అయ్యా ! యిది సినిమాలలో చూయించే బొంబాయి గానా-బజానా వేశ్యవాడ ! (నిజమైన వేశ్యవాడ గురించి నాకు నిఝంగా తెలియదు)
ఒక్క వేశ్యపై ఆధారపడి జీవించే వారందరి బ్రతుకులలో వెన్నెల వానే గదా :
01) ________________________________
ఇంటివాడు, మరియు - వంటవాడికి, తోడు పనులు చేయువార్కి , - బంధుగులకు పాట పాడు వార్కి - వాయిద్యకార్లకూ వేశ్య వలన బ్రతుకు - వెలుగు లీను ! ________________________________ ఇంటివాడు అంటే ఇంటాయన కాదండోయ్-వేశ్యకెలాగూ ఉండడుగా ఇంటినద్దెకిచ్చిన వాడని నా భావం
అయ్యా ! మీకు తెలియనిదేముంది ? అంతా శ్రీ వైష్ణవులే గాని - బుట్టెడు రొయ్యలు మాయమన్నట్టు :
03) ________________________________
పడక వేరు పరచు - భార్య బాధితులకు వీధి వీధి తిరుగు - విధురులకును పెళ్ళి కాని పెద్ద - పెద్ద ప్రసాద్ లకు వేశ్య వలన బ్రతుకు - వెలుగు లీను ! ________________________________ విధురుఁడు = భార్యావియోగమైనవాడు(భార్యలేనివాఁడు)
పూర్వం వేశ్యలను చారులుగా వినియోగించేవారట ! వారు మాన ప్రాణాలను ఫణముగా పెట్టి అగ్నిలో దూకిన శలభములయ్యేవారు దొరికి పోతే ! వారు విజయం సాధిస్తే మాత్రం - ఒక్కరికే కాదు - దేశ ప్రజలందరికీ పండుగే : ఇప్పుడు కూడా ఉందీ పద్ధతి !
05) ________________________________
అగ్ని బడెడు శలభ - మా యను రీతిగా శత్రు రాజ్య మేగి - సాహసముగ వేగు జేయ నేగు - విమల మనస్కపు వేశ్య వలన బ్రతుకు - వెలుగు లీను ! ________________________________
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** వసంత కిశోర్ గారూ, మీ అయిదు పూరణలు ఆణిముత్యాలు. చాలా బాగున్నవి. అభినందనలు.
కవిమిత్రులారా, రెండు రోజులుగా జ్వరం. ఈరోజు ఇంకా తీవ్రమయింది. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి మందులు తీసుకొని ఇప్పుడే వచ్చాను. రేపటికి ఎలా ఉంటుందో? ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘మంట గలియు...’ అనండి. ***** సుసర్ల నాగజ్యోతి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పద్యంలో మొదటి రెండు పాదాలకు నా సవరణలు.... ఇంటి దీపమగుచు నిల్లాలు భువిలోన (ఇల్లాలు+ఇలలోన- అన్నపుడు యడాగమం రాదు) ఇల్లు వెలుగ జేయు నింపుగాను.... ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘మధురవాణి’ ప్రస్తావన ఎవరు తెస్తారా అని ఎదురుచూశాను. ఆ పని మీరు చేశారు. సంతోషం! ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణలో ‘ధూర్జటి+అటుల’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘ధూర్జటి యటు జెప్పె’ అనండి. ఐదవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘...నెట్టుల’ అనండి.
ఇంటి దీపమగుచు నిల్లాలు భువిలోన ఇల్లు వెలుగ జేయు నింపుగాను వీధి దీపమవదె వెలయాలు ధరణిలో వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను!
సరిజేసాను ...ధన్యవాదములండీ శంకరయ్య గారూ .... మీకు ఆరోగ్యము కుదుటపడాలని కోరుకుంటున్నాను...నిన్న సాయంత్రం మా అబ్బాయికి అర్జెంట్ గా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది...ఇప్పుడే ఇంటికి వచ్చాను...అందుకే పద్యం సరి జేయటం ఆలస్యం అయ్యింది ..క్షంతవ్యురాలను
సకల సిరులు బోవు సంసారమే కూలు
రిప్లయితొలగించండివేశ్య వలన, బ్రతుకు వెలుగు లీను
భార్య నాదరించ, ఆర్యులార వినుడు
ధర్మమెఱిగి మనుడు, ధరణి యందు.
మగువ మత్తు విడి కొమరగిరి వేమన
రిప్లయితొలగించండివిశ్వదాభిరామ వినురవేమ
యనుచు పలికె తాను తెనుగు గీతమ్ములు
వేశ్య వలన బ్రతుకు వెలుఁగు లీను!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అయ్యా !
యిది సినిమాలలో చూయించే బొంబాయి గానా-బజానా వేశ్యవాడ !
