15, జులై 2015, బుధవారం

పద్య రచన - 961

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. వక్కల యాకులు సున్నము
    చక్కగ చెలి విడెము జేయ సంతస మందున్
    చెక్కిలి మీటుచు కవులట
    మక్కువతో కవన మల్లె మహనీ యులనన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వక్కలు నాకులు సున్నము’ అనండి.

    రిప్లయితొలగించండి
  3. పోకలనిచ్చట జూడుడు
    పోకుడు మరి వాని వదలి పుక్కిట నిడుచున్
    ఆకుల సున్నము బూసుక
    చేకొనుచును నోట నమల చిక్కగ పండున్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఆకువక్కలు సున్నము నారగించ
    నరిగి పోవును తిన్నది కరము వేగ
    నోటి వాసన హరియించ నీటుగాను
    వీడియమ్ముల నిత్తురు విందులందు

    రిప్లయితొలగించండి
  6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. చక్కని సొగసుల చిన్నది
    పక్కన జేరియు సరసపు పలుకుల తోడన్
    వక్కల నాకుల చిలుకల
    మక్కువతోనందజేయ మధురమె సుమ్మీ

    రిప్లయితొలగించండి

  8. వనితలు జాణలు పురుషుని
    మనసది పోకలుగ నున్న మరు మాడుచు నా
    కున కాచు సున్నములతో
    తినగా ను౦కి౦తు రెపుడు తెలియుము మగడా

    రిప్లయితొలగించండి
  9. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  10. 222.ఆ.వె:ఆకు వక్క లొసగి యాదరించుట వల్ల
    సంప్రదాయము లును సంస్కృతియును
    వ్యక్త మగును గాదె! భక్తితో తాంబూల
    ఫలము లొసగ పుణ్య ఫలము లబ్బు.

    రిప్లయితొలగించండి
  11. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. చెట్టున బుట్టిన వక్కలు
    అట్టుడికిన రాతి సున్న మాకులుతోడై|
    మక్కువగా దిన?మనసున
    చక్కటి ననుభూతి బెంచు సంసారులకున్|
    2.వక్కల నైఖ్యతన్ దుడిపి-పల్చటియాకులురెండుజేర్చి నీ
    ప్రక్కన జేరు భార్య మురిపంబున సున్నము రాసి కిళ్ళినే
    చక్కగ నోటికివ్వ?మనసందున జేరెడి కోర్కె లెన్నియో
    నిక్కము బండు| వక్కలిట నెయ్యము బంచగ?రాత్రి మాత్రయౌ|

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువులకు నమస్కారములు
    ముందు అలాగే ' వక్కలు నాకులు సున్నము " అని వ్రాసి మళ్ళీ ఎందుకో చెరిపేసాను
    ఈ మధ్య బొత్తిగా సందేహలు ఎక్కువ ఐపోతున్నాయి
    పెద్ద ఐపోతున్నాను కదా ! అదన్న మాట అసల్ సంగతి

    రిప్లయితొలగించండి
  15. వక్కల నడకత్తెరలో
    ముక్కలుగా జేసుకొనుచు మురిపెము తోడన్
    వక్కాకున వేసుకొనుచు
    పెక్కురు తినుచుందురిలను వేడుక మీరన్!!!

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పూగీఫలమ్ములేనిదె
    తూగదు తాంబూలమెపుడు దోరగ పండన్!
    సాగరు నల్లుడు లేనిదె
    సాగదు నంతట త్రిమూర్తి సారము నిండన్!

    రిప్లయితొలగించండి
  18. గురువుగారికి నమస్సులు. కె. ఈశ్వరప్ప గారి కందంలో మూడూ, నాలుగు పాదాల్లో ప్రాస తప్పింది. గమనించండి.

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    అన్నపరెడ్డి వారు మీ కందంపద్యంలో ప్రాసదోషాన్ని తెలియజేశారు. నేను గమనించలేదు. మీ పద్యానికి నా సవరణ....
    వక్కలు చెట్టున బుట్టియు
    నక్కజముగ రాతిసున్న మాకులు తోడై
    మక్కువగా దిన?మనసున
    చక్కటి ననుభూతి బెంచు సంసారులకున్|
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ధన్యవాదాలు. సవరించాను.

    రిప్లయితొలగించండి