5, జులై 2015, ఆదివారం

న్యస్తాక్షరి - 31

అంశం- వృక్షసంరక్షణ
ఛందస్సు- ఆటవెలది.
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘ప - చ్చ - ద - నం’ ఉండాలి.

40 కామెంట్‌లు:

  1. పల్లవించుడికను ప్రజలార మీరు ప
    చ్చని తరువుల రక్ష సలుపుటకును
    దక్కు దీని వలన పెక్కు జీవములక
    నంత వాసయోగ్య యవని తలము

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పవన మందు ప్రాణవాయువు నింపి ము
    చ్చటగ నిచ్చు జీవ జాలమునకు
    దయను జూపునట్టి తరువుల గావు మా
    నందముగను పృథ్వి నందు నిలువ!

    రిప్లయితొలగించండి
  4. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పృథ్వియందు’ అనవలసింది.

    రిప్లయితొలగించండి
  5. పరమ పుణ్య భూమి భారత మాతప
    చ్చని వనము లందు సంత సముగ
    దనరు చుండ గోరు తరుశాఖ చాయల
    నంది వృక్ష మవగ నరులు మెచ్చు
    --------------------------------------
    నంది వృక్షము _ మఱ్ఱి చెట్టు

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘ప|చ్చని వనములయందు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. ధన్యవాదములు గురువుగారూ! సవరణతో...

    పవన మందు ప్రాణవాయువు నింపి ము
    చ్చటగ నిచ్చు జీవ జాలమునకు
    దయను జూపునట్టి తరువుల గావు మా
    నందముగను పృథ్వి యందు నిలువ!

    రిప్లయితొలగించండి
  8. పరిఢ విల్లవలెను తరువులు నిండు ప
    చ్చదన మునకు తాము సదన మయి ము
    దము నొసంగు జనుల దాహార్తి దీర్చున
    నంత శాంతి గూర్చు నయ్య లార.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

    త్త్రి రక్షణాఖ్య సమయోగ యత్నతో
    చ్చతను నేఁడు ముఖ్య సచివు నాజ్ఞఁ
    రువు లెన్నొ నాటి పరిరక్షణము సేయ
    నంద మిడును! వర్ష మంద మిడును!!

    రిప్లయితొలగించండి
  11. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మనముయు నలరు’...? ‘మనమ్ము మురియు’ అంటే బాగుంటుందేమో?!
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పచ్చ దననము పెంచు ప్రాణ వాయువును, ము
    చ్చటను నింపు చుండు చక్షువులకు
    దట్టముగను బెంచ ధరణిని చెట్ల నా
    నందమంది జగతి హాయి నిచ్చు.

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పచ్చదనముతోడ పల్లెలు మురుయు, బ
    చ్చదనమ్మె దేశ ప్రగతి, పచ్చ
    దనము నిచ్చు మొక్క లనిల నాట మనకా
    నందమౌ తెలుంగు నాడు వెలుగు.

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
    చ్చదనము విరియగ వెసన్ మదికి ము
    దమును గల్గు గాన తరువులు బెంచుచూ
    నందమొంద రండు నవల లార.

    రిప్లయితొలగించండి
  16. ఆ.వె:పసిడి కాంతులీను వసుధలో నాకుప
    చ్చదనము విరియగ వెసన్ మదికి ము
    దమును గల్గు గాన తరువులు బెంచుచూ
    నందమొంద రండు నవల లార.

    రిప్లయితొలగించండి
  17. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘...బ|చ్చదనమె మన దేశప్రగతి...’ అనండి.
    ‘మొక్క లనిల నాట..’ ?
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తరువుల బెంచుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. పల్ల వించ దరులు చల్లద నమును ప
    చ్చద నమును గలిగియు జంతు తతికి
    దయను నీడ నిచ్చి తా రక్ష సేసి నా
    నందము గలిగించు నమ్ము డా ర్య !

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురువారికి వందనములు
    మీ సూచనలకు ధన్యవాదములు
    పద్యమును సవరించి వ్రాసినాను
    పచ్చదనముతోడ పల్లెలు మురుయు, బ
    చ్చదనమొసగు సంతసమ్ము, పచ్చ
    దనము నిడెడు మొక్క ధరణి నాట మనకా
    నందమౌ తెలుంగు నాడు వెలుగు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పశులు పక్షులనుచు పక్షపాతమున మ
    చ్చరము జూపబోక ఛాయ నిచ్చి
    దనకు బొగ్గుపులుసు మనకు వలయు గాలి
    నంద జేయు తరులు విందు గొలుపు

    రిప్లయితొలగించండి
  22. పత్ర పుష్ప ఫలము వరముగా నొసఁగి ము
    చ్చటగ కలప నిచ్చు సదనములకుఁ
    దనదు స్వార్థమేమి తలవక! వర్షము
    నందఁ జేయు! రక్షనందఁ జేయ!

