ నెట్ సౌకర్యము ఉన్నప్పుడు తొలుత చూసేది మన శంకరాభరణము బ్లాగునే అని గర్వంగా తెలుపుకొంటాను.
"ఇలా మారిస్తే సరిపోతుందేమో అని " ---------------------------- అతులిత పూజితు డైనను సతిచావుకు కార కుండు శంకరుఁడు గదా గతులను మార్చగ ప్రాణుల మితిమీరిన వయసు నందు మేధిని వీడన్ ------------------------------ అంటే పెద్ద వయస్సు వచ్చాక ప్రాణుల స్థితి గతులను మార్చేది శంకరుడెకదా .అందుకని ఎంత పూజనీయుడైనా ,సతిచావుకు కారణం ఈశ్వరుడె అని నాభావం అదన్నమాట పొరబాటైతే ఇం...తే.... సంగతులు .
కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ద్రాక్షాయణి’ అన్నారు. అది ‘దాక్షాయణి’. ***** రాజేశ్వరి అక్కయ్యా, ఇప్పుడు మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, ముందుగా సమస్యలోని దోషాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. ‘చావునకు’ అనడమే సాధువు. మిత్రుల దోషాలను ఎత్తిచూపే నేను ‘చావుకు’ అని తప్పుగా ప్రయోగించాను. మిత్రుల పూరణలను సవరించలేను కాని సమస్యను సవరిస్తాను. ఇక మీ పూరణ వైవిధ్యమైన భావంతో చక్కగా ఉంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅతిశయ మేలనొ శివుడను
తొలగించండిమతి లేనిదిచీమయైన మరణించదుగా
పతిగద విశ్వానికతడు
సతిచావుకు కారకుండు శంకరుడుగదా
అతిశయ మేలనొ శివుడను
తొలగించండిమతి లేనిదిచీమయైన మరణించదుగా
పతిగద విశ్వానికతడు
సతిచావుకు కారకుండు శంకరుడుగదా
అతిశయ మేలనొ శివుడను
తొలగించండిమతిలే నిదెచీమయైన మరణింపదుగా
పతిగద విశ్వానికతడు
సతిచావుకు కారకుండు శంకరుడుగదా
అతిశయ మేలనొ శివుడను
తొలగించండిమతిలే నిదెచీమయైన మరణింపదుగా
పతిగద విశ్వానికతడు
సతిచావుకు కారకుండు శంకరుడుగదా
మతిమంతులు సెప్ప వినమె
రిప్లయితొలగించండిసతతము పుట్టించువాఁడు సరసిజ భవుడే!
స్థితికిన్ మూలము విష్ణువు
సతి! చావుకు కారకుండు శంకరుడు గదా!
అతులిత పూజితు డైనను
రిప్లయితొలగించండిమితిమీరిన వయసు నందు మేధిని వీడన్
గతులను మార్చగ ప్రాణుల
సతి చావుకు కారకుండు శంకరుఁడు గదా
పద్య రచన - 974
రిప్లయితొలగించండికలల గనుడు, వాటిని బొంద గాల మిడుడు
లక్ష్యములను జ్వలిత రెక్కలనట దాల్చి
ప్రగతి పథమున భ్రమరింప పరుగులిడుడ
నుచు నవ యువత భవితల న్నూలుగొల్ప
కంఠమెత్తి, కలం బట్టి, గాథల, హృది
పుటల పై లిఖించితివీవు, పుణ్య పురుష!
భరత రత్న! సంగీత పిపాసిత! చిర
నియత చరిత! కలాం! సలాం నీకు మాన్య!
పితరుడు దక్షుండేగద
రిప్లయితొలగించండిసతి చావుకు కారకుండు, శంకరుడు గదా
మితిమీరిన కోపముతో
ప్రతిగా మామనువధించె ప్రమథాధిపుడే!!!
పతికై రోదించి మరుని
రిప్లయితొలగించండిసతి,చావుకు కారకుండు శంకరుడు గదా!
గతిఁ జూపగ వేడెదనని
నుతియించుచు మంగళకరు నూరట నందెన్!
గురుదేవులకు ప్రణామములు. మరింతమెరుగైన వైద్యం గురించి ఆలోచించ మనవి.
రిప్లయితొలగించండిసతికిన్బ తియే యె ట్లగు
రిప్లయితొలగించండిసతి చావుకు కారకుండు, శంకరుడు గదా
సతతము శుభముల నిచ్చెడు
పతిదేవుడు మనకు గాదె ? పరి కింపంగాన్
స్థితిలయ కారకులీశ్రీ
రిప్లయితొలగించండిపతులని వేదాంతులనెడు వాక్కుల జూడన్
రతిపతి మరణానికితన
సతిచావుకు కారకుండు శంకరుడు గదా
పతికై రోదించి మరుని
రిప్లయితొలగించండిసతి, చావుకు కారకుండు శంకరుడు గదా!
గతిఁ జూపగ వేడెదనని
నుతియించగ మంగళకరు నూరట నందెన్!
సతతము కట్నముఁదెమ్మని
రిప్లయితొలగించండిపతి శంకరుడే తనసతిఁబల్మఱుఁగొట్టన్
హతవిధి! మరణించిన తత్
సతి చావుకు కారకుండు శంకరుడుగదా!
స్థితిలయ కారకులీశ్రీ
రిప్లయితొలగించండిపతులని వేదాంతులనెడు వాక్కుల జూడన్
రతిపతి మరణానికితన
సతిచావుకు కారకుండు శంకరుడు గదా
సతతము సేవలఁజేయును
రిప్లయితొలగించండిస్థితికారకుడైన హరికి సిరి యరుసముతో
శ్రుతదేవి సృష్టికర్తకు
సతి, చావుకు కారకుండు శంకరుడుగదా!
కం:పిత/తృ యింట జరుగు క్రతువున
రిప్లయితొలగించండిసతి,పతి యనుమతి గొనకయె చనియట యవమా
నితయై యఙ్ఞంబున పడె
సతి చావుకు శంకరుండు కారకుడెగదా!
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణలు
రిప్లయితొలగించండిపితరుడు దక్షుడె నిజముగ
సతిచావుకు కారకుండు; శంకరుఁడు గదా
పతనము జేయగ యజ్ఞము
నతియుగ్రత వీరభద్రు నచటికె బంపెన్ !
పతి యాజ్ఞ గైకొనేకద
సతి, యజ్ఞము చూడనేగి సమిధగ నయ్యెన్!
వెతలొంది మృతిని గోరిన
సతి చావుకు కారకుండు శంకరుఁడు గదా!
రిప్లయితొలగించండిసితిక౦ఠు తెగడు దక్షుడు
సతి చావుకు కారకుండు. శ౦కరుడు గదా
స్తుతియించగ నజముఖునిగ
బ్రతికించెను దక్షు మరల పరికించి కృపన్
మతి చంచలమై చంపెను
రిప్లయితొలగించండిరతి భర్తను తపసు జెరప రగిలిన రుషతో
క్రతువుకు పంపడమే శ్రీ
సతి చావుకు కారకుండు శంకరుఁడు గదా!
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఇంకా జ్వరం తగ్గలేదు. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా పరిచయమైన మిత్రులు రామమోహన్ గారు నన్ను అపోలో హాస్పిటల్‍కు తీసుకువెళ్ళారు. డాక్టర్ మూడురోజులకు మందులిచ్చి అప్పటికి తగ్గకుంటే కొన్ని పరీక్షలు చేయాలన్నారు. అన్నపరెడ్డి వారికీ, రామమోహన్ గారికి ధన్యవాదాలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
‘శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్ట’దన్న మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘అతిశయ మేలనొ శివు డను...’ అనండి.
సృష్టిస్థితిలయకారకుల గురించిన మీ రెండవపూరణ కూడా బాగుంది. అభినందనలు.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
సృష్టిస్థితిలయకారకుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ భావం అవగాహన కాలేదు. వివరిస్తారా? పద్యంవరకు సలక్షణంగా చక్కగా ఉంది. ఆ విషయంలో అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
కలాంకు శ్రద్ధాంజలి ఘటించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘కలం’ అనడం వ్యావహారికం. ‘కలము బట్టి’ అనండి. ‘హృది పుటల’నడం దుష్టసమాసం. ‘ఎద పుటలపై’ అనండి.
