9, జులై 2015, గురువారం

సమస్యా పూరణము - 1725 (కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.

38 కామెంట్‌లు:

 1. సుమములు మొత్తము వనమున
  కమలాప్తుని రశ్మి సోకి కమలె - గమలముల్
  విమలముగావికసించెను
  రమణీయమ్మగు సరసున రవికిరణముచే

  రిప్లయితొలగించండి

 2. తమబడి ముగియుట రావ మ
  నుమలింటికి, గాంచి తాత నొవ్వుచు బల్కెన్
  క్షమ వేసవిలో బడులే?
  కమలాప్తుని రశ్మి సోకి కమిలెఁ గమలముల్.

  [క్షమ =భూమి]

  రిప్లయితొలగించండి
 3. అమరేం ద్రునివన మందున
  కమలాప్తుని రశ్మి సోకి కమిలెఁ, గమలముల్
  రమణీయ మైన తటమున
  గమకముగా విరిసె నంట కన్నుల విందౌ

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది, కాని అమరేంద్రుని వనంలో కమలినవి ఏమిటి?

  రిప్లయితొలగించండి
 5. తమవాడే నాయకుడిక
  తమ కడ్డే మున్నదనుచు తంత్రము నడుపన్
  తమ కరముల సంకెల లయె!
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్!

  రిప్లయితొలగించండి
 6. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. అమరేంద్రుని వనమందున
  గమకముగా విరిసె నంట కన్నుల విందౌ
  రమణీ యమైన తటమున
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్

  గురువులు క్షమించాలి
  ఇలారాస్తే బాగుంటుందేమొ అని

  రిప్లయితొలగించండి
 8. అక్కయ్యా,
  ఇప్పుడు మీ పద్యం బాగుంది. సంతోషం.

  రిప్లయితొలగించండి

 9. కమలాక్షి కుంతి మోమున
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్
  ద్యుమణి శోభితమౌ యా
  కమలాంగికి గర్భమందు కర్ణుడు పుట్టెన్

  రాంభట్ల వేంకటరాయ శర్మ

  రిప్లయితొలగించండి
 10. కమలమును వీడి నలములు
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ , గమలముల్
  కమనీయముగా విరిసెను
  జమునయ్యనుగని సరసున సమ్మోదముగన్!!!


  కమలము= నీరు
  నలములు= కమలములు

  రిప్లయితొలగించండి
 11. విమతౌద్ధత్యవ్యగ్రత
  సమరోగ్రసరభసగమన సామ్యము నొప్పన్
  అమలినమని యామాద్మీ
  కమలాప్తుని రశ్మి సోకి కమలె కమలముల్

  రిప్లయితొలగించండి

 12. తమ పదవిని కోల్పోవగ
  కుమతి యనుచు నాయకునకు కుత్స లభింపన్
  కమలిని నీటిని వీడిన
  కమలాప్తుని రశ్మి సోకి కమలె కమలముల్

  రిప్లయితొలగించండి
 13. కం:కమలారిని జూచినయా
  కమలములు ముడుచుకొనియెను;కాంతుని కరముల్
  తమకున్ తాకగ వెంటనె
  కమలాప్తుని రశ్మిసోకి కమలె కమలముల్

  రిప్లయితొలగించండి
 14. సోమపు ధామము వీడిన
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్
  తమతమ నెలవులు తప్పిన
  తమ నేతయె ముప్పు నీకు తప్పక చేయున్

  రిప్లయితొలగించండి
 15. అమృతుని తలమంటి తిరుగు
  కమలాప్తుని రశ్మి సోకి కమిలెఁ గమలముల్!
  రమణీయతనందు నవే
  తిమిరారి తొలివలపుఁగొని దినమంతటయున్!

  రిప్లయితొలగించండి
 16. కమలములు ప్రియుని కన్నులు,
  రమణీయంబనియు, వగచె రామ' కటకటా!
  కుముదపు చెలుడేతెంచడొ,
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్. '

  రిప్లయితొలగించండి
 17. కమలముల గోసి సంధ్యా
  సమయంబున దైవ పూజ సలిపెద నని యా
  సుమముల తటిపై నుంచగ
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్

  రిప్లయితొలగించండి
 18. నిన్నటి పూరణ

  స్తంభమ్ము వంటి వాడను
  రంభా నిను గోరుచుంటి ప్రణయము సలుపన్
  సంభావించెద రమ్మిక
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

  రిప్లయితొలగించండి
 19. ద్యుమణీ ప్రతాప మందున
  ప్రమదొక్కతి కానలందు పతికై వెదకన్
  కమలాక్షి మోము వడలెను
  కమలాప్తుని రశ్మి సోకి, కమలె గమలముల్

  రిప్లయితొలగించండి
 20. కమలములు పాలవెల్లికి
  కమనీయముగాను గట్టగానుదయానన్
  సమయము మించగ నౌరా!
  కమలాప్తుని రశ్మిసోకి కమలె గమలముల్ .

  రిప్లయితొలగించండి
 21. కమలధరుకు స్వాగతమిడ
  కమలిని యందించు ధవళ - కమలపు కాంతుల్
  రమణీయపునరుణిమలయె
  కమలాప్తుని రశ్మి సోకి కమలె కమలముల్
  (కమలిని= తామర కొలను)
  (కమలు- ఎఱ్ఱబడు)

  రిప్లయితొలగించండి
 22. గురుదేవులకు ప్రణామములు. రెండవపాదంలో సవరణతో :
  అమృతుని తలమంటి తిరుగు
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్!
  రమణీయతనందు నవే
  తిమిరారి తొలివలపుఁగొని దినమంతటయున్!

  రిప్లయితొలగించండి
 23. కమలా దెచ్చిన యందపు
  కమలాలను కట్టిబెట్టి గమనించితివా?
  కమలపులందముజూడగ?
  కమలాప్తుని రశ్మి సోకి కమలె గమలముల్|
  2.అమరిక సరిగా లేదట
  కమలాప్తుని రశ్మి సోకి కమలెగ గమలముల్
  సుమముల సుందరదృశ్యము
  కమనీయత గానరాదు గాంచగ మనకున్|

  రిప్లయితొలగించండి
 24. రాంభట్ల వేంకటరాయ శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. "ద్యుమణి సుశోభితమౌ యా" అనండి.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  దువ్వూరి రామమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సుసర్ల నాగజ్యోతి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  తమిగొని నిశి విరిసి కలువ
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ ; గమలముల్
  తమ ప్రియతమ భాను నుదయ
  సమయమున నరసి మురిసెను సఖియలతోడన్

  రిప్లయితొలగించండి
 27. కమలాక్షుడు కరిగాచెడు
  దమకంబున సతినివీడి ధాటిగ నేగన్
  కమలస్థయు మింట జనగ
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్

  రిప్లయితొలగించండి
 28. కమలా ఫలములు దెచ్చితి
  ని, మరచినానయ్యొ " ఫ్రిడ్జు " నెంచుక బెట్టన్
  యమ యెండలు గాయుటచే
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్

  రిప్లయితొలగించండి
 29. కమలాకరమ్ము లింకగ
  కమలాప్తుని రశ్మిసోకి కమలెఁకమలముల్
  కమలములు విరిసి వృష్టిన్
  ప్రమదము గూర్చెను జనులకు రమణీయముగన్

  రిప్లయితొలగించండి
 30. కమలములే వికసించెను
  కమలాప్తుని రశ్మి శోకి కమలె గమలముల్
  కమలాకరములె యింకగ
  కమలములకు జీవ మవియ కమలాకరముల్

  రిప్లయితొలగించండి
 31. సమముగ వేసవి నడుమున
  క్రమముగ మోడీని మబ్బు క్రమ్ముచునుండన్
  కుమిలెడి వోటరు కోపపు
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్

  రిప్లయితొలగించండి


 32. అమలాపురమమ్మాయిలు
  ఘమఘమలన్ మల్లియల సిగనిజొనుపుచు మా
  ర్గమున నడువన్ జిలేబీ
  కమలాప్తుని రశ్మి సోకి కమలెఁ గమలముల్.

  జిలేబి

  రిప్లయితొలగించండి