జన్మదిన శుభాకాంక్షలండి.ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాను.మేము కూడా పద్యాలల్లగలమనే నమ్మకాన్ని మాకు కల్గిచిన మీకు హఋదయపూర్వక వందనాలండీ.
గురువు గారికి ప్రణామములు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు సాహితీ సేవలో నాలాంటి నిరక్షర కుక్షులను ప్రోత్సహిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఆ సాహితీమతల్లి కృపాకటాక్షాలతో మీరు వర్ధిల్లాలని ఆ భగవంతున్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి.
గురువు గారికి ప్రణామములు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు సాహితీ సేవలో నాలాంటి నిరక్షర కుక్షులను ప్రోత్సహిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఆ సాహితీమతల్లి కృపాకటాక్షాలతో మీరు వర్ధిల్లాలని ఆ భగవంతున్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజన్మదిన హార్దిక శుభాకాంక్షలు మాస్టారూ..మీరు నిండు నూరేళ్ళూ చల్లగా జీవించాలని మాలాంటి ఔత్సాహికులకు తెలుగు పద్యాలు వ్రాయడం నేర్పిస్తూ తెలుగు సాహితీ సరస్వతికి సేవచేస్తూ వర్ధిల్లాలని కోరుకొంటాను
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలండి.ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాను.మేము కూడా పద్యాలల్లగలమనే నమ్మకాన్ని మాకు కల్గిచిన మీకు హఋదయపూర్వక వందనాలండీ.
రిప్లయితొలగించండిఅందమైన ప్రకృతి శోభ సుందరమగు
రిప్లయితొలగించండిఅరకులోయలోఁ గలదు - భద్రాచలమ్ము
నందు శ్రీరామచంద్రుని యాలయమ్ము
పుణ్య గోదావరీ తీరముననె కలదు
ప్రకృతి యందాలు విలసిల్లు ప్రాంతమనిన
రిప్లయితొలగించండిఅరకు లోయలో కలదు, భద్రాచలమ్ము
నిండు గౌతమీ తటమందు నిలిచి యుండి
తెలుగు దేశపు ఘనకీర్తి తెలుపు నివియె.
ప్రకృతి యందాలు విలసిల్లు ప్రాంతమనిన
రిప్లయితొలగించండిఅరకు లోయలో కలదు, భద్రాచలమ్ము
నిండు గౌతమీ తటమందు నిలిచి యుండి
తెలుగు దేశపు ఘనకీర్తి తెలుపు నివియె.
గురువు గారికి ప్రణామములు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసాహితీ సేవలో నాలాంటి నిరక్షర కుక్షులను ప్రోత్సహిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఆ సాహితీమతల్లి కృపాకటాక్షాలతో మీరు వర్ధిల్లాలని ఆ భగవంతున్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి.
గురువు గారికి ప్రణామములు మరియు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసాహితీ సేవలో నాలాంటి నిరక్షర కుక్షులను ప్రోత్సహిస్తూ పరిపూర్ణ ఆయురారోగ్యాలతో ఆ సాహితీమతల్లి కృపాకటాక్షాలతో మీరు వర్ధిల్లాలని ఆ భగవంతున్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి.
గురువు గారికి అభివందనములు , జన్మదిన శుభాకాంక్షలు ! మీకు పార్వతీపరమేశ్వరులు ఆయురారోగ్య సౌభాగ్యములు కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను !
రిప్లయితొలగించండిగురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యవంతులై మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పరమాత్మునికి ప్రార్థనలు.
రిప్లయితొలగించండిముఖ్య గుడుల నమూనాలఁ బొందు పరచ
రిప్లయితొలగించండిరాష్ట్ర పర్యాటకపు సంస్థ, రాజమండ్రి
నుండె సింహాద్రి, తిరుమల, యొంటిమిట్ట!
యరకులోయలో గలదు భద్రాచలమ్ము!
ప్రణామములు గురువుగారు..జన్మదిన శుభాకాంక్షలు..మీరు శాంతి సౌఖ్యాలతో, ఆయురారోగ్య సౌభాగ్యాలతో మరెన్నో పుట్టిరోజులు జరుపుకోవాలని భగవంతుడుని ప్రార్ధిస్తున్నాను....
రిప్లయితొలగించండితే.గీ:సొబగు లీనెడి ప్రకృతిని చూడ గలము
రిప్లయితొలగించండిఅరకు లోయలో;గలదుభద్రాచలమ్ము
నందు శ్రీసీతా రాముల యాలయమ్ము
చూడముచ్చటిది గనుడో సుమతులార.
తే.గీ:సొబగు లీనెడి ప్రకృతిని చూడ గలము
రిప్లయితొలగించండిఅరకు లోయలో;గలదుభద్రాచలమ్ము
నందు శ్రీసీతా రాముల యాలయమ్ము
చూడముచ్చటిది గనుడో సుమతులార.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు మీ కుటుంబమున కా భగవంతుఁ డాయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతులను, శుభములను, సత్వరకార్యసాఫల్యతలను, సంతృప్తి నొసంగుఁగావుతమని వేడుకొనుచున్నాను.
