వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మానవత+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మానవతగ| నెఱిగి...’ అనండి. ***** వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, ‘కి-కు’ ప్రత్యయాల ప్రయోగాలు.... అ) ఇ,ఈ,ఐ అంతమందున్న శబ్దాలకు ‘కి’ వస్తుంది. ఉదా. హరికి, తరుణికి, బావిలీకి, రైకి. (నీ,మీ లకు కి రాదు. నీకు, మీకు). ఆ) అ,ఆ,ఎ అంతమందున్న శబ్దాలకు ‘కు’ వస్తుంది. ఉదా. పలకకు, బాబాకు, కన్నెకు. ఇ) ఉ,ఋ అంతమందున్న శబ్దాలకు ‘కు’ పరమై దానికి ముందు ‘న’ ఆగమంగా వస్తుంది. రామునకు, విధాతృనకు. ఇక ఫలకము తత్సమము. దానికి ఫలకమునకు, ఫలకముపై అని ప్రత్యయాలు చేరుతాయి. ‘పలక’ తద్భవము. దానిని పలకకు, పలకపై అని ప్రత్యయాలు చేరుతాయి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరణ శయ్యపై నున్నట్టి మానవునకు
తొలగించండిప్రాణ దానమ్ము సేయుటే మాన వతగ
నెఱిగి మసలుకొనుడు, ధర్మ మిదియె, కాదు
రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
గురువు గారికి నమస్కారములు మీ సూచన ప్రకారము పద్యమును సరిచేసాను ..నా దోషములను ఎప్పటీకప్పుడు సరిచేసి మార్గదర్శకం చూపుతున్న మీకు కృతజ్ఞతలండీ.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రోగుల-రక్తదానం రాక్షసమే :
01)
_____________________________
రక్తమందున వైరస్సు - రాజుకొనెడి
రోగకరమగు రుధిరపు - రోగులెపుడు
తోటివారి కంటును గాన - తొలగి చనుడు
రక్తదానమ్ము సేయుట - రాక్షసమ్ము !
_____________________________
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మానవత+అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మానవతగ| నెఱిగి...’ అనండి.
*****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండిఒకఁ డెయిడ్స్ వ్యాధి పీడిత ప్రకటుఁ డయ్యుఁ
దక్కు వారినిం దనవలెఁ దల్లడిల్లఁ
జేయఁగా నెంచి వైద్యులఁ జీరి తనదు
రక్తదానమ్ముఁ జేయుట రాక్షసమ్ము!
రెక్క లూపుచు తొండాన రెచ్చికరచు
రిప్లయితొలగించండిజనుల నేచుచు నారోగ్య జగతి చెరచు
మనుజ పీడన జేసెడి మశకములకు
రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము
తనదు రక్తము నీయంగ తగని దగచు
రిప్లయితొలగించండినంటు రోగము తగిలించు ననుచు దెలిసి
యుండి గూడను " శాడిస్టు " మొండి యగుచు
రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవసరార్థము వచ్చిన నార్త జనుల
రిప్లయితొలగించండిరుధిర మీయక పీడించి రొక్కమడుగు
రక్తనిధి కేంద్రముల వద్ద లాభమనుచు
రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము!
రక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
రిప్లయితొలగించండికాదు,పరుల ప్రాణము నిల్చు ఖచ్చితముగ
మానవుల సేవ యే ,యిల మాధవార్చ
నంబనుచు దాన మొసగ పుణ్యంబు నబ్బు.
సుఖపురోగములన్ బడి స్రుక్కుచుండి
రిప్లయితొలగించండితాగి తందనా లాడెడి తలపుతోడ
రక్తదానముఁజేయుట రాక్షసమ్ము
వంచన సలిపి రోగులన్ ముంచవద్దు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పుణ్య కార్యమ్మురా మంచి బుద్ధితోడ
రిప్లయితొలగించండిరక్తదానమ్ము సేయుట - రాక్షసమ్ము
సుమ్మ నిర్లక్ష్యముగదాని సుంతయైన
ప్రజలకుపయోగ పడకుండ పాడు చేయ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దుష్టమగు రీతి రణమున దుస్ససేను
రిప్లయితొలగించండిరక్త"పానమ్ము"సేయుట రాక్షసమన
ముద్ర"రాక్షస"మున తప్పు ముద్రిత మయె
రక్త "దానమ్ము"సేయుట రాక్షసమ్ము
అచ్చు తప్పును క్షమియించు డార్యులార
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ వైవిద్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
నేను నా పూరణను పోస్ట్ చేద్దామనుకుంటుండగా మీ పూరణ వచ్చింది. చూడండి నా పూరణ....
