13, జులై 2015, సోమవారం

సమస్యా పూరణము - 1729 (రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్.
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

29 కామెంట్‌లు:

  1. రామాయణమందునడచి
    రాముఁడు రావణుని - మెచ్చి రాజ్యం బొసఁగెన్
    ప్రేమగ విభీషణునికిన్
    కోమలి జానకిని వెంట గొనిపోయెగదా!

    రిప్లయితొలగించండి
  2. ధీమతి రావణు వైరము
    రామునితోఁ జూడ మోక్ష రాజ్యము కొఱకే
    ఆ మది తెలిసిన వాడై
    రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్!!

    రిప్లయితొలగించండి
  3. ఆ మండోదరి కలగనె
    కామాంధుడనైతి పాహి కరుణించుము నన్
    నీ మానిని చేగొను మన
    రాముడు రావణుని మెచ్చి రాజ్యంబొసగెన్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విభీషణునకున్’ అనండి.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మోక్షసామ్రాజ్య మిప్పించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    విరుపుతో, మండోదరి స్వప్న వృత్తాంతంతో మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘విభీషణుకు’ అనడం దోషమే. ‘ప్రేమ విభీషణునకు సు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. ఏమీ తెలియని రయితట
    రామాయణము వినగోరి రాముని గుడికిన్
    నీమము తప్పక వినుచును
    రాముడు రావణుని మెచ్చి రాజ్యం బొసగెన్

    రిప్లయితొలగించండి
  6. ఆ మండోదరి కలగనె
    కామాంధుడనైతి పాహి కరుణించుము నన్
    నీ మానిని చేగొను మన
    రాముడు రావణుని మెచ్చి రాజ్యంబొసగెన్

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదాన్ని ‘నీమము దప్పక విని యనె’ అంటే బాగుంటుందేమో!

    రిప్లయితొలగించండి
  8. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. సోమముతో తునుమాడెను
    రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బొసగెన్
    క్షేమము గాపాలించగ
    సీమను కైకసి సుతునకు స్థిరచిత్తముతో

    రిప్లయితొలగించండి
  10. భీమ సమరమున జంపెను
    రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బొసగెన్
    ప్రేమగ విభీషణునకే
    సామమ్మున సకల జనులు శాంతిని బొందన్

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. నామము నడగించె ననిని
    రాముఁడు రావణుని, మెచ్చి రాజ్యం బొసఁగె నా
    రాముని శరణార్థకి యా
    ధీమంత విభీషణునకు దివిజులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  13. రాముని గాధను వినకను
    రాముని నామంబు మఱియు రాముని గూర్చి
    న్నేమఱచియు ని ట్లు పలికె
    రాముడు రావణుని మెచ్చి రాజ్యం బొసగెన్

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శరణార్థికి నా...’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గూరి న్నెమఱచి’ అనడం దోషమే. ‘రామౌన్నత్యం| బేమఱచియు...’ అందామా?

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    1) పామరుడు కలగని బలికె
    "రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్;
    కోమలిని బట్టి వెంటనె
    కామాంధుడు చెఱచు నేటి కాలమునందున్!"

    2) కాముకుడని యని దునిమెను
    రాముఁడు రావణుని; మెచ్చి రాజ్యం బొసఁగెన్.
    సామమున విభీషణుడన
    రాముడె నారయణుడని రక్తిని గొలుపన్

    రిప్లయితొలగించండి
  16. గురువు గారికీ నమస్కారములు పూర్వం నేను ప్రచురించిన రెండు పద్యాలలో ఒకటి అదృశ్యమైనందున తిరిగీ ప్రచురిస్తున్నందులకు క్షమించాలి.....

    సౌమిత్రి గూడి కూల్చెను
    రాముడు రావణుని, మెచ్చి రాజ్యం బొసగెన్
    ప్రేమ విభీషణుని సు
    క్షేమం బుగపాలనంబు చేయుమటంచున్

    రిప్లయితొలగించండి
  17. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీరే నన్ను మన్నించాలి. ఒక వ్యాఖ్యను తొలగించబోయి పొరపాటున మీ వ్యాఖ్యను తొలగించాలి.

    రిప్లయితొలగించండి
  18. ఏమీవిచిత్ర దృశ్యము
    రాముడు రావణుని మెచ్చి రాజ్యంబొసగెన్
    ప్రేమయు తనలోదాగగ?
    కామంబునసూర్పణఖకు కలలో జరిగెన్

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. ఏమని నుడివెద మావిధి
    నీమము లెవ్వియొ తెలియగ నేరము, ఖలుడా
    కామాంధు డసుర జగదభి
    రాముడు రావణుని, మెచ్చి రాజ్యంబొసగెన్

    రిప్లయితొలగించండి
  21. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    రాక్షస జగత్తుకు అభిరాముడైన రావణుని మెచ్చి ఒక ఖలుడు రాజ్య మిచ్చాడనే భావంతో పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    ఇది నేను అర్థం చేసుకున్నది... భావాంతర మేదైనా ఉందా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విధి నియమాలు మనకు తెలియవు, అది రాక్షసులకభిరాముడైన ఖలుడైన రావణుని రాజును చేసిందని నా భావం

      తొలగించండి
  22. సీత హృదయ సామ్రాజ్యము రామునకొసంగినదను భావంతో:
    సోముని విలుఁ గొని మించగ
    రాముడు రావణుని, మెచ్చి రాజ్యమొసంగెన్
    భామామణి హృదయమ్మున
    ప్రేమాస్పద కల చెదరక వేడుకఁ జేయన్!

    రిప్లయితొలగించండి
  23. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  24. కామిత హరి రాజ్యంబునుఁ
    బ్రేమనుఁ గాయంగఁ గోరి వేగిర పడఁగన్
    భీమాజి డిందఁ జేసియు
    రాముఁడు రావణుని మెచ్చి రాజ్యం బొసఁగెన్!

    రిప్లయితొలగించండి
  25. గుండు మధుసూదన్ గారూ,
    వైకుంఠప్రాప్తిని గోరిన ద్వారపాలకుని విష్ణువు మన్నించిన విషయంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి