వసంత కిశోర్ గారూ, రాముడు బంగారుజింకకు తీసుకువచ్చినట్టుగా ఊహాలోకంలో విహరిస్తున్న సీత విషయంగా నేను పూరణ చేయాలనుకున్నాను. ముందుగా మీరే ఆ పని సమర్థంగా చేశారు. చక్కని పూరణ. అభినందనలు.
రాముని సామర్థ్యము పై యిసుమంతైనా సందేహం లేని సీత తప్పకుండా స్వర్ణమృగమును రాముడు తెచ్చుననీ దానిని పట్టుకొని తాను ముద్దాడుదు నని ఊహలలో మునిగిన సమయాన "హా సీతా హా లక్ష్మణా " యని పతి యార్తరావము వినిపింప వాస్తవము గమనించిన సందర్భము :
దువ్వూరి రామమూర్తి గారూ, ఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘లేడి+అని’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మాయలేడిగ నెఱుగక మనసు...’ అనండి.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె ననుచు కమ్మని కలగను నవనిజాత అయ్యె-హాసీత|హా లక్ష్మణా యటన్న ఆర్త నాదము విని వికలాత్మ యయ్యె ---------------------- శ్రీకే.యస్ గురుమూర్తి గారి పూరణం జులై 04, 2015 2:02 [PM]
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో ‘సువర్ణమయపు స్వర్ణమృగ’మన్న చోట పునరుక్తి ఉన్నది. రెండవపూరణలో ‘వర్ణలేడి’ అన్నది దుష్టసమాసం. ‘వర్ణమృగము’ అనండి. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మహితనూజను’లో ‘ను’ తప్పిపోవడం టైపాటనుకుంటాను.
పందెమట్లుగ పోటీలు పొందుబరచ? ఉంచుసమయానికే ముందు నుంచుటాయె| స్వర్ణ కారుడుగూర్చె-విశ్వాసమందు స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె| 2.కోర్కె లందించు నాశకు కొదవ లేదు స్వర్ణ మృగమును రాముడు పట్టితెచ్చె అనెడి యూహలుసీతమ్మ నందుకొనగ? పర్ణ శాలన దిరిగెను వర్ణ-మృగము.
వేడుకపడగా జానకి - వెంబడించె
రిప్లయితొలగించండిస్వర్ణ మృగమును రాముడు - పట్టి తెచ్చె
నా యయోనిజనా రావణాసురుండు
దుష్టబుద్ధితో లంకకు దొంగవలెను
భార్య కోరిక దీర్చెడి భర్త గాను
రిప్లయితొలగించండివెతల నెఱుగక మారీచు వెంట నంటె
స్వర్ణ మృగమును రాముఁడు , పట్టి దెచ్చె
సాద్వి సీతను రావణు సంత సముగ
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రావణు’ అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. ‘దనుజుడు సంతసమున’ అనండి.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిరాముడు బంగారుజింకకు తీసుకువచ్చినట్టుగా ఊహాలోకంలో విహరిస్తున్న సీత విషయంగా నేను పూరణ చేయాలనుకున్నాను. ముందుగా మీరే ఆ పని సమర్థంగా చేశారు.
చక్కని పూరణ. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
రాముని సామర్థ్యము పై యిసుమంతైనా సందేహం లేని సీత తప్పకుండా
స్వర్ణమృగమును రాముడు తెచ్చుననీ దానిని పట్టుకొని తాను ముద్దాడుదు
నని ఊహలలో మునిగిన సమయాన "హా సీతా హా లక్ష్మణా " యని పతి
యార్తరావము వినిపింప వాస్తవము గమనించిన సందర్భము :
01)
_________________________________
ఊహలలో మునిగిన సీత :
స్వర్ణమృగమును రాముఁడు - పట్టి తెచ్చె
ననుచు లక్ష్మణు డరచిన - నాత్రపడుచు
పరుగు పరుగున వెలువడి - పర్ణశాల
మురిసి మృగమును జానకి - ముద్దులిడుచు
వాస్తవమున సీత :
నున్న సమయాన వినిపించె - నువిద కంత
నార్తరావము పతినోట - నాపదనుచు !
తల్లడిల్లుచు లక్ష్మణు - దరిమె నంత
నన్న మాటలు కావవి - యన్న వినక !
_________________________________
శంకరార్యా ! శుభోదయము మరియు ధన్యవాదములు !
రిప్లయితొలగించండిశంకరార్యా ! మీ ఆలోచనను నేను తస్కరించ లేదు గదా ?
రిప్లయితొలగించండిశంకరార్యా ! ఈ సరికే మీ పూరణ సిద్ధమైతే - మాకూ వినిపించొచ్చు గదా !
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ కోరికపై నా పూరణ.....
తన మనోరథ మీడేర్చ చనియు వేగ
స్వర్ణమృగమును రాముఁడు పట్టి తెచ్చె
ననుచు నూహలలో మున్గె నవనిజాత
కలలు కల్ల లౌనని యెఱుంగని లతాంగి.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ నిస్సందేహంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
"ప్రేమలత"తనపతి"రాము"గోరుకొనెను
రిప్లయితొలగించండిస్వర్ణమృగమునౌర!బహుమతిగను
మెచ్చి మదిని "స్వర్ణమృగమునురాముడు
పట్టితెచ్చె"చేత కొట్టున గొని.
మాయ లేడని యెరుగక మనసు పడిన
రిప్లయితొలగించండిసీత కోరిక దీర్చగ ప్రీతి తోడ
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
దనని వెంబడించుచు వేగ తరలె నతడు!!!
