గురువులను [ సోదరులను ]ఆశీర్వదించి మీ ఆరోగ్యము కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోగలరని మనవి .పెద్దలెవరైనా సమీక్షించ గలరు . సగం కారణం ఎక్కువగా ప్రయాణములు , ఆశ్రమ వాసం . ఈరెండూ వీడితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది . చెప్పేంత గొప్పదాన్ని కాదు కానీ అక్కగా ఒకచిన్న సలహా . త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ దీవించి అక్క
కవిమిత్రులారా, ఇంకా జ్వరం తగ్గలేదు. ఇన్నిరోజులు ఆశ్రమానికి దగ్గరగా ఉన్న డాక్టరు దగ్గరికి వెళ్తున్నాను. ఆయన ఇంజక్షన్లు ఇస్తున్నాడు, ఆయన రాసిన టాబ్లెట్లు వేసుకుంటున్నాను. అయినా మార్పేమీ ఉండడం లేదు. రేపు ఉదయం వరకు తగ్గకుంటే దూరమైనా ఏదైనా పెద్ద హాస్పిటల్‍కు వెళ్దామనుకుంటున్నాను. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, ఉత్పలమాల పాదాన్ని కందంలో ఒదిగించి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరిపాదాన్ని ‘కొలుతురొ భగవంతు మరువకుండగ భక్తిన్’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నా ఆరోగ్యం గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, ధన్యవాదాలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ ‘మోసము లేని భక్తి’ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగునన్నది. అభినందనలు. ‘నిత్యపు టండదండ’, ‘వార లవ్విధిన్’ అనండి. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నాకు శుభం కోరూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, ధన్యవాదాలు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, బహుకాల దర్శనం... సంతోషం! భీముని కపటవేషాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ద్రౌపది’ అనండి. ***** మిస్సన్న గారూ, గజాసుర ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** దువ్వూరి రామమూర్తి గారూ, మోసగాళ్ళను మోసగించే అంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగునన్నది. అభినందలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘దోషముల్ ఆసర’ అని విసంధిగా వ్రాయరాదు. ‘దోషమే| యాసరగాగ...’ అందామా? రెండవపాదంలో గణదోషం. ‘మానవుల యాసల కంతములేని కార్యముల్’ అంటే ఎలా ఉంటుంది? ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, ‘వారు+ఎవ్విధిన్=వా రెవ్విధిన్’ అవుతుంది. యడాగమం రాదు. వారు, వారలు పర్యాయపదాలు.అందుకే ‘వారలు+ఎవ్విధిన్= వార లెవ్విధిన్’ అని సూచించాను. మీ ఉద్దేశానికి భంగం రాదు.
కలుగక మానవు పాపము
రిప్లయితొలగించండిలల మోసము చేయువారలకె - పుణ్యఫలం
బు లభించునెల్లెడనెవరు
కొలచునొ భగవానుమరువకుండగ భక్తిన్
గురువుగారూ ఆరోగ్యం కుదుటబడేదాకా విశ్రాంతి తీసుకోండి.త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
రిప్లయితొలగించండివేసము లెన్నివే సినను వేయివి ధమ్ముల కర్మభూ మిపై
రిప్లయితొలగించండిదోసమ టంచెరుం గకను దోచుకొనం గనెమేటి లాభముల్
రోసము లేకజీ వనము రోయక సౌఖ్యము నొందగో రుచున్
మోసము జేయువా రలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్
గురువులను [ సోదరులను ]ఆశీర్వదించి మీ ఆరోగ్యము కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోగలరని మనవి .పెద్దలెవరైనా సమీక్షించ గలరు .
రిప్లయితొలగించండిసగం కారణం ఎక్కువగా ప్రయాణములు , ఆశ్రమ వాసం . ఈరెండూ వీడితే ఆరోగ్యం చక్కగా ఉంటుంది . చెప్పేంత గొప్పదాన్ని కాదు కానీ అక్కగా ఒకచిన్న సలహా . త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ దీవించి అక్క
గురువుగారూ ఆరోగ్యం కుదుటబడేదాకా విశ్రాంతి తీసుకోండి.త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
రిప్లయితొలగించండిగురువుగారూ ఆరోగ్యం కుదుటబడేదాకా విశ్రాంతి తీసుకోండి.త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
రిప్లయితొలగించండిగురువుగారికి వందనములు.
రిప్లయితొలగించండిమాసమునందు నొక్క దినమాత్రమె యీ శివరాత్రి గాన వి
శ్వాసము తోడ బిల్వ శతపత్రములుంచి శివార్చనంబుచే
దోసములెల్ల బాపి పరితుష్టిగ పూజల భక్తిఁ, వీడుచున్
మోసము, చేయువారలకె పుణ్యఫలంబు లభించునెల్లెడన్.
మోసమువీడుచున్, పూజల భక్తిఁ చేయువారలకె ......... అని అన్వయము.
బాసలు చేయనాయకులు, బంగరుపాలన కోసమోట్లిడన్
రిప్లయితొలగించండిగ్రాసముమేయునట్టి యధికారుల నిత్యపు నండదండతో
దోసపు బుద్ధితో ప్రజల దోపిడి సల్పగ వారు యవ్విధిన్
మోసముచేయువారలకె పుణ్యఫలంబు లభించునెల్లెడన్
కాసులగోరుమానవులు కల్లల నాడుచు దైవమన్న వి
రిప్లయితొలగించండిశ్వాసము లేని వారికిల పాపము జేరక దప్పదింక నా
మోసము జేయువారలకె, పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
ఈశునిపాదపద్మముల జేరిభజించెడు వారికేగదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదోసములే కలుంగు మఱి దుష్ట జనాళికి నెల్లెడ న్సుమీ
రిప్లయితొలగించండిమోసము చేయు వారలకె ,పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్
వాసము జేయుచుం దరిని నాసమవర్తిని నెల్ల వేళల న్
వాసిగ భక్తితో గొలువ బాపము ద్రోచుచు నెల్ల వారికిన్
సకల శుభములు గలిగించు శంకరుండు
రిప్లయితొలగించండిపరమ గురువుల రుగ్మత బా ఱద్రోలి
యాయు రారోగ్య ములతోడ హర్ష మొదవు
నట్లు జేయుత ! మాశంక రార్యుల నిల
శ్రీగురువర్యులైన కందిశంకరయ్యగారికివందనములతో
రిప్లయితొలగించండితెలియజేయుట మీఆరోగ్యముముఖ్యమువైద్య సలహాలతో
బాగుపడాలనిదైవాన్నికోరడమైనది
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిబాసలు జేసి భీముడటు భార్యను బ్రోవగ నెత్తు వేయుచున్
వేసము మార్చి ద్రౌపతిగ బేలగ నిల్చుచు నాట్యశాలలోన్
వేసెను కీచకాథముని వేగమె, వంచన జేయు దుష్టులన్
మోసము చేయువారలకె, పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
చేసి తపమ్ము శంకరుని శ్రీకర దర్శనమొంది కుక్షిలో
రిప్లయితొలగించండివాసముజేయ గోరె తను బాయక శంభుని, నంత్యమందునన్
వాసముగా ధరింప తన త్వక్కును వేడె గజాసురుండహో !
మోసము జేయువారలకు పుణ్య ఫలమ్ము లభించు నెల్లెడన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినాశము సంభవించునిల నల్గురి మంచిని కోరకెన్నడున్
రిప్లయితొలగించండిమోసము చేయు వారలకె, పుణ్యఫలంబు లబించునెల్లెడన్
దోసము లెల్ల బాపుమని దోయిలి యొగ్గుచు భక్తిమీరగ
న్నాశగ నాగభూషణుని కర్చన జేయగ నాత్మసాక్షిగన్!!!
