6, జులై 2015, సోమవారం

సమస్యా పూరణము - 1722 (కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు.

37 కామెంట్‌లు:

 1. పరవ సించగ శృంగార భావ మందు
  కవిత లందున " రా " కొట్ట కవులు బలికె
  సత్య భామయె వెన్నుని సరస మాడె
  కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు

  రిప్లయితొలగించండి

 2. మోటూ హో గయా తో క్యా మై బేబీ
  యూ ట్యూబు న లగావో షకీరా డాన్సు
  తకిట తదిమి ఫియాన్సీ తో కూడి చేసిన, ఒద
  కలికి పద తాడ నమ్ములే కడు ప్రియములు :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. జిలేబీ గారూ,
  మీ వచనకవిత స్ఫూర్తితో నా పూరణ....
  రాగతాళగతులతోడ రమ్యముగను
  మనము నూగించు గీతమ్ములను వినుచును
  లీలగా నాట్యమాడగ నేలపైన
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు.

  రిప్లయితొలగించండి
 4. పెండ్లి తంతును జరుపుచు విప్రవరుడు
  వధువు పదమునెత్తి వరుని పదముపైన
  నుంచి నొక్కుమనగ నొత్త యువకునకును
  కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు!

  రిప్లయితొలగించండి
 5. సరసమాడగ పాన్పుపై సత్య జేర
  అలకతోనున్న ప్రియసఖి ఆగ్రహించి
  కాలితో తన్నె కృష్ణు-నేకాంతమందు
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు

  రిప్లయితొలగించండి
 6. వెలుగులెంతయొ నిండిన వేదికందు
  కురుచ దుస్తులు దరియించి కోరచూపు
  కలయ జూచుచు జేసెడి" క్యాటు వాకు "
  కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు

  రిప్లయితొలగించండి
 7. తకధిమి తకధిమి యటంచు ధాత్రి యెడల
  పరమ భక్తిఁ జాటి మొదట ప్రణతులొసగి
  పిదప నాట్యమాడెడు వేళ బిడ్డ వంటి
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు.

  రిప్లయితొలగించండి
 8. పట్టుచీరెఁగట్టి నుదుట బొట్టుపెట్టి
  కదము తొక్కుచు ముదమున సదనమందు
  నడుము తిప్పుచు రయమున నాట్యమాడు
  కలికి పదతాడనమ్ములే కడుప్రియములు

  రిప్లయితొలగించండి
 9. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వేదిక+అందు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘వేదిపైన’ అనండి.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. అలిగిన సతి సత్యావతి యలుక దీర్చ
  జనిన కృష్ణుని తన్నిన సంయమమున
  పాదముల నొత్తె నాతడు పలుకరించె
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు.

  రిప్లయితొలగించండి
 12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. కలికి పద తా డ నమ్ము లే కడుప్రి యములు
  కొందరికి మాత్రమే ,మఱి యంద ఱి కది
  పోల్చు ట న్యాయమే యగు బోధ కుండ !
  కోప పడకుడు నాపైన కొంచె మైన

  రిప్లయితొలగించండి
 14. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. తే.గీ: సతి పతులు సరసమాడు సమయ మందు
  ప్రణయ కలహమ్ము లాడుచు వలపు చేత
  పరవశమ్మున మైమరువ ముదమార
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు.

  రిప్లయితొలగించండి
 16. తే.గీ: సతి పతులు సరసమాడు సమయ మందు
  ప్రణయ కలహమ్ము లాడుచు వలపు చేత
  పరవశమ్మున మైమరువ ముదమార
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు.

  రిప్లయితొలగించండి
 17. బోసి నవ్వులు రువ్వుచు బుజ్జిపాప
  గుండె పైనెక్కి తన్నుచు గోముగాను
  ముద్దు మాటల నాడంగ మురియు తల్లి
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు!!!

  కలికి = మనోహరము

  రిప్లయితొలగించండి
 18. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. బస్సునెక్కెడినొకగుడ్డి పడతి గాంచి
  సంస్కరించెడు తమయింటి సబ్బు దలచి
  యువకుడుంచెను మోకాలు యూత మిడుచు
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు

  (తిపుల్ ఎక్స్ సంస్కారవతమైన సోప్ అనే ప్రకటన దలచి వ్రాసింది) .....

  రిప్లయితొలగించండి

 20. ఓరచూపుకు బదులు నీ కోరచూపు
  చిరు నగవుకు బదులుగ నీ చిరుబురులును
  ముద్దు మురిపాల బదులు నీ మూతి విరుపు
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు

  రిప్లయితొలగించండి
 21. నమస్కారములు
  క్షమించాలి గురువులు నాపద్యము సవరణ చేయడం మరచి నారు

  రిప్లయితొలగించండి
 22. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  వెగటు చేష్టలు చేయుచు, వీరుల వలె
  వెకిలి నవ్వులు నవ్వుచు వెంటఁ బడెడి
  దుడుకు యువకుల దండింపఁ దొడగినట్టి
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు!!