    రిప్లయితొలగించండి
  23. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణలో ‘సంపద+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘రక్ష గూర్చి యాదుకొనును’ అనండి.
    రెండవపూరణలో ‘కలుషము| నంట...’ అనండి.
    *****
    గండూరి లక్ష్నినారాయణ గారూ,
    సవరించినందుకు సంతోషం. ‘మురియు’కు ‘మురుయు’ అని టైపాటు...
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తిని మీ పూరణలో ప్రస్తావించారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులు శంకరయ్యగారూ!

    నా పూరణమునం బ్రథమ పాదమున యతిమైత్రి లోపించినది. నేను చూచుకొనకయే ప్రచురించితిని. ఇప్పుడు చూచుకొనఁగా దోషము నా దృష్టికి వచ్చినది. దానిని నీ క్రింది విధమున సవరించి, తిరిగి ప్రచురించుచుంటిని. పరిశీలించఁగలరు.

    త్త్రి రక్ష ణాఖ్య వర రత్న యత్నతో
    చ్చతను నేఁడు ముఖ్య సచివు నాజ్ఞఁ
    రువు లెన్నొ నాటి పరిరక్షణము సేయ
    నంద మిడును! వర్ష మంద మిడును!!

    రిప్లయితొలగించండి
  25. గుండు మధుసూదన్ గారూ,
    నేనూ గమనించలేదు. సవరించినందుకు సంతోషం!
    సవరించిన మీ పూరణ మరింత బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. పరమ యోగ్య మైన వరమగు చెట్లు-ప
    చ్చదన ముంచ? జగతిసంపదిడు|క
    దనము వంటి కల్తి మనమది జేర్చక
    నంటి| రక్ష గూర్చి నాదుకొనును|
    2.పరమ,పావనంబు హరిత హారంబు|మె
    చ్చగలచెట్లు జూడ?సంతసంబు.
    దరికి జేరుగాలి విరివిగ కలుషితము
    నంట జేయకుండు-నదియె బలము|

    రిప్లయితొలగించండి
  27. ఈశ్వరప్ప గారూ,
    మళ్ళీ అదే పొరపాటు చేశారు. ‘సంపద+ఇడు’ అన్నచోట సంధి లేదు.
    ‘కలుషితము’ అన్నచోట గణదోషం.

    రిప్లయితొలగించండి
  28. చెట్టు నాటగ నెన్నొ సిరులు గలుగునను
    మాట తెలుప నెప్డు మరువరాదు.
    పట్టు విడువకుండ ప్రజలకెల్ల నిజము
    చక్కగఁ జెప్పగ జంకరాదు.
    గుట్టు సమతులితమిట్టుల ప్రకృతిన
    టంచు నేర్పక నుండ ననువుగాదు.
    మట్టు బెట్ట నకట మనుజ జాతికి నొక్క
    తమ యలక్ష్యమనగ దాచరాదు.


    పచ్చదనముల భువి పసిడిగా వెలుగ ని
    చ్చలును మనుజులెల్ల సలుపు కృషియె
    దక్కఁ జేయు సుఖము, దైన్యమేలనటంచు
    నందనమ్ము నకొక నకలు నిలుపు.

    రిప్లయితొలగించండి
  29. చక్కగా జెప్పగా... అని ఉంటే బాగుంటుందనుకుంటా.
    నాలుగోపాదము- మట్టుబెట్టగా నయ్యో మనుజజాతికి ఒక్క అలక్ష్యమే అనుటను దాచరాదు.

    రిప్లయితొలగించండి
  30. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. పట్టణీకరణము పాడు జేసె భువి ప
    చ్చదనమనెడు మాట చాల నిజము
    దహనముసలుపకను తరువుల కాపాడి
    నందనములఁబెంచ నయము కలుగు

    రిప్లయితొలగించండి
  32. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. పగను బూన బోకు పవనదాయదియు ప
    చ్చదన మున్న పుడమి సంతసించు
    దమన నీతి తొడ తరువుల న్నరక నా
    నంద మేమి? జాతి నష్ట పోవు

    రిప్లయితొలగించండి
  34. పట్టు బట్టి జనులు పరశుఘాతాన ప
    చ్చనితరువుల నరుక సరియుగాదు
    దయను కలిగి పెంచు దారిద్ర్యమున్ ద్రుంచు
    నంద నాలు మనకు నాణ్య తోసగు

    రిప్లయితొలగించండి
  35. పరుగున పది మంది వచ్చి నిలిచియున్ యి
    చ్చట వనముల బాగ సస్య సంప
    దలను పెంచ పట్టు దలతో పని పఱప
    నందు నీడ దొరికె నలుగురికిని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంథా భానుమతి గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి