గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘పద్మవ్యూహము’ అన్నప్పుడు ‘ద్మ’ గురువై గణదోషం. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కొఱకై| యోరిమిలో...’ అనండి. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అక్కయ్యా, ధన్యవాదాలు.
పొట్టన దారము దీయుచు
రిప్లయితొలగించండిపెట్టుచు తానుచ్చు జూడ మెరుపుల తోడన్
పట్టుచు పురుగుల జుట్టుచు
పొట్టన తా బెట్టు సాలె పురుగిది గనరే.
కోటఁ గట్టు రాజు చేటుల నెదిరించ!
రిప్లయితొలగించండిపిట్ట గూడుఁ గట్టు పిల్లలుంచ!
సాలె గూడు నల్లు జోలెలా తిండికిన్!
భక్తుడల్లు భక్తి ప్రభువుఁ బట్టు!
చిత్త శుద్ధి తోడ శివుని సేవించిన
రిప్లయితొలగించండికీటకంబు వనుచు కీర్తి నొంద
ధన్య మాయె నింక ధరణిలో నీజన్మ
శాశ్వ తాన నిలిచె చరిత లోన
చిత్త శుద్ధి తోడ శివుని సేవించిన
రిప్లయితొలగించండికీటకంబు వనుచు కీర్తి నొంద
ధన్య మాయె నింక ధరణిలో నీజన్మ
శాశ్వ తాన నిలిచె చరిత లోన
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చిన్ని సాలెపురుగు లల్లు చిత్రమైన
రిప్లయితొలగించండిగూడు నోటి దారముతోడ కూటి కొరకు
నందమగుదాని నిర్మాణ మద్భుతమ్ము
యుచ్చులో బడ్డ పురుగులు చచ్చునచట
పద్మ వ్యూహము బన్నెడి వలనుజూపి
రిప్లయితొలగించండికౌరవాదుల నాశనకారి యయ్యు
సాలె పురుగైన?యూహలు సాకినట్టి
నీదు శక్తుల యుక్తులు నెవరికబ్బు|
2.కలము కాగితమేల?విలువైన చిత్రమే
------ప్రకృతి పటమున పట్టి గీయు|
ఊహల లుయ్యాల లూగుసాలె పురుగు
-----నుత్సాహ భరిత మైనురక లేయు|
ముందు చూపెరుగని-మూర్ఖ కీటకముల
------మదమణ గించుచు మట్టు బెట్టు|
నోటి మగ్గము చేత చాటుగ దారాన్ని
------వలగూర్చి పురుగుల పట్టిజంపు|
బట్ట,బుట్ట లల్లికలకు-ప్రథమ గురువు
నీవు గాకున్ననీవలె నేయగలర?
చాక చక్యపు విద్య-ప్రచారమివ్వ?
స్వార్థ పరులకు లాభాల సంపదాయె|
.ఆ.వె:పొట్టలోని నూలు పొరలుగా దీయుచు
రిప్లయితొలగించండినేత నేయ సాగె లూత యొకటి
విసుగుచెంద కుండ విడువక పని చేయ
సాధ్యమవని దేది జగతి యందు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘పద్మవ్యూహము’ అన్నప్పుడు ‘ద్మ’ గురువై గణదోషం.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పురుగు చిన్నదే చూడగా పుట్టెడన్ని
రిప్లయితొలగించండిబుద్ధులున్నవి కద సాలె పురుగు తెలివి
చూడ చోద్యామౌ నల్లిన గూడు గనిన
ప్రకృతిలో నెన్ని వింతలో పరికరించ
దారము నల్లుచు గూడును
రిప్లయితొలగించండిచారిమముగ గట్టినావె చామ్యము కొరకై
నోరిమిలో నిను మించిన
వారెవ్వరు జూడ ధరను వైనాశికమా!!!
వైనాశకము= సాలీడు
పద్యరచన ;సాలె గూడైన ఈ ప్రపంచమ్ము నందు
రిప్లయితొలగించండిభార్యతనయులు మమతల బంధనమను
వలను జిక్కిన ఈగల వలె జనమ్ము
బ్రతుకు సాగించు చుందురుభయము జెంది
ఆశీర్వదించి
రిప్లయితొలగించండిగురువులకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంకషలు
నిండు నూరేళ్ళు మనవలు ముని మనవలు ఇని మనవలతో మాచేత ఇలాగే పద్యాలను రాయిస్తూ సుఖంగా ఉందాలని ప్రేమతో అక్క
క్షమించాలి నిన్నటి నుంచీ నా సిస్టం సరిగా లేనందున ఆలస్యంగా వ్రాయడ మైనది
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కొఱకై| యోరిమిలో...’ అనండి.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అక్కయ్యా,
ధన్యవాదాలు.