  రిప్లయితొలగించండి
 23. రాజేశ్వరి అక్కయ్యా,
  మన్నించాలి. మీ పూరణను సమీక్షించాననే అనుకున్నాను.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగజ్యోతి సుసర్ల గారూ,
  మీరు గతంలో ఈ బ్లాగుకు పద్యాలు వ్రాశారా? (నాకు జ్ఞాపకశక్తి తక్కువ!). ఇదే మొదటిసారి అయితే మీకు హృదయపూర్వక స్వాగతం.
  మీ ‘సంస్కారవంతమైన’ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మోకాలు నూత మిడుచు’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. మాయ మంత్రాల నేర్చిన మాంత్రికుండు
  లంకె బిందెలుఁ గలవని రక్తిఁ గొలుప
  మోహ మందిన వాడికి యూహ లందు
  కలికి పద తాడనమ్ములు కడు ప్రియములు!

  రిప్లయితొలగించండి
 25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. నేను పద్యాలు వ్రాశాను ఒకటీ రెండు సార్లు శంకరయ్య గారు ...నమస్సులు ఇక్కడ పద్యాలు ఎలా ఎడిట్ చెయ్యాలో తెలియక పద్యాలు పోస్ట్ చెయ్యటం మానేశాను ....

  రిప్లయితొలగించండి
 27. బస్సునెక్కెడినొకగుడ్డి పడతి గాంచి
  సంస్కరించెడు తమయింటి సబ్బు దలచి
  యువకుడుంచెను మోకాలు నూత మిడుచు
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు

  సవరించిన పద్యం ...ధన్యవాదములు శంకరయ్యగారు

  రిప్లయితొలగించండి
 28. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు
  గాగ,గమనించ కొల్లలు కధలు వినమె !
  విప్రనారాయణుడె గాక బిల్వ మంగ
  ళుడును చవిజూచియుండరే లుబ్ధులగుచు

  లుబ్ధులు = ఆసగలవారు
  ( ఆధారం - శబ్దరత్నాకరము )

  రిప్లయితొలగించండి
 29. నాగజ్యోతి సుసర్ల గారూ,
  సంతోషం!
  ఇక్కడ పోస్ట్ చేసిన పద్యాలను ఎడిట్ చేసే అవకాశం లేదు (మీకే కాదు ... నాకు కూడా!) ఆ పద్యాన్ని తొలగించి సవరించిన పద్యాన్ని మళ్ళీ పోస్ట్ చేయడమొక్కటే మార్గం.
  మీ పద్యానికి నేను సూచించన సవరణలో లోపం ఉన్న విషయాన్ని గుండు మధుసూదన్ గారు వివరంగా (ఫోన్ ద్వారా) తెలియజేశారు. ఔపవిభక్తి ‘ఇ’ చేరడం వల్ల ‘మోకాలి నూత మిడుచు’ అవుతుంది. గమనించవలసిందిగా మనవి.
  *****
  గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. నడక టందాలు కళ్ళలో నాట్యమాడ?
  కనులరెప్పలు తాళమై కలసి యాడ?
  నవ్వుతొలకరి జల్లులా రువ్వినపుడు?
  కలికి పదతాడనమ్ములే కడు ప్రియములు|
  2కోపతాపంబు తొలగును కోర్కెలున్న
  భయము,లజ్జయు పరుగెత్తు పట్టుదలకు
  సరస మనియెడి సాహిత్య సంబరాన
  కలికి పద తాడ నమ్ములే కడు ప్రియములు|

  రిప్లయితొలగించండి
 31. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. మాస్టరు గారూ ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో....చిన్న మార్పుతో...


  వెలుగులెంతయొ నిండిన వేదిపైన
  కురుచ దుస్తులు దరియించి యోరకంట
  కలయ జూచుచు జేసెడి" క్యాటు వాకు "
  కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు

  రిప్లయితొలగించండి
 33. మంచి యన్నది వానికి మలినమగును
  చెడ్డ జూడవింతగ నతి శ్రేష్ఠమనును
  వందనములనుట కలికి వలను గాదు
  కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు

  రిప్లయితొలగించండి
 34. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సవరించిన పూరణ బాగుంది. సంతోషం!
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. వరుస గలిసిన భామతో బావ యొకడు
  సరస మాడంగ గోపించి సరసిజాక్షి
  కపట కోపంబు నటియించి కాలువిసర
  కలికి పదతాడనమ్ములే కడుప్రియములు

  రిప్లయితొలగించండి
 36. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి