పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు. ‘నౌకాశ్రయమ్ము+ఎటుల’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘నౌకాశ్రయ మ్మ|దెటుల నుండును...’ అనండి.
ఎన్నికల సమయమ్మున నెటులనైన
రిప్లయితొలగించండిగెలువ నేతలు మాయమాటలను చెప్పు
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
కూడ తెచ్చెదమనవచ్చు గొప్పకొరకు
అప్సరసలిచట జలక మాడవచ్చు
రిప్లయితొలగించండిగార్ధభాలు తిరగవచ్చు గగనమందు
హైదరాబాదులోన నౌకాశ్రయంబు
సాధ్యమవనిదేది కలదు స్వప్నమందు
సకల సౌకర్యములతోడ స్వర్గ మనగ
తొలగించండినొప్పుచుండెడి నగరమీ యుర్విలోన
దీప్తులొసగు చుండిన నేమి? లుప్త మయ్యె
హైదరా బాదులోన, నౌకాశ్రయమ్ము
గురువు గారికి ప్రణామములు
తొలగించండిసకల సౌకర్యముల తోడ స్వర్గ మనగ
నొప్పు చుండెడి నగరంబు ఉర్వి లోన
దీప్తులొసగుచుండిననేమి? లుప్త మయ్యె
హైదరాబాదులొన, నౌకాశ్రయమ్ము
హైదరాబాదు లోననౌ కాశ్ర యమ్ము
రిప్లయితొలగించండికలను గాంచిన పౌరుడు కలత బడుచు
సంత సంబున పలికెను సతిని బిలిచి
గగన మంటిన కోరిక తగదు నిలకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘నగరంబు+ఉర్విలోన’ అన్నచోట సంధి నిత్యం. అక్కడ ‘నగరమీ యుర్విలోన’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తగదు భువిని’ అనండి.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సంప్రాప్త స్థాన’మన్నప్పుడు ‘ప్త’ గురువై గణదోషం. ‘సకల సౌకర్య విలసిత స్థాన మిదియు’ అందామా?
ఆది నుండియే పేరుంది యవనియందు
రిప్లయితొలగించండిలేదిట కొరత దేనికి లేశమైన
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
తప్ప, సంద్రమున్ననదియు తప్పకగును
విశ్వ పర్యాటకులు మెచ్చ విరివి గాను
రిప్లయితొలగించండికళ్ళు మిరిముట్లు గొలిపేటి కట్ట డమ్ము
గ్రంధి మల్లికార్జునరావు కల్పితమ్ము
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము!!!
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండివరదపాలౌచు నుప్పొంగ,శరధి యాయె
నగరిమేడలు గననాయె నౌకలవలె
వాడలందున మోటార్లు పడవలవగ
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హైదరా బాదులోన నౌ కాశ్ర యమ్ము
రిప్లయితొలగించండిబాగు సెప్పితి రార్యులు ,వారు కట్టు
దురట టాంకుబండు దరిన తోయజాక్షి !
పోయి చూడుమ యొకసారి భూమి నచటి
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండి1) సర్వ సౌఖ్యములకు తోడు సైనికపురి
యున్న దైనను సంద్రమ దేది యచట ?
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
నల్ల సునామి యె సృష్టించ నపుడె వచ్చు
2) అల నిజాములె సృష్టించి రద్భుతముల;
నడిగి రల్లాను సంద్రము నచట నుంచ;
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
కలియుగమ్మున రాదని కలను దెలిపె
ఓడ రేవున నక్రమాలున్నవంటు
రిప్లయితొలగించండితిరిగి వచ్చిన మంత్రియే తేల్చెనంట!
యెంత మందిని ముంచునో యెవరికెరుక
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము!
సాగరపు తీరమేలేక సాధ్యమౌనె
రిప్లయితొలగించండిహైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము
యాధ్ర రాష్ట్రపు తోడ్పాటు నందుకొన్న
సరుకుల రవాణ సలుపుట సాధ్యమగును
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారు కృతజ్ఞతలు,
రిప్లయితొలగించండిమీసూచనకు అనుగుణంగా
హైదరాబాదు సర్వుల కాశ్రయమ్ము
సకల సౌకర్య విలసిత స్థానమిదియ
లేమి యనుమాట కనమిందు, లేని దొకటె
హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము
రాజకీయ నాయకుడు:
రిప్లయితొలగించండిపోయె భాగ్యనగరమని పొగల వలదు
దాని మించుపురము కట్టెదమొకొ పేరు
నదియె పెట్టుచున్ గట్టెదమట్టి క్రొత్త
హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము
అప్సరసలిచట జలక మాడవచ్చు
రిప్లయితొలగించండిగార్ధభాలు తిరగవచ్చు గగనమందు
హైదరాబాదులోన నౌకాశ్రయంబు
సాధ్యమవనిదేది కలదు స్వప్నమందు
ఆంధ్ర దేశపు పటమున నైదు పేర్లు
రిప్లయితొలగించండిగుర్తు బెట్టగ జెప్పె మా గురువు గారు
నదులు గోదావరీ కృష్ణ, నల్లమలయు
హైదరాబాదు, లోన నౌకాశ్రయంబు.
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. బల్లూరి ఉమాదేవి గారి పూరణ......
రిప్లయితొలగించండిరమ్యమైన దిదియె మన రాజధాని
భూతలస్వర్గ మన్న యభూతకల్ప
నమ్ము గాదు లేనిదొకటె నమ్ము లేదు
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హైధరా బాధలున్నవిఅందుకొరకె?
రిప్లయితొలగించండిహైదరాబాదులోన-నౌకాశ్రయమ్ము
పెట్టలేదని దెలిపెడి పెద్దమనిషె
త్రాగి వాగగ?తప్పను ధైర్యమేది?
2,మాట ,మూటలుబంచెడిమానవతను
బంచగలిగిన నాయకుల్ పలుకులందె
హైదరాబాదు లోన నౌకాశ్రయమ్ము
పెట్టగలమని వాగ్ధాటిబెంచి యనిరి
తీరమందున పలుకులే చేరగానె
మత్తుదిగకున్నమంత్రియు మాటఘాటు|
శ్రీ కే.యస్ గురుమూర్తి గారి పూరణం
రిప్లయితొలగించండి----------------------------
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
లేదు?కారణ మేమొ దెలియ బరచుము?
హైదరాబాదులో నౌక లసలు లేవు
గనుకనౌకాశ్రయమచటగట్టలేదు.
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండినా మొదటి పూరణము:
ఏండ్లు గడచిన మునుమంది దేమియగునొ?
యెవ్వ రెఱుఁగుదురో యయ్య యీ నగరము?
కన నెడారులు సంద్రాలగునొ? వెలయునొ
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము?
నా రెండవ పూరణము:
కలవు తాజమహలది యాగ్రా నగరిని,
హౌర కలకత్తలోఁ, జార్మినారు, కోఠి
హైదరాబాదులోన, నౌకాశ్రయమ్ము
వరలె ముంబాయిలో, విను, భరతపుత్ర!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నౌకయానాన పోటీలు నందు జరుగు
రిప్లయితొలగించండిప్రీతి హుస్సేను సాగరు పేరు హ్రదము
నెపుడు,కనుక కననగును నేడునింపు
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
యెటులనుండును,సంద్రమే లేకయిచట
సాగరంబను పేరొందు చాల చెరువు
లందు కనుపించునావలు నందమలర
ఓట్ల కొరకయి నేతలు గొప్పగాను
పలుకుచుందురు వారల పలుకు వింత
"రేపె తెత్తుము నోడలరేవు నిటకు
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము"
నేడు నంతర జాలాన నిఖిల జగతి
దర్శనంబిచ్చు నింటనే దానియందు
వివిధ పోర్టుల నౌకల పెద్దవిచట
హైదరాబాదులోన నౌకాశ్రయమ్ము
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
‘నౌకాశ్రయమ్ము+ఎటుల’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘నౌకాశ్రయ మ్మ|దెటుల నుండును...’ అనండి.