14, జులై 2015, మంగళవారం

పద్య రచన - 960

కవిమిత్రులారా,


పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

 1. నాసిక బాలవై నడచి నవ్యతరంగ సుమాల మాలలన్
  బాసర భారతీ లలన భవ్యగళమ్ము నలంకరించి సం
  వాసిగ నారసింహునికి వందనముల్ పొనరించి రాముడై
  దాసుని యేలినట్టి గిరిధాముని పాదములంటి కొండలన్
  దూసుకుపోయి పాపిడిగ తొందరగా చనుదెంచి రాణ్మహేం
  ద్రీసురభూమి లో తిరిగి దివ్య పథమ్ముల సాగి నాథునిన్
  భాసుర లీల గూడు జలపావని! గౌతమి! పుష్కరమ్ములన్
  జేసెద నీకు నర్చనలు చేతు ప్రణామములన్ దయామయీ.

  రిప్లయితొలగించండి
 2. మిస్సన్న గారూ,
  మీ ఉత్పలమాలిక మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. భువిని పన్నెండు వత్సర ములకు నదికి
  వచ్చు పర్వము పుష్కరం బందు రిలను
  వచ్చె గోదా వ రికిపుడు వంతు సామి !
  యాచ రింతును స్నానము హర్ష మొదవ

  రిప్లయితొలగించండి
 4. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. పుష్కర సమయమందున ముదముతోడ
  పుణ్యగోదావరి నదిలో మునిగినట్టి
  జనుల పాపములు నశించు సత్వరముగ
  ననుచు చనుచుండి రచటకు తనివితోడ

  రిప్లయితొలగించండి
 6. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. ఆ.వె: విప్రవరుల యీసు విపరీతమైదోప
  గోవు ప్రాణ మొదలె గుట్ర వలన
  ఆవు సుగతి కొరకు నాచరించతపము
  యుద్భవించె గంగ యుర్వి యందు.


  .ఆ.వె:గలగలమని పారు గౌతమీ గంగమ్మ
  ఆంధ్ర దేశ ప్రజల అన్నపూర్ణ
  పసిడి పంట లిచ్చు బంగారు మాతల్లి
  జాగు సేయకుండ జయము లొసగు.

  రిప్లయితొలగించండి
 8. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన విషాద సంఘటనలో మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారికి పుణ్యగతులు లభించాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 10. పార్వతీపతి పాదమంటుచుపర్వులెత్తెడు బాలికా!
  సర్వదేవతలాదరమ్మున స్వాగతించగ సాధ్వివై!
  యుర్విపైజనులన్నపూర్ణగనొప్పిమ్రొక్కెడు గౌతమీ!
  పర్వమాయెను పుష్కరమ్మన పాహిపాహి ప్రణామముల్!

  రిప్లయితొలగించండి
 11. నాసిక శిఖను బుట్టినాన్ధ్రదరిజేరి
  తెనుగు రైతుల గుండెల దిగులు దీర్చు
  పుణ్య పుష్కర ప్రస్తుత పూత వపుష
  తల్లి గోదారి సలిలాక్షి దండమమ్మ

  గౌతమమునీంద్రు నిజతపో గరిమ ఫలమ
  పొంగుటలల నర్తించుని న్బొగడ దరమ
  జలకళలతోడ వెలుగొందు జనుల వరమ
  మాపొలములకు దయచేసి మమ్ము గనుమ
  (రాయలసీమకు పట్టి సీమజలాలు వస్తాని ఆశిస్తూ )


  రిప్లయితొలగించండి
 12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. గోదావరిపుష్కరములు
  అదాయముకొరకుగాదు|ఆశనుద్రుంచే
  వేదాంత సారమనుచును
  వేదాంతులు దెలుపుటాయె|వేడుకలందున్|

  రిప్లయితొలగించండి