భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
శాంతితో బ్రతుకవలెను సర్వులనుచు
రిప్లయితొలగించండిసాధువులు గోరుచుంద్రు - సంసార సుఖము
వదలి దేశమంత తిరిగి భక్తులకును
బోధనమ్ములతో మంచి బుద్ధినిచ్చు
వలువ కాషాయమేగట్టి వసుధ యందు
రిప్లయితొలగించండిఆశ్రమాలను నెలకొల్పి యందులోన
అమర సుఖముల బడిసేటి యల్పులైన
సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేష మేయగ సన్యాసి భేష జముగ
రిప్లయితొలగించండిపూజ లందుచు ప్రజలకు మోజు పెంచి
ధనము కూడిన పిమ్మట తరలి పోవు
సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘..బడిసేటి’ని ‘...బడసెడు’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేనకా రమ్ము ప్రేయసీ మెచ్చినాడ
రిప్లయితొలగించండినిన్ను లభియింప సుందరి నిన్ను బోలు
వదలి వైరాగ్య మెంతటి వారలైన
సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము.
సోదరులు మిస్సన్న గారూ ! మీ పద్యం అద్భుతం
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సర్వ సంసార గతికి సంసార గతులు
రిప్లయితొలగించండికాంక్షితము గాన తాము నిష్కాములయ్యు
మాతృ పితౄణ బద్ధులౌ మానవులకు
సాధువులు గోరుచుంద్రు సంసార సుఖము
సకల బంధములను వీడి జనుల సేమ
రిప్లయితొలగించండిమరసి హితబోధ చేయుచు మంచి నెపుడు
సాధువులు గోరుచుంద్రు;సంసార సుఖము
వీడి దేశాలు తిరుగుట వెఱ్ఱి గాదె
విజయకుమార్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సతి సుభద్ర నందగఁ గ్రీడి సాధువాయె!
రిప్లయితొలగించండితారకా సురవధ శూలి తపము మాన్పె
స్వప్రయోజనమున, సృష్టి సంత సించ
సాధువులుఁ గోరుచుంద్రు సంసార సుఖము
Rajeswari akkayya gaariki dhanyavaadamulu.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండివీడి సంసార బంధముల్ జూడవిధిని
సాధువులు గోరుచుంద్రు; సంసారసుఖము.
త్యాగమొనరించి సతతము సాగు వారు
పరమ భక్తిని చేతు రుపాసనలను
నిన్నటి సమస్యకు పూరణ
కౌరవులు పాండవులు సల్పు కయ్యమందు
కోర సాయము పార్ధుడు, తేరు నడుప
మాధవుఁడు సారథి యయె; సుయోధనునకు
తనదు సైన్యము వంతుగా దక్కజేసే
సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము
రిప్లయితొలగించండికన్న మిన్న యైనట్టిమోక్షమ్ము నొంది
జననమరణాల చక్రభ్రమణము లేక
శివుని సామీప్య మందుచు సేవజేయ
రిప్లయితొలగించండిధర్మ పథమున పయనించి ధరణి జనులు
ముక్తి గోరంగ వలెనంచు ముదము తోడ
సాధువులు గోరు చుంద్రు, సంసార సుఖము
వీడి, లోక కళ్యాణ మే వీరి కాంక్ష.
రిప్లయితొలగించండిధర్మ పథమున పయనించి ధరణి జనులు
ముక్తి గోరంగ వలెనంచు ముదము తోడ
సాధువులు గోరు చుంద్రు, సంసార సుఖము
వీడి, లోక కళ్యాణ మే వీరి కాంక్ష.
భక్తి పేరున జనులను భంగపరచి
రిప్లయితొలగించండిమూఢ భోధలు జేయుచు ముంచునట్టి
కొంగ జపమును జేయుచు దొంగలైన
సాధువులు గోరుచుంద్రు సంసారసుఖము!!!
మోసమెరిగిన తంత్రాలమెరుపునందు
రిప్లయితొలగించండిమూడ నమ్మకమందున ముంచ గలిగి
వస్త్ర ధారణయున్నట్టి వన్నెగిలులు
సాధువులు గోరు చుంద్రుసంసారసుఖము
2.స్వార్థ పరు లైన కొందరు సలుపు పనులు
మోస పాశానభక్తిచే ముంచువారె
వ్యసన పరులయ్యు తాంత్రిక పసరు చేత
సాధువులు గోరు చుంద్రు సంసార సుఖము|
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
దార పెట్టెడు బాధల తాళలేక
రిప్లయితొలగించండిమారు మార్గము కనలేక మాఱినట్టి
సాధువులు కోరుచుంద్రు సంసార సుఖము
తనకునచ్చిన పడతుక తారసపడ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.