అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, నిజమే! నేను గమనించలేదు. ధన్యవాదాలు. **** సుమలత గారూ, మీ పద్యం రెండవపాదంలో యతిదోష నివారణకు ‘వీణ మీటు సామి వినతి సేయ’ అని సవరించండి.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటిపద్యంలో ‘శారదామాతృకృప’ అని సమాసం చేయవలసి ఉంది. అక్కడ ‘శారద తల్లిగ కృపతో’ అనండి. రెండవపద్యంలో ‘మూర్తిత్రయమ్ముకు’ అనరాదు. ‘మూర్తిత్రయమ్మునకు’ అని ఉండాలి. అక్కడ ‘ముగురు మూర్తులకును ముందు నుండు’ అనండి. ‘బహుమతి+అయ్యు’ అన్నపుడు యడాగమం వస్తుంది.అక్కడ ‘బహుమతులుగ’ అందామా? ***** మిస్సన్న గారూ, మనోహరమైన పద్యాల నందించారు. అభినందనలు, ధన్యవాదాలు. ***** సహదేవుడు గారూ, సంతోషం! ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యాలు చాల బాగున్నవి. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. (మీరు ఒకే పద్యాన్ని తరచుగా రెండు మూడు సార్లు పోస్ట్ చేస్తున్నారు) ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘స్మరిస్తు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దేవదేవు స్మరించుచుఁ దిరుగువాఁడు’ అనండి.
నలువకు మానస పుత్రుడు
రిప్లయితొలగించండినిలువక లోకముల నన్ని నెమ్మిని దిరుగన్
చెలిమిగ వార్తలు దెలుపుతు
కలతలు రేపంగ దివిజ కలహా సనుడౌ
ఇంతకుముందెప్పుడో వ్రాసినది, చిత్రానికి సరిపోతున్నదని.....
రిప్లయితొలగించండితప్పులున్న దయచేసి తెలుపగలరు.
జగతి మేలు కోరి జగడాలు కల్పించు
మహతి మీటు సామి వినతి సేయ
నాకృతులను దాల్చు నాపద్ధర్మంబున
వికృతములను ద్రుంచ విశ్వ ధారి
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఆపద్దర్మంబున’ అన్నచోట గణదోషం. ‘ఆకృతులను దాల్చునట్టి యాపద్ధర్మ| వికృతములను...’ అందామా?
లోక కళ్యాణమును గోరి తేకువగను
రిప్లయితొలగించండిదేవ దానవ మిత్రుడౌ దివ్య మౌని
తిరుగు చుండు లోకములను తీరుగాను
శౌరి జపమును చలుపుచు సంతతమ్ము
సుమలతగారి పద్యం రెండవపాదంలో యతిమైత్రిని సవరించాలి.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
నిజమే! నేను గమనించలేదు. ధన్యవాదాలు.
****
సుమలత గారూ,
మీ పద్యం రెండవపాదంలో యతిదోష నివారణకు ‘వీణ మీటు సామి వినతి సేయ’ అని సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినారాయణ నామమ్మును
రిప్లయితొలగించండిపారాయణ జేసి నంత నారదు డందెన్
వారాశిఁ బోలు జ్ఞానము,
గౌరవ మొనగూర్చ లోక కళ్యాణమ్మున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. ‘పారాయణ జేసినంత బ్రహ్మజు డందెన్’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినారాయణ నారాయణ
రిప్లయితొలగించండినారాయణ యనుచు దిరుగు నవ్వుచు నీతం
డీరేడు లోకములలో
నారదుడని పేరు జ్ఞాని నలువకు సుతుడున్.
కలహప్రియు డనుకొందురు
కలహములే తిండి యనుచు కసురుదు రయ్యో
కలహము పర్యవసానము
నలువురకును హితము గూర్చు నారద కృతమై.
పదునారు సద్గుణమ్ముల
కుదురుగ ధర మెలగువాడు కోదండ ధరుం
డిది చెప్పె నాదికవికిని
విదితముగా వ్రాయ రామవిభు కథ నతడున్.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండినారాయణ నామమ్మును
పారాయణ జేసి నంత బ్రహ్మజు డందెన్
వారాశిఁ బోలు జ్ఞానము,
గౌరవ మొనగూర్చ లోక కళ్యాణమ్మున్!
ఆ.వె:కలహమె యశనంబుగ దిరుగు చుండెడి
రిప్లయితొలగించండిదేవ మౌని యితడు దివిజ బంధు
తంపు బెట్టి సాగు తగవుల మునియని
ఖ్యాతినందినట్టి కలహప్రియుడు.
