కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘కట్టడి+ఉంది’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కట్టడి నిడి’ అనండి. ‘చేనేత వర్యుల యద్భుతాలు’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘విలువగు వలువలు నేసిన’ అనండి. ***** మిస్సన్న గారూ, ‘నేతపనివారి రక్షించు నేత లేడు’ అంటూ మీరు చెప్పిన పద్యం ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
ము -నేత
రిప్లయితొలగించండివీ రడు మగ్గము యొద్దన
చీరను నట నేయుచుండె సిలుకుది యదియే
వారము పట్టును నటయది
చీరలు నివి మంచి వనుచు జెప్పెను నాతో
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఓర్పును నేర్పుగ కూర్పున
రిప్లయితొలగించండిమార్పులతో నేయగలుగు మహిమాన్వితమౌ
తీర్పుగ బట్ట తయారీ
చేర్పులె? మనఆంధ్రప్రగతి జేరెనుజగతిన్|
2.జంతు జాలము నుండి జనులను విడదీసె|
------కట్టు బట్టలునేసి-కట్టడుంచి|
మాన మర్యాదలు మనకంద జేయగ
------వస్త్ర శాస్త్రజ్ఞులే వన్నేలుంచి|
కష్ట మెంతున్నను నష్టంబు నెంచక
-------చలికి-దుప్పట్లకుజన్మలుంచి|
దోమతెరలు నేసి సామాన్య మానవుల్
------రోగ బాధ బడక రోతమాన్పి|
చీర,దోవతు లేనేసి సిగ్గుమాన్పు
మగ్గమందున గూర్చెడి దిగ్గజాలు
అగ్గిపెట్టెల చీరల నందజేయు
ఆంధ్ర చేనేత వర్యుల నధ్భుతాలు|
విలువైన వలువలు నేసిన
రిప్లయితొలగించండియలివేణులు ముదము జెంది వన్నెలు విరియన్
పలురంగుల జిలుగు వెలుగు
కలనేత లుకలగ లిపిన కరమొక టైనన్
పడుగు పేకల వోలె పదిమంది కూడుక
రిప్లయితొలగించండి............సన్నని వస్త్రాల చాల నేసి
భుక్తికి లోటన్న ముప్పు నెరుంగక
............శ్రామిక సంస్కృతి చాటినారు
మరమగ్గములు వచ్చె మనుగడ బరువాయె
............నోటిముందర కూడు లోటు కలిగె
కులవృత్తి వీడగ కలగి డెందంబులు
............బ్రతుకు భారము హెచ్చె బాధలాయె
గొప్ప సుద్దులు చెప్పెడి యిప్పుడున్న
యేలికల కిట్టి వృత్తుల యిడుములందు
దృష్టి పారదు చేయూత కిష్టపడరు
నేత పనివారి రక్షించు నేత లేడు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కట్టడి+ఉంది’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘కట్టడి నిడి’ అనండి. ‘చేనేత వర్యుల యద్భుతాలు’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘విలువగు వలువలు నేసిన’ అనండి.
*****
మిస్సన్న గారూ,
‘నేతపనివారి రక్షించు నేత లేడు’ అంటూ మీరు చెప్పిన పద్యం ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
మగ్గము కుటుంబ పోషక
రిప్లయితొలగించండిపగ్గముగా నెంచి నావు వందన మయ్యా!
నెగ్గెడి రోజులు కావని
మగ్గిన వారనిరి యంత్రమాశ్రయమైనన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పోషక పగ్గ’మని సమాసం చేయరాదు కదా! ‘కుటుంబ భరణపు| పగ్గముగా...’ అందామా?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన :
రిప్లయితొలగించండిమగ్గము కుటుంబము నడుపు
పగ్గముగా నెంచి నావు వందన మయ్యా!
నెగ్గెడి రోజులు కావని
మగ్గిన వారనిరి యంత్ర మాశ్రయమైనన్!
అగ్గి పెట్టె లోన నమరె నాతనిచీరె
రిప్లయితొలగించండివర్ణ మిశ్రమముల వాసికెక్కె
నేత కళల కెల్ల నేతయై వెలుగొందె
పవరు లూము కిపుడు భస్మ మయ్యె
దిక్కు దోచ కకట! దీనాతి దీనుడై
బ్రతుకు భార మగుచు భయము గొల్ప
నేసి నట్టి బట్ట నేరమై పగబట్ట
ఆత్మ హత్య విధము లరయ జూచె
Guruvugaaroo dhanyavaadaalu.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పద్యం బాగుంది. సంతోషం! అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
చీరెలను నేయుచున్ కడు తీరుగాను
రిప్లయితొలగించండిపేరు పొందిరి మనవారు విశ్వమంత
సిల్కు చీరెలఁ గట్టుచు చేడెలంత
నేతపనివారి బ్రతుకుల నీరుగార్చ
బాధపడుచుండ్రి వారు సాపాటు కొరకు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అగ్గి పెట్టె లోన అరువది మూరల
రిప్లయితొలగించండిచీర దాచ గలుగు చేవ యున్న
కళను చూపినారు కమనీయమేగాని
కాసు లేనిబతుకు కలత తెచ్చె
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.