దువ్వూరి రామమూర్తి గారూ,
రిప్లయితొలగించండిఆటవెలదిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘లేడి+అని’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘మాయలేడిగ నెఱుగక మనసు...’ అనండి.
కర్ణు డన్నయగును కుంభ కర్ణు నకును
రిప్లయితొలగించండిస్వర్ణ మృగము రాముడు పట్టి దెచ్చె
పరశురాముడు రాముని భ్రాత యగును
అనున వెల్లన సాధ్యము లైనవి గద
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మృగమును’లో ‘ను’ టైపాటువల్ల తప్పిపోయింది.
స్వర్ణమృగమును రాముఁడు పట్టి తెచ్చె
రిప్లయితొలగించండిదనని పరుగెత్తుచున్నట్టి దానివెంట
వెడలి పోయె నదునుగని భిక్ష వేష
దారి యైవచ్చి సీతను తత్క్షణంబె
ఎత్తుకొని రావణాసురుండేగె లంక
అవనిజాత కోరిక దీర్చగ వెనుదగిలె
రిప్లయితొలగించండిఅడవిదారిన పారిన యసురకృతక
స్వర్ణ మృగమును రాముడు.పట్టి తెచ్చె
రక్ష లేనట్టిసీతను రావణుండు
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
రిప్లయితొలగించండిననుట సరిగాదు మారీచు డ దియ ,మారి
యటుల ,మాయను గల్పించి యాయమ పుడ
మి దుహిత నపహరింప గ నదను జూచి
తే.గీ: పసిడి జింకను గోరెనా పడతి సీత
రిప్లయితొలగించండిస్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
ద ననుచు కదిలె,వలదని తమ్ము డన్నఁ
వినక దుష్టుని/మారీచు శిక్షింప వెడలె తాను
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
రిప్లయితొలగించండిననుచు కమ్మని కలగను నవనిజాత
అయ్యె-హాసీత|హా లక్ష్మణా యటన్న
ఆర్త నాదము విని వికలాత్మ యయ్యె
----------------------
శ్రీకే.యస్ గురుమూర్తి గారి పూరణం
జులై 04, 2015 2:02 [PM]
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘సువర్ణమయపు స్వర్ణమృగ’మన్న చోట పునరుక్తి ఉన్నది.
రెండవపూరణలో ‘వర్ణలేడి’ అన్నది దుష్టసమాసం. ‘వర్ణమృగము’ అనండి.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రీతిఁ గలిగించ సీతకు, వెదుకఁ బోయె
రిప్లయితొలగించండిస్వర్ణ మృగమును రాముడు, పట్టి తెచ్చె
రాక్షసాధముండట కొక భిక్ష పాత్ర
మరణ కబళము నందగ మాత కడకు.
శంకరార్యా ! మీ పూరణ చక్కగా నున్నది !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గురుదేవులకు ధన్యవాదములు. చిన్న పొరబాటును సవరించేలోగా మీ సమీక్ష జరిగిపోయింది.
రిప్లయితొలగించండిశ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిపడతి కోర్కెను దీర్చగ బట్ట నేగ
స్వర్ణమృగమును రాముఁడు, పట్టి తెచ్చె
నడవి నొంటరి వైదేహి నసురరాజు ;
రావణుని జంపె రఘుపతి గావ నామె
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె
రిప్లయితొలగించండిననుచు కలలను కనుచుండ నడవిలోన
రావణాసురు డేతెంచి రయముగాను
మహితనూజఁగొనిపోయె మాయతోడ
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మహితనూజను’లో ‘ను’ తప్పిపోవడం టైపాటనుకుంటాను.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండి(బంగరు జింకనుఁ దెచ్చుట కేఁగిన రామునిం గూర్చి సీత తన మనస్సున వితర్కించిన సందర్భము)
"స్వర్ణ మృగమును రాముఁడు పట్టి తెచ్చె
నా, మదీయ హృదయమున హర్షమెసఁగుఁ!
దేక పోయెనా, మదిని భ్రాంతియు నణంగు!
నేమి యైనను నేను గ్రహింతు నిపుడు!!"
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండివైవిధ్యమైన మీ పూరణ అలరింపజేసింది. అభినందనలు.
పందెమట్లుగ పోటీలు పొందుబరచ?
రిప్లయితొలగించండిఉంచుసమయానికే ముందు నుంచుటాయె|
స్వర్ణ కారుడుగూర్చె-విశ్వాసమందు
స్వర్ణ మృగమును రాముడు పట్టి తెచ్చె|
2.కోర్కె లందించు నాశకు కొదవ లేదు
స్వర్ణ మృగమును రాముడు పట్టితెచ్చె
అనెడి యూహలుసీతమ్మ నందుకొనగ?
పర్ణ శాలన దిరిగెను వర్ణ-మృగము.
పడతి కోరిక వినినంత భారమనక
రిప్లయితొలగించండివిల్లు బాణముల్ చేగొని వెంబడించె
స్వర్ణ మృగమును రాముడు, పట్టి తెచ్చె
నంత సీతను మోసాన యసుర రేడు
పడతి కోరిక వినినంత భారమనక
రిప్లయితొలగించండివిల్లు బాణముల్ చేగొని వెంబడించె
స్వర్ణ మృగమును రాముడు, పట్టి తెచ్చె
నంత సీతను మోసాన యసుర రేడు
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.