వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘ఆళిపక్షములవొలె’ అన్నచోట గణభంగం. ‘ఆళిపక్షము లన’ అనండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
క.
రిప్లయితొలగించండితాకుచుండవలె, నితంబములనెపుడు
కారునలుపు తోడ కలికి వేణి
కులుకు లీను చున్న కుంకుడు కాయలే
రక్షజేయ గలవు రమణి కురుల
చ.
ఆమె కురులు జూడ అళిపక్షములవొలె
నాగ సర్పమువలె నాణ్యము గను
మెరియు చున్న దనిన
సరియగు పోషణ
కదియె మేలు కుంకు డనెడు కాయ.
దంపుడు కుంకుడు కాయలు
రిప్లయితొలగించండిజంపుగ మీకురులఁ బెంచు స్నానముఁ జేయన్
కంపరమీ దంపుడనుచు
షాంపూ మీ కురులకంట సగమై మిగులున్!
నెఱయఁ గుంకుడుపండ్లు వేన్నీళ్లఁ బిసికి,
రిప్లయితొలగించండివాని నురుఁగెల్లఁ దల నంటి వరుస మునుఁగఁ,
బాయు నీగతిఁ ద్రిదినముల్ పరఁగఁజేయ,
నొంటితలయేరు మఱి చేరకుండు నెపుడు. (ఒంటితలయేరు = పార్శ్వపు తలనొప్పి)
(చికిత్స.... సూర్యరాయాంధ్ర నిఘంటువు నుండి).
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఆళిపక్షములవొలె’ అన్నచోట గణభంగం. ‘ఆళిపక్షము లన’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మాస్టౌగారూ... బాగుంది...నేనూ మీబాటలోనే..
రిప్లయితొలగించండిభళ్ళున తెల్లారగ కుం
కుళ్ళను వేణ్ణీళ్ళ బిసికి కోరుచు తలపై
నీళ్ళను స్నానము సలుపగ
త్రెళ్ళెడు పార్శ్వంపు నొప్పి తీరుగ పోవున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఆ.వె:రుగ్మతలను బాపు రుద్దుకొనంగ కుం
రిప్లయితొలగించండికుళ్ళ రసము తోడ ;కురుల సొబగు
హెచ్చు ననగ తడవు యేల త్వర పడుడు
కాంతలార మేని కాంతు లీన.
చిక్కని కుంకుడు రసమును
రిప్లయితొలగించండిచక్కగ తలపైన రుద్ది జలకములాడన్
మిక్కిలి మేలగు జుట్టుకు
నిక్కముగా చుండ్రు పోవు నెఱవదు తలయే!!!
చుండ్రు బాధతో సతతము స్రుక్కు చున్న
రిప్లయితొలగించండికుంకుడు రసము తప్పక కూర్చు సుఖము
జుట్టు యందము కాపాడి పట్టులాగ
చేయు సాధనమేయిది చేడియలకు
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నురగలు గక్కెడి కుంకుడు
రిప్లయితొలగించండినరుదుగ నగుపించుటాయె|నత్యద్బుతమౌ
కురులను బెంచెడి వరమును
నరులకు సాయంబుజేయ?నవ్వుదురిలలో|
2కురులవరంబుగా నగునుకుంకుడు కాయరసమ్మువాడగా
పరువము నిల్పగా పడతి పట్టునుబెంచు తలంటు నందునన్
మరువక నాటి మేటి పరమావదిగా దలపోయ|నేడిలన్
అరువులు జేసినైన కొనియాడెడి షాంపునువాడ?వింతయే|
ముందుగ జూచి తర్జునుని మోజునగోరగ పార్థ సారదై
రిప్లయితొలగించండియుందును.యుద్దమందు తన యూహల రీతిగశౌర్య వంతమున్
బొందినసైనికుల్ నిడుదు పూర్తిగ నీకడ రాజరాజ|యే
మందువు?సంతసంబెగద?మంగళ మౌనిక కృష్ణ వాక్యముల్|
శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనాలతోవిన్నపము
నిన్నటిరోజు పద్యరచన ఈరోజు పంపుచున్నాను కొన్ని
అవాంతరాలుగలుగుటచే క్షమించండి.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
అంటు కొందురు తరచుగా నతివ లార్య !
రిప్లయితొలగించండితనర కుంకుడు రసముతో తమత లలిల
చూడ ముచ్చట గానుండె చూడు కాయ
బంతి వోలెను గుండ్రపు త్వక్కు కలిగి
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.