4, జులై 2015, శనివారం

పద్య రచన - 950

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. పిల్లుల పెంపుడు గృహమది
    చల్లటి నీడను సుఖముగ చల్దులు తినగన్
    తల్లులు పిల్లలు నొకదరి
    యల్లరి చేయంగ నెపుడు నానందముగన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘సఖ్యత+అందునే’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘సఖ్యతే యగున్’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  4. పిల్లు లగమి మరిని పెల్లుబికిన సంత
    సంబు తోడ పాలు సర్వ మునట
    త్రాగు చుండె నార్య ! దవడలు నొప్పి గ
    లిగిన ,నొవ్వ కయవి ,లేచి గనుము

    రిప్లయితొలగించండి
  5. .ఆ.వె:పిల్లులు గలిగిన యింటను
    కొల్లలుగా పిల్లలున్న కూరిమి తోడన్
    మెల్లగ పాలును పెరుగును
    చల్లయు పిల్లుల కొసగుచు సంబర పడుదుర్/చున్

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సంబరపడరే’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. పిల్లులు విందు వేరయిన?ప్రీతియు నింపెడి సఖ్య తేయగున్’
    తల్లులు,పిల్లలున్ గలసి తత్వము బంచెను|మానవాళికిన్
    అల్లరి లేనిహాయి|మనకందగ జూపెను”రెండు రాష్ట్రముల్
    కల్లలు మాని రాష్ట్రపతి కాంక్షలు దీర్చు మటన్న చిత్రమే”|

    రిప్లయితొలగించండి
  8. వేరైన?ముఖ్య మంత్రులు
    దారాళపు చంద్రులైన?”తలసరికోటా
    జేరిన?పిల్లుల వలెమా
    పోరాటముకానరాదు|పొంతన గుదురున్.

    రిప్లయితొలగించండి
  9. పిల్లులు తమ పిల్లలతో
    చల్లగ నట మేత దినుచు సంతోషముగ
    న్నెల్లరకువిందు జేయుచు
    కల్లతనము లేక నవియె కలిసుండెనుగా!!!

    రిప్లయితొలగించండి
  10. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఓ ప్రబుద్ధుని నిర్వాకం.....

    పిల్లి యెదురయ్యెనని తా
    తల్లట పడ! చచ్చె నదియె! తనఁగూడ సిరుల్!
    యుల్లాసము వెలయించిన
    పిల్లులకాశ్రయమిదెనట వీక్షించగదే!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి