2, జులై 2015, గురువారం

పద్య రచన - 948

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. చీకటి గనులను త్రవ్వుచు
    నేకత ముగపని జేయు నెవ్విధి నైనన్
    రూకలు నింపగ పిల్లల
    యాకలి దీర్చంగ నెంచి ప్రాణము లొడ్డున్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. "పనిని జేయ" అనండి.

    రిప్లయితొలగించండి
  3. అల్పాక్కర- మొదటిప్రయత్నం

    బొగ్గుల గనులను పుట్టెడునౌ
    యెగ్గుల పాలయి యిక్కట్లను
    మగ్గెడు వారలు మాణిక్యముల్
    నిగ్గులుదేఱిరి నేర్పులలోన్.

    రిప్లయితొలగించండి
  4. ఆలస్యంగా కొన్ని పాత పూరణలు.

    వారి గాథలఁ జదువుచు దారి తెలిసి
    కొనుచు నడువుదమనియెడు కోర్కె గలిగి
    చదువ మొదలిడ, నక్కట! చదువు కొలది
    సంతతము దుఃఖమే కులసతుల వలన.

    రిప్లయితొలగించండి
  5. మేడమిద్దెలనెప్డు మెఱుగనక
    కోడి కూసెడు వేళకు పడి లేచి
    పాడి పంటల శ్రద్ధఁ బండించుచున్
    పాడుకొనుచునుంద్రు పనులయందు.

    రవిఁ గానపడకుండ రణరంగము
    న విజృంభణమునర్జున రథమును
    గవగవనడుపుచు గనెనట సైం
    ధవ వధ కృష్ణుడు ధర్మముకై.

    ఎన్నిచీరలనైన నెన్నుకొన
    కన్నెల చేతగాక చెలియల
    సన్నల కొఱకు వేసటలేకయె
    మన్ననతో నిల్చు మగువలుంద్రు.

    వేదరాశి వర్ణించెడు విష్ణువతడు!
    పాప హరణమాతడి నామ జాపవిధము!
    కమల నాభ, వరములిచ్చి కావ రావె,
    రుద్రకళల నధర్మనిర్మూలపరుప.

    రిప్లయితొలగించండి
  6. నల్ల బంగార మనుపేర విల్ల సిలెడి
    బొగ్గు గనిలోన కూలీలు మగ్గి మగ్గి
    మోయు చుండిరి బొగ్గును మురళి ! చూడు
    వారి కిడుదును నతులునే వంద లాది

    రిప్లయితొలగించండి

  7. ఆ.వె:కోటి విద్య లెల్శ కూటి కొరకెయంచు
    కష్ట పడెడి బాల కార్మికులను
    గాంచ చిత్తమునకు కస్తి కలుగు వీరి
    బాధ తీర్చ వయ్య పరమపురుష.

    రిప్లయితొలగించండి
  8. బొగ్గుల గనులను త్రవ్వుచు
    మగ్గుచు పనిజేయుచున్న మన కార్మికులే
    నెగ్గుకు రాలేక విధిన్
    బుగ్గిన బడి బ్రతుకు చుండె బువ్వకు లేకన్!!!

    రిప్లయితొలగించండి

  9. 200ఆ.వె:కోటి విద్య లెల్ల కూటి కొరకెయంచు
    కష్ట పడెడి బాల కార్మికులను
    గాంచ చిత్తమునకు కస్తి కలుగు వీరి
    బాధ తీర్చ వయ్య పరమపురుష.
    పై పద్యంలో అచ్చు తప్పుందని మరల పోస్ట్ చేశానండి

    రిప్లయితొలగించండి

  10. 200ఆ.వె:కోటి విద్య లెల్ల కూటి కొరకెయంచు
    కష్ట పడెడి బాల కార్మికులను
    గాంచ చిత్తమునకు కస్తి కలుగు వీరి
    బాధ తీర్చ వయ్య పరమపురుష.
    పై పద్యంలో అచ్చు తప్పుందని మరల పోస్ట్ చేశానండి

    రిప్లయితొలగించండి
  11. భూమిలోతున చీకట్ల పొరలమాటు
    బొగ్గు నిల్వలు కలవని నిగ్గు దేల
    గనుల లో దూరి రేబవల్ కార్మికాళి
    వెలికి దీయంగ త్రవ్వకాల్ సలుపుచుంద్రు.

    చాల శ్రమకోర్చి కార్మికుల్ సహనమునను
    త్రవ్వుచుండంగ నాపదల్ తరచుగాను
    గనులు కూలియొ జలములు గనుల లోన
    నుప్పతిల్లియొ వారిపై గప్పికొనును.
    నల్ల బంగారమునకిల నెల్ల చోట్ల
    వల్లమాలిన విలువాయె కల్లకాదు
    నిల్వ లన్నియు నానాడు నెమ్మదిగను
    చిక్కి పోవుట దేశాల చిక్కులాయె.

    భూమి యట్టడుగున గల బొగ్గు, చమురు
    వంటి యింధనముల మారు బయట దొరకు
    సౌర శక్తిని బోలిన సహజమైన
    యన్యమైనట్టి వనరుల యండ మేలు.

    రిప్లయితొలగించండి
  12. భూగర్భ బొగ్గు గనులన్
    సాగించగ త్రవ్వకముల క్షమతో శ్రమతో
    సాగును పరిశ్రమలు, తుల
    తూగదె దేశమ్ము వృద్ధి తోడై వెలుగన్!

    రిప్లయితొలగించండి
  13. బాలకార్మికులను బడిబాట బట్టించ?
    ---బ్రతుకంత సుఖమిచ్చి బ్రమలుమాన్పు|
    వెట్టిచాకిరి కంప?వెతలన్ని మానునా?
    ------సాధన సంపత్తు సన్నగిల్ల|
    తల్లిదండ్రికి మంచి దలపెట్ట బూనగా?-
    -----చదువు సంస్కారంబె చక్కబరచు|
    యేరోజు కారోజు సారాంశ మనుకొన్న?-
    ----ఆరోగ్య ఖర్చులు నందగలవ?
    బొగ్గుబుట్టలెత్త?మగ్గును బాల్యమే
    కట్టుబాట్ల యందు కరుగు బ్రతుకు|
    బాల్యమన్న దెంత-మూల్యమో గ్రహియించి
    గనుల పనికి బంప?ఘనత గాదు.
    2.తలఫై బుట్టను బెట్టక
    పలకా బలపంబుబట్ట?బాల్యము యెంతో
    విలువలు నింపును జీవన
    మలుపులచే మనిషి యగును|మరువకుమన్నా

    రిప్లయితొలగించండి
  14. చట్టము బొగ్గున మసియై
    కట్టడి గనుపించనంత కల్మష మంటన్
    పట్టవు బాల్యపు చదువులు
    పట్టాలను పట్టు టెట్లు?బాలుర బ్రతుకుల్?

    రిప్లయితొలగించండి