(నిజమైన వేశ్యవాడ గురించి నాకు నిఝంగా తెలియదు)
ఒక్క వేశ్యపై ఆధారపడి జీవించే వారందరి బ్రతుకులలో వెన్నెల వానే గదా :
01)
________________________________
ఇంటివాడు, మరియు - వంటవాడికి, తోడు
పనులు చేయువార్కి , - బంధుగులకు
పాట పాడు వార్కి - వాయిద్యకార్లకూ
వేశ్య వలన బ్రతుకు - వెలుగు లీను !
________________________________
ఇంటివాడు అంటే ఇంటాయన కాదండోయ్-వేశ్యకెలాగూ ఉండడుగా
ఇంటినద్దెకిచ్చిన వాడని నా భావం
శ్రీవిరాట్ పోతులూరి వీరబహ్మేంద్ర స్వామి చరిత్ర, సతీ సుమతి, పాండురంగ మహత్మ్యం
రిప్లయితొలగించండిభక్తతుకారాం , చింతామణి లాంటి ఎన్నో సినిమాలలోని - ఎందరెందరెందరెందరో
02)
________________________________
విశ్వద వలన గద - వేమన కవి యయె !
సుమతి వాసి కెక్కె - శుండ వలన !
ఎందరెందరెంద - రెందరో పేరొంద్రి
వేశ్య వలన; బ్రతుకు - వెలుగు లీను !
________________________________
అయ్యా ! మీకు తెలియనిదేముంది ?
రిప్లయితొలగించండిఅంతా శ్రీ వైష్ణవులే గాని - బుట్టెడు రొయ్యలు మాయమన్నట్టు :
03)
________________________________
పడక వేరు పరచు - భార్య బాధితులకు
వీధి వీధి తిరుగు - విధురులకును
పెళ్ళి కాని పెద్ద - పెద్ద ప్రసాద్ లకు
వేశ్య వలన బ్రతుకు - వెలుగు లీను !
________________________________
విధురుఁడు = భార్యావియోగమైనవాడు(భార్యలేనివాఁడు)
పాండురంగమహత్మ్యంలో ఎన్ టి ఆర్ వలె :
రిప్లయితొలగించండి04)
________________________________
బ్రతుకు భార మౌను - భార్య దూరంబౌను
వేశ్యవలన ! బ్రతుకు - వెలుగు లీను
నాలు బిడ్డ తోడ - కూలి జేసినగాని
పణము పోదు మిగుల - పరువు మిగులు !
________________________________
మిగుల = ముందు మించి, మిక్కిలి, అత్యంతము
greatly, much, very, exceedingly, excessively
(ముఖ్యముగా అని భావం)
పూర్వం వేశ్యలను చారులుగా వినియోగించేవారట !
రిప్లయితొలగించండివారు మాన ప్రాణాలను ఫణముగా పెట్టి
అగ్నిలో దూకిన శలభములయ్యేవారు దొరికి పోతే !
వారు విజయం సాధిస్తే మాత్రం - ఒక్కరికే కాదు - దేశ ప్రజలందరికీ పండుగే :
ఇప్పుడు కూడా ఉందీ పద్ధతి !
05)
________________________________
అగ్ని బడెడు శలభ - మా యను రీతిగా
శత్రు రాజ్య మేగి - సాహసముగ
వేగు జేయ నేగు - విమల మనస్కపు
వేశ్య వలన బ్రతుకు - వెలుగు లీను !
________________________________
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వసంత కిశోర్ గారూ,
మీ అయిదు పూరణలు ఆణిముత్యాలు. చాలా బాగున్నవి. అభినందనలు.
సొమ్ముమాయమగును సుఖరోగములువచ్చు
రిప్లయితొలగించండివీధులందు జనము వెక్కిరించు
పడకు నీవు వారి వలలోన యెటులనీ
వేశ్య వలన బ్రతుకు వెలుఁగు లీను?
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యోగ్యుడైన వాని యోగి కాగలవాని
రిప్లయితొలగించండిభోగమందుఁ దేల్చి మునగ నీక,
తనివిఁ దీర్చు సచ్చిదానందమని దెల్పు
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండితాను కాలిపోయి తమమును పోగొట్టు
దీపకళిక వోలె పాపపుణ్య
పురుష భేద భావ మరయక రహి గూర్చు
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను!
ఆ.వె:తనదు తప్పు లేక తార్పుడు కొంపలో
రిప్లయితొలగించండిచేర వలసి వచ్చె చిన్నపాప
బ్రతుకు బుగ్గి యైన పరుల బ్రతుకు నిల్పు
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభ్రష్టుబట్టి పోవు భాగ్యముల్ గోల్పోవు
రిప్లయితొలగించండివేశ్యవలన, బ్రతుకు వెలుగు లీను
సద్గుణంబులున్న సహచరి తోడుండ
సిరులు గురియు గాదె శ్రీకరముగ!!!
