11, జులై 2015, శనివారం

సమస్యా పూరణము - 1727 (విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్.

33 కామెంట్‌లు:

 1. చోద్యమ్ముగ వీధులలో
  పద్యమ్ముల పాడుచుండె పామరుడొకడున్
  మద్యము సేవించిన యా
  విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్

  రిప్లయితొలగించండి
 2. గద్యము చెప్పుట సులభము
  పద్యము పాడంగ లేని పామరు డిలలో
  చోద్యము గాదే, యేవిధి
  విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  విద్య+అశూన్యుడు = విద్యయందు శూన్యత లేనివాడు(విద్యాధికుడు)

  01)
  ___________________________________

  ఉద్యతు డొక్కడు శ్రద్ధగ
  నధ్యయనము జేసి వేద - మాసాంతముగా
  నధ్యాపకుడై యొక బడి
  విద్యాశూన్యుఁడు జనులకు - వేదముఁ జెప్పున్ !
  ___________________________________
  ఉద్యతుఁడు = పురుషార్థములయం దధికేచ్ఛగలవాఁడు, ఉదాత్తుఁడు, ఉదారుఁడు, ఉదీర్ణుఁడు
  అధ్యయనము = గురుముఖమున ఆనుపూర్విగ వేదముఁజదువుట
  ఆసాంతము = పూర్తిగా
  అధ్యాపకుఁడు = వేదముఁజదివించువాఁడు

  రిప్లయితొలగించండి
 4. సద్యో జాతుని గొలిచియె
  సద్యస్పూర్తిని వరము లొంది సాధించె కవుల్
  అధ్యయనము జేయకనే
  విద్యాశూన్యుఁడు జనులకు వేదము జెప్పున్

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. ‘కవుల్+అధ్యయనము’ అని విసంధిగా వ్రాశారు. మీ పద్యానికి నా సవరణ....
  సద్యో జాతుని గొలిచియె
  సద్యస్పూర్తి వరము గొని సాధించెను తా
  నధ్యయనము జేయకనే
  విద్యాశూన్యుఁడు జనులకు వేదము జెప్పున్.

  రిప్లయితొలగించండి
 6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 7. కవిశ్రీ సత్తిబాబు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం.. ‘హృద్యములగు వేదములను’ అన్నదానికి టైపాటు కావచ్చు. ‘మద్యముడు’ అన్నపదం లేదు. అది ‘మధ్యముడు’ కావచ్చు. ద-ధ ప్రాస సమ్మతమే!

  రిప్లయితొలగించండి
 8. హృద్యములగు వేదములను,
  మధ్యముడు చదువుచు జనుల మధ్యన జేరెన్:
  ఆద్యము తెలియని, అఱగొఱ
  విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్.

  రిప్లయితొలగించండి
 9. మద్యము మాంసము ముట్టడు,
  చోద్యము కా దన్యసతుల జూడడు, వాక్కుల్
  హృద్యము, కానీ లౌకిక
  విద్యాశూన్యుఁడు! జనులకు వేదముఁ జెప్పున్.

  రిప్లయితొలగించండి

 10. ఆద్యంతములెరుగని యా
  విద్యల తల్లికి మగండు వేదము జెప్పన్
  మద్యాసక్తుడు విస్సన
  విద్యాశూన్యుఁడు! జనులకు వేదముఁ జెప్పున్.

  రిప్లయితొలగించండి
 11. పద్యములు వ్రాయ నేరడు
  విద్యాశూ న్యుడు ,జనులకు వేదము జెప్పున్
  విద్యలతో బాటుగ మఱి
  విద్యా నా ధుం డు మిగుల వివరము తోడన్

  రిప్లయితొలగించండి
 12. హృద్యములగు వేదములను
  నద్యయనము జేసి యొకడు నద్యాపకుడై
  విద్యాలయమ్మున ధను
  ర్విద్యా శూన్యుడు జనులకు వేదము జెప్పున్!!!

  రిప్లయితొలగించండి
 13. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. విద్యే యెరుగని డంబపు
  నద్యయనము జేసి?కొనెడి నంగటి సరుకౌ
  విద్యా వినయము బొందిన?
  విద్యా శూన్యుడు జనులకు వేదము జెప్పున్

  రిప్లయితొలగించండి
 15. హృద్యమము వేదఘోష మ
  హోద్యమమై భరతజాతి కుపయుక్తంబై
  సద్యమల భాసితంబు, న
  విద్యా శూన్యుఁడు జనులకు, వేదముఁ జెప్పున్.

  రిప్లయితొలగించండి
 16. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విద్య+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘విద్యయె యెఱుగని...’ అనండి.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సద్యమల’ అర్థం కాలేదు. ‘సత్+యమల’ అని విభజిస్తే యమల మంటే జంట అని అర్థం. ఇది అక్కడ అన్వయించడం లేదు. ‘సత్+అమల = సదమల’ అవుతుంది. అక్కడ ‘సద్యోగభాసితంబు న|విద్యా...’ అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 17. వేద్యుండు ' దక్షిణా మూ
  ర్త్యా'ద్యంతము జ్ఞానముద్ర దాల్చిన మునియౌ
  సద్యో జాతుండట! వా
  గ్విద్యా శూన్యుఁడు జనులకు వేదము జెప్పున్!
  (చిన్మయ రూపముతో మౌనంగా ఉంటూనే ఎదురుగా వుండే వారికి దక్షిణామూర్తుల ముఖ కమలము నుండి సర్వము తెలుస్తుందని విన్న భావముతో పూరణ చేయడమైనది.స్వస్తి.)

  రిప్లయితొలగించండి
 18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మంచి పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. విద్యలనిన నాగమ స
  ద్విద్యలె యనుచు నితరము లవిద్యలని పరా
  విద్యా ధీనిధి, లౌకిక
  విద్యా శూన్యుడు జనులకు వేదము జెప్పున్

  రిప్లయితొలగించండి
 20. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

  ఉద్యోగిగ తావేది గ
  నుద్యమముగ సిరిని గొనగ నుర్విని కలిలో
  విద్యాధికునిగ బలుకుచు
  విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్.

  ( సూ :- విద్యా శూన్యుడు అనగా ....
  1) విద్య లేని వాడనియును 2) విద్యాధికుడనియు
  రెండు విధముల పద ప్రయోగములను సమర్ధించిరి
  జ్ఞానశూన్యుడు అనుపదమును .. జ్ఞానాశూన్యుడు
  అని కూడా ప్రయోగించ సమర్ధ నీయమా ?
  సందేహ నివృత్తి గావింప మనవి

  రిప్లయితొలగించండి
 22. ఉద్యోగము లేని జడుడు
  మద్యము గ్రోలుచు సతతము మత్తున మనుచున్
  పద్యముల ధారణఁజలిపి
  విద్యా శూన్యుడు, జనులకు వేదముఁజెప్పున్

  రిప్లయితొలగించండి
 23. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విద్య’ ఆకారాంత స్త్రీలింగపదం. ‘విద్యాశూన్యుడు = విద్యా+శూన్యుడు, విద్యా+అశూన్యుడు’ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. ‘జ్ఞానము’ అకారాంత నపుంసకలింగ శబ్దం. ‘జ్ఞాన+అశూన్యుడు’ ఒక్కటే రూపం. ప్రయోగించవచ్చు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులకు నమస్సులతో...

  ఆద్యంత రహితుఁ దెలుపు సు
  వేద్యాంచిత సూక్ష్మదర్శి, విస్తృతశాస్త్రా
  ద్యద్యతనజ్ఞా, న్యస
  ద్విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్!!

  రిప్లయితొలగించండి
 25. గుండు మధుసూదన్ గారూ,
  ‘అసద్విద్య’తో మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. విద్యయనంగను విజ్ఞత
  విద్యాధిక్యత నదియును వెలుగదు జనులన్
  విద్యయు లేకున్న బ్రతుకగ
  విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్

  పద్యాలును గద్యాలవి
  విద్యయుకా,దా చదువది వేడుక జగతిన్
  హృద్యము గూర్పగ తెలిపే
  విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్

  విద్యలు నేర్వక జగతియె
  హృద్యము కాదది,యరయగ నేపుగ లోకం
  బా,ద్యుతి కలుగగ జేసెడి
  విద్యాశూన్యుడు జనులకు వేదము నేర్పున్

  హృద్యము బ్రతుకుల దీర్చెడి
  విద్యలె పలుగతి కులముల వృత్తులు నెందున్
  విద్యలు నవియే నేర్పెడి
  విద్యాశూన్యుడు జనులకు వేదము నేర్పున్

  రిప్లయితొలగించండి
 27. యద్యపి యాంగ్లపు విద్యల
  నాద్యంతము చదివి యొకడు నౌరా యనగా
  సద్యోజాతపు బుద్ధిని
  విద్యాశూన్యుడు జనులకు వేదము జెప్పున్

  రిప్లయితొలగించండి
 28. మల్లెల సోమానాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
  మొదటిపూరణ మూడవపాదంలో గణదోషం. ‘విద్యయు లేకున్న బ్రదుక...’ అంటే సరి.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. మద్యము గ్రోలండరకొర
  పద్యమ్ములు వ్రాయడతడు పనసలు నేర్చెన్
  ఖాద్యము నిచ్చెడి భౌతిక
  విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్

  రిప్లయితొలగించండి


 30. విద్యాదధాతి వినయము
  వేద్యంబగునపుడు మనకు వేదము మహిలో
  చోద్యంబదెట్లయా కవి
  విద్యాశూన్యుఁడు జనులకు వేదముఁ జెప్పున్?

  జిలేబి

  రిప్లయితొలగించండి