18, జులై 2015, శనివారం

సమస్యా పూరణము - 1734 (గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్.

27 కామెంట్‌లు:

 1. సరసములాడెడు పతినే
  కొరకొరమని చూచి యాపు కోతి పనులనన్
  చిరునగవున తా గెంతుచు
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్

  రిప్లయితొలగించండి
 2. వరుసగ పంచా మృతములు
  శిరమున నభిషే కముజేయ చిందులు ద్రొక్కన్
  నరకము చీమలు బట్టగ
  గిరిజాపతి వానరమయి కిచకిచ లాడెన్

  రిప్లయితొలగించండి
 3. హరి దాశరధిగ వచ్చెన్
  సిరి సీతగ యేగుదెంచె క్షితి గర్భంబై
  మరిమరి చిత్రమె జూడగ
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్!!

  రిప్లయితొలగించండి
 4. గిరిపై నెలవుండగ నా
  కరువలి పట్టి, గజరిపుని గైసేయగ దా
  త్వరితము చని గాంచ, నచట
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్

  రిప్లయితొలగించండి
 5. పరదేశ మేగి వచ్చెను
  విరహము తో భర్త, యధిక వేడుక తోడున్
  సరసన జేరిన వలదన
  గిరిజా పతివానరుడయి కిచకిచ లాడెన్

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అభిషేకము జేయ’ అన్నచోట గణభంగం. ‘శిరమున నభిషిక్తమైన’ అనండి.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  హరి నరునిగ బెరయంగను
  హరి హితవరి కరము దనరి హరి హరి యనుచున్
  గరువలి వరమున హరుఁ డా
  గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!

  రిప్లయితొలగించండి
 8. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. సరసను జేరిన తనయుడు
  మరకటమును జూపమనుచు మారాం జేయన్
  సరెయని సముదాయించుచు
  గిరిజాపతి వానరమయి కిచకిచ లాడెన్!!!

  రిప్లయితొలగించండి
 10. విరహముతోవేగు పతిని
  సరసములనుసలుపనీక శయనించు సతిన్
  చిరచిరలాడుచు కనుగొని
  గిరిజా పతి వానరమయి కిచకిచలాడెన్

  శౌరియె త్రేతాయుగమున
  ధరపై బుట్టగ నయోధ్య, ధరణీ సుతగా
  నరజన్మమెత్తె లక్ష్మియు
  గిరిజాపతి వానరమై కిచకిచలాడెన్

  రిప్లయితొలగించండి
 11. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణలు

  1) ఎరుగక విధి సృష్టించగ
  నరులను పోషించలేక నరహరి కుములన్
  పొరపడి గరళము త్రాగిన
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్.

  2) పొరపడి సృష్టించె విధియె
  నరులసురుల సురుల; గాచు నారాయణుడే
  గిరికడ సిరికై హరియవ
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్.

  హరి = కోతి

  రిప్లయితొలగించండి
 13. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రాక్షసులను ‘అసురులు’ అనవచ్చు, కాని దేవతలను ‘సురులు’ అని కాకుండా ‘సురలు’ అనాలి.

  రిప్లయితొలగించండి
 14. హరి రాముండయి వచ్చెను
  సిరి లక్ష్మీదేవి వచ్చె సీతాఖ్యముగా
  సరి సేవకుండుగా మన
  గిరిజా పతి వానరమయి కిచకిచలాడెన్.

  రిప్లయితొలగించండి
 15. పరనారి మరులు కోరెడి
  వరు మనసును మార్చు మంచు ప్రార్థించగ నా
  వర మాంత్రికు డేదొ నుడువ
  గిరిజా !పతి వానరమయి కిచకిచలాడెన్.

  రిప్లయితొలగించండి
 16. చిరుతనమున సూర్యునిగని
  మిరుమిట్లు గొలుపు ఫలమని మీరన్ కరుణా
  కరుడై యానిలిఁ బ్రోవగ
  గిరిజాపతి, వానరమయి కిచకిచ లాడెన్

  రిప్లయితొలగించండి
 17. ఇది పద్యరచన లొపం కాదు.. టైపాటు. గమనించమనవి

  రిప్లయితొలగించండి
 18. పరమేశు నంశతో కే
  సరికిని అ౦జనికి కలిగె సత్పుత్రు౦డై,
  ఉరికెనుభానుని మ్రింగగ
  గిరిజాపతి వానరుడయి కిచకిచ లాడెన్

  రిప్లయితొలగించండి
 19. అరెరే!వినుడీ!డాక్టర్
  గిరిజాపతి!వానరుడయి కిచకిచలాడెన్
  కరవగ వీనిని కోతియు
  త్వరగా వైద్యంబుచేసి బ్రతికించుడయా!

  రిప్లయితొలగించండి
 20. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ వైవిద్యంగా ఉండి అలరింపజేసినది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల సత్యనారాయణ మూర్తి గారూ,
  గమనించాను. సంతోషం!
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  దువ్వూరి రామమూర్తి గారూ,
  వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గిరిజా కొమరుడు యేడ్వగ?
  గిరిజాపతి వానరమయి|కిచకిచ లాడెన్
  విరుగుడు నవ్వును బంచిన
  తరుణంబున సంతసానతనయుడు మెలిగెన్|

  రిప్లయితొలగించండి
 22. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కొమరుడు+ఏడ్వగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కొమరుం డేడ్వగ’ అనండి.

  రిప్లయితొలగించండి
 23. నరపతి రాముడు వచ్చె, న
  సురపతి రావణుని జంపి సురలను గావన్,
  వరముగ తోడుగ వచ్చిన
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్.

  రిప్లయితొలగించండి
 24. మురియుచు ముచ్చటలందున
  సరిసరి శివరాత్రి నాడు సరసమ్ములనన్
  గిరిజయె తా కితకితలిడ
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్

  రిప్లయితొలగించండి


 25. మిరియాలు శొంఠి కలిపిన
  గరగర లాడెడు పయస్సు కస్సున నివ్వన్
  పరగడ మగనికి నరరే
  గిరిజా! పతి వానరమయి కిచకిచలాడెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. తిరుగగ రాహులు డాదట
  మురియుచునా వెండి కొండ ముప్పది చుట్లన్
  బరబర వృక్షము నెక్కుచు
  గిరిజాపతి వానరమయి కిచకిచలాడెన్

  రిప్లయితొలగించండి