విశ్వంభరు కీర్తించుచు
రిప్లయితొలగించండివిశ్వ రహస్యముల దెల్పు వీణాధరుడీ
విశ్వాత్ముని సూను౦డగు
శాశ్వత పథికు౦డత౦డు సచ్చరితు౦డున్
2.నారాయణు నామమ్ముల
పారాయణ జేసివిష్ణు పాదమ్ములనే
నారాధించుచు భక్తిని
నీరాజన మిచ్చి పాడి నిగుడి౦చు నిలన్
3.కలహమ్ములు పెట్టుచును స
కలజీవుల యహమడ౦చి జ్ఞానము కలుగన్
వెలయించును హరినామము
కలిలో సాధించ జనులు కైవల్యమ్మున్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘శారదామాతృకృప’ అని సమాసం చేయవలసి ఉంది. అక్కడ ‘శారద తల్లిగ కృపతో’ అనండి.
రెండవపద్యంలో ‘మూర్తిత్రయమ్ముకు’ అనరాదు. ‘మూర్తిత్రయమ్మునకు’ అని ఉండాలి. అక్కడ ‘ముగురు మూర్తులకును ముందు నుండు’ అనండి. ‘బహుమతి+అయ్యు’ అన్నపుడు యడాగమం వస్తుంది.అక్కడ ‘బహుమతులుగ’ అందామా?
*****
మిస్సన్న గారూ,
మనోహరమైన పద్యాల నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
*****
సహదేవుడు గారూ,
సంతోషం!
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు చాల బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితిరుగుచు ముల్లోకములను
రిప్లయితొలగించండిహరిగీర్తన పరిఘటించు ననిమిషమునియే
నిరతము మహతిని మీటెడు
సురమౌనికి ప్రణతులిడెద సుస్థిర భక్తిన్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలహ భోజనుండుకలహ కారణుండు
రిప్లయితొలగించండిమూడు లోకము లెప్పుడు ముదముతోడ
దేవ దేవుని స్మరియిస్తు తిరుగు వాడు
బ్రహ్మ మానస సుతుడు నా రదుడతండు.
దేవ ఋషిగ కీర్తి దేవదానవమైత్రి
రిప్లయితొలగించండిపొందినట్టి ధాత పుత్రుడతడు
మహతి చేత బట్టి మధురగానము తోడ
హరిని కొలుచు చుండు అనవరతము
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
(మీరు ఒకే పద్యాన్ని తరచుగా రెండు మూడు సార్లు పోస్ట్ చేస్తున్నారు)
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘స్మరిస్తు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దేవదేవు స్మరించుచుఁ దిరుగువాఁడు’ అనండి.
గురువు గారికి నమస్కారములు నేను ఒకేసారీ చేస్తున్నానండీ ఎందుకోమరీ ఎక్కువసారులు ప్రచురిత మౌతుంది ఫోన్ లో ఏదో లోపమొమో అర్థం కావడం లేదు
తొలగించండిగురువు గారికి నమస్కారములు నేను ఒకేసారీ చేస్తున్నానండీ ఎందుకోమరీ ఎక్కువసారులు ప్రచురిత మౌతుంది ఫోన్ లో ఏదో లోపమొమో అర్థం కావడం లేదు
తొలగించండినారాయణ మంత్రమ్మును
రిప్లయితొలగించండిధారాళము గాను మహతి తంత్రులు గదుపన్?
శారద తల్లిగ కృపతో
పారాయణ,నారదుడికిభక్తియు నొసగెన్|
2,లోకసంచారిగా|లోకోద్దరణుడిగా
-----నారదతంత్రమ్ము నక్కియుండు|
కలహాల ప్రియుడిగా |ఫలితాల మయుడిగా
-----మంచిని జేకూర్చు మమతలుండు|
రాక్ష సత్వము మాన్పి రాగల నష్టాలు
-----దీర్చు నుపాయంబు దీక్ష లుండు|
వరగర్వ పరులకు కరుణయు లోపించ?
-----మూర్తి త్రయమ్మునకు ముందు యుండు|
మహతిమీటగ?కళ్యాణ భహుమ తులుగ
తోడి,బిలహరి,మోహన జోడి గాగ|
రాగరంజిత భక్తి వైరాగ్యమందు
నారదుండెంచు హరిభక్తి నాదమాయె|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధన్యవాదములు గురువు గారు, మిస్సన్న గారు.....
రిప్లయితొలగించండిగమనించలేదు తెలిసిన తప్పులని కూడా....చేసే 20 పనులలో, మధ్యలో పద్యము రాయలనే తాపత్రయం ఒకటి....మన్నించగలరు.
జగతి మేలు కోరి జగడాల గల్పించు
మహతి మీటు సామి మనవి సేయ
నాకృతులను దాల్చు నవసర వేళలన్
వికృతములను ద్రుంచ విశ్వ ధారి