8, జులై 2015, బుధవారం

సమస్యా పూరణము - 1724 (రంభారావణుల ప్రేమ రమ్యము జగతిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రంభారావణుల ప్రేమ రమ్యము జగతిన్.

31 కామెంట్‌లు:

 1. రంభోరూ! అసురవిభులు
  రంభను కాదనుచు నిన్ను రమ్మనిరో వి-
  శ్వంభరసుత! విను మానవ
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్.

  (అశోకవనంలో రాక్షస స్త్రీలు సీతను బెదిరిస్తూ అన్నట్లుగా ఊహ)

  రిప్లయితొలగించండి
 2. దంభమున దెచ్చి చెఱచిన
  రంభా రావణుల ప్రేమ రమ్యము , జగతిన్
  శంభుని గొలిచెడి యసురుడ
  సంభవమని దెలియ నంత శాపము నొందెన్

  రిప్లయితొలగించండి
 3. శుంభల్లలితానన ప్రే
  మాంభోనిధి సుందరాంగి మండోదరి వ
  చ్చెం భార్యగ ; మదన కళా
  రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్ !

  ( అప్పుడే వివాహమైన మండోదరి శృంగార కళారంభయయ్యెనని , ఆరంభము = దర్పము , ప్రయత్నము )

  రిప్లయితొలగించండి
 4. శంభుడు పలికెను సతితో
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్
  దంభములు జేసి యున్నను
  జృంభణముగ వాని కీర్తి క్షితిలో నిలుచున్!!!

  రంభ = పార్వతి (పర్యాయపదం)
  జృంభణము = అతిశయము

  రిప్లయితొలగించండి
 5. డింభుడు పలికెను సచితో
  రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్
  సంభవము కాదు హితుడా
  కుంభిని సోదరుడు కుజను కోరెను గాదా!

  డింభుడు= మూర్ఖుడు
  కుంభిని సోదరుడు= రావణుడు

  రిప్లయితొలగించండి
 6. కంభంపాటి తనూజుడు
  దంభము తో బలికె నిపుడు దా రా వణు డే
  రంభను మోహించె గమఱి
  రంభారావణు ల ప్రేమ రమ్యము జగతిన్

  రిప్లయితొలగించండి
 7. లంకకుఁ గొని దెచ్చిన సీతతో రావణుడు....

  శంభుని పర్వతమెత్తితి
  దంభమ్ములు పల్కజాల తగువాడనునే!
  కుంభిని సుత! యవ్వన సం
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

  రిప్లయితొలగించండి
 8. అంభో జనేత్ర మయసుత
  గంభీ రానను దశాస్యు కరమున్ బట్టన్
  సంభవమవ నా దానవ
  రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్

  రిప్లయితొలగించండి
 9. మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  శుంభన్ముఖి మండోదరి
  రంభోరు మహేప్సితార్థ రంజిత మదనో
  జ్జృంభద్ధృద్రాగోత్ప్రా
  రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

  రిప్లయితొలగించండి
 10. శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ ప్రౌఢ సమాస బంధురమై అలరారుతున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  చెఱచిన ప్రేమ రమ్య మెలా అయింది? మొత్తానికి పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  డా. విష్ణునందన్ గారూ,
  మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  ‘ంభ’ప్రాసతో ఒక్క పూరణమే కష్ట మనుకుంటే మీరు అలవోకగా రెండు చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. రంభా!యని పతిపిలువన్
  రంభగ మారెను మయసుత రాక్షస జన్మన్
  సంభవమేయిది మాయా
  రంభా రావణులప్రేమ రమ్యము జగతిన్ .

  రిప్లయితొలగించండి
 13. దువ్వూరి రామమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. అంభోవీధిన జనియెడు
  రంభను రాపాడి నిలిపి- రావణుడంతన్
  పుంభావముతో బలికెను
  రంభా రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

  (నలకూబరుని వద్దకు వెళ్ళుచున్న రంభను,కుబేరుని దగ్గరకు వెళ్ళొస్తూ రావణాసురుడు చూచి వేధించిన వైనం గురించి వ్రాశాను...తప్పులుంటే పెద్దలు మన్నించాలి)

  రిప్లయితొలగించండి
 15. నాగజ్యోతి సుసర్ల గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. వి.యస్. ఆంజనేయులు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  'దాటీ' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'దాటియు' అనండి.

  రిప్లయితొలగించండి
 17. శంభుని మెప్పును పొందిన
  కుంభిని సోదరుడు మెచ్చి కొనితెచ్చెను నిన్
  అంబుధి దాటియు మానవ
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్

  రిప్లయితొలగించండి
 18. నమస్కారములు మీ అమూల్యమైన సూచనకు కృతజ్ఞతలండి

  రిప్లయితొలగించండి

 19. రంభోరువు ,మందోదరి ,
  కు౦భస్తని,రావణుండు కూడగ పుట్టెన్
  జంభారి గెల్చు తనయుడు
  రంభా!రావణుల ప్రేమ రమ్యము జగతిన్

  రిప్లయితొలగించండి
 20. 1.డింభికమండోదరి-ప్రా
  రంభము నుండితనభర్త రక్షణ కొరకై
  అంబను దలచెడి “రూపసి
  రంభా”రావణుల ప్రేమ రమ్యము జగతిన్|
  2.అంబను మండోదరి యా
  శంభునిదశకంఠనెంచు సద్భక్తియుచే
  లంభో దరునాజ్ఞగ|ఆ
  రంభారావణులప్రేమ రమ్యము జగతిన్|

  రిప్లయితొలగించండి
 21. ధన్యవాదములు శంకరయ్యగారూ!

  *** *** ***

  ధన్యవాదములు డా.విష్ణునందన్‍గారూ! మదనకళారంభయైన మండోదరియొక్కయు, రావణునియొక్కయు ప్రేమమునుం గూర్చి చేసిన మీ పూరణ మద్భుతముగనున్నది. అభినందనలు!

  రిప్లయితొలగించండి
 22. అశోక వనములో సీతతో ఒక రాక్షస చెలికత్తె అంటున్నట్లుగా........

  శుంభత్కాంచన దేహ వి
  జృంభిత సదమల గుణాఢ్య శ్రీలలితాంగీ
  సంభాసమాన శుభదా
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్.

  రిప్లయితొలగించండి
 23. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  కాని మీరు రెండింటిలోను బ-భ ప్రాస ప్రయోగించారు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. రావణుడు రంభతో :
  కుంభస్తనీ!మహేంద్ర వి
  జృంభ విశృంఖల వినోద జీవన లీలా
  రంభస్ఫూర్తిద! వేశ్యా!
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్.

  రిప్లయితొలగించండి
 25. ఊకదంపుడు గారూ,
  ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. స్తంభమ్ము వంటి వాడను
  రంభా నిను గోరుచుంటి ప్రణయము సలుపన్
  సంభావించెద రమ్మిక
  రంభా! రావణుల ప్రేమ రమ్యము జగతిన్!

  రిప్లయితొలగించండి