25, జులై 2015, శనివారం

పద్య రచన - 971

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. సరసు లోన చేరి సంస్కారి యైనట్టి
  బ్రాహ్మణుండు యొకడు భక్తితోడ
  అర్ఘ్య పాద్య మొసగె ఆదిత్యునకుతాను
  తపన తోడ యదియె తపము గాను.

  రిప్లయితొలగించండి
 2. ఉదయసంధ్యవేళ నుష్ణ కరుని గొల్వ
  స్వస్థతయొనగూడు సంతతమ్ము
  తెలిసినట్టి మునులు తెల్పిరి ప్రజలకు
  “పూజఁజేయ రవికి పుణ్య మంచు”

  రిప్లయితొలగించండి
 3. 1ఆ.వె:అలుపు యన్న మాట నసలెరుంగని వాడు
  కమల బాంధవుండు కర్మసాక్షి
  అతని కర్ఝ్య మిడగ హరియించు పాపాలు
  రండు మిత్రలార రయము తోడ.
  2.ఆ.వె:సుప్రభాత వేళ సూర్యున కొసగెడి
  యర్ఘ్య మన్న ప్రీతి హరికి చాల
  ఉదయ వేళ లందు నుదయించు తరణికి
  సంధ్య వార్చి యొసగు సలిలమిపుడె/
  వేళ మించ కుండ విడుడు జలము.

  రిప్లయితొలగించండి
 4. పావన వీచి హస్తముల 'బాసర' వాణి పదార్చ జేసి, ఆ
  ర్తావన నారసింహునికి 'ధర్మపురిన్' ప్రణమిల్లి, పూర్ణ స
  ద్భావన తోడ 'భద్రగిరి' ధాముని రాముని పూజ సేయు గో
  దావరి! 'పుష్కరాల' మము ధన్యుల జేయుము తీర్థమాడగాన్!

  రిప్లయితొలగించండి
 5. ఉభయ సంధ్య లందు నుదరథి నర్చించి
  యంబు నందునిల్చి యార్ఘ్యమిడగ
  జలము లోని శక్తి బలమిచ్చుటయెగాక
  'డి'విటమినులొసంగు దివసకరుఁడు.

  రిప్లయితొలగించండి
 6. నాసికఁ బుట్టితి బాసరఁ బారితి
  వమ్మ గోదావరి ప్రణతి గొనుము
  నారసింహుని యూర నర్తించి కదలితి
  రాముఁ గొల్చితి నాదు ప్రణతి గొనుము
  పంటపొలములెల్ల పండగా ప్రవహించి
  రాణ్మహేంద్రముఁ జనితి, ప్రణతి గొనుము
  మంగళారతులివె మాతల్లి ! యా సాగ
  రమ్మునంతర్వేది లయము గమ్ము.

  యుగయుగమ్ముల నెందును జగతినెల్ల
  గాచుచుండెడి జలమవు గాదె నీవు!
  కోటి ప్రణతులనొసగంగ కోరివచ్చు
  ప్రాణితతులను దీవించు పావనిగను.

  రిప్లయితొలగించండి
 7. తపము జేసిన నర్మదా తటమునందు,
  దానమిడ కురుక్షేత్రములోన, తనువు
  పడిన గంగయొడ్డున ముక్తి బడయ వచ్చు
  నాడ స్నానమ్ము గౌతమిన్ మూడు నమరు.

  మూడును పాపమ్ముల కిక
  మూడున్నరకోట్లు నదిని పుష్కరములలో
  కూడును తీర్థములు వడిగ
  నేడే మునుగంగవలయు నిర్మల భక్తిన్.

  ఆడి స్నానమ్ము గౌతమి నాదరమున
  నిచ్చి యర్ఘ్యమ్ము సూర్యున కెడద భక్తి
  తీర్థవిధులనిడియు పితృదేవతలను
  గొల్వ సద్గతులందురు కోవిదాళి.  రిప్లయితొలగించండి
 8. నదిలో స్నానము జేయగ
  మదిలో కల్మషము దగ్గు|మహిమాన్విత మౌ
  హృదయమె నాహ్లాదంబగు|
  ఉదయమె రవి కర్ఘ్య మొసగ?యుల్లసంబౌ|

  రిప్లయితొలగించండి
 9. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘బ్రాహ్మణుండు+ఒకడు’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘బ్రాహ్మణుం డొకండు’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  తెలంగాణపు తీరప్రాంతాలను పునీతం చేస్తూ ప్రవహిస్తున్న గోదావరిని ప్రశంసిస్తూ, పుష్కరాలను ప్రస్తావించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  తెలుగునేలపై గోదావరీ పరీవాహక ప్రాంతాలను, అక్కడి దేవతలను ప్రస్తావించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  గోదావిరి పుష్కారాల ప్రాశస్త్యాన్ని వివరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  జ్వరం కారణంగా పుష్కరస్నాన భాగ్యానికి నోచుకోలేదు. జ్వరం లేకుంటే నిన్నటిరోజు ‘కాళేశ్వరం’ వెళ్ళాల్సినవాణ్ణి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. గురుదేవులకు ధన్యవాదములు మరియు ప్రణామములు. తమరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాను.

  రిప్లయితొలగించండి