మంటగలుసు సుమ్మ మాన మర్యాదలు
రిప్లయితొలగించండివేశ్యవలన, బ్రతుకు వెలుగు లీను
సతియు పతియు సతము సఖ్యతతోనుండ
సాగుకాపురమ్ము చక్కగాను (సంతసముగ)
ఇంటి దీపమవుచు యిల్లాలు యిలలోన
రిప్లయితొలగించండిఇల్లు వెలుగ జేయు యింపుగాను
వీధి దీపమవదె వెలయాలు ధరణిలో
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను
దయయె ముఖ్య మనుచు దలచెడి జయదేవ
రిప్లయితొలగించండివేశ్యవలనబ్రతుకు వెలుగులీను
మానవత్వ మచట మాయకనే-జయ
దేవ అష్టకమ్ముదెలిపె నాడు|
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండి1) స్వర్గ సీమ వంటి సంసారములు గూలు
వేశ్య వలన ; బ్రతుకు వెలుఁగు లీను
పొట్ట కూటి కొఱకు పట్ట పడుపు వృత్తి
మహిళ జీవితమున మార్పు గొలుప
2) మాయమాట లాడి మనుగడ సాగించ
నల గిరీశ మాడు నాట లాపె
మధురవాణి ; యటులె మంచి సంస్కారియౌ
వేశ్య వలన బ్రతుకు వెలుఁగు లీను.
వేశ్య లోలుడైన వేమన్న తుదకు నా
రిప్లయితొలగించండివేశ్య బోధ వలనె వెలుగు నంది,
వేలు పద్యములను వేదాంతమే జప్పె
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను
బిల్వమంగళుండు వేశ్యనామె వలచి
భ్రష్టుడైన,చివర భవ్యు డయ్యె
చెలువు మాటలంది చింతామణి వలన.
వేశ్య వలన బ్రతుకు వెలుగులీను
వేశ్య లంపటుండు వేద్యుడై తుదకును
ధూర్జటటుల జెప్పె,ధూర్త చేష్ట
వలన కలుగు కష్ట వారాసి మునుగుటల్
వేశ్యవలన బ్రతుకు వెలుగులీను
భార్య యింటిలోన బాధలు పెట్టగా
నాటవెలది తగులమంది యిలను
చాలమంది తాము సౌఖ్యంబు గొందు రా
వేశ్యవలన బ్రతుకు వెలుగులీను
వేశ్య వలన కలుగు వేవేల రోగాలు
సంఘమందు తాను చౌకయగును
నాస్తిపాస్తులెల్ల నంతమౌ,నెటుల
వేశ్యవలన బ్రతుకు వెలుగులీను?
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండిరెండు రోజులుగా జ్వరం. ఈరోజు ఇంకా తీవ్రమయింది. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి మందులు తీసుకొని ఇప్పుడే వచ్చాను. రేపటికి ఎలా ఉంటుందో?
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మంట గలియు...’ అనండి.
*****
సుసర్ల నాగజ్యోతి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యంలో మొదటి రెండు పాదాలకు నా సవరణలు....
ఇంటి దీపమగుచు నిల్లాలు భువిలోన (ఇల్లాలు+ఇలలోన- అన్నపుడు యడాగమం రాదు)
ఇల్లు వెలుగ జేయు నింపుగాను....
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మధురవాణి’ ప్రస్తావన ఎవరు తెస్తారా అని ఎదురుచూశాను. ఆ పని మీరు చేశారు. సంతోషం!
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణలో ‘ధూర్జటి+అటుల’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘ధూర్జటి యటు జెప్పె’ అనండి.
ఐదవపూరణ మూడవపాదంలో గణదోషం. ‘...నెట్టుల’ అనండి.
క్రమాలంకారము;
రిప్లయితొలగించండిపొందె పేరునెవరి పొందున వేమన్న?
నిహము పరము జూపి నిన్ను గాచి
వంశ వృద్ధి జేసి భార్య యేమి జేయు?
వేశ్య వలన; బ్రతుకు వెలుగు నిచ్చు
రేపటీకి మీ జ్వరం తగ్గిపోతుంది ఏమీ కంగారు పడకండి,మందులు జాగ్రత్తగా వాడండి.
గురుదేవులు త్వరగా కోలుకోవాలని దేవదేవునికి ప్రార్థన.
రిప్లయితొలగించండిరెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.
*****
సహదేవుడు గారూ,
ధన్యవాదాలు.
ఇంటి దీపమగుచు నిల్లాలు భువిలోన
రిప్లయితొలగించండిఇల్లు వెలుగ జేయు నింపుగాను
వీధి దీపమవదె వెలయాలు ధరణిలో
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను!
సరిజేసాను ...ధన్యవాదములండీ శంకరయ్య గారూ .... మీకు ఆరోగ్యము కుదుటపడాలని కోరుకుంటున్నాను...నిన్న సాయంత్రం మా అబ్బాయికి అర్జెంట్ గా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది...ఇప్పుడే ఇంటికి వచ్చాను...అందుకే పద్యం సరి జేయటం ఆలస్యం అయ్యింది ..క్షంతవ్యురాలను