అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. (ఉదయం ఎందుకో మీ పద్యం నా దృష్టికి రాలేదు. మన్నించండి!) ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘వివిధ+ఆకృతులలో = వివిధాకృతులలో’ అవుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘వివిధాకృతులతోడ/ వివిధరూపములతో’ అనండి.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘నిల్వ జేయంగాను’ అన్నదానిని ‘నిల్వ చేయుటకునై’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గురుదేవులుశంకరయ్యగారికి మీ సూచనకు ధన్యవాదములు సవరించినపద్యము పెండ్లి కూతురు గంప ,విడిచిన వలువలు దాచగా నొకగంప ,ధాన్య రాశి నిల్వ జేయుటకునై ని౦డైన గాదెలు విత్తనముల దాచ పెద్దగంప తమలపాకులగంప కమలాల కొకగంప అప్పదాల్ వడియాల నారబెట్ట అటకపై నెక్కగా పటుతర నిచ్చెనల్ ప్రతి యింట నుండంగ వలయు ననగ నాటి మేదరులకు దీటుగ పని యుండె చేతి వృత్తి పోవ చేటు కలిగె నేడు దేశ ప్రజలు వాడుటమానిరి పాతరోత యనుచు పాట పాడి
వెదురును బుట్టగ నల్లుచు
రిప్లయితొలగించండికదలక తనవృత్తి యందు కడు మోదమునన్
వదలక నేర్చిన విద్యను
ముదితలు చేయంగ నెపుడు ముచ్చట గొల్పున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఉదరపు పోషణ కొరకై
రిప్లయితొలగించండిముదిత కులపు వృత్తిఁజేసి భూజపు పొడలో(నీడన్)
వెదురు బద్దల తోడుత
సదనమును నడుపుచు నుండె సంతోషముతో
వెదురు బద్దలు వరుసగ పేక పడుగు
రిప్లయితొలగించండిలుగను బేర్చియు భామల ల్లుదురు బుట్ట
జీవ నంబును గొఱకుగా , చిత్ర మందు
బుట్ట నల్లుట జూడుడు పొలతి యొకతె
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
వెదురు గర్ర దెచ్చి వివిధయాకృతులలో
రిప్లయితొలగించండిబుట్టలల్లు చుంద్రు పొట్ట కొరకు
కూడు పెట్టు వృత్తి కులవృత్తి గానెంచి
తృణము పణము చాలు తృప్తి గలుగు.
గురువు గారికి నమస్సులు. నా పద్యము కూడా పరిశీలించండి.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
(ఉదయం ఎందుకో మీ పద్యం నా దృష్టికి రాలేదు. మన్నించండి!)
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వివిధ+ఆకృతులలో = వివిధాకృతులలో’ అవుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘వివిధాకృతులతోడ/ వివిధరూపములతో’ అనండి.
పద్య రచన; మేదరివృత్తి
రిప్లయితొలగించండిచేటలు బుట్టలు గంపలు
పీటలపై రెల్లుచాప వెదురు తడికెలున్
నీటు ప్రయాణపు సంచియు
మాటునపడె ప్లాస్టికులకు మాన్యత హెచ్చన్
పెండ్లి కూతురు గంప ,విడిచిన వలువలు
దాచగా నొకగంప ,ధాన్య రాశి
నిల్వ జేయంగాను ని౦డైన గాదెలు
విత్తనముల దాచ పెద్దగంప
తమలపాకులగంప కమలాల కొకగంప
అప్పదాల్ వడియాల నారబెట్ట
అటకపై నెక్కగా పటుతర నిచ్చెనల్
ప్రతి యింట నుండంగ వలయు ననగ
నాటి మేదరులకు దీటుగ పని యుండె
చేతి వృత్తి పోవ చేటు కలిగె
నేడు దేశ ప్రజలు వాడుటమానిరి
పాతరోత యనుచు పాట పాడి
బుట్టలల్లు టెట్లు?బొంగులు జీల్చుచు
రిప్లయితొలగించండిడబ్బలన్ని గూర్చి నిబ్బరాన
నేర్పు గాను కూర్పు నెగడించబుట్టను
ఎరుకలమ్మ చెంత కెగిరివచ్చు|
2.అల్లగలట్టి బుట్టలను నారెడి బట్టల చెట్టు నీడలో
పిల్లల పాపలన్ తగిన-ప్రీతిగ జూచుచు యింటి బాధ్యతల్
నల్లుచు|కష్ట, నష్టములయాత్రలు జేయుచు నేర్పునందునే
నుల్లము సంతసంబిడగ?యున్నతు లౌదురు|వృత్తి విద్యలోన్|
3.కూర్పున దబ్బలకోర్కెలు
నేర్పునసమకూర్చుటందు నియమములందే
తూర్పున వెలుగులు రాగా?
ఆర్పెడి సమయంబు వరకు నల్లును బుట్టల్|
బుట్ట లల్లు కొనుచు పొట్టనింపు కొనగ
రిప్లయితొలగించండిశ్రమకు తగ్గ ఫలము సాధ్య మౌనె
కాలమెంతొ మారె కాంచవే మాతల్లి
బుట్ట గొనగ నెవడు పూనుకొనడు
నేడు ప్లాస్టిక్కు బక్కెట్టు నేస్త మయ్యె
బ్యాటరీలతొ బొమ్మలు ఫ్యాషనయ్యె
జీన్సు ప్యాంటులు షర్టులు చెన్ను మీరె
పశ్చిమఁపుగాలి మేపరి పడగ విప్పె
బుట్ట లల్లు కొనుచు పొట్టనింపు కొనగ
రిప్లయితొలగించండిశ్రమకు తగ్గ ఫలము సాధ్య మౌనె
కాలమెంతొ మారె కాంచవే మాతల్లి
బుట్ట గొనగ నెవడు పూనుకొనడు
నేడు ప్లాస్టిక్కు బక్కెట్టు నేస్త మయ్యె
బ్యాటరీలతొ బొమ్మలు ఫ్యాషనయ్యె
జీన్సు ప్యాంటులు షర్టులు చెన్ను మీరె
పశ్చిమఁపుగాలి మేపరి పడగ విప్పె
ఆ.వె:పతి యశక్తుడవగ పలుకష్టముల కోర్చి
రిప్లయితొలగించండిపడతి యొకతె తాను పట్టుదలగ
బుట్ట లల్ల నేర్చి పొట్టలు నింపుచు
గడిపె విసుగు లేక కాలమెల్ల
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘నిల్వ జేయంగాను’ అన్నదానిని ‘నిల్వ చేయుటకునై’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మా తండ్రి వ్రేలిఁ బట్టుకు
రిప్లయితొలగించండిపోతుండగ నూరి బయట బుట్టల వాళ్లే!
రీతులు మారక నేటికి
భీతి గొలుపు విధము బ్రతుక వేదన మిగిలెన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పోతుండగ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
గురుదేవులుశంకరయ్యగారికి
రిప్లయితొలగించండిమీ సూచనకు ధన్యవాదములు సవరించినపద్యము
పెండ్లి కూతురు గంప ,విడిచిన వలువలు
దాచగా నొకగంప ,ధాన్య రాశి
నిల్వ జేయుటకునై ని౦డైన గాదెలు
విత్తనముల దాచ పెద్దగంప
తమలపాకులగంప కమలాల కొకగంప
అప్పదాల్ వడియాల నారబెట్ట
అటకపై నెక్కగా పటుతర నిచ్చెనల్
ప్రతి యింట నుండంగ వలయు ననగ
నాటి మేదరులకు దీటుగ పని యుండె
చేతి వృత్తి పోవ చేటు కలిగె
నేడు దేశ ప్రజలు వాడుటమానిరి
పాతరోత యనుచు పాట పాడి
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిమా తండ్రి వ్రేలిఁ బట్టుకు
చూతును గద బుట్టలల్లు చొప్పడు వారిన్
రీతులు మారక నేటికి
భీతి గొలుపు విధము బ్రతుక వేదన మిగిలెన్!