3, జులై 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1720 (నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

34 కామెంట్‌లు:

  1. నన్నింతగ వేధించిన
    మన్నించడు దేవుడు మిము మరుజన్మములో
    తన్నించును నాచేతనె
    నిన్నును నినునిన్ను నిన్ను నిన్నును నిన్నున్

    రిప్లయితొలగించండి
  2. నన్నే వలచితి నంటివి
    మిన్నంటిన మమత పంచి మీరిన ప్రేమన్
    మన్నన సేయుటె ఋజువని
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్

    రిప్లయితొలగించండి
  3. కం. నన్నని నిన్నని ఎన్నను
    వెన్ననివెన్నునికనిననువినిననుహన్నా
    నిన్నొ దలనేనుతన్నెద
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    (నన్నని నిన్నని ఎవరినీ వదలను వెన్నగాని ,వెన్నుదుని గాని చూసినా విన్నా హమ్మా నిన్ను వదలను పట్టుకొని వాడిని వేడిని అందరినీ తంతాను అని యశోద శ్రీకృష్ణుని స్నేహితుడితో అంటోంది.)

    రిప్లయితొలగించండి
  4. నన్నెవ రనియెవరన్నను
    నన్నును నను నన్ను నన్ను నన్నును నందున్
    నిన్నెవ రన్నను నందును
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్

    రిప్లయితొలగించండి
  5. మన్నును తిన్నా వనినే
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    కన్నా! జూపుమనగ నట
    మిన్నగ నిను నిన్ను యెన్న మిన్నక యుంటిన్ !

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులతో...

    (వెన్నను దొంగిలించుమని పురికొల్పిన వెన్నుని నేస్తములను యశోద బెదరించుచున్న సందర్భము)

    "అన్నుగ వెన్ననుఁ దినగను
    వెన్నునిఁ బురికొల్పఁగాను వెన్నుల పైనన్
    దిన్నగఁ దన్నెద నోరీ
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!"

    రిప్లయితొలగించండి
  7. ఎన్నడు వెనువెనుక తిరుగు
    చిన్నాయను చిన్నశిశువు చేతుల జారన్
    అన్నా! యని తల్లి యడుగు
    నిన్నును,నిను,నిన్ను,నిన్ను,నిన్నును,నిన్నున్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మాయాబజారు సినిమాలో చివరి దృశ్యం :
    పింగళి వారి రచన మధ్యలో నా పూరణ :

    హ్హహ్హహ్హహ్హహ్హహ్హహ్హా

    పెదమామగారూ నమో నమః
    పెద్దలు తమ కెందులకీ శ్రమ
    ఈ దురాత్ముల మద మణచడానికి నేనున్నాను

    ఎవడవురా నువ్వు ?

    నేనా ఎవడనా
    ఘోషయాత్రలో గంధర్వులు నిన్ను బంధించినప్పుడు వచ్చి విడిపించినే
    ఆ అర్జున ఫల్గుణ భీభత్స బాబాయిగారి అన్న భీమసేన మహారాజు
    వారి కుమారుడను

    ఓరీ నువ్వా ఘటోత్కచా
    కర్ణా దుశ్శాసనా వీణ్ణి పట్టండి

    ఓరోరి ధుర్యోధన దుశ్శాసన కర్ణ హతకులారా
    అతి దురాత్ములు మీరు
    మీకు సహాయపడక ఆయుధాలు వాటి పరువు దక్కించు కుంటున్నాయి
    యిక మీకు బుద్ధి చెబుతాను
    లంబూ జంబూ యిక మీరు విజృంభించండి
    ------------------------------------------------
    ------------------------------------------------
    ------------------------------------------------
    ఓరీ మూఢ ధుర్యోధనా నీ ఐశ్వర్యం చూచుకొని త్రుళ్ళి పడినావు గదూ
    ఇప్పుడు చూడు యెవరి ఐశ్వర్యం మోస్తున్నావో
    చిన్నమయా

    అం అః ఇం ఇః ఉం ఉః
    ------------------------------------------------
    ------------------------------------------------
    ------------------------------------------------
    ఆర్తనాదములు శ్రవణానందకరముగ నున్నవి
    ఛీ ! శరణార్ధులను చంపను లెండిరా పిరికిపందలు
    లంబూ జంబూ ఈ కౌరవాధములను కట్టగట్టి
    ఎత్తుకొని పోయి హస్తినాపురిలో పారవేయండి

    అం అః ఇం ఇః ఉం ఉః
    ------------------------------------------------
    ------------------------------------------------
    ------------------------------------------------

    ఓరోరీ ! మీ దుష్ట చతుష్టయానికి సమిష్టిగా యిదే నా తుది హెచ్చరిక :

    01)
    ________________________________________

    పన్నితి మాయోపాయము
    నన్నుల మిన్నయె లభింప - నభిమన్యునకున్ !
    మన్నిగొను మాదు తండ్రులు
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్ !

    ________________________________________
    మన్నిగొను = చంపు

    స్వాతిశయమున త్రుళ్ళు ఐ - శ్వర్య గర్వ
    దుర్విదగ్ధులు మీ రెల్ల- దుమ్ము ధూళి
    కలియు కాలము దగ్గర - కలదటంచు
    బుద్ధి తెచ్చుకు బ్రతుకుడు - పొండు పొండు !

    ఇంకొక్క మాట :
    పాండవులె కాదు పాండవ - బంధుకోటి
    బంధు బంధుల బంధుల - బంధులందు
    ఎవరి నెదిరింతురేని మీ - కిదియె శాస్తి
    ఙ్ఞప్తి కలిగుండుడీ ఘటో - త్కచుని మాట !

    రిప్లయితొలగించండి
  9. అన్నా!యేమని తెలిపెద
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    యన్నారట "కౌరవులకు
    మన్నే గతి యుద్దమందు మరణము నొందన్ "

    రిప్లయితొలగించండి
  10. చెన్నుగ సంధి వలదనిన
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్ !
    మన్నున గలుపగ దప్పదు
    కన్నులు విచ్చిగనుమోయి! గాంధారిసుతా

    రిప్లయితొలగించండి
  11. ఎన్నగ బుడమిని యంతట
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    మిన్నగు నతడును నుండు నె ?
    అన్నా ! మఱి సాటి నీకు నగుపడ డెందున్

    రిప్లయితొలగించండి
  12. కన్నియ పెండిలి బంతికి
    తిన్నగ రారండి మీరు తినుటకు కుడుపున్
    సన్నుతి చేయుచు నుంటిని
    నిన్నును నినునిన్నునిన్నునిన్నును నిన్నున్

    రిప్లయితొలగించండి
  13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    1) మన్నును తిన్నా వైనా
    వెన్నను పలుయిండ్ల లోన వేమారు తిన
    న్నెన్ననిరో వ్రజ భామలు
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    2) నిన్ను న్నేనన్నానా
    నిన్ను న్నీ నాన్న నైన నే నన్నానా
    నిన్నను నే ననినానా ?
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    రిప్లయితొలగించండి
  14. విన్నారా?కపులారా!
    నిన్నును నినునిన్నునిన్ను నిన్నును నిన్నున్
    క్రన్నన వారధి గట్టగ
    నన్నరపతి పంచెనంచు హనుమంతుడనెన్ .

    రిప్లయితొలగించండి
  15. వసంతమహోదయా! చాలారోజులకు మీ బాణీతో కనువిందు చేసారు.

    రిప్లయితొలగించండి
  16. మిన్నగ బూజింతు నెపుడు
    వెన్నుని వెనకయ్య సామి వేంకట నాధున్
    వెన్నెల విరిదాల్పు మరియు
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!!



    ఉన్నారా గను వారలు
    కన్నుల బడకుండ నుండు కాయస్థునిల
    న్నెన్నో సార్లడిగితి నే
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!!!

    రిప్లయితొలగించండి
  17. ఎన్నను రాముని బంటును
    నన్నా బంధింప వచ్చినారా? మీరా?
    క్రన్నన చంపుదు నిపుడే
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    రిప్లయితొలగించండి
  18. యశోదమ్మ కృష్ణుని స్నేహితులతో
    కం:వెన్నుని పైకొండెములా
    అన్నన్నా యెంత వింత యాటకు రాలే
    నన్నందులకా గొట్టెద
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    రిప్లయితొలగించండి
  19. విన్నాను మీ ప్రతాపము
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    మన్ననతో జేర్చుకొనెద
    కన్నా! మా పార్టిలోన గలవం డిపుడే.

    రిప్లయితొలగించండి
  20. ఎన్నియొ కాలుష్యమ్ములు
    ఛిన్నాభిన్నమొనరించు! చేతలు మరువన్
    తిన్నగ కబలించు నవియె
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్!

    రిప్లయితొలగించండి
  21. కవి మిత్రులు శ్రీ భాగవతుల కృష్ణారావుగారి ప్రేరణముతో నేను జేసిన ద్వితీయ పూరణము:


    నన్నన్నను నిన్ననె నని,
    న న్ననినన్, నిన్ను నేను నననన్నా! నే
    నిన్నన! నే నన్నానా
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్?

    రిప్లయితొలగించండి
  22. కవిమిత్రులకు నమస్కృతులు.
    రెండురోజులు ప్రయాణాల్లో వ్యస్తుణ్ణై ఇప్పుడే నెలవు చేరుకున్నాను. నిన్నటి పూరణలను, పద్యాలను కాస్త తీరుబడిగా సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెన్న+అని’ అన్నప్పుడు సంధి లేదు. లేదా ద్వితీయార్థంలో ‘వెనను’ అని ఉండాలి. ‘ఒదలను’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘నిన్ను వదల నిక తన్నెత’ అందామా?
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిన్నున్+ఎన్న= నిన్ను నెన్న’ అవుతుంది.
    నిన్నటి సమస్యకు మీ పూరణ మొదటి మూడవ పాదాలలో గణదోషం, రెండవపాదంలో యతి తప్పింది. సవరించండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ వివరణాత్మకమైన పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిన్ను+అన్నారట’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నిన్ను| న్నన్నారట...’ అనండి. (గత్యంతరం లేనప్పుడు).
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘...బుడమిని నంతట’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు (మంచి ఏకాక్షరితో సహా) బాగున్నవి. అభినందనలు.
    *****
    దువ్వూరి రామమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  24. నిన్నే నాన్ననె నన్నూ
    నిన్నును,నిను,నిన్నునిన్ను,నిన్నును,నిన్నున్
    ఎన్నగ తప్పులు దొర్లగ
    మనమేడుగు రుండిఫలమ?మర్యాదుడిగెన్|

    రిప్లయితొలగించండి
  25. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మర్యాద+ఉడిగెన్’ అన్నప్పుడు యడాగం వస్తుంది. అక్కడ ‘మర్యాద చనెన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  26. నన్నని నిన్నని ఎన్నను
    వెన్ననువెన్నునికనిననువినిననుహన్నా
    నిన్నువదలనికతన్నెద
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

    ఇప్పుడు సరిపోయిందా గురువుగారు.?

    రిప్లయితొలగించండి
  27. ధన్యవాదములు గురువు గారు. సవరించినాననుకొంటున్నాను:

    మన్నును తిన్నా వనినే
    నిన్నును నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్
    కన్నా! జూపుమనగ నట
    మిన్నగ నిను నిన్ను నెన్న మిన్నక యుంటిన్ !

    తత్పద్మ బంధుని గనుచు
    తత్పూర్వపు ముని పలుకుల దలచన్, సహసా
    యుత్పతితాలజడికి పృథ
    హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్.

    రిప్లయితొలగించండి
  28. పిరాట్ల ప్రసాద్ గారూ,
    ఇప్పుడు పద్యం అన్నివిధాల బాగున్నది. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    రెండవ పూరణలో ‘సహసా+ఉత్పతిత=సహసోత్పతిత’ అవుతుంది. యడాగమం రాదు. ‘పలుకుల దలచగ నయ్యో| యుత్పతితఖేదమున పృథ...’ అందామా?

    రిప్లయితొలగించండి
  29. సుమలత గారూ,
    ‘అలజడి’ దేశ్యం. ఉత్పతితాలజడి అని సమాసం చేయరాదు.

    రిప్లయితొలగించండి
  30. అవును కదా! సంస్కృతంలో సంధులు చదువుకుంటూనే తప్పులు చేస్తున్నాను...అంతే శ్రద్ధ లేదు. మీ సూచన చాలా బాగుంది గురువు గారు.

    తత్పద్మ బంధుని గనుచు
    దత్పూర్వపు ముని పలుకుల దలచగ నయ్యో|
    యుత్పతితఖేదమున పృథ
    హృత్పద్మము ముడుచుకొనియె నినుఁ డుదయింపన్.

    రిప్లయితొలగించండి