12, జులై 2015, ఆదివారం

పద్య రచన - 958

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విందున మకుటము తేనెల
బంధుర మగుబాదు షాలు బహుప్రీతి యటన్
సందియ మెందుల కనగను
తిందము రారండు నిటకు తీయగ ముదమున్

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

subbarao చెప్పారు...

బాదు షా లను జూడగ భరణి !యిపుడె
యూరు చున్నది నిజముగ నోరు నాది
తెచ్చి యీయవ ? వాటిని నిచ్చ కముగ
తిందు నిప్పుడే తృప్తిగ దేన్చు కొనుచు

కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

విరించి చెప్పారు...

తెలుగు పలుకు వోలె తేనెలూరుచునున్న
అమ్మను మరిపించు కమ్మదనపు
బాదుషాలజూడ ఫలిత మేముండెనో
జిహ్వ కందనట్టి చిత్ర మందు

కంది శంకరయ్య చెప్పారు...

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

బాదుషాలనిచట బాగనమరినారు
బాదుషాలు తీపి పాదుషాలు
తీపి దనము లోన దేనె కన్న ఘనము
మహిని గనము ఇంత మధుర ఫలము

A.Satyanarayana Reddy చెప్పారు...

బహుపసందుగ నుండును బాదు షాలు
నోట బెట్టగానె కరుగు నీటు గాను
పెరుగు మైదా కలిపి చేయు పిండి వంట
పిల్ల పెద్దలు తిందురు ప్రీతి తోడ

విరించి చెప్పారు...

ధన్యవాదములండి గురువుగారు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తీరుగా కంచాన కూర్చిన తీపి బాదు
షాలు జూడగానె మదికి సంబరమ్ము
కంటి కింపు హితకరము పంటి/నోటి కౌర
రండు రండు తినగ రమణులార.

కంది శంకరయ్య చెప్పారు...

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటి చివరి పాదాలలో గణదోషం. ‘తీరుగా కంచమున కూర్చ తీపి బాదు..... రండు రండు తినగ రండు రమణులార’ అనండి.

Unknown చెప్పారు...

రుచిగల బాదుషా దినగ ?రోదన లుండవు బాల్య మందునన్
సచివులు మెచ్చుతీపి మనసంతయు జేర్చును యవ్వ నాళికిన్
సుచిగల పాకమున్ మునిగి శుబ్రతయందున నోరుజేరగా?
ఆచలుని కైన నచ్చుగద?అందరివిందుల సంద డందునన్.

Unknown చెప్పారు...

2 తియ్యదనమున మనసును తీర్చి దిద్ద
.పాదుషాగారు మెచ్చిన వంట కంబె|



సంతసించుచు నౌకర్లు చింతజేసి
బాదుషా గాను మార్చిరి పరవశించి|

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘యవ్వనాళికిన్’....?