10, జులై 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1726 (ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే.

30 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    దేవదాసు సినిమాలో దేవదాసు వంటి వారికి చివరకు :

    01)
    _________________________________

    సూక్తుల పెడచెవిబెట్టుచు
    శక్తి కొలది ; విత్త , మాన - స్వాస్థ్యాంతమునన్,
    రక్తము గక్కుచు కాయ వి
    ముక్తికి మార్గమ్ము మద్య - మును గ్రోలుటయే !
    _________________________________
    సూక్తి = మంచిమాట
    పెడచెవిఁబెట్టు = వినకుండు , అలక్ష్యముసేయు
    స్వాస్థ్యము = ఆరోగ్యము
    అంతము = తుద

    రిప్లయితొలగించండి
  2. భక్తిని గొలిచిన దైవము
    ముక్తికి మార్గమ్ము , మధ్యమును గ్రోలుటయే
    శక్తికి మించిన యలజడి
    యుక్తము గాదంచు బుధులు నుద్భోదించన్

    రిప్లయితొలగించండి

  3. సన్యాసి మార్గమున తపన పడనేల !
    తిండి యావన తపతప నాడ నేల !
    గృహ సామ్రాజ్యమున నిండుగ ప్రేమైకమై
    ముక్తి కి మార్గము "మధ్యమ్మును" గ్రోలుటయే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. గురువర్యులకు నమస్సులు.

    సూక్తులు వెతికిన దెలియును
    ముక్తికి మార్గమ్ము , మధ్యమును గ్రోలుటయే
    యుక్తమ నొక్క య ఘోరీ
    శక్తి యుపాశకుడె జెప్పు శంకయె లేకన్

    రిప్లయితొలగించండి
  5. శక్తికి మించు ఋణము గొని
    భుక్తిని మాని యనవరతము మదిర ద్రాగు దు
    ర్వక్తుల బాధల ప్రాణ వి
    ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే.

    రిప్లయితొలగించండి

  6. భక్తిని హరి సేవించుట
    ముక్తికిమార్గము.మద్యమును గ్రోలుటయే
    రక్తికి అనురక్తికి నా
    సక్తికి నిహసుఖము లందు సంపర్క మగున్

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి ప్రణామములు

    శక్తి రహితుండొకడు పతి
    భక్తియె లేని సతి తోడ బాధల నొందన్
    యుక్తమని తలచె బ్రతుకువి
    ముక్తికి మార్గమ్ము మధ్యమును గ్రోలుటయే

    రిప్లయితొలగించండి
  8. భక్తిని గొలుచుట శంభుని
    ముక్తికి మార్గమ్ము ,మద్యమును గ్రోలుటయే
    యుక్తము ,పగలంతయు మఱి
    శక్తికినిన్మించు పనిని సలిపెడు నెడలన్

    రిప్లయితొలగించండి
  9. భక్తిన్ సలుపు హరిభజన
    ముక్తికి మార్గమ్ము, మద్యమును గ్రోలుటయే
    శక్తిని హరించి మనుజుల
    రక్తిని నశియింపఁజేసి రాలగ జేయున్

    రిప్లయితొలగించండి
  10. భక్తిగ హరినే దలచిన
    ముక్తికి మార్గమ్ము, మద్యమును గ్రోలుటయే
    యుక్తము గాదుగ నెవరికి
    శక్తి ని పోకార్చు మదిర చవిగొన సుఖమా? !!!

    రిప్లయితొలగించండి
  11. “శక్తికి మీరిన పనులు-వి
    ముక్తికిమార్గమ్ముమద్యమును గ్రోలుట?”యే
    రక్తిని గూర్చ గలుగు?నీ
    భుక్తియు తగ్గించి|నిన్ను భూత బలికిడున్|

    రిప్లయితొలగించండి
  12. కం:శక్తికి మించిన యప్పులు
    యుక్తితొ చేయుచు చివరకు యూరున్ విడిచెన్
    నక్తమనిపల్కి జీవ
    న్ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    _/\_
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యుక్తమని+ఒక్క’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘యుక్త మని యొక యఘోరీ’ అనండి.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దుర్వ్యక్తుల’ టైపాటు వల్ల ‘దుర్వక్తుల’ అయింది.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యుక్తితొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. అక్కడ ‘యుక్తిని’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. శక్తిని గూర్చు ఖజానా
    ముక్తికి మార్గమ్ము "మద్యమును గ్రోలుటయే"
    యుక్తము ప్రజలకనంగన్
    రిక్తపు రాష్ట్రమ్ము నేలు రేనికి తగునే?

    రిప్లయితొలగించండి
  15. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    1) ముక్తికి హరినామ జపము
    ''భక్తిని మధ్యంబు త్రాగు పగిదిని'' సలుపన్
    యుక్తం ; బావిధి జన్మ వి
    ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే.

    2) భుక్తియె కఱవై కొందరు
    వ్యక్తులు మద్యమ్ము త్రాగి వ్యధలను మరువన్
    భక్తియె మద్య మనెడి ప్రజ
    ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సుదేష్ణ సైరంధ్రి తో:

    యుక్తాయుక్తము లెంచక
    భక్తి మదిరను గొనితెమ్ము భామరొ! మద
    వ్యక్త శిరోభారధృవవి
    ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే.
    [మదవ్యక్త మత్ +అవ్యక్త]

    రిప్లయితొలగించండి
  20. ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. యుక్తమనుచు యెన్నికలన్
    శక్తికొలది తాగిరి చెడు- సారా జనులున్
    సక్తులయిరి యకటా జన
    ముక్తికి మార్గమ్ము "మద్యమును గ్రోలుటయే"
    (సక్త = మూర్చ )

    రిప్లయితొలగించండి
  22. సుసర్ల నాగజ్యోతి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...


    త్యక్తోద్భక్తి విగాహా
    శక్తత దుర్వ్యసన భార సక్త సరుగ్ణో
    ద్వ్యక్తాయత దుర్జీవ
    న్ముక్తికి మార్గమ్ము మద్యమునుఁ గ్రోలుటయే!

    .

    రిప్లయితొలగించండి
  24. గుండు మధుసూదన్ గారూ,
    ప్రతిపదార్థం ఇస్తేనే కాని అర్థంకానంతటి ప్రౌఢపద్యాన్ని పూరణగా ఇచ్చిన నైపుణ్యం మీది. అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. రిక్తపు జ్ఞానము తోడ వి
    భక్తుల నందముగ చేర్చి పద్యము గూర్చన్
    శక్తిని మించగ త్వరిరపు
    ముక్తికి మార్గమ్ము మద్యమును గ్రోలుటయే :)

    రిప్లయితొలగించండి


  26. భక్తి యను గంధవతియే
    ముక్తికి మార్గమ్ము, మద్యమును గ్రోలుటయే
    రక్తికి మార్గము‌ బంధము
    యుక్తిగ వీడుము జిలేబి‌ యున్నతి గానన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి