శత్రుసేనల బల్మిఁ జావగొట్టిన వాడు చేతకను హయము రౌతు వాడు వీర చరితముల విశ్వమందెల్లను భారతీయుల ఖ్యాతి పఱపు వాడు కోట నిర్మాణము గొప్పగా జేసిన మేటి రాజులనెల్ల మించువాడు దేశ మాత నెపుడు దీన స్థితినిఁ గాంచ నిచ్ఛపడని ధీర హృత్తు వాడు వందనములు నీకు భారత వీరుడా! నీదు కీర్తి యిటులె నిల్చునెపుడు. పాడుచుందుమయ్య భక్తి నిండంగ మా మనములందు నిన్ను మరువబోము.
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘తురుష్కుల’ను ‘తుష్కరుల’ చేశారు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘వర్గ పాలి’ అనడం దోషమే. ‘వైరివర్గమునకు’ అనండి. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాణా ప్రతాప సిం హుని
రిప్లయితొలగించండిత్రాణగ నిలచెడి హయమట దర్పము చేతక్
ప్రాణ ప్రదమంచు నెంచగ
రాణా నిర్మించె నపుడు రమ్యపు గుడినే
శత్రుసేనల బల్మిఁ జావగొట్టిన వాడు
రిప్లయితొలగించండిచేతకను హయము రౌతు వాడు
వీర చరితముల విశ్వమందెల్లను
భారతీయుల ఖ్యాతి పఱపు వాడు
కోట నిర్మాణము గొప్పగా జేసిన
మేటి రాజులనెల్ల మించువాడు
దేశ మాత నెపుడు దీన స్థితినిఁ గాంచ
నిచ్ఛపడని ధీర హృత్తు వాడు
వందనములు నీకు భారత వీరుడా!
నీదు కీర్తి యిటులె నిల్చునెపుడు.
పాడుచుందుమయ్య భక్తి నిండంగ మా
మనములందు నిన్ను మరువబోము.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అరయ రాణా ప్ర తా పసిం గతడు కంటె ?
రిప్లయితొలగించండిబాహు బలుడును నాజాను బాహుడు గద
శత్రు మూకల జెండాడి జయము బొందె
జగతి నె వరును నతనికి సాటి లేరు
తుష్కరుల దాడి నెదిరించ తొనకక తన
రిప్లయితొలగించండిప్రాణముల్ మాతృ భూమికై పణము నొడ్డి
పోరి నటువంటి ధీరుడు వీరుడతడు
రాజు రాణా ప్రతాపుండు ప్రథితు డతడు.
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తురుష్కుల’ను ‘తుష్కరుల’ చేశారు.
గురువుగారు సవరణతో
రిప్లయితొలగించండిఆ తురుష్కుల దాడిని యనచ తనదు
ప్రాణముల్ మాతృ భూమికై పణము నొడ్డి
పోరి నటువంటి ధీరుడు వీరుడతడు
రాజు రాణా ప్రతాపుండు ప్రథితు డతడు.
రాణా ప్రతాప సింగము
రిప్లయితొలగించండిప్రాణమ్ములకుతెగియించి రణములనెదిరెన్!
దీనుల గాచెడు వాడని
గానమ్ములఁ పొగడ దగిన ఘటికుండతడే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రాకకు శత్రువే బెదరు|రాణ-ప్రతాపుని బల్లె మున్నచో
రిప్లయితొలగించండిప్రాకదు నీడ భూమిఫయి|’ప్రాణము దీయకవీడబోడనే
సాకదు సంతసంబు మనసందున భీతియునిల్వ?యుద్దమున్
లోకపు వైరు లందరికి లోకువ గావటమీసముల్ సదా|
2బల్లెమువంటి మీసమున పట్టుగ బెట్టగ నిమ్మకాయనే
వల్లెయనంగ నుండగలవాడట |ధైర్య-ప్రతాప- సింహమై
బల్లెము చేత బట్టగనె?శత్రువులూహలుతీరు మారగా
పల్లపు నీరులా పరుగు పందెము జేతురు|ప్రాణ భీతిచే|
3ఆరితేరిన యుద్దాన నలసిపోడు|
కోపమందున రాణ-ప్రతాప సింహ|
సింహ బలుడుగ శత్రువుల్*జీల్చగలడు
అనెడి నానుడిలోకాన నంటుగట్టే
కం:రాణాప్రతాపు డనగా
రిప్లయితొలగించండిప్రాణంబుల్ పై కెగురును పగతుర కెల్లన్
తాణంబులు కోల్పోవుచు
బాణము తగిలిన పిచుకల వలెగూ ల్తురనిన్.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రాజ పుత్రులలోన రాజిల్లు ధరలోన
రిప్లయితొలగించండి...... విఖ్యాతి పొందిన వీరుడెవడు ?
భారతీయుల కీర్తి పలుచెరంగుల చాటి
.......భావికి నందించు బలుడెవండు?
చేతకు పైనెక్కి చెన్నుగా పోరాడి
.......శత్రురాజులగెల్చు సాహసెవడు ?
భరత దేశపు మట్టి ప్రాభవమ్మును దెల్పి
........నీతి కోవిదుడైన నేత యెవడు?
రాజపుత్రుడతడు రాణాప్రతాపుడు
రహిని గాంచె ధరను రమ్యముగను
అందగాడు మంచి యాజానుబాహుడు
భరత దేశమునకు వరమతండు!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యాన్ని అందించారు. చాల బాగుంది. అభినందనలు.
కవిమిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండిభరతదేశ మహావీర! పరమ పురుష!
జన్మభూమిని శత్రుహస్తగతఁ గాక
యుంటకై పోరి యక్బరు వంటి వాని
ముప్పుతిప్పలు పెట్టి యపూర్వమైన
ధైర్యసాహసములు సూపి ధరణిమాత
ఋణముఁ దీర్చుకొన్నట్టి యుర్వీతనయ!మ
హోదయా! మహారాణ! సమాదరించు
ధాత్రి నిరతమ్ము నిన్నుఁ బ్రతాపసింహ!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...
రిప్లయితొలగించండిరాజులందు మేటి రాణా ప్రతాపుడు
రిప్లయితొలగించండివైరి వర్గ పాలి భైరవుండు
తురక వారినెల్ల తుప్పు రాలన్ గొట్టి
మంచిపేరుఁబొందె నంచితముగ
చేతకాశ్వము సిద్ధమై చెంత నుండ
రిప్లయితొలగించండిశివపినాకము బల్లెమై చేతనుండ
అక్బ రేగాదు హరిహరు లైన తరమె
యిలను రాణాప్రతాపుని నెదిరి నిలువ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వర్గ పాలి’ అనడం దోషమే. ‘వైరివర్గమునకు’ అనండి.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.