రాజేశ్వరి అక్కయ్యా, ధన్యవాదాలు. జ్వరం ఇంకా తగ్గలేదు. మందులు వేసుకుంటున్నా. మీ పద్యం బాగుంది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘యవనాశ్వము బంధించిరి’ అనండి. ***** జిగురు సత్యనారాయణ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘జయమునొంద నితనిపై’ అనండి. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ, లవకుశ చిత్రంలోని ‘లేరు కుశలవుల సాటి...’ పాటను చక్కగా వినియోగించుకున్నారు. బాగున్నవి మీ పద్యాలు. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురువులకు నమస్కారములు మీరు తొందరగా కోలుకోవాలని [సోదరులను ] ఆశీర్వదించి అక్క
రిప్లయితొలగించండిమీ ఇంటర్వ్యూ బాగుంది .నా సిస్టం అలిగినందున నాలుగు రోజులుగా మన బ్లాగును మీస్ అయ్యాను
--------------------------
యవనాశ్వము నుబంధించిరి
లవకుశ లటమోద మంది లౌల్యము తోడన్
ఎవరా వీరుడు గెలువగ
నవనిని గలడేని రమ్ము నారిని విడువన్
ఊత్సాహ:
రిప్లయితొలగించండిఅశ్వమేధ యాగమంట హయమునిటుల పంపె రా
జేశ్వరుండు రాముడంట యినుడి వంశమంట యీ
విశ్వమంత మెచ్చినట్టి వీరుడంట మనలకున్
శాశ్వతంబు కాదె కీర్తి జయమునొంద యితనిపై!!
కందము:
ఇట్టిటు రమ్మిటు పట్టుము
ముట్టెకు కళ్లెము బిగింప పుట్టము తోడన్
పట్టము గట్టిన రాముని
గుట్టిక రట్టౌ కుదురునె కొట్టుట మనలన్!!
కం.
రిప్లయితొలగించండిపుట్టిరి వీరులు సీతకు
పట్టగ యజ్ఞపు తురగము పాశము తోడన్
పట్టులు వదలరు కడకున్
దిట్టలు వచ్చియడిగినను దేవత లైనా !
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. జ్వరం ఇంకా తగ్గలేదు. మందులు వేసుకుంటున్నా.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘యవనాశ్వము బంధించిరి’ అనండి.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘జయమునొంద నితనిపై’ అనండి.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
యవనాశ్వమునే బంధిం
రిప్లయితొలగించండిచి,వారు వీరులమటంచు చెప్పిరి ఘనులీ
లవకుశులను సీతసుతులు,
యవనిన యద్భుతచరితులు అనఘులు వీరున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామ బంటుల నోడించి రయముగాను
రిప్లయితొలగించండియవనమును బట్టి కరమగు యావతోడ
యుద్ధమునకు కుశలవులు సిద్ధమైరి
రాము నెదిరించి యశమొందు గోమునరసి
అశ్వ మేధ యాగ యవనా శ్వ మద్దిర
రిప్లయితొలగించండిదాని కిరుదె సలను దనరు వారు
రాము తనయు లుగద ,రమ్యులు ,వీరులు
నశ్వ రక్ష ణ కయి యచట గలరు
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
తాటకిఁ జంపుట కాదని
రిప్లయితొలగించండిధీటుగ లవకుశులుఁ బల్కి ధీరతఁ జూపన్!
కోటను వీడెను రాముడు
ఘోటము విడిపించు కొనగ కోదండుండై!
రవికుల సోముని తోడన్
రిప్లయితొలగించండిబవరము జేయంగ మిగుల ప్రహ్లాదముగన్
యవనాశ్వమ్మును బట్టుకు
లవకుశు లిరువురును వేచె రాముని కొరకున్!!!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అశ్వమేధమ్ము జేసెడి నంట ప్రభువు
రిప్లయితొలగించండిరామచంద్రు డీరీతిని వ్రాసిరిచట
పట్టి బంధింత మశ్వము బాగుబాగు
తెలియు మన శక్తి రాజుకు దివ్యముగను.
తల్లి దీవెన తోడుగా తాత కరుణ
వెన్ను గాచును పనిలేదు వెరువ మనకు
శ్రీరఘుపతియౌ నాతని జేజియౌను
వెనుక కేగుట తథ్యము వెరపుతోడ.
లేరు కుశలవులకు సాటి వీరు లవని
నోటమిని యెరుగని రామ పాటవమును
నేడు నిలదీసి దీటుగా నిగ్రహింప
యశము మాదౌను ధరణి యథార్థ మిద్
యథార్థమిద్ది .
రిప్లయితొలగించండిఅశ్వమేదంపుగుర్రాన్నినాపిఅన్న
రిప్లయితొలగించండిదమ్ములైనలవకుశులు దమ్ముచేత
రామచంద్రునిసుతుల పరాక్రమంబు
లోకమెంచగ సత్కీర్తి లోలు లైరి
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిలవకుశ చిత్రంలోని ‘లేరు కుశలవుల సాటి...’ పాటను చక్కగా వినియోగించుకున్నారు. బాగున్నవి మీ పద్యాలు. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
2.ఆ.వె:అశ్వమేధ యాగ మవనిలోచేయంగ
రిప్లయితొలగించండిదలచి రాముడంపె తాను హయము
బాలవీరులు గని బంంధించి వేయగా
లక్ష్మణుండు గాంచె లవకుశులను.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.