22, జులై 2015, బుధవారం

పద్య రచన - 968

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. తెగువ యనగ వలెన? తెంపరి తనమౌన?
    ప్రాణ భీతి లేని పయన మేల?
    ఒడలు జలదరించె, ఊపిరే స్థంభించె
    పటము గాంచినంత భయము కలిగె

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పొగడాలి కాని , బుగులు పడితే ఎలా ?

    01)
    _______________________________

    తెగువ మెచ్చదగును ! - తెంపరితనమది
    కాదు; మలుపు నొడుపు - కారు నడపు
    చుండి, ప్రజల గాచు - చోదకు నెలమిని
    బొగడి తీర వలయు - బుగులుపడక !
    _______________________________

    రిప్లయితొలగించండి
  3. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ముందుకు జాగ్రత సాగిన
    నందరు క్షేమముగ పైకి జేరుట జరుగున్
    క్రిందకు జారిన లోయన
    నందరు నిక్కముగ " పైకి " జేరుట జరుగున్.

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఏదోరకంగా ‘పైకి’ పంపే మీ పద్యం హాస్యస్ఫోరకంగా ఉంది. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గాలి వానతో డుత దరి కూలిపోవ
    సాగిపోయెడు వాహన మాగిపోయె
    బస్సులోని ప్రయాణికు లుస్సురనగ
    ప్రాణములరచేతనునిచి రక్షకొరకు

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులు గోలి వారి పద్యం చాలా బాగుంది.
    యతి మైత్రి సరిచేయండి.

    రిప్లయితొలగించండి

  8. 'అందరు. .........నరుగుట జరుగున్' అంటే బాగుంటుందేమొ పరిశీలించ గలరు.

    రిప్లయితొలగించండి
  9. సహదేవుడు గారూ,
    ధన్యవాదాలు. నేను గమనించలేదు. మీరు సూచించిన సవరణ బాగున్నది.
    *****
    హనుమచ్ఛాస్త్రి గారూ,
    సహదేవుడు గారి సవరణను పరిశీలించి తగు మార్పు చేయవలసింది.

    రిప్లయితొలగించండి
  10. ఎటుల బస్సును దెచ్చితో నెరుగ లేము?
    కొండ మలుపులో నదిగన్న గుండె లదిరె!
    పైకి జేర్తువో! ప్రాణమ్ము పైకి నెగురొ!!
    రెప్పపాటు జీవితమను రీతి నిదియె!

    రిప్లయితొలగించండి
  11. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ఆ.వె:ధర్మ నిష్ఠ తోడదైవ దర్శనముకై
    సాగు చుందు రిలను జనులు చేరి
    బీటు వార బాట భీతి వలదటంచు
    శకటమును నడిపెను చాలకుండు.

    రిప్లయితొలగించండి
  13. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘దర్శనమునకై’ అనడం సరియైన రూపం. ‘దైవసన్నిధి జేర’ అందామా?

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి నమస్సులు. నా పద్యంకూడా పరిశీలించండి

    రిప్లయితొలగించండి
  15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మన్నించండి. మరచిపోయాను.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘లేడిలాగనే’ అన్నదానిని ‘లేడిరీతిగన్’ అనండి.
    చివరిపాదం అన్వయం సందేహాస్పదంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  18. వాహనచోదకుండెపుడు-ప్రక్కనజూడక-ముందుచూపుతో
    దాహమువేయ?వెళ్లుటకు దారియు జూచెడి లేడిరీతిగన్
    సాహస వంతు డైవెడల?సాయము జేయును దైవశక్తియే
    శ్రీ హరి వాసమైన గిరి”జేర్చదు బస్సునులోయలోతుకున్
    శ్రీగురువర్యులగు కంది శంకరయ్యగారికినాపూరణచివరిపాదం
    లోని నాభావం అదిహరివాసమైన గిరిఅందుకే దైవ రక్షగా
    బస్సునిలువడమైనది.

    రిప్లయితొలగించండి
  19. జీవన రధమును దోలగ
    దోవయె నిటులుండ నెట్లు ?ధూర్జటి గనుమా!
    నీవే దీర్చిన బండిని
    దేవేశా! నడుపుమయ్య తీరము జేరన్!!!


    కొండల రాయుని దలచుచు
    గండములగు మలుపులున్న కలవర పడకన్
    బండిని నడుపుము చోదక
    నండగ తానుండు హరియె నావల జేర్చన్!!!

    రిప్లయితొలగించండి
  20. మాస్టరు గారికి, చక్కని సవరణ చూపిన సహదేవుడు గారికి ధన్యవాదములు...కార్యాలయమునకు నరుగు హడావిడిలో దోషమును గమనించలేదు...మీరు చూపిన సవరణతో....



    ముందుకు జాగ్రత సాగిన
    నందరు క్షేమముగ పైకి నరుగుట జరుగున్
    క్రిందకు జారిన లోయన
    నందరు నిక్కముగ " పైకి " నరుగుట జరుగున్.

    రిప్లయితొలగించండి