5, జులై 2015, ఆదివారం

పద్య రచన - 951

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. భరతుడు పసితన మందున
    నిరతము జంతువుల తోడ నిర్భయ ముగతా
    దిరుగుచు కౄర మృగమ్ముల
    సరిగొని మురియంగ నతడు సాహస మందున్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. చిత్ర మయ్యది జూచియు జెప్పు చుంటి
    భరతు డా తడు శౌర్యుడు బాల్య మందె
    క్రూర మృగముల తోడను దైర్యముగను
    నాడు చుండెడి వాడుగా నర్ధ మయ్యె

    రిప్లయితొలగించండి
  4. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో యతిదోషం. ‘క్రూరమృగములతోడను కొంకకుండ’ అందామా?

    రిప్లయితొలగించండి
  5. భరత మున బుట్టి నాడుర
    భరతమునే బట్టినాడు పసితనమందే
    భరతుడు సింగమ్ముల, నిట
    భరతుని గనగాను " బట్ట బయలాయె " గదా !

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సోదరి రాజేశ్వరిగారూ!

    మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు.

    కాని, "కౄర" శబ్ద మసాధువు. దానిని "క్రూర" యని సవరించఁగలరు. అన్యధా భావింపవలదని మనవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులతో...

    అలరుఁ బుట్టువుననె యామోద మందించు
    చందముగను భరతుఁ డందముగనుఁ
    జిత్రమైన రీతి సింగంపుఁ గొదమలఁ
    జేతఁ బూని యాడెఁ, జిఱుత యతఁడె?

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    అక్కయ్యగారి పద్యంలో ‘కౄర’ శబ్దాన్ని నేను గమనించలేదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:సకల మృగము లణచి సాహసోపేతుడై
    బలము జూపినట్టి బాలుడితడు
    సకల మునులు మెచ్చి సర్వదమనుడనన్
    వాసికెక్కె నితడు వసుధ యందు.

    రిప్లయితొలగించండి
  11. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. భరత కీర్తి నిలిపె బాలుడు భరతుడు
    సింహబలుడు చూడ-చిన్నవాడె|
    పులిని చేతబట్టి నిలిపెను తల్లిని
    భయము నెరుగనట్టి భరతు డౌర|
    2.బట్టలు లేని బాల్యమున “బట్టెను సింహపు పిల్ల నెంచియే
    చుట్టపు రీతి జుచుగద-చోద్యము గాదట సింహ ముండియున్”|
    పట్టు దలందు నే-భరతభావననెంచగ?వింతగాదటే|
    పుట్టుక యందెవీరుడిగ బుట్టెను భారత కీర్తి నిల్పగన్|

    రిప్లయితొలగించండి
  13. నమస్కారములు
    సవరించిన సోదరులకు ధన్య వాదములు .
    నేను రాసేటప్పుడే అనుకున్నాను .కానీ గురువులు బాగుంది అనగానే రాయచ్చునేమో అనుకుని సమర్ధించు కున్నాను . సందేహం తీర్చి నందులకు సోదరు లిరువురికీ కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  14. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. భరతుడు.......
    దైవ తపోశక్తుల సుత
    చేవఁగలుగు రాజుఁగూడ జీవము దాల్చన్
    కోవందెల్పగ తరమే?
    జీవులఁ బులి సింహమనుచు పోల్చునె యాడన్!

    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘సుత, కోవం దెల్పగ’....?

    రిప్లయితొలగించండి
  17. గురుదేవులకు ధన్యవాదములు.
    సుత=పుత్రిక
    కోవం దెల్పగ= వంశానుక్రమము దెలుపగ.
    అన్వయలోపమా? అర్థం లో లోపమా? తెలియజేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  18. సహదేవుడు గారూ,
    ‘కోవ’ అంటే అర్థం కాక అడిగాను. ఇప్పుడు అర్థమయింది. సంతోషం!

    రిప్లయితొలగించండి
  19. బాలుడొకడు సింహబలుడుగా పేరునుఁ
    గాంచెనన్న వాడె గా భరతుడు,
    దివ్యభూమినేలు దేవాంశ గలవాడు,
    తల్లిదండ్రి ముద్దు తనయుడతడు.

    రిప్లయితొలగించండి
  20. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు ధన్యవాదములు. చివరిపాద సవరణతో:
    దైవ తపోశక్తుల సుత
    చేవఁగలుగు రాజుఁ గూడ జీవము దాల్చన్!
    కోవం దెల్పగ తరమే?
    జీవులఁ బులి సింహమంచు చేవదలకనే!

    రిప్లయితొలగించండి
  22. బాలు డైన నేమి భరతుని శౌర్యంబు
    తలచు కొనిన చాలు తనివి తీర
    ఒడలు పులక రించు నూహమాత్రముచేత
    భరత కీర్తి కతడు భాగ్య జ్యోతి

    రిప్లయితొలగించండి
  23. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి