8, జులై 2015, బుధవారం

పద్య రచన - 954

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. వదలక కొనెదరు జగతిని
  కదళిని శుభమంచు మెండు కాంతా మణులే
  నుదుటను బొట్టును పెట్టుచు
  ముదముగ పర్వముల యందు ముత్తైదు లకున్

  రిప్లయితొలగించండి
 2. అరటి పండ్లు తినిననారోగ్యము కలుగు
  దినమునకొక పండు తినిన చాలు
  తమలపాకులందు తాంబూలముగపెట్టి
  యిచ్చపుచ్చుకొందురింతులిచట

  రిప్లయితొలగించండి
 3. చిత్ర మయ్యది జూడుము చిత్ర ! నీవు
  అరటి పండ్లను బెట్టిరి యమ్ము కొఱకు
  అత్త మొక్కటి గొనిదేవ ?యార గింపు
  జేతు శివునకు ,శుభములు సేయు మనకు

  రిప్లయితొలగించండి
 4. కనుడు కదళీఫ లములిట కదలి వచ్చె
  వినుడు యౌషధ గుణముండు వీటి యందు
  తినుడు తినిన కొలది వీటి తీపి హెచ్చు
  ఘనుడు గణపతి సంప్రీతి కరము లండ్రు

  రిప్లయితొలగించండి
 5. అమ్మలార! యయ్యలార! యారగించ రండహో!
  కమ్మనైన నంటి పళ్లు కళ్ల విందు జేయుచున్
  రమ్మనంచు బిల్చు చుండ ప్రాణమూరకుండునా?
  తిమ్మనమ్ముగూర్చునంచుఁదెల్పినారు పెద్దలున్!

  రిప్లయితొలగించండి
 6. ఫలములారగింపు బలము నవియె పెంచు
  యనెడు వెజ్జు నుడుల ననుసరించి
  బండె డరటి పండ్లు మెండుగా దిన్నను
  జీర్ణ మవక వచ్చజీర్తి నిజము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫలము లారగింపు బలమునవియె పెంచు
   ననెడు వెజ్జు నుడుల ననుస రించి
   బండె డరటి పండ్లు మెండుగాదిన్నను
   నోర్వలేనిబాధ యుదరమందు

   తొలగించండి
  2. ఫలము లారగింపు బలమునవియె పెంచు
   ననెడు వెజ్జు నుడుల ననుస రించి
   బండె డరటి పండ్లు మెండుగాదిన్నను
   నోర్వలేనిబాధ యుదరమందు

   తొలగించండి
 7. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘నీవు+అరటి..’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘చిత్రలేఖ! యరటి...’ అనండి. ‘...బెట్టిరి యమ్ముటకయి’ అనండి.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వినుడు+ఔషధ..’ అన్నపుడు యడాగమం రాదు. ‘వినగ నౌషధ...’ అనండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం పసందుగా ఉంది. అభినందనలు.
  ‘కమ్మనౌ ననంటి...’ అనండి.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘బలము నదియె పెంచు’ అన్నచోట టైపాటు. ‘పెంచు+అనెడు = పెంచు ననెడు’ అవుతుంది, యడాగమం రాదు. ‘తిన్ననూ’ అన్నచోట ‘తిన్నను’ అనండి. ‘తెచ్చు+అజీర్తి = తెచ్చు నజీర్తి’ అవుతుంది. సవరించండి.

  రిప్లయితొలగించండి
 8. పువ్వుల నవ్వులో పుట్టినందుల కేమొ
  ------మకరంద మట్లుగా మధుర ముండు|
  ఇకమత్యమునందు నలరారు నొకచోట
  -----ఒద్దిక ఫలము లై ముద్దుగుండు|
  పసిడి కాంతుల చేత పలకరించక యున్న?
  ------పసిపాపమనసును బట్టుచుండు|
  కుసుమ కోమల మైన కూర్పుల నేర్పున
  ------అమ్మకొమ్మకున్న నరటి గెలలు
  బాల,యవ్వన,వృద్దుల మేలుకొరకు
  తేలికాహార ఫలములై మేలుగుర్చు|
  అరటి యానంద మందించు పెరటి మొక్క
  విందు భోజన మందున పొందు గూర్చు|

  రిప్లయితొలగించండి
 9. శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి వందన
  చందనాలచేనాభావన ఉత్సాహ వృత్తం ఉత్సాహాన్ని
  గలిగించేప్రోత్సాహంగాఉన్నది

  రిప్లయితొలగించండి
 10. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. సహదేవుడు గారూ,
  అది "కమ్మనౌ+అనంటి=కమ్మనౌ ననంటి".

  రిప్లయితొలగించండి
 12. గురువుగారూ!
  అంటి = అరటి
  ఇలా ఆనుకునే మొదట వ్రాశాను.దయతో ఓ మారు మొదటి పద్యాన్ని పరిశీలించ ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 13. పళ్ళులేనియట్టి పండు ముదసలైన
  నడకరాని బాల బుడత డైన
  యవ్వనంబు నింపు ఆశయ జంటైన
  అరటిపళ్ళు తినుట మరువరాదు|

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులు శ్రీ ఈశ్వరప్పగారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 15. సహదేవుడు గారూ,
  మీరు మొదట ‘కమ్మనైన నంటి’ అన్నారు. ‘కమ్మనైన యంటి’ అంటే నేను ఏ సవరణనూ సూచించేవాణ్ణి కాదు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘ముదుసలి+ఐన = ముదుసలి యైన’ అవుతుంది. అక్కడ ‘పండు ముదుసలియు’ అనండి.

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
  అమ్మలార! యయ్యలార! యారగించ రండహో!
  కమ్మనైన యంటి పళ్లు కళ్ల విందు జేయుచున్
  రమ్మనంచు బిల్చు చుండ ప్రాణమూరకుండునా?
  తిమ్మనమ్ముగూర్చునంచుఁదెల్పినారు పెద్దలున్!

  రిప్లయితొలగించండి
 17. శ్రీకరమగు పండ్లు గొనుడు
  నాకలి దీర్చుచు మనకివి నారోగ్యమిడున్
  వేకువనే పూజలలో
  చేకొను జనులంత నివియె చెన్నుగ మహిలో!!!

  రిప్లయితొలగించండి
 18. పేదవారి కైన పెద్దవారలకైన
  పండు ముసలికైన పాపకైన
  భోగి రోగికైన భువిని పూజలకైన
  పనికి వచ్చు ఫలము పచ్చ యరటి.

  రిప్లయితొలగించండి
 19. అరటి పండ్లు యిచ్చు నధికమౌ శక్తిని
  అనవరతము తృప్తిఁదినుట మేలు
  తక్కువ ధరలోన నెక్కడైన దొరకు
  నమృతఫలము సుమ్మ యరటికాయ

  రిప్లయితొలగించండి