వ్రాయమనె శిష్యుని గురువు పలకపైన
రిప్లయితొలగించండి“రక్తపానమ్ము సేయుట రాక్షసమ్ము”
వ్రాసె గురువాక్య మిట్లు పరాకున విని
“రక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము”
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిరక్తదానమ్ము సేయుట రాక్షసమ్ము
గాగ దలుపగ వలయును,కర్మభూమి
కుష్టు, బొల్లి, యెయిడ్సు తో కుందువారు,
రక్త కేన్సరు గలవారు యుక్తమదియె.
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
అన్న,వస్త్ర,భూ,గోదానమున్న?మిన్న
రిప్లయితొలగించండిసాటి మానవాళి కొసగు సమయమందు
రక్త దానంబు సేయుట.”రాక్షసమ్ము
రోగకారకక్రిములున్న-రక్తమివ్వ”
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
గురుదేవులు శ౦కరయ్య గారికి
రిప్లయితొలగించండినాపద్యము మీకు నచ్చినందుకు ధన్యవాదములు.మీపూరణ కు
అభినందనలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరక్త దానమ్ము సేయుట రాక్షసమ్ము
రిప్లయితొలగించండిగాదలచవలదు మదిన కరుణతోడ
సాటివారిని గాపాడ సత్వరముగ
దానమీయగ బుణ్యంబు శోణితమును!!!
శ్రీ శంకరార్యా
రిప్లయితొలగించండిచిన్న సందేహం. కొండపై బస్సు పద్యంలో ఉమాదేవిగారి పద్యంలో దర్శనముకు తప్పు దర్శనమునకు కరెక్ట్ అన్నట్లే పలకపై అని కాక పలకముపై అని వ్రాయాలా?
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండి‘కి-కు’ ప్రత్యయాల ప్రయోగాలు....
అ) ఇ,ఈ,ఐ అంతమందున్న శబ్దాలకు ‘కి’ వస్తుంది. ఉదా. హరికి, తరుణికి, బావిలీకి, రైకి. (నీ,మీ లకు కి రాదు. నీకు, మీకు).
ఆ) అ,ఆ,ఎ అంతమందున్న శబ్దాలకు ‘కు’ వస్తుంది. ఉదా. పలకకు, బాబాకు, కన్నెకు.
ఇ) ఉ,ఋ అంతమందున్న శబ్దాలకు ‘కు’ పరమై దానికి ముందు ‘న’ ఆగమంగా వస్తుంది. రామునకు, విధాతృనకు.
ఇక ఫలకము తత్సమము. దానికి ఫలకమునకు, ఫలకముపై అని ప్రత్యయాలు చేరుతాయి. ‘పలక’ తద్భవము. దానిని పలకకు, పలకపై అని ప్రత్యయాలు చేరుతాయి.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మదిని’ అనండి. ఇకారాంత శబ్దాలకు ద్వితీయావిభక్తిలో ‘ని’ ప్రత్యయం చేరుతుంది.
శ్రద్ధ లేకుండ వాహనచాలకులును
రిప్లయితొలగించండిదారి నడిచెడి వారిని దారుణముగ
గుద్ది,యాసుపత్రిని జేర్చి,గొప్పగాను
రక్తదానమ్ము జేయుట రాక్షసమ్ము
మేదినందున మనకగు మేలుచర్య
రక్తదానమ్ము చేయుట-రాక్షసమ్ము
దారియందున క్షతగాత్రు,దారుణముగ
వదల-పరిచర్య చేయుటే భవ్యమగును
రక్తదానంపు శిబిరాలు రమ్యమగును
తాము రక్తమ్ము చేయక దానమచట,
నితర మనుజులు రక్తమ్మునివ్వగాను
రక్తదానమ్ము చేయుట రాక్షసమ్ము
దయయు లేకుండ రక్తమ్ము ధరకునమ్మి
తాము పొందంగ వ్యసనమ్ము దానివలన,
రక్తదానమ్ము చేయుట రాక్షసమ్ము
దయను పొందినయపుడేను దానమగును
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.