*****
నాగరాజు రవీందర్ గారూ,
త్రిపుర సంహార ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
ధన్యవాదాలు. ఈరోజే ‘అపోలో’లో జనరల్ ఫిజీషియన్‍కు చూపించుకున్నాను.
రతీదేవి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి వాక్యంలో సతి పునరుక్తి అయింది. ‘పతియే దైవ మ్మెట్లగు| సతి చావుకు కారకుండు...’ అనండి.
*****
దువ్వూరి రామమూర్తి గారూ,
కట్నంకోసం పీడించిన శంకరయ్యను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
వైవిద్యమైన విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
దక్షదజ్ఞ ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పిత యింట, పితృ నింట’
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘గైకొనియె కద...’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
దక్షయజ్ఞధ్వంస ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పతిమాట మీరివచ్చిన
రిప్లయితొలగించండిసతిచావుకుకారకుండు శంకరుడు గదా|?
“మతిహీ నుండగు దక్షుని
సుతయౌ ద్రాక్షాయణికట సుముఖతలేకే”|
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
ఆదరంబున గుర్తించి యడిగినంత
పులకరించితి చల్లని పలుకు వినుచు
పద్య రచనను ప్రోత్సాహపరచు నట్టి
కంది శంకర గురువర్య వందనములు
గురువుగారు మీరు జ్వరముతో ఉన్నారని తెలిసినది. మీరు త్వరగా కోలుకోవాలని పరమేశ్వరుని ప్రార్థించుచున్నాను.
కొన్ని కారణాల వలన ఇటీవల బ్లాగును వీక్షింపలేకున్నాను. పద్యరచన కూడా చేయలేకపోతున్నాను. ఐననూ నెట్ సౌకర్యము ఉన్నప్పుడు తొలుత చూసేది మన శంకరాభరణము బ్లాగునే అని గర్వంగా తెలుపుకొంటాను.
పతినే దూరగ, దక్షుడు
సతి చావుకు కారకుండు, శంకరుడు గదా
హితమున్ బల్కెను, కాలపు
గతి మార్చుటకగునె? కాలకాలునికైనన్
"ఇలా మారిస్తే సరిపోతుందేమో అని "
రిప్లయితొలగించండి----------------------------
అతులిత పూజితు డైనను
సతిచావుకు కార కుండు శంకరుఁడు గదా
గతులను మార్చగ ప్రాణుల
మితిమీరిన వయసు నందు మేధిని వీడన్
------------------------------
అంటే పెద్ద వయస్సు వచ్చాక ప్రాణుల స్థితి గతులను మార్చేది శంకరుడెకదా .అందుకని ఎంత పూజనీయుడైనా ,సతిచావుకు కారణం ఈశ్వరుడె అని నాభావం అదన్నమాట పొరబాటైతే ఇం...తే.... సంగతులు .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండి(ఆర్యసమాజావిష్కృతిచే...సత్యార్థప్రకాశ రచనముచే...దయానందసరస్వతిగా పేరుగడించిన మూలశంకరుని వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)
యతియై, సత్యార్థము స
మ్మతితోఁ జెప్పంగ నెంచి, మనువాడక, యా
సతత మతి చలిత మోహపు
సతి చావుకుఁ గారకుండు శంకరుఁడు గదా!
శంకరయ్యగారూ, సమస్య:"సతి చావునకును కతమ్ము శంకరుఁడు గదా" యని యుండవలెననుకొందును. పరిశీలింపుఁడు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ద్రాక్షాయణి’ అన్నారు. అది ‘దాక్షాయణి’.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
ఇప్పుడు మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
ముందుగా సమస్యలోని దోషాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. ‘చావునకు’ అనడమే సాధువు. మిత్రుల దోషాలను ఎత్తిచూపే నేను ‘చావుకు’ అని తప్పుగా ప్రయోగించాను. మిత్రుల పూరణలను సవరించలేను కాని సమస్యను సవరిస్తాను.
ఇక మీ పూరణ వైవిధ్యమైన భావంతో చక్కగా ఉంది. అభినందనలు.
అతిగా పొగడుచు వ్రాతల
రిప్లయితొలగించండిమితిమీరిన నెమ్మితోడ మ్రింగుచు గడియల్
మతిపోవు రీతి నాదు వ
సతి చావుకు కారకుండు శంకరుఁడు గదా!
వసతి = సౌఖ్యము