ఓసఖ! తీయగావలయు నొప్పుగ ముల్లును ముల్లుతోడనే
రిప్లయితొలగించండిమీసము త్రిప్పువారిఁగని మీసము తప్పక త్రిప్పగావలెన్
హాసముకైవచించను!మహానుభవంబున మోసకారులన్
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
మోసము మోసమ౦చు వగ పొందగనేల?ప్రపంచ మందునన్
రిప్లయితొలగించండిమోసము చావు పుట్టుకలు మోసము భార్యయు బంధు వర్గమున్
మోసము పాప పుణ్యమన మూఢ!వితాకును జెందబోకుమా
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిమీ సములెవ్వరంచనుచు మెచ్చియు చెల్లును హానిగూర్బుటల్
మోసము చేయువారలకె; పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
రోసము ముందు జూపినను రోయక దీనుల మందభాగ్యులన్,
వేసమటంచుదల్పకనె, వేవిధ సాయములందజేయుచో!
బాసలు చేసి తీర్చక న భాగ్యపు పాలొనరించు నేతకున్
రిప్లయితొలగించండికాసుల వేటలో పడి కు కర్మల చేయగ నేర్పుగుర్వుకున్
రాసులు కూడ బెట్టుటకు రాతిరి కర్జము చేయువాన్కి చీ!
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్.
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిఇంకా జ్వరం తగ్గలేదు. ఇన్నిరోజులు ఆశ్రమానికి దగ్గరగా ఉన్న డాక్టరు దగ్గరికి వెళ్తున్నాను. ఆయన ఇంజక్షన్లు ఇస్తున్నాడు, ఆయన రాసిన టాబ్లెట్లు వేసుకుంటున్నాను. అయినా మార్పేమీ ఉండడం లేదు. రేపు ఉదయం వరకు తగ్గకుంటే దూరమైనా ఏదైనా పెద్ద హాస్పిటల్‍కు వెళ్దామనుకుంటున్నాను.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
ఉత్పలమాల పాదాన్ని కందంలో ఒదిగించి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదాన్ని ‘కొలుతురొ భగవంతు మరువకుండగ భక్తిన్’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా ఆరోగ్యం గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
ధన్యవాదాలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ ‘మోసము లేని భక్తి’ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
‘నిత్యపు టండదండ’, ‘వార లవ్విధిన్’ అనండి.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాకు శుభం కోరూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
ధన్యవాదాలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
భీముని కపటవేషాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ద్రౌపది’ అనండి.
*****
మిస్సన్న గారూ,
గజాసుర ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
దువ్వూరి రామమూర్తి గారూ,
మోసగాళ్ళను మోసగించే అంశంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రోసి వరూదినిన్ క్షితిసురుండు తిరోహితుడైన కోపునన్
రిప్లయితొలగించండిమోసము జేసి యచ్చరను పొంది సుఖించెను వేల్పుగాణనన్
మోసపు ద్వంద్వ యుద్ధమున మోదుచు నూరువులన్ వధించగా
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కోపునన్... వేల్పుగాణనన్...’ ?
భూసుత జాడకై హనుమ ప్రొద్దుగొమారుని రాముఁజేర్చినన్
రిప్లయితొలగించండివేసెను వాలినిన్ జమర పీలువు చాటుగ ధర్మమూర్తియై
జేసెను మేలదే దనుజుఁ జెండగ! ధర్మము నిల్పగన్ సదా
మోసముఁ జేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్!
గురుదేవులకు నమస్కారములుబ కోపు అనగాసమయము ,
రిప్లయితొలగించండివేల్పుగాణ అనగా గంధర్వుడు. చూ. ఆచార్య జి యన్ రెడ్డి గారి పర్యాయ పదనిఘంటువు
నీసముపార్జి తంబయిన నిత్యసుఖాలకు వచ్చుదోషముల్
రిప్లయితొలగించండిఆసరగాగ|మానవులనాశకనంతములేకనుజేయుకార్యముల్
మోసముజేయువారలకె|”పుణ్యఫలంబు లభించునెల్లెడన్
దోసముకానరానివగు తుచ్చపు కోర్కెలువీడ భక్తికిన్|”
దోసియు నైన వాలినటు తూలగ చాటుగ గొట్టె రాముడున్
రిప్లయితొలగించండిచెసెను బూదిగా నసురు చేతుల,మోసము తోడ వానినే
మోసమెదుర్కొనన్ కలిని మోసమె గావలె,ధర్మ రక్షకై
మోసము చేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
దోసము కాదసత్యమది,దోషులనుండియు రక్షణందగా
వేసములేని పాండవులు వెల్గరె నాడు విరాటు కొల్వునన్
మోసము జేసి కృష్ణుడటు మోసపు రాక్షసులెల్ల గూల్చడే
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
వీసమునైన పాపమని భీతిని జెందక నేడునెందరో
మోసముతోడ దేశమున పూర్తిగ సంపద దోచుచుండగా
గ్రాసములేక మానవులు కష్టము లందెడి వారి గావగా
మోసము చేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
రాసిగ గల్గుగా నరక రౌరవ బాధలు నంతమందునన్
మోసము జేయు వారలకె-పుణ్యఫలంబు లభించునెల్లెడన్
వాసిగ దానధర్మములు బాగుగ జేయుచు,సత్యవర్తనన్
భాసిలు వారలన్-కనుక వర్తిలుడెందున నీతితోడుతన్
వాసము లేని వారలకు వాసము,కూడది లేనివారికిన్
గ్రాసము నందజేయునది గౌరవమిచ్చును నేటిరోజులన్
మోసముజేసి దుష్టులను,మొత్తము లేములకీయజూడగా
మోసముజేయు వారలకె పుణ్యఫలంబులభించు నెల్లెడన్
గురువుగారికి నమస్సులు. నా ఉద్దేశము
రిప్లయితొలగించండిదోసపు బుద్ధితో ప్రజల దోపిడి సల్పగ వారు, యెవ్విధిన్
మోసముచేయువారలకె పుణ్యఫలంబు లభించునెల్లెడన్?
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగునన్నది. అభినందలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దోషముల్ ఆసర’ అని విసంధిగా వ్రాయరాదు. ‘దోషమే| యాసరగాగ...’ అందామా? రెండవపాదంలో గణదోషం. ‘మానవుల యాసల కంతములేని కార్యముల్’ అంటే ఎలా ఉంటుంది?
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
‘వారు+ఎవ్విధిన్=వా రెవ్విధిన్’ అవుతుంది. యడాగమం రాదు. వారు, వారలు పర్యాయపదాలు.అందుకే ‘వారలు+ఎవ్విధిన్= వార లెవ్విధిన్’ అని సూచించాను. మీ ఉద్దేశానికి భంగం రాదు.
కాసులకై యమాయకులఁ గష్టములన్ పడఁదోయుచున్, సదా
రిప్లయితొలగించండిమా సములెవ్వరంచు, మరి మభ్యపు మాటల నాడువారు, నే
దోసమెఱుంగబోమనుచు దూషణలన్ పలుకాడుచున్, మహా
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్?
దోసమెలేదు నీదిటను దోసెల పిండిదె దోసమంచునున్
రిప్లయితొలగించండివాసన లేకపోయినను వన్నెగనున్నవి పూలటంచునున్
వీసపు టెత్తుబంగరము వీసెడు కాంతియె నీకుగూర్చనిన్
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
గ్రాసము కోరుచున్ సతము గాఢపు రీతిని మౌనముద్రనున్
రిప్లయితొలగించండివేసము మార్చి కాళి కడ వేడుక జేయుచు దొంగ పూజలన్
మీసము గడ్డమున్ పెనిచి మేటి ప్రసాదము నిచ్చుచున్ సదా
మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్