పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘రంగులపూలు వేసియున్’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరతము భక్తి మార్గమున నిశ్చల బుద్ధి సమన్వితుండుగా పరమ దయాళువైన భగవంతుని పాదములన్ స్మరించగా పరమతులైననేమి తన వారిగ జూచును కాననట్టి శ్రీ హరి కరుణాకటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా.
కరుణను జూపువాడు త్రిజగంబుల నేలెడు వాడు పాపముల్
రిప్లయితొలగించండిపరిహరణం బొనర్చెడు భవాండపు రక్షకుడంచు హైందవుల్
హరికరుణా కటాక్షమునకై తపియింతురు , క్రైస్తవుల్ సదా
మరియకుమారుడన్న కడు మన్నన సేతురు లోకమందునన్ .
వరములు కోరు దైత్యులు భవాండము నేలగ మాయ లందునన్
రిప్లయితొలగించండిసురలను హింస బెట్టగ నుసొర్గము నేలుచు సౌఖ్య మందగా
హరికరుణా కటాక్షమునకై తపియింతురు , క్రైస్తవుల్ సదా
కరుణను జూపుమంచు మమకారము నింపగ మానవాళికిన్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సొర్గము’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
నిరతము పాపజీవనము నేరకఁ జేయుచు తల్లడిల్లుచున్
రిప్లయితొలగించండిదురితము బాయగన్ ప్రభువు స్తోత్రము లందున విన్నవించుచున్
వరములనందగన్ గొలచి పాపముఁ గైకొని పుణ్యమిచ్చు బే
హరి కరుణా కటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరతము బూజజేయుదు ననేకపు రంగులపూలు వేసియుం
రిప్లయితొలగించండిహరికరుణా కటా క్షమునకై, తపియింతురు క్రై స్తవుల్ సదా
కరుణను జూ పుమంచు నయగారము నొం దగ మానవాళి కిన్
వరముల నీయగ న్దలచి పాయని భక్తిని విన్నవింతురే
నిరతము హైందవుల్ పరమనిష్ఠ భజింతురు మంజుకేశుడౌ
రిప్లయితొలగించండిహరి కరునాకటాక్షములకై, తపియింతురు క్రైస్తవుల్ సదా
స్థిరమగు చిత్తమున్ నిలిపి దేవుని బిడ్డడు క్రీస్తు ముక్తికై
తురకలు పూజసల్పుదురు తుష్టి రహీము సతమ్ము దీక్షతో
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రంగులపూలు వేసియున్’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గురువర్యులైన కంది శంకరయ్యగారికివందనాలు
రిప్లయితొలగించండిగురు పూర్ణిమసందర్భమునకవులకు,పండితులకు
నమఃసుమాంజలులు.
తరములు మారినా?మనిషి తత్వము మారక-శక్తి పూజలున్
మరువక-హిందువుల్ జరుప? మంచిదటంచునునెంచిదుష్టసం
హరి|కరుణా కటాక్షములకై తపియింతురు.”క్రైస్తవుల్ సదా
శరణ మటంచు వేడెదరు సర్వులుఏసును బైబులుంచియున్”.
స్థిరమగు భక్తితో సతము సేవలు బూజలు జేసి హిందువుల్
రిప్లయితొలగించండిహరి కరుణాకటాక్షమునకై తపియింతురు, క్రైస్తవుల్ సదా
మురియుచు నేసు జెప్పిన సుభోధలు బల్కుదురెల్లవేళలన్
నిరతము వేడు చుందురు రహీమును నిష్టగగొల్చుముస్లిముల్!!!
మరువక వైష్ణవుల్ దరచు”మంగళ రూపుడు లక్ష్మి నాథుడౌ
రిప్లయితొలగించండిహరి కరుణాకటాక్షములకై తపియింతురు”క్రైస్తవుల్ సదా
మరియ కుమారు డేసు పరమార్థము విందురు|”ముస్లిముల్గనన్
సరియగు వేళ లందుతమ సంస్థ మసీదు –నమాజునెంచు టౌ”.
మరణము నందుచున్ తనకు మారకులన్ క్షమియించ టంచు యా
రిప్లయితొలగించండిపరమ పితన్ పరాత్పరుని ప్రార్ధన జేసిన నిర్మలాత్మకున్
మరియకు బిడ్డ "క్రీస్తు"తమ మాన్యుడు దైవము సర్వ కిల్బిషా
హరి,కరుణాకటాక్ష ములకై తపియి౦తురు క్రైస్తవుల్ సదా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిరతము భక్తి మార్గమున నిశ్చల బుద్ధి సమన్వితుండుగా
రిప్లయితొలగించండిపరమ దయాళువైన భగవంతుని పాదములన్ స్మరించగా
పరమతులైననేమి తన వారిగ జూచును కాననట్టి శ్రీ
హరి కరుణాకటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...
రిప్లయితొలగించండిదరిసెన మందఁ గోరి నిరతమ్మును హిందువు లంద ఱెప్డు శ్రీ
హరి కరుణా కటాక్షములకై తపియింతురు! క్రైస్తవుల్ సదా
యిరవుగ సిల్వఁ దాల్చి ప్రభు యేసునుఁ గొల్తురు! మహ్మదీయులున్
స్థిరత నమాౙుఁ జేసెదరు దీనులఁ బ్రోవ మసీదు లోపలన్!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
హరిహర నామముల్ జపము నందము జేసియు హైందవాళియున్
రిప్లయితొలగించండిహరికరుణా కటాక్షములకై తపియింతురు-క్రైస్తవుల్ సదా
యిరవుగ సేయుచున్ భజననేసును వేడ,మహమ్మదీయులున్
పరమగు"అల్ల"నే మనసు బాగుగ వేడి నమాజు చేయరే!
హరియన పాపహారియగు,నందరికొక్కడె దైవమంచు,వే
నిరసన జేయకుండగను నిందలనన్యుల దైవతంబులన్
పరమును జేరు మార్గమని,పాపముడుల్చెడు నేసు,దూషితా
హరి,కరుణా కటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా!
నిరుపమ కారుణిన్ వెలిగి నేరములన్నిటి తొల్గ జేయుచున్
హరువునుగూర్చునేసు మనమందున గొల్వగ,కన్య పుత్రుడై
తరుణముజూప సిల్వపయి,తానటు బాధలనంద,పాపముల్
హరి,-కరుణాకటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా!
విరివిగ భారతంబునను,వే మతముల్ వెలుగొందు సఖ్యతన్,
బిరబిర హిందువుల్ తమటు వేడరెయీసును,దైవమొక్కటన్
చిరమగు భావనన్ కలిగి,చేరియు కొందరుభక్తి యుక్తులై
హరికరుణా కటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరుగిడి పాపపుణ్యముల వంకర టింకర వీధులందు వా
రిప్లయితొలగించండిరరయక పారమార్థికము నందరి హృత్తుల నొక్కడౌచు తా
నిరతము సర్వభూతముల నిల్చెడు శ్రీహరి తత్త్వమొల్ల కా
హరి కరుణాకటాక్షమునకై తపియింతురు క్రైస్తవుల్ సదా!
హరి = యముడు
కరచెడు మేరి మాతలను కాదని చేరుచు హైద్రబాదునన్
రిప్లయితొలగించండితరుముచు రోడ్డులందునను దాపున జేరుచు కన్నుగొట్టుచున్
బరువగు హిందు కన్నియల పాలిట చిక్కుచు పెండ్లియాడగా
హరి కరుణాకటాక్షమునకై తపియింతురు క్రైస్తవుల్ సదా