రిప్లయితొలగించండిపుట్టుకను లేదు గొప్ప యే పూరుషునకు;
గిట్టఁగాఁ గూడ ఘనతఁ జేపట్టఁబోఁడు;
జీవితోద్భవ సత్కర్మమే విజయము,
ఘనత నిడఁగ, జనహృదయాకాశమడరు!
స్వస్తి.
మాస్టరు గారూ ! మీకు జన్మదిన శుభాకాంక్షలు...భగవంతుని ద్వారా మీకు సమస్యల లేమి....మీ ద్వారా మాకు సమస్యల కలిమి చిరకాలం అందుతూ ఉండాలని అభిలషిస్తున్నాను...
రిప్లయితొలగించండిబాగుంది.
తొలగించండిసరకు జేయడు నామాట చంటి గాడు
రిప్లయితొలగించండివాదు లాడును తానిట్లు పందెమిడుచు
హైదరాబాదు ప్రక్క సింహాచలమ్ము
అరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము.
శ్రీ శంకరయ్య గురుదేవులకు జన్మదిన హార్దిక శుభాకాంక్షలు ..మీరు నిండు నూరేళ్ళూ చల్లగా జీవించాలని మాలాంటి ఔత్సాహికులకు తెలుగు పద్యాలు వ్రాయడం నేర్పిస్తూ తెలుగు సాహితీ సరస్వతికి సేవచేస్తూ వర్ధిల్లాలని, మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకొంటాను
రిప్లయితొలగించండిపద్యరచనలో ఓనమలు నేర్చుకొంటున్ననేను ఒక్క సంవత్సరకాలంలో సమస్యాపూరణలు, దత్తపదులు, న్యస్థాక్శరి, నిషిద్ధాక్షరి పూరించే స్థితికి వచ్చానంటే దానికి పూజ్యగురుదేవులు కంది శంకరయ్యగారి దీవెనలే కారణం.గురుదేవులు నూరు జన్మదినములు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిశ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఅరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము
నకు సమానమైనట్టిదౌ నగము; చూడ
చాల చిక్కని యడవులు జలనిధులును
నేటి యాంధ్రప్రదేశాన మేటి వనియె!
జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
డా. బల్లూరి ఉమాదేవి గారికి,
వి.యస్. ఆంజనేయులు శర్మ గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
శైలజ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గుండు మధుసూదన్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
కందుల వరప్రసాద్ గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారికి
ధన్యవాదాలు.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో ‘శ్రీసీతా’ అన్నచోట గణదోషం. ‘...అందు శ్రీరఘురాముని యాలయమ్ము’ అనండి.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మంచి వాతావరణమును కాంచవచ్చు
రిప్లయితొలగించండినరకులోయలో, గలదు భద్రాచలమ్ము
నందు దశరథ సూనుని యాలయమ్ము
పుష్కరస్నాన మటజేయ పుణ్యమబ్బు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గురువరులకు
రిప్లయితొలగించండినమస్కారములు.
భగవంతుడు మీకు ఆయురారోగ్య
మాన:శాంతిని,శతాధిక శకముల
జీవనము ప్రసాదించాలని
కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు
తెలియ జేస్తున్నాను.
గిరులు సెలయేర్లు వనములు విరులు గలవు
రిప్లయితొలగించండినరకులోయలో , గలదు భద్రాచలమ్ము
నందు గోపన్న గట్టిన నాలయమ్ము
కొలువు దీరెను రాముడు కోరియచట!!!
గురువుగారికి నమస్సులు. మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది.
రిప్లయితొలగించండిఇలాసరి చేసాను.
మంచి ప్రకృతిని సంతత మెంచవచ్చు
"సింగి"యెచట నుండె చెప్పుమా?యనినంత
రిప్లయితొలగించండి"అప్పడుదొర"నవ్వి చెప్పెనిట్లు
ఓయి!సింగి "అరకు లోయలోగలదు భ
ద్రాచలమ్ము"ను మనువాడి వెడలె.
శ్రీగురువర్యులు కంది శంకరయ్యగారికి
రిప్లయితొలగించండిజన్మదిన శుభా కాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు జరుపుకొనగ?
కవుల హృదయాల యూహలు కలమునుండి
పద్య రచనల నాశీస్సు పరిమళాలు
ఆయురారోగ్య భాగ్యాలె?యశముగూర్చు|
“అందచందాల ప్రకృతి ఆంధ్ర యందు
అరుకులోయలో”|గలదుభద్రాచలమ్ము
రామచంద్రుని నిలయ మై రాటుదేలె
నేటి తెలగాణరాష్ట్రాన మేటిగాను.
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండిధింస నృత్యమ్ముఁ జేయు నాదిమతెగ యట
నరకులోయలోఁ గలదు! భద్రాచలమ్ము
లోన నాదివాసుల నృత్యమే నవకము!
మేడవరపుఁ గోయల నాట్య మెంత ఘనము!!
సుకవి మిత్రులు రామమూర్తిగారూ! తేటగీతి సమస్యాపాదము నాఁటవెలఁదిలోఁ బొదిగిన మీ పూరణము బాగుగ నున్నది. అభినందనలు. కాని, నాలుగవ పాదమున యతిభంగమైనటులఁ గన్పట్టుచున్నది. పరిశీలింపుఁడు.
