28, జులై 2015, మంగళవారం

సమస్యాపూరణ - 1744 (పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ.

19 కామెంట్‌లు:

  1. తీయగ నుండిన దినుటకు
    వాయసముల గుంపు జేరి బాహాబాహీ
    మాయల మంత్రుల సభలను
    పాయసమున నుప్పుకలుపఁ బడఁదీ యనయౌ

    రిప్లయితొలగించండి
  2. ప్రేయసి మత్తున మునిగిన
    ప్రాయపు వాడెరుగ లేడు వాస్తవ జగతిన్
    వాయసమే తెల్లనిదౌ
    పాయసముననుప్పు కలుప బడ దీయనయౌ

    రిప్లయితొలగించండి
  3. కం.తీయని పదార్థ మొండగ
    పాయసమున నుప్పుకలుపఁ బడఁ, దీయన యౌ
    నా,యేయదిధాతువుయా
    వయ్యా రమునోండినయది పధ్ధతియనరే

    (తీయని పదార్ధం లో ఉప్పు పడితే అది అందులోంచి తీయగలమా(తీయనవునే లేదా తీయన యౌనా) అన్న ప్రయోగం లో వ్రాసాను . మిత్రులు ఆదరిస్తారని అనుకోనుచున్నాను.)

    రిప్లయితొలగించండి
  4. పెయమ్మును కలిపిన యా
    పాయసమున నుప్పు కలుప బడ{దు+ఈ}దీయన యౌ
    రా యేమనవలే పులగపు
    పాయసమున నుప్పు కలుప బడ వలయు ననన్

    రిప్లయితొలగించండి
  5. తీయని దనముంబోవును
    పాయసమున నుప్పు గలుపబడ ,దీ యనయౌ
    పాయసమున దగు చక్కర
    వేయంగా గఱగి యదియ ప్రియమగు రీతిన్

    రిప్లయితొలగించండి
  6. మాయాజాలము లెన్నియొ
    చేయుచు తా జనుల మాయ చేయును బాబా
    ఆయన చేతుల తోడన్
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ

    రిప్లయితొలగించండి
  7. పిరాట్ల వారి పూరణ నాలుగవ పాదం ప్రాస తప్పినట్లుంది

    రిప్లయితొలగించండి
  8. ఖాయముగ రుచి నశించును
    పాయసమున నుప్పు కలుపఁబడఁ, దీయనయౌ
    పాయసమున బెల్లమ్మును
    నేయిని, పాలుమరి పండ్లు నీటుగ కలుపన్

    రిప్లయితొలగించండి
  9. పేయము నేయిని వేయక
    పాయసమున నుప్పు కలుప బడదీయన యౌ
    నే? యాలకి శర్కరలిడ
    తీయగ నోరూరు గాదె తిలకించంగా!!!

    రిప్లయితొలగించండి
  10. మాయా మంత్రములెరిగియు
    ఆయాపనులందు మునిగి నాయాసమునన్
    జేయంగా చూచినసతి
    పాయసమున నుప్పు కలుపబడ?దీయనయౌ

    రిప్లయితొలగించండి
  11. సాయి కరము సోకఁగ పా
    నీయము నింపిన ప్రమిదలు నిక్కము వెలుగున్!
    చేయంట వేప దళములు,
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ!

    రిప్లయితొలగించండి
  12. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    తీయని చక్కెర నిడకయ,
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ
    నా? యశముం గాకయె యెటు
    న్యాయమగును నప్రతిష్ఠ నరులందఱకున్??

    రిప్లయితొలగించండి
  13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వాయసమే మెరుగు రుచిని
    పాయసమున నుప్పు కలుపఁబడఁ ;దీయనయౌ
    పీయూషంబున తేనెయు
    నేయిని చక్కెరను గలుప నిక్కంబిదియౌ

    రిప్లయితొలగించండి
  14. చేయగ పాయస మింపుగ
    వేయగనందున కపురము,పిసరును నదియే
    ఛాయను నుప్పైకనగను
    పాయసమున నుప్పుకలుపబడ తీయనయౌ

    వేయగ చక్కెర పాలును
    పాయసమునగుగద,యింపు బలు కిస్మిసులున్
    ఏయెడ నయ్యెడునిలలో
    పాయసముననుప్పు కలుపబడ తీయనయౌ

    తీయని ఫలముల కొన్నిట
    వేయగ దగుగా లవణము వెలుగగ తీపిన్
    నాయమె యగుగద,యాఫల
    పాయసమున నుప్పుకలుపబడ తీయనయౌ

    పాయసమందున పాలవి
    వేయగ నవియే విరుగన్,పిసరా సోడా
    వేయగ చెడవవి కనుకన్
    పాయసమున నుప్పుకలుపబడ తీయనయౌ

    సోడా=సోడా ఉప్పు.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. జ్వరం తగ్గలేదు. అందువల్ల మీ పూరణలను విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలను పంపిన కవిమిత్రులు....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారికి,
    పిరాట్ల.వెంకటశివరామ కృష్ణప్రసాద్ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    మల్లెల సోమనాథ శాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. హాయిగ నుండక పాకముఁ
    జేయగ నొప్పుకొనితిట్లు చిక్కులఁ బడితిన్,
    హా! యెఱుగనన, నదెట్టుల (యెఱుగననన్ అదెట్టుల)
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ?

    రిప్లయితొలగించండి
  17. కోయిల కూతల కలసిన
    వాయస గానమ్మదెట్లు వైనంబగునో
    తీయని చిక్కని సేవియ
    పాయసమున, నుప్పు కలుపఁబడఁ దీయనయౌ

    రిప్లయితొలగించండి


  18. రాయస కారుల నడిగితి
    వా! యయ్యోరామ రామ ! వారు జిలేబీ
    లే! యట్లే యందురయా
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. కాయపు కష్టము నందున
    నా యాలిని వెక్కిరించి నగవుచు కొలదిన్
    సాయము చేయని బంధుల
    పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ

    రిప్లయితొలగించండి