రిప్లయితొలగించండిశ్రీమధుసూదన్ గారు!నమస్సులు.
రిప్లయితొలగించండిభద్ర+అచల
మనువు+ఆడి
అ మరియు ఆ లకుయతి చెల్లునని తలచితిని.
శ్రీ రామమూర్తిగారూ! నేనే పొరపాటు పడితిని. మన్నింపుఁడు. యతి చక్కఁగ సరిపోయినది!
రిప్లయితొలగించండియాత్ర కెళ్ళిన వారిలో-పాత్రదారి
రిప్లయితొలగించండి“నేటిచరవాణి యందున చాటుచున్న
దని|ప్రసారముజూపెగా అందరెదుట
అరుకు లోయలో గలదు భాద్రచలమ్ము|
శంకరయ్యగురుదేవులకు జన్మదిన శుభాకాంక్షలు మీసాహితీసేవ నిరంతరము
రిప్లయితొలగించండికొనసాగాలని కోరుచున్నాను
నింగి చు౦బి౦ప నెంచును వంగి శృంగి
ప్రకృతి జన్యమౌ నొప్పు బొర్రా గుహలను
అరకులోయలో.గలదు భద్రాచలమ్ము
గోదతటి సీత, రాముడు కొలువుదీర
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యంలో ప్రాసయతి తప్పలేదు. ‘మంచి - కాంచ’ దోషం లేదు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
ధన్యవాదాలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
ధన్యవాదాలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ధన్యువాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంతు మీరినట్టి ప్రకృతి యంద మంత .
రిప్లయితొలగించండిఅరకులోయలోఁ గలదు, భద్రాచలమ్ము
గౌతమీ భవ్య నదికి ప్ర ఖ్యాతి, రామ
భద్రు మేటి దేవళమిట వాసి కెక్కె.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గారికి కొంచెం ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు -
రిప్లయితొలగించండికరమరుదైన వాఙ్మయ వికాసము - పెల్లగు ధీ విలాసమ
బ్బురమగు సత్కవిత్వ నిధి - భూరి వివేకము - శిష్యకోటిపైఁ
దిరమగునట్టి వత్సలత - తీర్చిన సార సరస్వతీ వధూ
సురుచిర రూప సంపదల శోభిలు ప్రాఙ్ఞుని శంకరయ్య స
ద్గురుని నజస్రమోమవలెఁ దోరఁపు ప్రేముడి నిండ వేంకటే
శ్వరుఁడు కృపా ప్రపూర్ణుఁడయి - సర్వ శుభమ్ములఁ గ్రుమ్మరించుచున్ !
తీర్ధయాత్రలు జేయగ వార్ధకమున
రిప్లయితొలగించండిమేము యెక్కిన వాహన మిచట కాన
నరకు లోయలోగలదు,భద్రాచలమ్ము
చేరితిమి కొంతవడికెట్లొ చింతదీరె
మాస్టారూ!మీకు పుట్టినరోజు జేజేలు!!!
అరకు,సీలేరు,భద్రాద్రి యలరు తూర్పు
రిప్లయితొలగించండికనుమలందున యందమై కనమె,పాపి
కొండలును నందె,చెప్పగా గొప్పనగును
అరకులోయలోగలదు భద్రాచలమ్ము
హైదరాబాదుకు,నరకు యాత్ర మధ్య
కలవు కొండలు,వనములు కాంతినిడుచు,
మధ్య గననౌను రాముండు మసలు గుడియ
అరకు లోయలో గలదు భద్రాచలమ్ము
రామ మందిరములు పెక్కు రమ్యముగను
వెలయునాంధ్రను నింపార వేనవేలు
అరకు లోయలో గలదొక యాలయమ్ము
అరకు లోయలో గలదు భద్రాచలమ్ము
రాము గొల్చెడి గిరిజన రమ్య సీమ
వివిధ జనపద కళలందు పేరుగాంచె
మారు మ్రోగెడి భజనల మహిత మగుట
అరకు లోయలో గలదు భద్రాచలమ్ము
ఆశీర్వదించి
రిప్లయితొలగించండిగురువులకు హృదయ పూర్వక శుభాకాంకషలు
నిండు నూరేళ్ళు మనవలు ముని మనవలు ఇని మనవలతో మాచేత ఇలాగే పద్యాలను రాయిస్తూ సుఖంగా ఉందాలని ప్రేమతో అక్క
క్షమించాలి నిన్నటి నుంచీ నా సిస్టం సరిగా లేనందున ఆలస్యంగా వ్రాయడ మైనది
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు!
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మేము+ఎక్కిన=మే మెక్కిన’ అన్నచోట యడాగమం రాదు. ‘మేము కూర్చున్న’ అందామా?
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
******
రాజేశ్వరి అక్కయ్యా,
ధన్యవాదాలు.
క్షమించాలి. నేనీ మధ్య మన బ్లాగ్ లోకి రాలేదు. గురువు గారికి నా మనః పూర్వక విలంబిత జన్మదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండివిజయ కుమార్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.